
కిరణ్ పార్టీలోకి వెళ్లను: రాంచంద్రయ్య
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాము వెళ్లబోమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రాంచంద్రయ్య తెలిపారు.
నెల్లూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాము వెళ్లబోమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రాంచంద్రయ్య తెలిపారు. పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు 4 సీట్లు సంపాదించుకునేందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాలవారు తెలుగువారి భవిష్యత్తును నిర్ణయించడం సరికాదని మంత్రి కాసు కృష్ణారెడ్డి హైదరాబాద్లో అన్నారు. సీఎం కిరణ్ రాజీనామాపై ఇప్పుడే మాట్లాడడం అపరిపక్వత అవుతుందని అభిప్రాయపడ్డారు.
పార్టీలన్నీ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రాన్ని మోసం చేశాయని మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురంలో అన్నారు. పార్టీలన్నీ కలసివెళ్లి ప్రధానిని కలిసి మొరపెట్టుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుందన్నారు.