
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విఐపీ దర్శన సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు తిరుమలలో ఘనస్వాగతం పలికిన వేద పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మనందం అనంతరం పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కళాకారుని కుటుంబాన్ని ఆదుకుని మంచి మనసును చాటుకున్నారు. కళాకారుడు మరణించిన కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రహ్మనందం చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనందం కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment