సీఎం రిలీఫ్‌ఫండ్‌కు రేస్ క్లబ్ తరఫున ఎంపీ రఘురాంరెడ్డి రూ.2 కోట్లు..
‘లలిత’, సైయెంట్, మైత్రా సంస్థలు రూ.కోటి చొప్పున..
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవన్‌టౌన్: ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఈఐఎల్ సంస్థ రూ.5 కోట్ల విరాళంఅందజేసింది. సంస్థ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి, బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కని కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి, సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్టీ రావు పాల్గొన్నారు. ఏపీకి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని అందించినట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
రేస్ క్లబ్ తరఫున రూ.2 కోట్లు
హైదరాబాద్‌లోని రేస్ క్లబ్ డైరెక్టర్ అయిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి.. మరో డైరెక్టర్ నరసింహరెడ్డితో కలిసి వరద బాధితుల సహాయార్థం రూ.2 కోట్ల చెక్కును మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
రూ.కోటి చొప్పున..
సీఎం సహాయ నిధికి సైయెంట్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి విరాళాన్ని అందజేసింది. అలాగే లలితా జ్యువెల్లర్స్ అధినేత కిరణ్ రూ.కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు విక్రం కైలాస్, రవికైలాస్ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసి చెక్కులను అందజేశారు. సినీ నిర్మాత దిల్ రాజు రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment