హైదరాబాద్ : సీమాంధ్రలో కొనసాగుతున్న సమైక్య ఉద్యమంతో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుకు వెళ్లలేకపోతోందని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి గల్లా అరుణకుమారి మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలు కోరుకున్నట్లు రాజీనామాలు చేయటానికి తాము వెనకాడమని అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకించడానికే రాజీనామాలు చేయటం లేదని ఆమె తెలిపారు.
చంద్రబాబును రాజీనామా చేయమని ఏపీ ఎన్జీవోలు ఎందుకు కోరటం లేదని మంత్రి కొండ్రు మురళి ప్రశ్నించారు. టీడీపీ నేతలు సమైక్యాంధ్ర అంటూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇస్తే కాంగ్రెస్ విభజన నిర్ణయాన్నివెనక్కి తీసుకుంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని కొండ్రు మురళి డిమాండ్ చేశారు.
'తెలంగాణపై కాంగ్రెస్ ముందుకు వెళ్లలేకపోతోంది'
Published Tue, Sep 3 2013 2:51 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement