kasu krishna reddy
-
'రాయలసీమలో రెండవ రాజధాని ఏర్పాటు చేయాలి'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రెండవ రాజధానిని రాయలసీమలో అభివృద్ధి చేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఆయన మాజీ మంత్రులు కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డిలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటకలో ఉన్న విధంగానే ఏపీలోనూ రెండవ రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. లేనిపక్షంలో మరోసారి ప్రత్యేక ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వాటికన్ సిటీ తరహాలో ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కోరారు. అందుకు తగ్గట్టుగా పూర్తిస్థాయిలో మద్యం, ధూమపానం వంటివి నిషేధించాలని సూచించారు. శేషాచలంలోని మైన్స్, ఎర్రచందనం ద్వారా సమకూరే ధనాన్ని రాయలసీమ అభివృద్ధికే వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే మరో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూ... సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించేందుకు టీటీడీ కృషి చేయాలని అన్నారు. వారితోపాటు మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
అక్కడ గెలిస్తే మంత్రి పదవి బోనస్..
రాజకీయాల్లో ఒక్కొక్క చోట.. ఒక్కో రకం సెంటిమెంట్లు రాజ్యమేలుతుంటాయి. నరసరావుపేట నియోజకవర్గంలో ఒక సెంటిమెంట్ బహుళ ప్రచారంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఖాయం అనేది ఆ సెంటిమెంటు. గతంలో చాలాసార్లు ఆ విధంగా జరిగింది. ఈసారి అందరూ కొత్తవారే పోటీచేస్తున్న నేపథ్యంలో తొలిసారి గెలవగానే ఈ సెంటిమెంట్ ప్రకారం మంత్రి కూడా అయ్యే అదృష్టం ఉందని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలో గెలిచిన వారిలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెంటనే మంత్రులైన ఘనత ఉంది. రాజకీయ ఉద్దండుల కోటగా పేరొందిన నరసరావుపేట నియోజకవర్గానికి ఉన్న ప్రత్యేకత ఇది. అక్కడి నుంచి గెలిచిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఏడున్నరేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఇంకో విశేషమేమిటంటే నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురు దానికి ముందో, తర్వాతో ముఖ్యమంత్రులుగా కూడా చేసిన చరిత్ర ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కొణిజేటి రోశయ్య ఆ కోవలోకి వస్తారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి 1983లో జరిగిన ఎన్నికలలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రి పదవిని అలంకరించారు. అంతేకాదు గుంటూరు జిల్లాలో మొట్టమొదటి సారి రాష్ట్ర హోం మంత్రి పదవి పొందిన వ్యక్తిగా కోడెల రికార్డుల్లోకి ఎక్కారు. అక్కడి నుంచి వరుసగా మరో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ కోడెల ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్లలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. కోడెలకు ప్రత్యర్ధిగా ఉన్న కాసు వెంకటకృష్ణారెడ్డి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో మంత్రిగా కొనసాగారు. అయితే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయాలకు కొత్తవారు కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఖాయమనే సెంటిమెంట్ ప్రకారం ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అయినట్టేనని నియోజకవర్గ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ అదృష్టజాతకుడెవరో వేచి చూడాలి. -
నరసరావుపేట ఎంపీగా పోటీ చేయను: కాసు
గుంటూరు : గుంటూరు జిల్లాలో కాంగ్రెస్‌కు తనయుడు ఝలక్ ఇస్తే తండ్రి మరో షాక్ ఇచ్చారు. నరసరావుపేట ఎంపీగా పోటీ చేయటం లేదంటూ మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రకటించారు. మరో అభ్యర్థిని చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచించారు. కాగా నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనని కాసు కృష్ణారెడ్డి తనయుడు మహేష్ రెడ్డి నిన్ననే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా నరసరావుపేట నియోజకవర్గంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం ఉన్న కాసు కుటుంబం కాంగ్రెస్ పార్టీ తరపును పోటీ చేయటం లేదంటూ ప్రకటించటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. నామినేషన్లకు మరో రెండు రోజులే గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను వెతుక్కోవటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవాలి. ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా పోటీ చేయటం లేదంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
కిరణ్ పార్టీలోకి వెళ్లను: రాంచంద్రయ్య
నెల్లూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాము వెళ్లబోమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రాంచంద్రయ్య తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు 4 సీట్లు సంపాదించుకునేందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలవారు తెలుగువారి భవిష్యత్తును నిర్ణయించడం సరికాదని మంత్రి కాసు కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో అన్నారు. సీఎం కిరణ్ రాజీనామాపై ఇప్పుడే మాట్లాడడం అపరిపక్వత అవుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలన్నీ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రాన్ని మోసం చేశాయని మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురంలో అన్నారు. పార్టీలన్నీ కలసివెళ్లి ప్రధానిని కలిసి మొరపెట్టుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుందన్నారు. -
16న సీమాంధ్ర ప్రజాప్రతినిధుల భేటీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రి కాసు కృష్ణారెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. సీఎంతో భేటీ అనంతరం మంత్రి కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 16న సీమాంధ్ర ఎమ్మెల్యేలు... ఎమ్మెల్సీలు... మంత్రుల సమావేశం జరుగుతుందన్నారు. అయితే ఈ భేటీలో సీఎం కొత్తపార్టీపై చర్చ.... ఎలక్షణ్ ఎజెండా కాదని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని కాసు కృష్ణారెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు: కాసు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వైఖరిపై రాష్ట్ర మంత్రి కాసు కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తన సర్వశక్తులు వడ్డి ప్రయత్నించానని కాసు చెప్పారు. అయితే, కాంగ్రెస్ హై కమాండ్ తమల్ని పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలకు సమైక్యాంధ్రుల నుంచి సెగ ఎదురవుతోంది. -
మా పేర్లు వాడుకుంటే క్రిమినల్ చర్యలు: టీజీ, కాసు
-
స్టెప్పులేసిన మంత్రులు కాసు, ఏరాసు
విశాఖపట్టణం: మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి కాసేపు డాన్సర్ల అవతారం ఎత్తారు. సరదాగా స్టెప్పులేసి అందరినీ అలరించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌళిక సదుపాయాల మంత్రి గంటా శ్రీనివాసరావు కూతురి వివాహ వేడుకలో ఈ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. అక్కడున్న ఓ అమ్మాయి చేయి పట్టుకుని సరదాగా నాలుగు స్టెప్పులు వేయడంతో గంటా శ్రీనివాసరావు సహా అక్కడున్న అందరూ సరదా పడ్డారు. సోమవారం రాత్రి నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో కాసు, ఏరాసు డాన్స్ చేసి ఔరా అనిపించారు. ఏఎన్నార్ పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఏరాసు ప్రతాపరెడ్డి భరతనాట్యం చేశారు. కాగా గంటా శ్రీనివాసరావు కుమార్తె వివాహం బుధవారం జరగనుంది. -
''గంటా'' వారి సంగీత్‌లో ''కాసు'' స్టెప్పులు
-
రాష్ట్రపతితో రఘువీరా, కాసు, పొన్నం భేటీ
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో మంత్రి కాసు కృష్ణారెడ్డి శనివారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సమైక్యరాష్ట్రాన్ని కోరుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రణబ్‌కు తెలిపారు. దేశ మొదటి పౌరుడిగా ప్రజల హృదయ స్పందనను కేంద్రానికి వివరించాలని ప్రణబ్‌ను ఈసందర్భంగా కాసు కోరారు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రజలతో పాటు నేతలు కూడా త్యాగాలు చేశారని గుర్తు చేశారు. భేటీ అనంతరం కాసు కృష్ణారెడ్డి మాట్లాడుతూ విభజన జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు ఆయన చెప్పారు. పొరపాట్లు జరగకుండా చూస్తామని రాష్ట్రపతి చెప్పారన్నారు. కాగా రాష్ట్రపతిని మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ విడివిడిగా కలిశారు. -
'జీవోఎంలో కీలకశాఖ మంత్రులు లేరు'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో కీలక శాఖ మంత్రులు లేరని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆ కమిటీ అసలు రాష్ట్రానికి వస్తుందో లేదో నమ్మకం లేదని....అందుకే ఆ కమిటీని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు బుధవారమిక్కడ తెలిపారు. ఆ కమిటీలో తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ జరగకపోయినా.... సభ్యులంతా విభజనపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. అలాగే అసమ్మతి తెలపటానికి కూడా ఆస్కారముందని వారు తెలిపారు. రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిస్తున్నారని.... అయితే విశ్వరూప్ పార్టీ మారతారనే ఆయన రాజీనామాను ఆమోదించారని కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల్లో కల్లోలం మొదలైంది. ఇంతకాలం అడ్డుకుంటాం.. ఆపేస్తాం.. నోట్ రాకుండా ఒత్తిడి చేస్తామంటూ మాటలు చెబుతూ కాలయాపన చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. గురువారం కేంద్ర మంత్రిమండలి ముందుకు కేంద్ర హోం శాఖ రూపొందించిన తెలంగాణ నోట్ రాబోతోందన్న వార్తలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రోజంతా సమాలోచనలు జరిపారు. మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన సమయానికే తెలంగాణ నోట్ కేంద్ర కేబినెట్ ముందుకురావడం, దాన్ని ఆమోదించడమూ జరిగిపోయాయి. దీంతో కేంద్రం నిర్ణయంపై సీమాంధ్ర మంత్రులు, నేతలు మరోసారి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. అయితే రెండోసారి భేటీలో సీఎం వద్దకు సీనియర్ మంత్రులెవ్వరూ రాకపోవడం గమనార్హం. సీఎం గ్రూపుగా ముద్రపడ్డ గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పార్థసారథి తదతరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ నిర్ణయంపై చర్చించారు. కేంద్ర కేబినెట్ తీర్మానం రాష్ట్రపతికి వెళ్లి అక్కడినుంచి అసెంబ్లీ అభిప్రాయానికి రావాలి. అప్పుడు ఎలా వ్యవహరించాలి? ఈలోగా ఎలాంటి కార్యాచరణను చేపట్టాలి? సీమాంధ్రలో ప్రజలకు ఏం సమధానం చెప్పాలన్న అంశాలపై తర్జనభర్జనలు సాగించారు. రాజీనామాలు చేయడం వల్ల ఫలితం ఉండదని, అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించి ఆ తరువాత అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని సీఎం మరోసారి చెప్పారని సమాచారం. అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించి పంపిస్తే పార్లమెంటులో దానిపై చర్చ జరుగుతుందని, ఎక్కడో ఒకదగ్గర బ్రేక్ పడుతుందన్న అభిప్రాయం మరికొందరు వినిపించారని సమాచారం. అంతకు ముందు కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ గురించి ఉదయం నుంచే వార్తలు రావడంతో కాంగ్రెస్ సీమాంధ్ర నేతల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. కేబినెట్ నోట్ ఆలస్యం కావడానికి తాము చేసిన ఒత్తిడే కారణమని, విభజన సమస్యలపై స్పష్టమైన పరిష్కారం లభించే వరకు నోట్ రాకుండా అడ్డుకుంటామని కేంద్రమంత్రులు, ఎంపీలు ప్రకటిస్తూ వచ్చారు. అందుకోసమే తాము రాజీనామాలు చేసినట్లూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వారి ప్రకటనలకు భిన్నంగా నోట్ కేబినెట్ ముందుకు వచ్చింది. మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ సాగింది. రాజీనామాలు చేయాలా? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి. కాంగ్రెస్సే విభజన చేస్తున్నట్లుగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నందున దాన్ని ఎలా చల్లార్చాలి. పార్టీలోనే ఉంటూ సమైక్యపోరాటం సాగించడం తదితర అంశాలపై వాడివేడి చర్చ సాగింది. చివరికికి పార్టీని వీడకుండానే సమైక్యపోరాటం సాగించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు కొందరు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరచగా మంత్రులు దానిపై అభ్యంతరం చెప్పారు. పార్టీని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మరోసారి అధిష్టానానికి స్పష్టంచేయాలని, అసెంబ్లీకి తీర్మానం వస్తే పార్టీ సీమాం ధ్ర ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స స త్యనారాయణల ద్వారా అధిష్టానానికి తెలియచేయాలని నిర్ణయించారు. సమావే శంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమా ర్, సి.రామచంద్రయ్య, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, గల్లా అరుణ, శైలజానాథ్, తోట నర్సింహం, గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళీమోహన్, పార్థసారథి, శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు. నేతలు మభ్యపెట్టారా? రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఆ ప్రాంత కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన కానేకాదని తమను మోసపుచ్చే మాటలతో వంచించారని మండిపడుతున్నారు. ‘‘తెలంగాణ చాలా జఠిలమైంది. రాష్ట్ర విభజన అంత సులభం కాదు. నోట్ తయారీ ఇప్పట్లో కాదు. కేబినెట్ ముందుకు రానేరాదు’’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత కొంత కాలంగా చేస్తున్న ప్రకటనలను గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తథ్యమని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కేంద్రప్రభుత్వంలోని ముఖ్యులు ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రులకు, ఎంపీలకు ముందునుంచే సంకేతాలు ఇచ్చారు. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనే సీమాంధ్రలోని ఎనిమిది మంది నేతలకు మంత్రి పదవులు కట్టబెడుతున్న సందర్భలో కూడా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని, దానికి సహకరించాలని షరతు విధించి మరీ కేబినెట్లోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ తరువాత కోర్ కమిటీ, సీడబ్ల్యూసీలో చర్చలన్నీ కేవలం కంటితుడుపు చర్యల్లో భాగంగానే చేపట్టినట్లుగా ఇపుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్ కమిటీ సమావేశానికి ముందు రోడ్ మ్యాప్‌లు తీసుకురావాలని కేంద్రం పెద్దలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంలకు సూచించడం కూడా కేవలం ఏదో చర్చిస్తున్నామని అనిపించుకోవడానికేనని ఇప్పుడు తేటతెల్లమవుతోందని మండిపడుతున్నారు. తెలంగాణపై కేంద్రం వేసే ప్రతి అడుగు ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రులకు ముందుగానే తెలుసునని, కానీ ఏమీ జరగడం లేదని, జరగబోదని తమను చివరి వరకు మభ్యపెట్టారని వారు మండిపడుతున్నారు. కేంద్రం, ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజన సాఫీగాసాగిపోయేలా చేసేందుకే చివరి వరకు సీఎం తమను భ్రమల్లో ఉంచారని, ఇది కావాలనే చేశారా? ఇంకేమైనా కారణముందా? అన్న అనుమానాలు నేతల్లో ఏర్పడుతున్నాయి.