బాబు దొంగ నాటకాలు ఆపాలి:శైలజానాథ్ | Chandrababu should end his dramas, say sailajanath | Sakshi
Sakshi News home page

బాబు దొంగనాటకాలు ఆపాలి:శైలజానాథ్

Published Fri, Aug 23 2013 3:03 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

బాబు దొంగ నాటకాలు ఆపాలి:శైలజానాథ్

బాబు దొంగ నాటకాలు ఆపాలి:శైలజానాథ్

విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే అన్ని పార్టీలు కలిసి ఓడిస్తామని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ శుక్రవారం హైదరాబాద్లో స్ఫష్టం చేశారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరామని ఆయన తెలిపారు. అయిన రాష్ట్రాన్ని ఏ ప్రాతిపదికన విభజిస్తారు అని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఇకనైన దొంగ నాటకాలకు తెరదించాలని చంద్రబాబుకు ఈ సందర్భంగా హితవు పలికారు.

 

రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని బాబు ఇప్పటికైనా చెప్పకపోవడం పట్ల ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. కర్నూలులో లక్షమంది రోడ్లపైకి వచ్చి సమైక్యగళం వినిపించిన సంగతిని న్యాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు. సమైక్య ఉద్యమంలో నేతలను దగ్గరకు రానీయకుండా ప్రజలే ఉద్యమం చేస్తున్నారని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి ఈ సందర్భంగా వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement