విశాఖపట్టణం: మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి కాసేపు డాన్సర్ల అవతారం ఎత్తారు. సరదాగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌళిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాసరావు కూతురి వివాహ వేడుకలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడున్న ఓ అమ్మాయి చేయి పట్టుకుని సరదాగా నాలుగు స్టెప్పులు వేయడంతో గంటా శ్రీనివాసరావు సహా అక్కడున్న అందరూ సరదా పడ్డారు.
సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కాసు, ఏరాసు డాన్స్ చేసి ఔరా అనిపించారు. ఏఎన్నార్ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏరాసు ప్రతాపరెడ్డి భరతనాట్యం చేశారు. కాగా గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహం బుధవారం జరగనుంది.