తిరుపతి: నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. హాస్టల్ నిర్వహణ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్ అధికారులకు అప్పగించే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఈ మేరకు ముందుగా ఎస్వీ యూనివర్సిటీలో ఒక హాస్టల్‌ను ఔట్‌సోర్సింగ్ అధికారులకు ఫెలైట్ ప్రాజెక్టుగా ఇచ్చి పరిశీలిస్తామని చెప్పారు.
ఇది విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల హాస్టల్స్ నిర్వహణ బాధ్యతలు ఔట్‌సోర్సింగ్ అధికారులకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. వైస్‌చాన్స్‌లర్ల పదవీకాలాన్ని రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు పొడగిస్తూ చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లలో తర్వాత పనితీరును పరిశీలించి ఆశాజనకంగా లేకపోతే పదవి నుంచి తొలగిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.
'నెలలోపు వీసీల నియామకం'
Published Sun, Aug 23 2015 1:23 PM | Last Updated on Sat, Apr 6 2019 9:11 PM
Advertisement
Advertisement