
స్కూళ్లకు, విరాళాలు ఇచ్చే ఎన్నారైల పేర్లు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని 5వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చేవారి పేర్లను స్కూళ్లు, క్లాసులకు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు ఇక నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి అని తెలిపారు.
మరోవైపు, ఈ నెల 25న ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 19న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. లక్షా 30వేల 264 సీట్లకు ఇప్పటి వరకు 69,459 సీట్లు భర్తీ అయ్యాయని గంటా తెలిపారు. ఇంకా 43, 599 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.