Raghuveera Reddy Yadav
-
‘బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్’
సాక్షి, హైదరాబాద్ : మోసకారి నరేంద్ర మోదీ రాక్షస పాలనకు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మే 26న రణ శంఖారావం పూరించనున్నామని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఇందిరాభవన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 100 రోజుల్లో నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసిన మోదీ సన్నిహితులు నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, లలిత్ మోదీలు విదేశాల్లో దర్జాగా ఉన్నారన్నారు. రఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతి, వ్యాపం కుంభకోణం మోదీ హయాంలోనే వెలుగు చూశాయన్నారు. ‘పెద్ద నోట్ల రద్దు పెద్ద కుంభకోణం. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. బ్యాంకుల్లో క్యాష్ నిల్, బీజేపీ నేతల ఇళ్లల్లో క్యాష్ ఫుల్‌గా పరిస్థితి మారింది. దళిత, ఎస్టీ, మైనారిటీలను రెండో శ్రేణి పౌరులుగా మోదీ ప్రభుత్వం చూస్తోంది. మహిళలు, బాలికలకు రక్షణ కొరవడింది. పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తుంగలో తొక్కి గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ఎమ్మెల్యేలను కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను అనూహ్యంగా పెంచుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. మోదీ పాలన రాక్షస పాలన. దీన్నిఅంతమొందించాల’ని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాదని, మోదీ ముక్త్ బీజేపీ కోసం ఆ పార్టీకి చెందిన వారే ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. రైతుల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. 40 వేల కోట్ల రూపాయల రొయ్యలను మన దేశ రైతులు ఎగుమతి చేస్తే, అందులో సగం రాష్ట్ర రైతులే ఎగుమతి చేశారని తెలిపారు. రొయ్యల ధర పడిపోవడంతో 4 వేల కోట్ల రుపాయల నష్టం వాటిల్లిందని, దీనిపై మాత్రం ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ టీటీడీలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేవుడి మీద నమ్మకం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. వ్యక్తి, పూజారి మీద కోపంతో దేవాలయాల మీద కక్ష కట్టొద్దని, వ్యవస్థ మీద బేషజాలకు పోకుండా వివాదం తొలగించాల’ని హితవు పలికారు. -
టీటీడీ బోర్డు కూర్పు అహంకార పూరిత చర్య
సాక్షి, అనంతపురం : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మండిపడ్డారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ పాలకవర్గ సభ్యుల్లో అర్హులు కానీ వారిని, అన్యమతస్తులను నిమమించి ప్రభుత్వం అపచారం చేసిందని అన్నారు. ఇది పొరపాటు కాదని, అహంకార పూరిత చర్యని ఆయన వాఖ్యానించారు. తాను ఇతర మతాల వారిని, వారి ఆచారాలను గౌరవిస్తానని, ఇది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. భేషజాలకు పోకుండా వివాదాస్పదులను తొలగించి, అర్హులైన వారిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు బీజేపీతో బహిరంగ కాపురం చేసిన ప్రాంతీయ పార్టీలు, నేడు దొంగ చాటుగా కాపురం చేస్తున్నాయని తెలిపారు. బీజేపీ మంత్రి భార్యకి టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించడమే ఇందుకు నిదర్శనమని రఘవీరా ఆరోపించారు. -
ఏపీ బంద్‌ను విజయవంతం చేయండి
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా సాధన సమితి ఈ నెల 16న తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టిన బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు. కేంద్రంపై ఒత్తిడి తేచ్చేందుకే దీక్షలు, నిరసనలు ప్రారభించినట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళనం చేయడమే అని విమర్శించారు. బంద్‌లో తెలుగు ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రఘువీరా కోరారు. కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవహరించిన తీరుకు నిరసనగా సాధన సమితి 16వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
రఘువీరారెడ్డి అరెస్ట్.. పీఎస్‌కు తరలింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేస్తున్నవారిని సీఎం చంద్రబాబు అరెస్ట్ చేయించడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. చంద్రబాబు తన కేసుల కోసమే కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సిగ్గుంటే ముందు తన కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. హైవేపై ఆగిన ట్రాఫిక్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడప-తిరుపతి జాతీయ రహదారిని కాంగ్రెస్ నాయకులు దిగ్బంధించారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
‘ప్రధానిగా రాహుల్ తొలి సంతకం దానిపైనే’
సాక్షి, కడప: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి పోరాడుతూనే ఉందని చెప్పారు. చట్టసవరణ చేసైనా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని, దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందన్నారు. పార్లమెంట్లో విభజన హామీలపై చర్చ జరపకుంటే చరిత్ర హీనులవుతారని ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని చివరి అస్త్రంగా ఉపయోగిస్తామన్నారు. 2019లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతారని చెప్పారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అవకాశవాది: సీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటి లేఖ రాసింది సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు అధిక సంఖ్యలో వస్తాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాదని, అవకాశాన్ని బట్టి ఆయన మారిపోతుంటారని దుయ్యబట్టారు. భూములు కబ్జా చేసిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. -
ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదు
నంద్యాల ఓటమిపై పీసీసీ భేటీలో చర్చ సమావేశానికి హాజరైన దిగ్విజయ్‌సింగ్ సాక్షి, అమరావతి: పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన మంగళవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై నిర్వహించిన సమావేశంలో నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఘోర పరాజయంపై వాడివేడి చర్చ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ కొంతమేరకైనా బలపడకపోతే ఒక్క నాయకుడూ మిగిలే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కాగా, నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘోర ఓటమిపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని దిగ్విజయ్ పేర్కొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గత విషయాలపై చర్చించేందుకు రాష్ట్ర ముఖ్యనేతల్ని ఢిల్లీకి రావాలని ఆయన సూచించినట్టు సమాచారం. నంద్యాల, కాకినాడల్లో పార్టీ ఓటమికి నైతికి బాధ్యత తనదేనని రఘువీరారెడ్డి అన్నట్లు సమాచారం. ఇందిరమ్మ శతజయంతి ఉత్సవాల పేరిట అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 15 వరకు ప్రతి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పేదలకు ఇందిరమ్మ హయాంలో అందించిన ఫలాల గురించి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు వీలుగా అక్టోబర్ 2 నుంచి 45 రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ వెళ్తామని చెప్పారు. నంద్యాల, కాకినాడలో జరిగిన ఎన్నికలు ఎన్నికలే కావని, అవి పూర్తిగా అనైతికంగా జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ డీసీసీ, అనుబంధాల సంఘాల ఎన్నికల ప్రక్రియ 80 శాతం పూర్తయిందని, పీసీసీ చీఫ్‌తోపాటు మిగిలిన పదవులకు ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు కేవీపీ రామచంద్రారావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, సి.రామచంద్రయ్య, కమలమ్మ, కాసు వెంకటకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'నంద్యాల ఉప ఎన్నిక రద్దు చేయాలి'
విజయవాడ: నంద్యాల ఉప ఎన్నికతో రాష్ట్రంలో పాలన పడకేసిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేసిందన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఓటమి భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాలలో ఎన్నికలు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సొంత లాభం కోసమే చంద్రబాబు, జగన్.. ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తున్నారని ఆరోపించారు. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా
విజయవాడ: బాధిత దళితులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో రాష్ట్రంలో దళితలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై టీడీపీ నేతల దాడులని ఖండిస్తున్నామని చెప్పారు. కృష్ణాజిల్లా గుడివాడలో దళితులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని రఘువీరా ధ్వజమెత్తారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీలను మూడేళ్లయిన కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రత్యేక హాదాపై ఇచ్చిన మాటను ప్రధాని నరేంద్ర మోదీ తప్పారని విమర్శించారు. మోదీ మాట తప్పినందుకు రేపు (సోమవారం) నిరసన కార్యక్రమాలు చేపడతామని రఘువీరారెడ్డి తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా మోదీకి నిరసన రాఖీలు పంపనున్నట్లు వెల్లడించారు. -
‘పేరు మార్చుకున్న చంద్రబాబు’
అమరావతి: ‘టీడీపీ, బీజేపీ మూడేళ్ళ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరును అబద్ధాల నాయుడుగా మార్చుకున్నారు. టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. అవినీతి, దోపిడి, అరాచకాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారింద’ని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ మూడేళ్ల పాలనపై ఈ రోజు ఆయన ‘దోపిడి బాబు’ పేరుతో ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెదబాబు, చినబాబు, టీడీపీ నేతలు కలిసి ఇసుకలో రూ. 29 వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. చంద్రబాబు మూడేళ్ళుగా అన్నం తినడం లేదు ఇసుక తింటున్నారని ఎద్దేవా చేశారు. ‘సాగు నీటి ప్రాజెక్టు అంచనాలను 34 వేల కోట్ల నుంచి 74 వేల కోట్లకు పెంచేశారు. భూములు కోసం టీడీపీ మంత్రులు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎమ్మెల్సీలు జైలుకు పోతున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య రాజీ కోసమే చంద్రబాబు త్రిసభ్య కమిటీ వేశారు. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగితే దానిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. తన అవినీతి వల్లే ప్రత్యేక హోదాపై రాజీపడ్డారు. ఏపీలో చినబాబుకు ఒక్కడికే జాబ్ వచ్చింది. బ్యాంకులకు టీడీపీ నాయకులు వేల కోట్లు ఎగ్గొట్టారు. టీడీపీ ఆర్థిక నేరస్థులను పెంచిపోషిస్తోంది. టీడీపీ నేతలు అధికారలోకి వచ్చిన తరువాత రూ. 3 లక్షల కోట్లు దోచుకున్నారు. బాబు మీడియా గొంతు నొక్కుతున్నారు. వాస్తవాలు రాస్తున్న సాక్షి మీడియాను అనేక ఇబ్బందులు పెడుతున్నార’ని రఘువీరా మండిపడ్డారు. -
ఏపీసీసీ ఛీఫ్ మౌనదీక్ష
మడకశిర: రాష్ట్రంలో ప్రస్తుతమున్నది తీవ్ర దుర్భిక్షమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలోని గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు దీక్ష సాగింది. తొలుత స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు, దేశ వ్యాప్తంగా లౌకికవాదానికి ముప్పు, రైతు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ఈ దీక్ష చేపట్టానన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. హిందువులకు కూడా శాంతి లేదన్నారు. రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఉందని ఆయన తెలిపారు. ఐదు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 12 లక్షల మంది కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. యంత్రాలతో ఉపాధి పనులను చేపడుతుండటంతో కూలీల వలసలు పెరిగాయన్నారు. గతేడాది రాష్ట్రంలో 580 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. హేవళంబి సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను పాలకులు పెద్దఎత్తున మోసం చేస్తారని పంచాంగం చెబుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలకు ఎపీసీసీ పరిశీలకుల నియామకం
హైదరాబాద్: స్థానిక సంస్థలకు జరిగే ఉప ఎన్నికల్లో పరిశీలకులను నియమించడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మార్చి 17న ఇందిరాభవన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మున్సిపల్/కార్పొరేషన్, వార్డుల ఉప ఎన్నికలకు పార్టీ పరిశీలకులుగా కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జిల్లాలు, వాటి పరిశీలకుల వివరాలను ఓ ప్రకటనలో ఏపీసీసీ వెల్లడించింది. జిల్లా పేరు పరిశీలకులు 1. విజయనగరం --- ద్రోణం రాజు శ్రీనివాస్(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 2. విశాఖపట్నం --- ఎస్.ఎన్.రాజా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 3. తూర్పు గోదావరి --- పక్కాల సూరిబాబు (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 4. పశ్చిమ గోదావరి --- నరహరశెట్టి నరసింహారావు(ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి) 5. కృష్ణా ---- సుందరరామ శర్మ (ఎపీసీసీ లీగల్ సెల్ చైర్మన్) 6. గుంటూరు ---- కె. బాపిరాజు (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 7. నెల్లూరు ----- మస్తాన్‌వలీ (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 8. చిత్తూరు ------ డాక్టర్ సాకె శైలజానాధ్ (ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) 9. కడప ----- షాజహన్ బాషా (ఎపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే) 10. కర్నూలు ----- డాక్టర్ ఎన్. తులసిరెడ్డి ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ) 11. అనంతపురం ------ అహ్మదుల్లా ( ఎపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి) -
‘ఏపీలో విచ్చలవిడిగా అవినీతి దందా’
విజయవాడ: శాసనసభా సమావేశాలను కనీసం 30 రోజుల పాటు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని సూచించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేసే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ తీర్మానంతో పాటు అఖిలపక్ష నాయకులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దందా కొనసాగుతోందని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ఇష్టానుసారంగా అంచనాలు పెంచేసి దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు వెనుకాడుతోందని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. -
ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్ షానవాజ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా షేక్ షానవాజ్ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్‌ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్ లను నియమించారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్.రఘువీరారెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక ఉత్తర్వులను అనంతపురం జిల్లా ఇన్చార్జి కె.రవిచంద్రారెడ్డి చేతుల మీదగా నేతలు అందుకున్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్న నేతలు, అవకాశం ఇచ్చిన పార్టీ చీఫ్ రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
'ప్రత్యేక హోదా కోసం మౌనదీక్ష'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో 26వ తేదీన మౌనదీక్ష చేపట్టాలని ఏపీసీసీ నిర్ణయించింది. ప్రత్యేక హోదా..ఆంధ్రుల హక్కు అని, ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం చేశాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేసిందని చెప్పారు. బీజేపీ, టీడీపీల మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ శ్రేణులు గాంధీజీ విగ్రహాల వద్ద జాతీయ జెండాలను చేతబూని, నల్లబ్యాడ్జీలతో మౌనదీక్ష చేపడతాయని రఘువీరారెడ్డి వెల్లడించారు. -
‘మోదీతో పోటీ పడుతున్న చంద్రబాబు’
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన సమయంలో కరువు నివేదికలు పంపకపోవడంతో కేంద్రం నుంచి సహాయం అందడం లేదని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. రైతాంగానికి ప్రభుత్వం హాలిడే ప్రకటించిందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీతో పోటీ పడి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయనగరం రైలు ప్రమాద బాధితులకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆయన సంతాపం తెలిపారు. -
దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
విజయవాడ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల మృతి చెంది ఏడాది గడిచినా ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. ఈ విషయంలో న్యాయం జరిగేవరకు తమ పార్టీ పోరాడుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా వాసి అయిన రోహిత్ మరణంపై టీడీపీ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదని చెప్పారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠిన చట్టాలు ఉన్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వైఖరి ప్రభుత్వాలకు దళితులపై ఉన్న చిత్తశుద్దికి అద్దం పడుతుందన్నారు. రోహిత్ ఎస్సీ కాదు బీసీ అని అంటూ.. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు కేసును తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. రోహిత్ వేముల చట్టం తేవాలని ఆయన డిమాండ్ చేశారు. -
శేఖర్‌రెడ్డి.. చంద్రబాబు బినామి: ఏపీసీసీ చీఫ్ రఘువీరా
విజయవాడ: అక్రమ ఆస్తుల వ్యవహారంలో పట్టుబడిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బినామీ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చెన్నైలో చంద్రబాబుకు చాలా మంది ఆప్తులు ఉన్నప్పటికీ వారిని కాదని బినామీ కాబట్టే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇచ్చారని అన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలకు నిరసనగా ‘ప్రశ్నిద్దాం రండి’ పేరుతో తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 23న చలో వెలగపూడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. తాత్కాలిక సచివాలయానికి సమీపంలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సామాన్యుల ఇళ్లలో డబ్బులు లేక పెళ్లిళ్లు వాయిదా పడుతుంటే, మరోపక్క బీజేపీ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ప్రజలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. పాత పెద్ద నోట్ల రద్దు తన వలనే అని చెప్పుకుంటున్న చంద్రబాబు 2 వేల రూపాయల నోట్లు రద్దు చేయాలని ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. -
పెద్ద నోట్ల రద్దుతో పేదలకు ఇబ్బందులు
ప్రధానికి లేఖ రాసిన రఘువీరా సాక్షి, హైదరాబాద్: నల్లధనం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల క్షేత్ర స్థాయిలో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వాస్తవాలను ప్రజలకు అందించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలోని అంశాలను ఇందిరభవన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కావలసిన వారికి, బీజేపీకి ఎన్నికల్లో ఆర్థికంగా ఉపయోగపడిన నల్ల కుబేరులకు సంబంధించి రూ.1.20 లక్షల కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసింది నిజం కాదా.. ఆ మొత్తాన్ని రద్దు చేసిన నల్లకుబేరుల పేర్లను బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. -
ఎవరి కోసం రద్దు చేశారు: రఘువీరారెడ్డి
గుంటూరు: పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకుందో అర్థం కావడం లేదని వాపోయారు. బడాబాబుల కోసమే 2 వేల రూపాయల నోటు చెలామణిలోకి తెచ్చారని ఆరోపించారు. 2 వేల రూపాయల నోటుతో సామాన్య, పేద ప్రజలకు చిల్లర కష్టాలు మొదలయ్యాయని అన్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పెద్ద నోటుకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నోట్ల కష్టాలతో దేశవ్యాప్తంగా 70 మంది చనిపోయారని, వీరి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
‘రూ. 2 వేల నోటు చెల్లని నోటే’
విజయవాడ: ప్రత్యామ్నాయం చూపకుండా అనాలోచితంగా పాత పెద్ద నోట్లు రద్దు చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని గుర్తు చేశారు. 14 లక్షల కోట్ల రూపాయల 500, వెయ్యి నోట్లు రద్దు చేశారని, కొత్తగా ఎన్నినోట్లు విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పాత పెద్ద నోట్ల ఉపసంహరణతో మీరు చెప్పిన లక్ష్యం నెరవేరిందా అని ప్రశ్నించారు. కొత్తగా విడుదల చేసిన నోట్లకు నకిలీవి రావని గ్యారెంటీ ఇవ్వగలరా అని అడిగారు. కొత్తగా చెలామణిలోకి తెచ్చిన 2 వేల రూపాయల నోటు చెల్లని 500, వెయ్యితో సమానమని వ్యాఖ్యానించారు. 2 వేల నోటు సామాన్యులకు ఉపయోగపడడం లేదు, చిల్లర దొరకడం లేదని తెలిపారు. 2 వేల నోటు దాచుకోవడానికే పనికొస్తోందని ఎద్దేవా చేశారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ రాకముందే 2 వేల నోట్లు ప్రింట్ చేశారా అని ప్రశ్నించారు. నోట్ల కోసం క్యూలో నిలబడిన వారిలో 70 మంది మృతి చెందారని, వీరి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ తన తల్లిని క్యూలో నిలబెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. -
‘రూ. 2 వేల నోటు చెల్లని నోటే’
-
‘2 వేల రూపాయల నోట్లను రద్దుచేయండి’
-
‘2 వేల రూపాయల నోట్లను రద్దుచేయండి’
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతపురంలో ఎస్ బీఐ ఎదుట ఆయన ధర్నాకు దిగారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు తమ వారిని కాపాడుకున్నాకే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. దోపీడీ దొంగలు అంతా దాచుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని అన్నారు. తాను లేఖ రాస్తే పెద్ద నోట్లు రద్దు చేశారని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక్క సంతకంతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. బ్యాంకుల్లో విత్ డ్రా దరఖాస్తులను కూడా అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రతి బ్యాంకు, ఏటీఎంలో సరిపడా వందనోట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రేపు అన్ని బ్యాంకుల వద్దకు వెళ్లి ప్రజలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రఘువీరారెడ్డి పిలుపుయిచ్చారు. -
'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'
⇒ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అమరావతిః స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలకు శిక్షణ పేరుతో ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యం అని హోదా కోసం మహానాడులో తీర్మానాలు చేసిన చంద్రబాబుకు హోదా తెచ్చే శక్తిలేక, తన సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేసేందుకు ప్యాకేజీ జపం చేస్తున్నారన్నారని విమర్శించారు. శిక్షణా తరగతులు అంటూ ప్యాకేజీపై ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లకు చెప్పడం వెనుక ఆయనకు ఉన్న భయమేమిటో అర్థం అవుతోందన్నారు. హోదా విషయంలో తన రక్తం మరిగిపోతుందని, ఎంతటి పోరాటానికైనా సిద్ధం అన్న చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించడంలో తన సొంత ప్రయోజనాలకే పెద్దపీఠ వేశారని తేటతెల్లమైందన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు భయపడే టీడీపీ నాయకులకు శిక్షణ పేరుతో ప్యాకేజీ పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు హోదా...నేడు ప్యాకేజీ అంటున్న చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని ఇందులో భాగంగానే ప్రజల వద్దకే కాంగ్రెస్ అంటూ తిరుపతిలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. -
'చంద్రబాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లే'
- టీడీపీ అవినీతిపై పోరాటం ఉధృతం - ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విజయవాడ సెంట్రల్ (కృష్ణా జిల్లా) : ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆయుష్షు మూడేళ్లలో ముగియనుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరా రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం సోమవారం ఆంధ్రరత్న భవన్లో జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2050 వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని చంద్రబాబు కలలు కంటున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అవినీతి సంపాదన మితిమీరడంతో చంద్రబాబు అహంకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అడవి పందులతో పోల్చిన బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు రెండేళ్ల పాలనలో హామీలను గాలికి వదిలేశారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ గుర్తింపును రద్దుచేయాలని కోరతామన్నారు. చంద్రబాబు నుంచి జన్మభూమి కమిటీల వరకు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. దీనిపై కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేయనున్నట్లు తెలిపారు. త్వరలో రాహుల్‌గాంధీ విశాఖ మన్యంలో భరోసాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తిరువనక్కరసు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కోపంగా ఉన్న ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గాలవారీగా పునశ్చరణ తరగతులు నిర్వహించాలని, ప్రభుత్వ పథకాలు అందని అర్హుల తరఫున పోరాటం చేయాలని, తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని, ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని, ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రత్యేకహోదా కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లుకు ఇతరపార్టీల మద్దతు కూడగట్టాలని సమన్వయ కమిటీ తీర్మానించింది. మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ ఏర్పాటు చేయాల్సిందే..
లేదంటే ఉద్యమిస్తాం పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నరసరావుపేట : మండలంలోని కాకాని వద్ద కాకినాడ జవహల్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం నరసరావుపేటకు వచ్చిన ఆయన పీసీసీ క్రమశిక్షణ సంఘ చైర్మన్, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి సూచన మేరకు జేఎన్టీయూకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించి విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వం రూ.50 కోట్ల విలువైన 87 ఎకరాల స్థలాన్ని జేఎన్టీయూకు కేటాయిస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే ఇదే స్థలాన్ని పారిశ్రామిక వాడ కోసం ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నల్ల జీవో ఇచ్చిందని, దానిని వెంటనే రద్దు చేయాలని కోరారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జేఎన్టీయూపై చంద్రబాబు హామీ ఇచ్చిన మూడు నెలలకే..ఏపీఐఐసీకి అప్పగించడం దారుణమన్నారు. పారిశ్రామిక వాడల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడుతుందని విమర్శించారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జున రావు స్థానిక నాయకులు ఉన్నారు. -
కాంగ్రెస్ కరువు యాత్ర
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితులను సమీక్షించేందుకు పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బృందం మే 14,15 తేదీల్లో జిల్లాల్లో పర్యటించనుంది. 14వ తేదీ ఉదయం 10 గంటలకు విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపాలెం మండలంలోని కొత్తూరు గ్రామం, అనంతరం సాయంత్రం 4 గంటలకు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలోని మండపం గ్రామాల్లో పర్యటించనున్నారు. 15 వ తేదీన ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలోని చింతలపూడి గ్రామంలో పర్యటించనున్నారు. -
ఓటింగ్‌తో వాళ్ల నిజాయితీ తెలుస్తుంది: రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదాపై పీసీసీ చీఫ్ రఘువీరా న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్‌తో బీజేపీ, టీడీపీ నిజాయితీ ఏంటో బయటపడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇతర పార్టీలను కోరినట్టు వివరించారు. ఓటింగ్ జరిగే 13వ తేదీన కాంగ్రెస్ సభ్యులందరూ హాజరవ్వాలని పార్టీ విప్ జారీచేస్తుందని, దీనిపై ఇప్పటికే సోనియాగాంధీ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రైవేటు బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవాలని బీజేపీ, టీడీపీ కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి రాజధాని లేదని, నిర్మాణంలో తగిన సాయం చేయాలని ఆయన కోరారు. -
‘ప్రత్యేక’ నినాదమే మనకు దిక్కు!
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు... రాష్ట్ర విభజన పాపం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పార్టీపరంగా రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కన్పించడం లేదు. ఆఖరుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏడాదిలోనే రెండు సార్లు అనంతపురం జిల్లా పర్యటనకు తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ పార్టీకి గ్రామ స్థాయి నాయకులు కూడా కరువయ్యారు. రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఎలాగూ నష్టపోయాం...ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆ నినాదంతోనే ముందుకెళ్తే బాగుంటుందని భావిస్తున్నారు. హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై ఇప్పటికే కోటి సంతకాలు, ఎస్ఎంఎస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం పార్లమెంటు జరుగుతున్నందున రాష్ట్రం నుంచి కనీసం రెండు వందల మంది నాయకులు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. అంతో ఇంతో పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఈ నినాదమే దిక్కు అని నేతలు భావిస్తున్నారు. -
చలో ఢిల్లీ పోస్టర్ విడుదల చేసిన రాహుల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం అమలు కోసం కోటి సంతకాల సేకరణకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. న్యూఢిల్లీలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇందుకు సంబంధించి గురువారం ఓ పోస్టర్ విడుదల చేశారు. కోటి సంతకాల సేకరణతో మార్చి 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా, పునర్ విభజన చట్టం సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేయనున్నట్లు ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పేర్కన్నారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జైరాం రమేష్, పార్టీ ఎంపీలు కేవీపీ రామచందర్ రావు, ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, జేడీ శీలం, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పార్టీ నిర్మాణంలో నిర్లక్ష్యం చేశాం
పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశామని, రాష్ట్ర విభజన అనంతర పరిణామాలతో పార్టీ మరింత బలహీనపడిందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం విజయవాడలోని ఎగ్జిక్యూటివ్ క్లబ్లో రాష్ట్రస్థాయిలో వివిధ జిల్లాల నుంచి ఎంపికచేసిన 70 మంది ముఖ్య కార్యకర్తలకు రెండు రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. పార్టీ సిద్ధాంతాలు, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి వివరించడంతో పాటు ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై కార్యకర్తలకు ఈ శిక్షణ తరగతుల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 15 వేల మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజలను తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ చేసిన తప్పులను సరిదిద్దుకోవడం ద్వారా పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేసేందుకు శిక్షణ తరగతులు ఉపకరిస్తాయన్నారు. -
'24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్: ఎస్సీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 24 గంటల్లోగా దళితులకు క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకుంటే చంద్రబాబుపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దళితులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బీసీ కమిషన్ ను పూర్తిస్థాయిలో నియమించలేదని తెలిపారు. బీసీ కమిషన్ కు ఇంతవరకు సభ్యులను నియమించలేదని, కనీసం కార్యాలయం కూడా లేదని అన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అవసరమయితే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సూచించారు. -
దారుల మూత.. నేతల నిర్బంధం
♦ ఎయిర్‌పోర్టులో రఘువీరా, చిరంజీవి అరెస్టు, విడుదల ♦ విమానాశ్రయంలోనే బొత్స, ఉమ్మారెడ్డిల నిర్బంధం ♦ హోటల్ నుంచి దాసరిని కదలనీయని పోలీసులు సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు, సంఘీభావం తెలిపేందుకు కిర్లంపూడి వస్తున్న ప్రతిపక్ష నేతలను రాష్ర్టప్రభుత్వం అడుగడుగునా ఆటంకపరిచింది. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంలో వారిని నిర్బంధించింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవిలను అక్కడే అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కూడా విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడి వస్తున్న కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావును అడుగడుగునా అడ్డుకున్నారు. కిర్లంపూడికి దారితీసే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. కిర్లంపూడి వెళ్లేందుకు రాజమహేంద్రవరం వచ్చి ఓ హోటల్లో బస చేసిన దాసరిని పోలీసులు బయటకు రానీయలేదు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమన్నా ఉగ్రవాదినా’ అని ఆయన మీడియా వద్ద వాపోయా రు. సాయంత్రం దాసరి కిర్లంపూడిలో ముద్రగడను కలిసివెళ్లారు. ప్రభుత్వ తీరుపై చిరంజీవి తీవ్రంగా స్పందించారు. ‘మమ్మల్ని నిర్బంధిం చే హక్కు ఎవరు ఇచ్చారు’ అని ప్రశ్నించారు. విమానాశ్రయంలోనే ...: వైఎస్సార్సీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ సీనియర్ నేత బొత్సలను విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్ష విరమించిన తర్వాత గానీ వారిని వదలలేదు. అక్కడ నుంచి బొత్స విజయనగరం, ఉమ్మారెడ్డి గుంటూరు బయలుదేరి వెళ్లారు. -
'మీడియాను రానివ్వకుండా మమ్మల్ని నిర్బంధించారు'
రాజమండ్రి: కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమను సోమవారం రాజమండ్రి విమానాశ్రయంలో అరెస్ట్ చేసి నిర్బంధించడం పట్ల కాంగ్రెస్ నేతలు రఘువీరా రెడ్డి, చిరంజీవి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అరాచకాలు జరుగుతాయని తమను ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ.. 'రాజమండ్రి విమానాశ్రయానికి ఉదయం 11.30కి చిరంజీవితో కలసి వచ్చాం. సి.రామచంద్రయ్య, పళ్లంరాజు, వట్టి వసంతకుమార్ కలిసి కిర్లంపూడి వెళ్లి ముద్రగడను పరామర్శించాలనుకున్నాం. కాపు రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వస్తే, అతి దుర్మార్గంగా మమ్మల్ని ముందస్తుగా అరెస్టు చేశారు. కనీసం మీడియాను కూడా రానివ్వకుండా గంటన్నర పాటు నిర్బంధించారు. ఇది ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట. దీన్ని ఖండిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు కాపులకు రిజర్వేషన్ కల్పించాలి. ఇది కేవలం కాపులకు సంబంధించిన సమస్య కాదు.. మొత్తం ప్రజాస్వామ్య సమస్య. మాకు, ప్రజలకు మధ్య గోడ నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. మేం కిర్లంపూడి వెళ్లి తీరాలి. వెళ్లకుండా వెనుదిరిగే ప్రసక్తి లేదు' అని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. 'కాపు ఉద్యమసారథి ముద్రగడను పరామర్శించి, సంఘీభావం తెలిపేందుకు మేమంతా వచ్చాం. కిర్లంపూడి వెళ్లి సామరస్యంగా మాట్లాడదామని వచ్చాం. ఏ అరాచకాలు, గందరగోళం జరుగుతాయని మమ్మల్ని ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారు. ఇది అప్రజాస్వామికం. సీఎం ఏం చూసి భయపడి ఇలా నిర్బంధిస్తున్నారో అర్థంకావడం లేదు. మేమంతా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులమే. మేం ప్రభుత్వానికి, ఉద్యమ పెద్దలకు మధ్య వారధిగా ఉండి ప్రయోజనాత్మక సలహాలు ఇవ్వాలని వస్తే ఇలా అరెస్టు చేయడం ఎంతవరకు సబబు? కేవలం వాళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, మా నోళ్లు మూయించడానికి జరుగుతున్న ప్రయత్నం. మేం రెచ్చగొట్టేవాళ్లం కాదు' అని చెప్పారు. -
రఘువీరా, చిరంజీవి అరెస్ట్
రాజమండ్రి: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంఘీభావం తెలిపేందుకు రాజమండ్రి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిలను పోలీసులు అడ్డుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న ఇరువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు విమానాశ్రయం వెలుపల పెద్ద ఎత్తున బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తమ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎయిర్ పోర్టు నుంచి రఘువీరారెడ్డి, చిరంజీవిని పోలీస్ స్టేషన్ కు తరలించడానికి ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ముద్రగడను పరామర్శించేందుకు తమ నేతలను వెళ్లనివ్వాలని వారు డిమాండ్ చేశారు. ముద్రగడను కలిసేందుకు వచ్చిన రఘువీరారెడ్డి, చిరంజీవిని 151 చట్టం కింద అరెస్టు చేశారని ఆరోపించారు. ముద్రగడతో ప్రభుత్వం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. ప్రజలను రెచ్చగొట్టవద్దని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోందని, మానవ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. రఘువీరా, చిరంజీవి అరెస్ట్ ను పీసీసీ ఖండించింది. -
'ఎట్టి పరిస్థితుల్లోనూ కిర్లంపూడికి వెళతాం'
హైదరాబాద్: కాపు ఉద్యమకారులతో ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సోమవారం ఉదయం చిరంజీవితో కలిసి కిర్లంపూడి వెళ్లేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రికి పయనమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమను రాజమండ్రిలో అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోన కిర్లంపూడికి వెళ్లి తీరతామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర ఆలస్యంగా జస్టిస్ మంజునాథ కమిషన్ వేసిన ప్రభుత్వం ఇప్పటికీ సభ్యులను నియమించలేదని విమర్శించారు. 2 నెలల్లో కాపుల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించవచ్చని తెలిపారు. తుని ఘటన సహా ఉద్యమానికి సంబంధించిన అన్ని ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. -
'గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయి'
అనంతపురం : జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్ఎస్ఎస్తో సంబంధాలున్నాయని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. శనివారం అనంతపురంలో రఘువీరా మాట్లాడుతూ... హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మరణానికి కారకులైన కేంద్రమంత్రులను తొలగించాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలకు వ్యతిరేకమని... అందుకే వారిపట్ల వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గాడ్సే , గాంధీ వారసుల మధ్య సైద్ధాంతిక పోరు జరుగుతుందని రఘువీరా తెలిపారు. -
'ఆంధ్రాకు ప్రత్యేక హోదా వర్తింపజేయాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని, ఈ విషయంలో తాము కూడా పూర్తి మద్దతు తెలియజేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అన్నారు. ప్రత్యేక హోదా అమలు ద్వారా ఉత్తరాఖండ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధించిందనీ, వివిధ మార్గాల ద్వారా అధిక మొత్తంలో నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాల ద్వారా విశేషమైన లబ్ధి సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం డెహ్రాడూన్‌లో ఆయనతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ, హోంమంత్రి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా వల్ల విద్య, వైద్యం, రహదారులు, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాలకు భారీగా నిధులు రావడంతోనే పురోగతి సాధించామని, ప్రారిశ్రామిక ప్రోత్సాహకాల వల్ల పారిశ్రామికంగా వృద్ధి చెందామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఇలాంటి చర్యల ఫలితంగా గడచిన 16 ఏళ్లలో తమ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంలో గణనీయమైన వృద్ధి రేటు నమోదు అయ్యిందనీ, ప్రస్తుతం తాము అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నామని ముఖ్యమంత్రి రఘువీరారెడ్డికి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులకు కోత పెట్టేందుకు యత్నించినా సమర్థంగా వ్యతిరేకించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింప చేయాలంటూ సోనియా గాంధీ సమక్షంలోనే తీర్మానించామని ఆ విషయంలో ఏపీకి సంపూర్ణ మద్దతిస్తామని రఘువీరాకు ముఖ్యమంత్రి రావత్ స్పష్టం చేశారు. -
మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా?
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల సందడి మొదలైనా ప్రచారంలో పాల్గొనాలని మాటమాత్రంగానైనా ఆహ్వానించకపోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు గుర్రుమంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచార వ్యూహంపై పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. అయితే, తనకు పిలుపు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ప్రచారం చేస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉన్నా దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఏపీకి చెందిన ముఖ్యనేతలు ఇందిర భవన్లో చర్చించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామనే ఆకాంక్షను ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించాలని ఏపీ పీసీసీ చీఫ్ ముందుగా అనుకున్నప్పటికీ తెలంగాణ నాయకుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆ విషయాన్ని ప్రకటించకుండా వాయిదా వేయాల్సి వచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
'చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చూస్తుంటే నీరో చక్రవర్తి గుర్తుకు వస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉంటే చంద్రబాబు కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు టైంపాస్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కృష్ణానదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే సెక్షన్ 84 కింద కేంద్ర జలవనరులు సంఘం అనుమతి ఉండాలని, కేంద్ర జలవనరుల శాఖ సిఫారసు అయినా ఉండాలని తెలిపారు. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై చంద్రబాబు అభ్యంతరం చెప్పకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టడం సరికాదన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సుతో రూ.2 లక్షలు కూడా రాష్ట్రానికి రావని చెప్పారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా రెడ్డి లేఖ రాశారు. -
'చంద్రబాబు గొప్పలు హాస్యాస్పదం'
కడప: నదుల అనుసంధానంపై చంద్రబాబు, ఆయన బృందం గొప్పులు చెప్పుకోవడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడేళ్ల క్రితమే కృష్ణా నీటిని హాంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా పెన్నాకు అనుసంధానం చేశామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ద్వారా నదులను అనుసంధానం చేస్తే అది నిజమైన అనుసంధానం అని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నవన్నీ తాత్కాలిక పనులేనని అన్నారు. చంద్రబాబుది అంతా ఇంకుగుంతల జాతకమని, ఆయన ఎప్పుడూ ప్రాజెక్టులకు వ్యతిరేమని రఘువీరా పేర్కొన్నారు. -
'చంద్రబాబుది ఇంకుడు గుంత జాతకం'
కాకినాడ: పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ, బీజేపీ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. పోలవరానికి పట్టిసీమ ప్రాజెక్టు ప్రత్యామ్నాయం అయితే పోలవరాన్ని ఎందుకు కొనసాగించాలని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వచ్చేనెల లోపు రాయలసీమకు నీళ్లు ఇవ్వకుంటే టీడీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుంత బతుకు.. చంద్రబాబు జాతకం కూడా ఇంకుడు గుంతేనని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాపై మోసం చేసిన మోదీ, వెంకయ్య, చంద్రబాబు నేరస్థులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఈనెల 7, 8, 9 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తులు పోలీసుస్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని చెప్పారు. -
'డేటు, టైమ్ ఫిక్స్ చేయండి'
హైదరాబాద్: ప్రత్యేకహోదాపై బహిరంగ చర్చకు సిద్ధమన్న సీఎం చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. వేదిక, తేదీ, సమయం చంద్రబాబే నిర్ణయించాలని సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ కావాలని ప్రధాని మోదీని అడిగిన మాట వాస్తవం అవునో, కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానికి చంద్రబాబు ఇచ్చిన వినతిపత్రంలో ఏం అడిగారో తనకు తెలియదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పడం చంద్రబాబు రహస్య పాలనకు అద్దం పడుతోందన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పిన వెంకయ్య నాయుడు ఇప్పుడు ఏపీకి మూడు మాత్రమే ఇవ్వడంపై వివరణ ఇవ్వాలన్నారు. ఏపీలో టీడీపీ పాలన దారుణంగా ఉందనడానికి ఎలుక కరిచిన ఘటనలో చిన్నారి చనిపోవడమే నిదర్శనమని రఘువీరారెడ్డి అన్నారు. -
'చంద్రబాబుపై అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు'
హైదరాబాద్: ఢిల్లీ వెళ్తున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకుని రావాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేకహోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మోసం చేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ప్రత్యేకహోదా అంశాన్ని నీరుగారిస్తే ప్రధాని మోదీ, చంద్రబాబుపై అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు పెడతామని హెచ్చరించారు. రాజధాని భూములను తాకడానికి వీల్లేదన్నారు. రైతులను బ్లాక్ మెయిల్ చేసేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీలోని అన్ని మండలాలు, కలెక్టరేట్ల ఆఫీసుల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
'సీఎంను అవమానించేలా వెంకయ్య వ్యాఖ్యలు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాను లేకపోతే దిక్కులేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వెంకయ్య వ్యాఖ్యలు ప్రజలను నిరాశపరిచేలా, ముఖ్యమంత్రిని అవమానించేలా ఉన్నాయని అన్నారు. విదేశీ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే చంద్రబాబు భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాని రఘువీరా డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు
మోదీ, వెంకయ్య, బాబులపై కేసులు పెడతాం వైఎస్ జగన్ ధర్నా హర్షణీయం కాంగ్రెస్ పోరు సభలో రఘువీరారెడ్డి, చిరంజీవి వెల్లడి 11న రాష్ట్ర బంద్‌కు పిలుపు తిరుపతి మంగళం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడం ఆంధ్రుల హక్కు అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో శనివారం పోరు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తామని సోనియాగాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చెబితే అలా కుదరదు కనీసం పదేళ్లయినా ఇవ్వాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రత్యేక హోదా కల్పించకపోవడం శోచనీయమని విమర్శించారు. హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లలో కేసులు పెడతామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 11న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా చేపడుతుండడం హర్షణీయమని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.బలిదానాలతో కాకుండా పోరాటాలతో ప్రత్యేక హోదా సాధిద్దామని రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం తిరుపతికి చెందిన మునికోటి అనే యువకుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం బాధాకరమని చెప్పారు.సభలో కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు, కిల్లి కృపారాణి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తరపున మీడియాతో మాట్లాడేది వీరే
హైదరాబాద్ సిటీ: కాంగ్రెస్ తరపున మీడియాతో మాట్లాడేందుకు 18 మందితో కూడిన ప్రతినిధుల జాబితాను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సోమవారం విడుదల చేశారు. జాబితాలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, సాకే శైలజానాథ్, కొండ్రు మురళీమోహన్, పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, ఆనం వివేకానందరెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్.తులసిరెడ్డి, తూర్పు గోదావరి, చిత్తూరు పీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, కంచన వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ, గుంటూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణువర్ధన్‌రావు, షేక్ మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ కిసాన్, ఎస్సీ సెల్ చైర్మన్లు కె.రవిచంద్రారెడ్డి, సీహెచ్ సుందరరామ శర్మలను ఈ కమిటీలో వేశారు. -
'అబద్ధపు హామీలతో పూర్తిగా ముంచారు'
విశాఖపట్నం: అనంతపురం జిల్లా ఉరవకొండలో యువరైతు ఆత్మహత్యకు టీడీపీ సర్కారే కారణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. అబద్ధపు హామీలతో రైతులను పూర్తిగా ముంచేశారని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసులో రూ. 50 లక్షలతో పట్టుబడ్డ రేవంత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం, ఓటుకు కోట్లు కేసుపై రెండు, మూడు రోజుల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామని ఆయన తెలిపారు. -
వారే టీడీపీలో చేరారు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో మేము తప్ప ఎవ్వరూ మిగలరని ప్రకటించిన వాళ్లే టీడీపీలో చేరి పదవులు అనుభవిస్తున్నారని జేసీ సోదరులను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవి పోయిన తర్వాత రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సోమవారం అనంతపురంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
కాంగ్రెస్ నేతలతో రఘువీరా సమావేశం
అనంతపురం: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో అనంతపురం జిల్లా మడకశిరలో సమావేశమయ్యారు. రాహుల్ పాదయాత్రపై వారు ఈ సందర్భంగా చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ జూన్ నెలాఖరులో అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సదరు నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. అలాగే అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శిస్తారు. విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీనే కారణం అన్న బలమైన వాదన సీమాంధ్ర ప్రజల్లో గూడు కట్టుకుని ఉంది. దాంతో గత ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే కానీ... ఓ ఎంపీ కానీ ఎన్నిక కాలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో పునర్జీవింప చేయాలని సీమాంధ్రలోని ఆ పార్టీ నేతలు కంకణం కట్టుకున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర నేతలు రాహుల్ పర్యటన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా పావులు కదిపారు. రాహుల్ పాదయాత్ర చేసేందుకు అంగీకరించారు. అదికాక తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు... ఆ పాదాయత్రను ఎలాగైనా విజయవంతం చేయాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఇప్పటికే రాహుల్ పరామర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ పాదయాత్రను విజయవంతం చేయడానికి ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ నేతలు సమాయత్తమైయ్యారు. -
'పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు'
విశాఖపట్నం : పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే మాజీ పీసీసీ చీఫ్ బోత్స సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు విధించిందని ఆయన తెలిపారు. శుక్రవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో రఘువీరా విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇతర పార్టీల్లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు తమ పార్టీ చేయలేదని రఘువీరా వెల్లడించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బొత్స సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేసింది. -
'ఎదురుదాడితో నిప్పులాంటి మనిషి కాలేరు'
హైదరాబాద్: 'ఓటుకు నోటు'పై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో చంద్రబాబు ఎదురుదాడి చేయడం తగదని హితవు పలికారు. ఎదురుదాడితో నిప్పులాంటి మనిషి కాలేరని అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ప్రమేయం ఉందా, లేదా చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. నవ నిర్మాణ దీక్షలో ప్రజలతో చంద్రబాబు అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 65 మంది మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ ఐదుగురు అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో దించడాన్ని చంద్రాబు ప్రశ్నించడం శోచనీయమన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ ఎందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీ పెట్టిందని నిలదీశారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి కాదని, చెదలు పట్టిన మనిషిని రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. -
హామీలు హాంఫట్
- 600 వాగ్దానాలు తుంగలోకి... - ఇదీ చంద్రబాబు ఘనత - రఘువీరా ఎద్దేవా అల్లిపురం(విశాఖ): తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్న 600 హామీలను అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలు సంయుక్తంగా బుధవారం దసపల్లా హోటల్లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇదే చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిన ఘనత అని, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానానికి రూ.5 కోట్లు ఎర చూపి నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. హుద్‌హుద్ తుఫానులో కోట్లాది రూపాయల వసూలు చేసి హాంఫట్ చేశారన్నారు. పట్టెసీమ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు అందుకున్నారన్నారు. వీటన్నింటిని దగానాడుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. దేశం ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ 8 వతేదీ వరకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తుందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన 10 లక్షల 25 వేల సంతకాలతో కూడిన పుస్తకాలను ఆయనకు అంద జేశారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంతకుమార్, పి.బాలరాజు, డి.వి.రామమెహన్, బచ్చు మహేశ్వరరావు, కొండా మురళి, తులసీరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పేడాడ రమణకుమారి, కొండా రాజీవ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'బాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి'
పశ్చిమగోదారి(ఏలూరు): తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కూడా అరెస్ట్ చేయాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రఘువీరా పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం సీసలిలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి తమ బాసే ఈ డబ్బును పంపించారని పదే పదే ఒప్పుకున్నారని ఆయన అన్నారు. డబ్బులిచ్చిన చంద్రబాబుపై మొదటిముద్దాయిగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారు. గోదావరి జిల్లాల డబ్బులే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు చంద్రబాబు పంపారని దుయ్యబట్టారు. -
కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రం.. 'అదిరిందయ్యా చంద్రం'
హైదరాబాద్: చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. టీడీపీ మహానాడు అని కాకుండా దగానాడు అని పెట్టుకుంటే బాగుండేదని ఆయన సూచించారు. చంద్రబాబు ఏడాది పాలనపై వ్యంగ్యంగా రూపొందించిన 'అదిరిందయ్యా చంద్రం' సీడీని ఇందిరాభవన్ లో బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబుపై తమ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. ఈ సీడీలను టీడీపీ కార్యాలయానికి పంపుతున్నామని చెప్పారు. మహానాడుకు హాజరయ్యే 60 వేల మందికి ఈ సీడీని చూపించాలన్నారు. మాట తప్పుతున్న చంద్రబాబుకు ఎన్నికల హామీలను గుర్తు చేసేందుకే ఈ సీడీనీ రూపొందించామన్నారు. తమ లేఖ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న చంద్రబాబుకు నిజాయితీ ఉంటే ఇదే అంశంపై మహానాడులో తీర్మానం పెట్టాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
సొమ్మసిల్లిన రఘువీరా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వడదెబ్బ తగిలింది. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన ఆయన కొద్ది సేపటికి సొమ్మసిల్లిపడ్డిపోయారు. దాంతో కాంగ్రెస్ నాయకులు కంగారు పడ్డారు. వారు వెంటనే స్పందించి... వైద్యులను డీసీసీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రఘువీరాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రఘువీరా రెడ్డికి వడదెబ్బ తగిలిందని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. -
మొదట్నుంచి రైతులకు బాబు శత్రువే
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. మొదటి నుంచి రైతులకు చంద్రబాబు శత్రువే అంటూ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీలు ద్రోహం చేస్తున్నాయని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లు ప్రత్యేక హోదా అని కాంగ్రెస్ పేర్కొంటే... కాదు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగింది. కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాడిన సంగతి తెలిసిందే. విభజన జరిగి ఏడాది కావస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీలు నాన్చుడు ధోరణి అవలంబించడంపై రఘువీరా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రత్యేక హోదా కోసం..
ఆనందపేట (గుంటూరు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు గుంటూరును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడుతోంది. బీజేపీ, టీడీపీలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడాన్ని నిరసిస్త్తూ ఈనెల 2వ తేదీ స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలోని బళ్ళారి రాఘవ ఆడిటోరియంలో సామూహిక దీక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కోటి సంతకాల కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి జిన్నాటవర్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ, సభా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హిందూకళాశాల సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఐదు రోజులపాటు నిరాహార దీక్ష శిబిరాన్ని కొనసాగించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితోపాటు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులు రెండు ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు ఒంచైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి గుంటూరులో సామూహిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితోపాటు, పార్టీ రాష్ట్రముఖ్య నాయకులు హాజరు కానున్నారని జిల్లా నాయకులు వెల్లడించారు. -
'నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పు'
- వచ్చే నెల 2న గుంటూరులో మహా దీక్ష -దీక్ష విజయవంతంపై నేతలతో చర్చించిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హైదరాబాద్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా వచ్చే నెల 2వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో మహా దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఈ దీక్షను విజయవంతం చేసే విషయమై ఆదివారం రఘువీరా హైదరాబాద్‌లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం రాష్ట్రానికి మోసం చేయడం దారుణమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీనే ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోందని మొదట్లో భావించామని అయితే చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై ప్రత్యేక హోదా గురించి ఇక మరచిపోండని కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అంటూ వారికి హితబోధ చేయడాన్ని బట్టి చూస్తే బాబు... ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన విషయం బహిర్గతమైందన్నారు. చంద్రబాబు, మోడీ జోడీ అద్భుతం అంటూ ఇటు టీడీపీ అటు బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకోవడం మినహా రాష్ట్ర ప్రయోజాలను కాపాడే చర్యలేవీ చేపట్టలేదనే విషయాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకువెళ్లాలని ప్రార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినప్పుడు మాత్రం విభజన అడ్డగోలుగా చేశారని, తెలంగాణలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని పట్టుకుని వేళాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తే తెలుగుదేశం పార్టీకే మంచి పేరు వస్తుంది తప్ప కాంగ్రెస్‌కు కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేక హోదాతో ఏడాదికి లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ. 5 లక్షల కోట్లు వస్తే దేశంలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందనంతగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందన్నారు. మాట్లాడితే ప్రత్యేక హోదా విషయమై చట్టంలో ఎందుకు పొందుపరచలేదని టీడీపీ, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని దేశంలో ఇప్పటి వరకు ప్రత్యేక హోదా కల్పించి అన్ని రాష్ట్రాల్లో కూడా చట్టం చేయడం వల్ల రాలేదని కేవలం కేబినెట్ నిర్ణయాలతోనే ప్రత్యేక హోదా ఇచ్చాన్నారు. నాయకులు, కార్యకర్తలను తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ అని మిగిలిన పార్టీలకు ఆ శక్తి లేదని మహబూబ్‌నగర్ జిల్లా బహిరంగ సభలో చంద్రబాబు వెల్లడించడాన్ని ఆయన తప్పు పట్టారు. నీవు ఏ కర్మాగారం నుంచి తయారయ్యావో చెప్పాలంటూ చంద్రబాబును ప్రశ్నించారు. దీక్ష విజయవంతం అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు కేవీపీ రామచంద్రారావు, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణరెడ్డి తదితరులతో సమావేశమై చర్చించారు. -
'కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర'
అనంతపురం: కమీషన్ల కోసం కాలువ గట్లపై నిద్ర చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. రూ. 300 కోట్ల ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతున్నారని అన్నారు. పట్టిసీమకు బదులు పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తే మంచిదని సూచించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తానన్న చంద్రబాబు హామీల అమలులో విఫలమయ్యారు. -
నేనేం చేస్తున్నది ప్రజలకు తెలుసు
తనను కలసిన ఏపీ కాంగ్రెస్ నేతలతో నరసింహన్ ఎంట్రీ ట్యాక్స్ ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: ‘‘నా గురించి బయట ఏవేవో మాట్లాడుతున్నారు.. నేనేం చేస్తున్నది ప్రజలకు బాగా తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఏదైనా కావచ్చు. నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి నాకున్న అధికార పరిధిలో చేయాల్సింది చేస్తున్నాను.. ఏమి చేసిందీ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది’’ అంటూ తనను కలసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రుసుం వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకొని దానిని ఉపసంహరించుకునేలా చూడాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గవర్నర్‌తో మాట్లాడుతూ.. రుసుం వసూలుపై కోర్టు జోక్యం కంటే కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై గవర్నర్ తీవ్రంగా స్పందిస్తూ పైవిధంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టుతో పాటు ఆర్బీఐ, నాబార్డు సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నందున వాహనాలపై ప్రవేశ రుసుం విధించడం సరైన చర్య కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్టం ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గవర్నర్‌ను కోరారు. అదేవిధంగా ఏపీలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా లక్షలాది మంది పేద కూలీలు వలసలు పోతున్నారని.. దానిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 5 వేల గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి ట్యాంకర్లలో కూడా జన్మభూమి కమిటీల జోక్యం కారణంగా టీడీపీకి మద్దతివ్వని గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలసిన వారిలో కె.చిరంజీవి, పల్లంరాజు, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు. -
'ఆ రెండు పార్టీల దొంగాట'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి శుక్రవాంర చిత్తూరులో నిప్పులు చెరిగారు. ప్రత్యేక ఆంధ్రకు ఇవ్వాల్సిన ప్యాకేజీపై టీడీపీ, బీజేపీలు దొంగాట ఆడుతున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి మేలు చేస్తుంది.. అలాంటి ప్రాజెక్టును వదిలి పెట్టి...పట్టిసీమ అంటూ టీడీపీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదని రఘువీరా అశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది. ఎన్నికల హామీలు, వాటిని అమలు చేసేందుకు ప్రభుత్వాన్నికి ఉన్న చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో బడ్జెట్లో కేటాయించిన నిధులను చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు. -
'పట్టిసీమ' బెంగతోనే కర్రి శంకరయ్య మృతి
ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి... పోలవరం ప్రాజెక్టుకి నిధులు వెంటనే విడుదల చేయాలని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి... కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకు వచ్చిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. ఎత్తిపోతల పథకంలో రాయలసీమకు ప్రయోజనం శూన్యమన్నారు. పట్టిసీమ వద్దు, పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని రఘువీరారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడంలో బీజేపీ కుంటి సాకులు చెబుతోందని ఆయన విమర్శించారు. పట్టిసీమ పథకంతో భూమి కోల్పోనున్నమన్న బెంగతో మృతి చెందిన రైతు కర్రి శంకరయ్యది సర్కార్ హత్యే అని రఘువీరా ఆరోపించారు. శంకరయ్య కుటుంబాన్ని ఆదుకుని... రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని రఘువీరా డిమాండ్ చేశారు. -
రెండో రోజూ కొనసాగిన రిలే నిరాహార దీక్షలు
ఆనందపేట (గుంటూరు): ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా విభాగం ఆధ్వర్యంలో ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. రెండోరోజు శిబిరానికి పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు బీజేపీ విషబీజాన్ని నాటిందని, తెలుగుదేశం పార్టీ ఆ విష వృక్షాన్ని నీరు పోసి పెంచి పోషించిందని ఆరోపించారు.రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపిన తరువాతే కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయం తీసుకుందన్నారు. విభజన తరువాత రాష్ట్రానికి మేలు జరిగేలా అనేక అంశాలతో ఆర్డినెన్స్ జారీ చేశామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేయాలని, రూ.5 లక్షల కోట్లతో పథకాలను రూపొందించాలని చట్టం రూపంలో చేశామని ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టనవసరం లేదని, విభజన చట్టంలోని అంశాలను అమలుచేస్తే చాలని ఆయన అన్నారు. బీజేపీ, టీడీపీలు వారి స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా పరిశీలకుడు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు షేక్ మస్తాన్‌వలి, మాజీ శాసనసభ్యులు లింగంశెట్టి ఈశ్వరరావు, చదలవాడ జయరాంబాబు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ కూచిపూడి విజయ, కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూచిపూడి సాంబశివరావు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, షేక్ అబ్దుల్ వహీద్, కొరివి వినయ్‌కుమార్, మిరియాల రత్నకుమారి, ఈరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తప్పు సరిదిద్దుకుందాం
కాంగ్రెస్ మేధోమథనంలో దిగ్విజయ్ కోటి సంతకాలను ముమ్మరం చేయాలి తొలి రోజు నాలుగు గ్రూపుల చర్చ నేడు కూడా కొనసాగనున్న సదస్సు విజయవాడ సెంట్రల్ : రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ తొలి మేధోమథన సదస్సు నగరం కేంద్రంగా జరిగింది. శుక్రవారం హనుమాన్‌పేటలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సదస్సును ఎపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సదస్సు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగింది. అనంతరం ఒక గంట బ్రేక్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కోరిన తర్వాతే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందని చెప్పారు. మిగిలిన పార్టీలు విభజన వల్ల రాజకీయ లబ్ధిపొందితే, కాంగ్రెస్ చేయని తప్పుకు నింద మోస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నాయకులకు సూచించారు. పార్టీ విధి విధానాలు, భవిష్యత్ వ్యూహం తదితర అంశాలపై ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు వివరించారు. సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఆరు గ్రూపులుగా చేశారు. మొదటి నాలుగు కమిటీలు తొలిరోజు చర్చలు సాగించాయి. మిగిలిన రెండు కమిటీలు శనివారం చర్చలు సాగించనున్నాయి. ముమ్మరంగా కోటి సంతకాలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం రాజకీయాలకు అతీతంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లు శాసనమండలి ఫ్లోర్‌లీడర్ సి.రామచంద్రయ్య వెల్లడించారు. సాయంతం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సదస్సు వివరాలను తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజాప్రతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ పార్టీకి దూరమైన వర్గాలను ఆకట్టుకొనేందుకు కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కోటి సంతకాలకు మద్దతు తెలుపుదామనుకొనే వారు 7842434121 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకుడు తిరువనక్కరసు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కొండ్రు మురళీ, పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ, సిటీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణు, బుచ్చిబాబు, నేతలు కొలనుకొండ శివాజీ, ఆకుల శ్రీనివాస్‌కుమార్, అవినాష్, మీసాల రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
విభజన తప్పే.. క్షమించండి: రఘువీరా
తిరుపతి: రాష్ర్ట విభజన విషయంలో తప్పు చేశామని, ప్రజలు క్షమించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి కోరారు. తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం ఎంఆర్‌పల్లిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల అంగీకారంతో విభజన చేశామని, ఇప్పుడు ఆ పాపం కాంగ్రెస్ నెత్తిన వేస్తున్నారని ఆయన అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ సభ్యుడు తిరువక్కరుసు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే తప్పును సరిదిద్దుకుంటామని చెప్పారు. 126 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ చేసిన చిన్న తప్పునకు ప్రజలు మరణ శిక్ష విధించారని టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తప్పు తెలుసుకున్నామని, మీ ఓటుతో మరణ శిక్షను తొలగించాలని కోరారు. వెంకయ్య రాష్ట్రానికి చేసిందేమిటి? విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి బండారు దత్తాత్రేయ కృషి చేస్తుంటే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయిడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమిటని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. మంగళవారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బీజేపీ బిల్లు పెట్టాలని ఏఐసీసీ పరిశీలకుడు కుంతీయ డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్‌లో ముసలం
ఉప ఎన్నికల అభ్యర్థికి దూరంగా ముఖ్య నేతలు చింతామోహన్ ఏకపక్ష నిర్ణయాలపై కినుక బుజ్జగించేందుకు ఫిబ్రవరి రెండున రఘువీరా రాక అధిష్టానం నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం, పార్టీ అధికార ప్రతినిధి ఆశోక్ సామ్రాట్, పీసీసీ కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాగంటి గోపాల్‌రెడ్డిలను చింతామోహన్‌తో కలిసి చర్చించి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని సూచించింది. వీరంతా చింతాతో సమావేశమైనప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వెంట కేవలం చింతామోహన్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగతా పార్టీ శ్రేణులంతా అసంతృప్తితో రగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మబ్బు దేవనాథరెడ్డితో పాటు ప్రమీలమ్మ వంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థికి సహకరించేది లేదని తెగేసి చెప్పినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రంగంలోకి పీసీసీ నేత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడంతో సమస్యను పరిష్కరించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఫిబ్రవరి రెండో తేదీన తిరుపతికి వస్తున్నట్లు సమాచారం. ఆయన అసంతృప్త నేతలను బుజ్జగించి సమష్టిగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కూడా కొంత మంది నేతలు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థికి సహకరించేది లేదని ఖరాఖండిగా తెగేసి చెప్పినట్లు సమాచారం. కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పరువు ఎలా కాపాడుకోవాలని పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. -
ఎన్ఎస్యూఐ ‘విద్యార్థి పోరాట యాత్ర’
పోస్టర్ విడుదల చేసిన పీసీసీ చీఫ్ రఘువీరా సాక్షి, హైదరాబాద్: బాబు వస్తే జాబు వస్తుంది... నిరుద్యోగులకు ప్రతి నెలా భృతి... ఇలా ఎన్నో హామీలతో అధికారంలోకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చేతులెత్తేయడంపై ఎన్ఎస్యూఐ ఉద్యమానికి దిగుతోంది. బాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఒత్తిడి తెచ్చేందుకు ‘విద్యార్థి పోరాటం’ పేరిట యాత్ర చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం ఇందిరా భవన్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ రాష్ర్ట అధ్యక్షుడు రాజీవ్ రతన్ మాట్లాడారు. ఈ నెల 28న అనంతపురం జిల్లాలో పోరాట యాత్రను ప్రారంభించి ఫిబ్రవరి 11న శ్రీకాకుళం జిల్లాలో ముగిస్తామన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్ నియామకం..: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ చైర్మన్‌గా కాకినాడకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావును ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు నియమించారు. పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి శుక్రవారం నియామక పత్రాన్ని వెంకటేశ్వరరావుకు అందజేశారు. -
కాంగ్రెస్ నేత పాలడుగు కన్నుమూత
* ఇందిర భవన్లో ఆయన భౌతికకాయానికి నేతల ఘననివాళి * రేపు నూజివీడులో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు పాలడుగు వెంకట్రావు (78) సోమవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భార్య సుశీలాదేవితో కలిసి ఆయన హైదరాబాద్‌లో ఉంటున్నారు. సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడిని పెంచుకున్నారు. అయితే ఆయన కూడా ఇదివరకే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పాలడుగు మరణవార్త తెలిసి పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రికి తరలివచ్చారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన ఆయన భౌతికకాయాన్ని తరువాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు, అనంతరం ఇందిర భవన్‌కు తీసుకెళ్లారు. పార్టీలకతీతంగా నాయకులు తరలివచ్చి భౌతికకాయానికి నివాళులర్పించారు. తరువాత పాల డుగు భౌతికకాయాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్‌కు తరలించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మంగళవారం అక్కడ ఉంచి, బుధవారం ఉదయం 11 గంటలకు కృష్ణాజిల్లా నూజివీడులోని పాలడుగు తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు చెప్పారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి మాట్లాడుతూ పాలడుగు ప్రత్యేక చొరవ తీసుకుని భూ పోరాటాలు చేశారని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థ లకు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఉచితంగా ఇచ్చారని గుర్తుచేశారు. పాలడుగు మృతికి సీఎం సంతాపం పాలడుగు వెంకట్రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపి ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పాలడుగు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. వివిధ హోదాల్లో పనిచేసిన పాలడుగు మృతి కృష్ణాజిల్లాకే కాకుండా రాష్ట్రానికే తీరని లోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగన్ సంతాపం పాలడుగు వెంకట్రావు మృతిపట్ల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. విద్యార్థినేతగా రాజకీయ ప్రస్థానం సాక్షి ప్రతినిధి, విజయవాడ: పాలడుగు వెంకట్రావు రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీ, సమసమాజ స్థాపన కోసం పోరాడిన కార్ల్‌మార్క్స్ జీవితాలపై పాలడుగు పీహెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన 1940 నవంబరు 11న కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండ లం గోగులంపాడులో పాలడుగు లక్ష్మయ్య, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు. 1968లో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1972 లో ఎమ్మెల్సీగా 1978, 1989ల్లో నూజివీడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంజయ్య, భవనం వెంకట్రామ్, నేదురుమల్లి జనార్దనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సభ్యుడిగా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా, పీసీసీ హైపవర్ కమిటీ సభ్యుడిగా, ఏఐసీసీ, పీసీసీల్లో సభ్యుడిగా, పీసీసీ ట్రైనింగ్ సెల్ చైర్మన్‌గా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. -
'చంద్రన్న దోపిడీ అనాలేమో'
హైదరాబాద్: పేదలకు నిత్యవసర సరుకులు ఒక్క సంక్రాంతికే కాకుండా ప్రతినెలా ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రతినెలా పేదలకు సరుకులు ఇచ్చామన్నారు. చంద్రన్న కానుక అంటూ సంక్రాంతి సరుకుల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. టీడీపీ నేతలకు మాత్రమే మేలు జరిగేలా కార్యక్రమం చేపడుతున్నారని అన్నారు. చంద్రన్న కానుక అనకుండా చంద్రన్న దోపిడీ అనాలేమో అని ఎద్దేవా చేశారు. ఎన్నికల హామీలు నిలుపుకోకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. -
'ఎమ్మెల్యేలే రూ.150 కోట్లు తినేశారు'
విశాఖపట్నం: హుద్ హుద్ తుపాను సాయంలో అధికార టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. దీనిపై జనవరి మొదటివారంలో తమ పార్టీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశామని గుర్తు చేశారు. తుపాను బాధితుల కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు చెప్పారని, అయితే ఇందులో రూ. 150 కోట్లు టీడీపీ ఎమ్మెల్యేలే తినేశారని ఆరోపించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో గవర్నర్ కలుస్తామని చెప్పారు. తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తానని రఘువీరారెడ్డి అన్నారు. -
రుణాలు మాఫీ చేయకుంటే నిలదీస్తాం
మాడుగుల రూరల్: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అందరికీ వ్యవసాయ రుణాల మాఫీ వర్తింపచేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్‌చేశారు. సోమవారం ఎం.కోటపాడు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. గత నెలలో సంభవించిన తుపానుకు 64 మంది మృతిచెందితే వీరికి పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదన్నారు. క్షతగాత్రులైన 190 మందికి రూ.50 వేల వంతున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతాంగానికి రూ.134 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు కావలసి ఉందన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల మంది కౌలు రైతులకు రుణాలివ్వగా, ఈ ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు బాలరాజు, కోండ్రు మురళి, స్థానిక నాయకులు శానాపతి గంగాధర్ కొండలరావు, బొడ్డపాటి శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు చేయూతలో ప్రభుత్వం విఫలం బుచ్చెయ్యపేట: హుద్‌హుద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. ఆయన సోమవారం మండలంలోని వడ్దాది నాలుగు రోడ్లు సెంటర్లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ మంత్రులు కోండ్రు మురళి, పి.బాలరాజు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు ఉన్నారు. -
రేపు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాక
విజయవాడ సెంట్రల్ : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14న దివంగత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి వేడుకలను ఆంధ్రరత్నభవన్లో ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడపా నాగేంద్ర బుధవారం తెలియజేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఈనెల 19న దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు నగరంలోని పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు నాగేంద్ర తెలిపారు. 7నుంచి 10 తరగతులు విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖుల పాత్ర’ అంశంపై పోటీలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని నాగేంద్ర పేర్కొన్నారు. -
రసాభాసగా చీరల పంపిణీ
వితరణం రసాభాసగా హుద్‌హుద్ బాధితులకు చీరల పంపిణీ భారీగా తరలిరావడంతో తొక్కిసలాట కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ బాధితులకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దుప్పట్లు, చీరల పంపిణీ కార్యక్రమం రసాభసా అయింది. ఊహించని రీతిలో తరలివచ్చిన బాధితులకు కిట్లు పంపిణీ చేయలేక కాంగ్రెస్ నాయకులు చేతులెత్తేయడంతో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఒక దశలో తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. టర్నర్ చౌల్ట్రీలోని విశాఖ సెంట్రల్ ఎదురుగా సుమారు 14 డివిజన్లకు చెందిన బాధితులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీ సీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నా రు. సాయం పంపిణీలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి సాయం అందే వరకు పోరాడతామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్రలోని 50 వేల మంది బాధితులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అనంతరం ఓ అరడజను మందికి నేతలు దుప్పట్లు, చీరల కిట్లను పంపిణీ చేశారు. డివిజన్‌కు 400 మంది వంతున నగర పరిధిలోని పది డివిజన్ల నుంచి ప్రత్యేకంగా కూపన్లు పంపిణీ చేశారు. కూపన్లున్న బాధితులు మాత్రమే రావాల్సిందిగా సూచించారు. వీరి కోసం విశాఖ సెంట్రల్ ఎదురుగా ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వీరేనా బాధితులు.. మేము కాదా అంటూ వేలాదిగా వచ్చిన బాధితులు నాయకులతో వాగ్వాదానికి దిగా రు. అర్హులైన వారికి కాకుండా పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారా? అని ఆగ్రహం వ్యక్తం చేశా రు. నాయకులు వారించినా వినిపించుకోకుం డా కౌంటర్లలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశా రు. దీంతో పరిస్థితి చేజారిపోతుందనే భయం తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య నేతలంతా అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారు. మిగిలిన నాయకులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. అంతవరకు క్యూలైన్లలోఉన్న వారు సైతం ఒక్కసారిగా కౌంటర్ల వద్దకు తోసుకురావడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకదశలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో పెద్ద సంఖ్యలో బాధితులు కిందపడి పోయారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య బాధితులతో పాటు కార్యకర్తలు కూడా కౌంటర్లలోకి చొరబడి అందినకాడికి పట్టుకుపోయారు. రెండు మూ డు వందల మందికి కూడా పంపిణీ చేయకుం డానే కిట్లు మాయం కావడంతో నాయకులు కూడా చేసేది లేక అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్అధ్యక్షుడు బెహరా భాస్కరరావు, మహిళా కాంగ్రెస్ సిటీఅధ్యక్షురాలు రమణికుమారి, ఎస్సీ సెల్ చైర్మన్ కె.వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. -
హామీలకు చంద్రబాబు తిలోదకాలు: రఘువీరా
-
హామీలకు చంద్రబాబు తిలోదకాలు: రఘువీరా
నెల్లూరు: ఎన్నికలకు ముందు వందలకొద్దీ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలకు తిలోదకాలు ఇస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. పంట రుణమాఫీ, పొదుపు రుణాల మాఫీపై ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నెల్లూరులో రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... టీడీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. రాష్ట్ర పాలనను చంద్రబాబు కార్పొరేట్ గా మార్చారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ మాట-కాంగ్రెస్ మాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
అనంతపురం అర్బన్: అన్ని వేళలా కార్యకర్తలకు అండగా ఉంటామని పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక మడకశిర భవన్లో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రైతు వ్యతిరేకని రఘువీరా అన్నారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. జిల్లాకు రైతాంగానికి రావాల్సిన రూ. 640 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ వెంట నే ప్రభుత్వం విడుదల చేసి రైతు ఖాతాల్లోకి జమా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా ప్రజల అవసరాల కోసం అనంతపురం నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలకు అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా ద్వారా పీఏబీఆర్ జలాశయం నుంచి తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. జిల్లాకు 15 నుంచి 20 టీఎంసీలు నీటిని తెచ్చే అవకాశం ఉన్నా చేతకాని ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఇప్పటికి కేవలం 5.5 టీఎంసీలు మాత్రమే తెచ్చారన్నారు. ఈ నీటితో సరిపెట్టుకుంటే కరువు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి భవిష్యత్‌లో జిల్లా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందన్నారు. జిల్లాలో 70 శాతం వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం ఉండగా ఇప్పుడు రూ. 2 వేల కోట్లతో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తామనడం హాస్యస్పదమన్నారు. ఓఎంసీ గనుల లెసైన్స్‌ను కుద్రేముఖ్ కంపెనీకి కేటాయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు వచ్చాయని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత పాలకులు కొందరు లెసైన్స్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షులు కోట సత్యం, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మండ్ల నరసింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీసీ నాగరాజు, కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షుడు బి.వై. రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు, ప్రత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
'రైతు కక్ష సాధింపు సంస్థ'
హైదరాబాద్: పంట రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఏడాదికి 20 శాతం మాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని... వాస్తవానికి రూ. 5 వేల కోట్లతో 50 శాతం రుణాలు మాఫీ అవుతాయన్నారు. రైతులు తీసుకున్న ప్రైవేటు వడ్డీలను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసింది రైతు సాధికార సంస్థ కాదని, రైతు కక్ష సాధింపు సంస్థ అని వ్యాఖ్యానించారు. టీడీపీ రైతు వ్యతిరేకి కాబట్టే కార్పొరేట్ పాలన చేస్తోందన్నారు. రైతులు తిరగబడకముందే రుణాలు మాఫీ చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
ఆళ్లగడ్డలో పోటీకి కాంగ్రెస్ దూరం: రఘువీరా
హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలో పోటీ చేయొద్దంటూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవతీర్మానం చేశారని చెప్పారు. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినట్టు వెల్లడించారు. హుదూద్ తుపాను బీభత్సాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. దీనికోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒత్తిడి తీసుకురావాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, తాగునీటి సరఫరా వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిందన్నారు. వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయని చెప్పారు. బాధితులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీలు వేయాలని సూచించారు. గ్రామ సభల్లో చదివి వినిపించాలి. జాబితాను ఆన్లైన్ కూడా పెట్టాలన్నారు. తుపాను కారణంగా నష్టపోయినవారందరికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
'కిరణ్‌కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారు'
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చాలా ద్రోహం చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన జరుగుతుందని కిరణ్ కుమార్ రెడ్డికి ముందే స్పష్టంగా తెలుసునని అన్నారు. విభనకు అన్ని పార్టీలూ కారణమన్నారు. ప్రజల కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ మాత్రమే న్యాయం చేయగలదని చెప్పారు. ప్రజల తరపున నిలబడి కాంగ్రెస్ కుపూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. పంట పొలాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేయొద్దని కోరారు. ప్రభుత్వ భూముల్లోనే రాజధాని ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ రుణమాఫీ విషయంలో టీడీపీ సర్కారు పూటకో మాట మాట్లాడుతోందని రఘువీరా రెడ్డి విమర్శించారు. -
చంద్రబాబుకు రఘువీరా లేఖ
హైదరాబాద్: జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధుల అధ్యక్షతనే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. రుణమాఫీ ద్వారా లబ్ది పొందే రైతులు, డ్వాక్రా, చేనేత కార్మికుల వివరాలు గ్రామస్థాయిలో వెల్లడించాలని ఆయన సూచించారు. ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, రేషన్‌షాపు డీలర్లు, అంగన్వాడీ, ఔట్సోర్సింగ్, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనిఖీల పేరుతో అర్హులకు రేషన్ కార్డులు తొలగించడం సరికాదన్నారు. సంక్షేమ పథకాలకు ఆధార్ తో లింక్ చేయొద్దని రఘువీరా రెడ్డి కోరారు. -
'నందిగామలో రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు'
హైదరాబాద్: నందిగామలో ఉప ఎన్నికలో తమ పార్టీకి దక్కిన ఓట్ల పట్ల ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంప్రదాయ ఓట్లు తిరిగొచ్చాయని చెప్పారు. తంగిరాల ప్రభాకరరావు కుటుంబంపై సానుభూతి, నామినేషన్ తర్వాత విజయవాడను రాజధానిగా ప్రకటించడం వంటి కారణాల వల్ల టీడీపీ విజయం సాధించిందని అన్నారు. నందిగామలో గెలుపు కోసం అధికార టీడీపీ విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టిందని, మద్యం ఏరులై పారించిందని ఆరోపించారు. ఎన్నికల అధికారులే ఇది నిజమని ఒప్పుకున్నారని తెలిపారు. పోలవరం కాంట్రాక్టర్ల నుంచి టీడీపీకి డబ్బు అందిందని ఆరోపించారు. వీరి పేర్లు త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. ఉప ఎన్నికలో తాము రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. తమ అభ్యర్థి దగ్గర డబ్బు లేదు, తమ దగ్గర డబ్బు లేదని రఘువీరారెడ్డి చెప్పారు. -
'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు'
హైదరాబాద్: రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం చంద్రబాబు టోపి పెట్టారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై పీసీసీ తయారుచేసిన వాస్తవపత్రాన్ని సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు వందరోజుల పాలనలో 101 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. వందరోజుల్లో సిమెంట్ ధర రూ.100 పెంచారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో పెట్టుబడిదారలకే చోటు కల్పించారని అన్నారు. మంత్రివర్గ సమావేశాలను దిగజార్చారని రఘువీరా దుయ్యబట్టారు. -
'అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైకుల ముందు రఘువీరా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రిగా ఉన్నప్పుడు రఘువీరా ఏ రోజూ సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదని అన్నారు. ఇప్పుడు రాజధాని ఎక్కడ పెట్టాలనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అడిగే హక్కు ఆయనకు లేదని అన్నారు. అనంతపురం జిల్లాకు ఇప్పటిదాకా రఘువీరా ఏమీ చేయలేదని ఆరోపించారు. -
'వైఎస్ఆర్ లేని లోటు అనుక్షణం అనుభవిస్తున్నాం'
హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆ మహానేత ఐదవ వర్థంతి హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా రఘువీరా మాట్లాడుతూ... వైఎస్ఆర్ తాను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి క్రమశిక్షణగా వ్యవహారించారని రఘువీరా వెల్లడించారు. వైఎస్ఆర్ వ్యవసాయ రంగాన్ని అమితంగా ప్రేమించారని... ఆయన సీఎంగా ఉన్న హయాంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. వైఎస్ లేని లోటును అనుక్షణం అనుభవిస్తామని రఘువీరా ఆవేదనతో తెలిపారు. -
తిలోదకాలిచ్చిందని టీడీపీయే: రఘువీరా
విజయవాడ: ఎవరైనా మరణిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను పోటీకి నిలబెట్టని సంప్రదాయానికి తిలోదకాలిచ్చిందని టీడీపీయేనని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. నందిగామ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి నిలపడాన్ని ఆయన సమర్థించుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలుచేయడం లేదని ఆయన ఆరోపించారు. రుణమాఫీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు చేయడం లేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు. -
బాబు తేలుకుట్టిన దొంగ
ఏపీలో శాంతభద్రతలు క్షీణించాయి పీసీసీ అధ్యక్షుడు రఘువీరా, బొత్స ధ్వజం కర్నూలు : ‘శాంతి భద్రతల విషయంపై అసెంబ్లీలో మూడు రోజులుగా చర్చ జరుగుతున్నా తేలుకుట్టిన దొంగలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు... ఈ విషయమై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. మూడు నెలల టీడీపీ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయి. రాయలసీమలో హత్యలు, దాడులు జరుగుతున్నాయి.. ప్రభుత్వ ఆస్తులు దోపిడీకి గురవుతున్నాయి..’ అని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శనివారం కర్నూలులోని నిర్వహించిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు..లక్ష కోట్లకుపైగా అవసరమవుతుందని చెప్పారు.. కానీ, బడ్జెట్లో రూ.5 వేల కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారన్నారు. -
'చంద్రబాబుది రహస్య ఎజెండా'
అనంతపురం: తాత్కాలిక రాజధానికి తాము వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. చంద్రబాబు రహస్య ఎజెండా అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బుసంచులు మోసినవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండానే రాజధానిపై ఎందుకు తొందరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పంటల భూముల్లో రాజధాని ఏర్పాటు మంచిదికాదని హితవు పలికారు. రాజధాని ఎంపిక విషయంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరించాలని రఘువీరారెడ్డి సూచించారు. -
హామీలు మాఫీ చేస్తున్న చంద్రబాబు
కళ్యాణదుర్గం: రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం అని చెప్పి, పూటకో మాట చెబుతున్న చంద్రబాబు.. రుణమాఫీ మాటేమిటో గానీ ఇచ్చిన హామీలను మాఫీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రైతాంగం అయోమయంలో ఉందని, గత ఏడాది పంట నష్టానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, బీమా కలిపి రూ. 2,174 కోట్లు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 4 వేల చొప్పున రూ. 1,374 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా రూ. 800 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చేసిన డిమాండ్ మేరకు ఎకరాకు రూ. 10 వేల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయించాలన్నారు. ప్రస్తుతం రైతులు కనీసం రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ భరించలేదా అని నిలదీశారు. గతంలో 98 శాతం మహిళా రుణాల రికవరీ ఉండేదని, రుణమాఫీ హామీతో అప్పు చెల్లించలేక పోయారని తెలిపారు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగాలు తొలగించే విషయంలో శ్రద్ధ చూపిన పాలకులు.. పనులు కల్పించడంలో మాత్రం దృష్టి సారించలేకపోతున్నారని విమర్శించారు. -
బాబు మాటలు మయసభను మించిపోయాయ్
ఎన్నికల హామీలన్నీ నెరవేర్చకుంటే ఊరుకోం ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన పీసీసీ తిరుపతి: నయవంచనకు మారుపేరైన చంద్రబాబు మాటలు..ఆనాటి ఎన్టీఆర్ సినిమాలోని మయసభను మించిపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చేపట్టనున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా తొలి సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, రాజ్యసభ సభ్యుడు కేవీపీ.రామచంద్రరావు, మాజీ మంత్రులు శైలజానాథ్, సి.రామచంద్రయ్యతో పాటు దేవినేని నెహ్రూ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ నిత్యావసరాల ధరల అంశాన్ని మొన్నటి ఎన్నికల వాగ్దానాల్లో గొప్పగా ప్రస్తావించిన నరేంద్రమోడీ, చంద్రబాబు ఇప్పుడు ప్రతి వస్తువు ధరను విపరీతంగా పెంచి ప్రజలను మోసం చేశారన్నారు. బాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చాలని, లేకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు. చంద్రబాబు మాటల్లో ‘బాబొస్తే జాబొస్తుంది’ అనే పదానికి అర్థమే వేరన్నారు. ‘జాబంటే’ అమాయక జనం ఉద్యోగాలనుకున్నారేమో గానీ...చంద్రబాబు మాటల్లో రైతుల నగలు, ఆస్తులు వేలం వేసేందుకు, వేలాది మంది ఆదర్శరైతులను, ఉపాధిహామీ సిబ్బందిని, కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఇళ్లకు వచ్చే జాబులని ఎద్దేవా చేశారు. గతంలోనే తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు పాలనలో అన్ని విధాలా కష్టాలు అనుభవించిన జనం మళ్లీ ఆయన మాయమాటలు నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే చివరకు దగా చేశారని ధ్వజమెత్తారు. -
కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతాం..
సాక్షి, ఒంగోలు: కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు పుంజుకునే కాలం ఎంతోదూరం లేదు. కార్యకర్తలంతా మనోధైర్యంతో నిబ్బరంగా పనిచేస్తే క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో క్విట్ఇండియా డే కార్యక్రమం సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశం, నియోజకవర్గాల సమీక్షల్లో ఆయనతో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యనేత బొత్స సత్యన్నారాయణ, కేవీపీ రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డి మాట్లాడారు. తొలుత ర్యాలీగా జిల్లాపార్టీ కార్యాలయం చేరుకున్న ముఖ్యనేతలు అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యుల సమావేశం, నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. పంట రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీపై చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. హామీల దాటవేతపై త్వరలోనే ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు. కిందటేడాది పంటలు దెబ్బతిన్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంచేసిన రూ.137 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసి ప్రతీ రైతుకు రూ.3400 చొప్పున తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. చేనేతల రుణమాఫీపై ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసుకున్న టీడీపీ నేతలు ఆ సంగతిని మరిచిపోయినట్లుందని విమర్శించారు. రేషన్‌కార్డుల తొలగింపు, పింఛన్ల కోతతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రతీ కార్యకర్త పార్టీ తరఫున పూనుకుని ప్రభుత్వ పథకాల బాధితుల్ని గుర్తించి.. వారి తరఫున ఉద్యమాలు చేయాలన్నారు. ఎక్కడైతే టీడీపీ నేతల అరాచకాలు, వేధింపులు ఉంటాయో.. అక్కడ పోలీసులతో మాట్లాడి కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సిన పనిని చిత్తశుద్ధిగా చేపట్టాలని జిల్లా నేతలకు బొత్స సత్యన్నారాయణ సూచించారు. అంతర్గత సమస్యల్ని విడనాడాలి... పలు కారణాలతో పార్టీ పరాజయం పాలైందని.. ప్రస్తుతం గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు అంతర్గత సమస్యల్ని వదిలే సి కలిసికట్టుగా పనిచేయాలని బొత్స, పనబాక, జేడీ శీలం పిలుపునిచ్చారు. తమపార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన కార్యకర్తలు, నేతలు అక్కడి విధానాలు నచ్చకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తున్నారని చెప్పారు. త్వరలోనే పార్టీ నిర్మాణాత్మక కమిటీలను నియమిస్తామని, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఆయా కమిటీల్లో సీనియర్లు, జూనియర్లు, ఎమ్మెల్యే అభ్యర్థులు తదితరులను సభ్యులుగా చేస్తామన్నారు. అంశాలవారీగా నియోజకవర్గాల ఇన్చార్జులు తమ పరిధిలోని గ్రామాల పార్టీకేడర్‌తో సమావేశాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో పీసీసీ కార్యదర్శి ఈదా సుధాకర్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం, పీసీసీ పరిశీలకులు వేణుగోపాలరాజు, పి. చెంచలబాబు యాదవ్, ఒంగోలు, ఎస్ఎన్ పాడు, చీరాల, కొండపి, వై.పాలెం నియోజకవర్గాల ఇన్చార్జులు వై. శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, మెండు నిషాంత్, గుర్రం రాజ్‌విమల్, కనకరావు మాదిగ, వై.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అడ్మిషన్లలోపే స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌లోపే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశం తేల్చకపోతే అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులెవ్వరూ సాహసించరని, దీనిపై గవర్నర్ తక్షణం స్పందించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళవారం ఇందిర భవన్లో పీసీసీ నేతలు సి.రామచంద్రయ్య, రుద్రరాజు పద్మరాజు, బొత్స సత్యనారాయణ, అహ్మదుల్లా, కన్నా లక్ష్మీనారాయణ, సుధాకర్ తదితరులతో కలసి విలేకరుల సమావేశంలో రఘువీరా మాట్లాడారు. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫీజులు ఎవరు భరిస్తారనేది పేద కుటుంబాల్లోని విద్యార్థులకు శేష ప్రశ్నగా మిగిలిందన్నారు. 95వ సెక్షన్‌లోని 371 డి ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ విద్యార్థులు పదేళ్లపాటు తెలంగాణలో కూడా అడ్మిషన్లు పొందేవిధంగా కేంద్రం చట్టం చేసిందన్నారు. దీనిపై జోక్యాన్ని కోరుతూ గవర్నర్‌కు త్వరలోనే లేఖ ఇస్తామని తెలిపారు. గవర్నర్ సమక్షంలో భుజాలు తట్టుకొని మాట్లాడుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు, ఆ సమయంలో విద్యార్థుల సమస్యలపై ఒక క్షణం మాట్లాడలేకపోయారా అని ప్రశ్నించారు. హామీ మేరకు షరతుల్లేకుండా అన్ని రకాల రుణాలు రద్దు చేయాలని చంద్రబాబును రఘువీరా డిమాండ్ చేశారు. -
'బీజేపీ డబుల్‌గేమ్ ఆడుతోంది'
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై బీజేపీ డబుల్‌గేమ్ ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. పంటల రుణమాఫీపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. మరోవైపు ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా బలోపేతం చేయాలనే దానిపై పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పాల్గొన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
'రాజధాని'పై పారదర్శకత లోపిస్తోంది
విజయవాడ: రుణమాఫీఫై ప్రభుత్వం రోజుకోమాట మాట్లాడుతోందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. సీఎం, మంత్రులు చెప్పే మాటలకు పొంతనలేదన్నారు. ప్రభుత్వ ప్రకటనలతో రైతులు, డ్వాక్రా మహిళలు అయోమయానికి గురౌతున్నారని చెప్పారు. టీడీపీ హామీలన్నీ నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతు రుణమాఫీ చేయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజధాని విషయంలో పారదర్శకత లోపిస్తోందని ఆయన వాపోయారు. -
చంద్రబాబు షాక్‌లో ఉన్నట్లుంది: రఘువీరా
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో షాక్‌లో ఉన్నట్లు కన్పిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో 23 జిల్లాలకు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ప్రస్తుతం 13 జిల్లాలకే పరిమితం అనే న్యూనతా భావంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పాలనలో చంద్రబాబు జోష్ ప్రదర్శించడం లేదన్నారు. బుధవారం ఇందిరాభవన్‌లో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల రుణ మాఫీపై ఇచ్చిన హామీని పక్కనపెట్టి రీ షెడ్యూల్ చేసి రైతులను మోసగించాలని చూస్తున్నారన్నారు. -
వేటు వేయిద్దాం: కాంగ్రెస్
జంప్ జిలానీలపై చర్యలకు కాంగ్రెస్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంలో చేరిన పార్టీ ఎమ్మెల్సీలపై చర్యలకు కాంగ్రెస్ రంగం సిద్ధంచేస్తోంది. కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారితోపాటు పార్టీకి అనుబంధంగా కొనసాగి పార్టీ మారిన ఎమ్మెల్సీలకూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం ఈ నోటీసులు ఇవ్వనున్నారు. షోకాజ్ నోటీసులకు ఆయా ఎమ్మెల్సీలు వారం రోజుల్లో సమాధానమివ్వాలని కోరనున్నారు. ఎమ్మెల్సీల సమాధానాలు అందిన తదుపరి పార్టీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం ద్వారా ఆ ఎమ్మెల్సీలపై అనర్హత చర్యలకోసం ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా ఛైర్మన్‌కు సమర్పించనున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో ఏడుగురు ఎమ్మెల్సీలు అంగూరి లక్ష్మీ శివకుమారి, బలశాలి ఇందిర, షేక్ హుస్సేన్, కలిదిండి రవి కిరణ్‌వర్మ, కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు), గాదె శ్రీనివాసులునాయుడు, బచ్చల పుల్లయ్యలు టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. -
భయపెడితే రాజీనామా చేయొద్దు
రొళ్ల/కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పర్మినెంట్ రేషన్ డీలర్లు ఎవరూ రాజీనామా చేయవద్దని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా రొళ్ల మండలం తిరుమలదేవరపల్లి, కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ డీలర్ల తొలగింపు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజలకు మేలు చేయాలే కానీ నిరుద్యోగులను నష్ట పరిచే చర్యలు తీసుకోకూడదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అణా పైసాతో సహా రైతుల రుణాలు మాఫీ చేసి.. ఆగస్టు నుంచి కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. చౌకడిపో డీలర్లతోపాటు ఇతర శాఖల్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం న్యాయం కాదన్నారు. టీడీపీ, బీజేపీ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, అయితే ఇప్పుడు మాత్రం 1.40 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం అనైతికమని ధ్వజమెత్తారు. -
దశదిశలేని గవర్నర్ ప్రసంగం: రఘువీరారెడ్డి
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం ఎలాంటి దశదిశ లేకుండా సాగిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. మంత్రిమండలి ఇచ్చిన రాజకీయపత్రం చూసి గవర్నర్ చదివినట్లు కన్పించిందన్నారు. శనివారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ ప్రసంగంలో టీడీపీ ఎన్నికల హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టతనివ్వలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీలు పునరాలోచించుకోవాలి..ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొని గెలిచి అధికారంలోకి వచ్చినా టీడీపీ నేతలకు ఇంకా దాహం తీరినట్లు కన్పించడం లేదన్నారు రఘువీరా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిన విషయాన్ని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్‌లో పదవులు పొంది టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయిన వారికి సిగ్గు లేకపోయినా ప్రోత్సహించే వారిని ఏమనాలంటూప్రశ్నించారు. నవ్యాంధ్ర సాధన దిశగా: బీజేపీ విభజన తరువాత రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే దిశగా అసెంబ్లీలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగం సాగిందని టీడీపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ వ్యాఖ్యానించింది. -
భ్రమలు వీడితేనే భవిత
కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో నేతలు జంప్ జిలానీలను క్షమించవద్దు విభజన వల్లే పార్టీకి రాష్ట్రంలో తీవ్ర నష్టం ఉద్వేగంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు 7 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష విజయవాడ : ‘‘కాంగ్రెస్ పార్టీని ముఖ్య నేతలే రాష్ట్రంలో భ్రష్టుపట్టించారు. ప్రధానంగా పలువురు కీలక నేతలు సుదీర్ఘకాలంగా పదవులు అనుభవించి కీలక సమయంలో పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. పార్టీ జెండాను ఏళ్లతరబడి మోస్తున్న కార్యకర్తలకు సరైన ప్రాధాన్యమివ్వలేదు, న్యాయం కూడా జరగలేదు. ఇకనైనా ముఖ్యులు భ్రమలు వీడితేనే రాష్ట్రంలో పార్టీ బతుకుతుంది. లేదంటే భవిష్యత్తు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి’’ ఇదీ 13 జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సమావేశంలో పలువురు జిల్లా నేతలు తీవ్ర అగ్రహావేశాలతో ముఖ్యులను ప్రశ్నించిన తీరు. కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్, రాష్ట్రంలో మాజీ ముఖ్య నేతలు రాయపాటి, లగడపాటి, కావూరి, దగ్గుబాటిల తీరుపై పలు జిల్లాల అధ్యక్షులు, ముఖ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో మంగళవారం జరిగిన సీమాంధ్ర కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షుల సమావేశం వాడీవేడి ప్రసంగాల మధ్య సుదీర్ఘంగా సాగింది. నగరంలోని స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. దాదాపు ఏడుగంటలపాటు సాగిన సమావేశంలో 13 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ ముఖ్యులు పలువురు ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, పల్లంరాజు, జేడీ శీలం, సుబ్బిరామిరెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర ముఖ్య నేత కేవీపీ రామచంద్రరావు, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్య వరప్రపాద్, కాసు కృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్, కొండ్రు మురళీ, మహ్మద్ జానీ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు సమావేశంలో పాల్గొన్నారు. తొలుత రఘవీరారెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని, తద్వారా పార్టీని బలోపేతం చేయటానికి సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యల గురించి నేతలు నిర్మొహమాటంగా మాట్లాడాలని సూచించారు. జంప్ జిలానీలను మళ్లీ తీసుకోవద్దు... మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రూ మాట్లాడుతూ లగడపాటి, రాయపాటి, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు లాంటి నేతలు పార్టీ ద్వారా మంచి పదవులు అనుభవించి వెళ్లిపోయారని, మళ్లీ అలాంటి జంప్ జిలానీలు వస్తే పార్టీలోకి తీసుకోకూడదని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్లను ఆదరిస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజన విషయంలో జైరాం రమేష్ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందన్నారు. కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని జైరాం రమేష్‌కు పార్టీలో కేంద్ర మంత్రి పదవి ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఆయన చర్యల వల్లే సీమాంధ్రలో కాంగ్రెస్ ఘోరంగా నష్టపోయిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయిందన్నారు. ప్రజలు విభజన తీరు వల్ల తీవ్రంగా బాధపడ్డారని చెప్పారు. దాని పర్యవసానంగా అనేక స్థానాల్లో పార్టీకి డిపాజిట్ దక్కలేదని చెప్పారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో యువతను బాగా ప్రోత్సహించిందని, రానున్న రోజుల్లోనూ ఇదే రీతిలో వినియోగించుకోవాలని కోరారు. విజయవాడలోనే పీసీసీ కార్యాలయం విజయవాడ నగరంలోనే పీసీసీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు. నగరంలో పార్టీ కార్యాలయానికి అనువైన ప్రాంతాన్ని నేతలు గుర్తిస్తున్నారని, కొద్దిరోజుల్లోనే పార్టీ రాష్ట్ర కార్యకలాపాలు ఇక్కడ నుంచే జరుగుతాయని చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, జిల్లా నేతలు ఐలాపురం వెంకయ్య, అడపా నాగేంద్రం, మీసాల రాజేశ్వరరావు, కొలనుకొండ శివాజీ, కడియాల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జంప్ జిలానీల వల్లే నష్టపోయాం: రఘువీరా
విజయవాడ: కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో లాభపడి చివర్లో బయటకు వెళ్లిన జంప్ జిలానీల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో పదవులు అనుభవించి కష్టకాలంలో ఉన్నప్పడు పార్టీని వీడిన నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్యాడర్‌ను బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తెస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై మంగళవారమిక్కడ రాష్ట్రస్థాయి నేతలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. -
నిధులున్నా నిర్లక్ష్యమేనా!
చేవెళ్ల: ‘చేవెళ్ల ప్రాంతవాసులు ఎంతో అదృష్టవంతులు.. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రజల విజ్ఞప్తులకు మోక్షం లభించి ంది. ఆర్డీఓ కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేయడమే కాకుండా నూతన భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాను. వెంటనే పనులు ప్రారంభమవుతాయి’.. 2013 సెప్టెంబరు 30న చేవెళ్లలో ఆర్డీఓ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, శ్రీధర్‌బాబు, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి సమక్షంలో ప్రజల హర్షధ్వానాల మధ్య అప్పటి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. కానీ పది నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కానేలేదు. దీంతో అద్దె, ఇరుకు గదుల్లో అధికారులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఆదేశాలు జారీ.. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం గతంలో నగరంలోని అత్తాపూర్‌లో ఉండేది. దూరాభారం అవుతుండటంతో నగరం నుంచి చేవెళ్లకు తరలించాలని ప్రజలు పలుమార్లు విన్నవించుకున్నారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయాన్ని చేవెళ్లకు తరలించింది. స్థానిక విద్యుత్ ఏడీ కార్యాలయ భవనానికి రూ.10 లక్షలతో మరమ్మతులు చేశారు. గత ఏడాది సెప్టెంబరు 30న అప్పటి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఆర్డీఓ సొంత భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కానీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. చాలీచాలని గదులతో ఇక్కట్లు ఇక్కడి ఆర్డీఓ కార్యాలయానికి చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పది మండలాలకు సంబంధించిన రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయ భవనం రెవెన్యూ కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఐదుగురి కన్నా ఎక్కువ మంది కూర్చోవటానికి స్థలంలేని పరిస్థితి. ఆర్డీఓతో పాటు ఏఓ, డీఐఓ, డిప్యూటీ స్టాటిస్టిక్స్, ముగ్గురు డీటీలు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్, టైపిస్టు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం ఏవో, డీటీలకు మాత్రమే సరిపడా గదులున్నాయి. మిగతా అధికారులు చిన్నచిన్న ఇరుకు గదుల్లో ముగ్గురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సిబ్బంది నియామకం జరిగితే పనులు చేసేందుకు చెట్టు కింద బెంచీలు, కుర్చీలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందేమోనని వాపోతున్నారు. చెట్లకింద పడిగాపులు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి రెవెన్యూ సంబంధిత పనులపై నిత్యం వందలాది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. కార్యాలయంలో వేచి చూసేందుకు స్థలంలేక కార్యాలయం వెలుపల చెట్ల కిందపడిగాపులు కాస్తున్నారు. రెవెన్యూ పరిధిలోని తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నా చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ప్రతి శనివారం జరిగే రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి నిర్వహించే కోర్టు కేసులతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల నామినేషన్లపర్వం నుంచి కౌంటింగ్ వరకు తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగాయి. భవన నిర్మాణాన్ని చేపట్టండి- చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయ సొంత భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనందున పనులు వెంటనే ప్రారంభించేలా అ దికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ని త్యం అధికారులు, సిబ్బంది ఇరుకుగదుల్లో పనిచేస్తున్నారని స్పష్టంచేశారు. పనిమీద వచ్చిన వారు కనీసం నిల్చునేం దుకు కూడా స్థలంలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యలు స్పందించి వెంటనే ఆర్డీఓ కార్యాలయ భవన నిర్మాణం పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
కేసీఆర్.. హుందాగా వ్యవహరించు
ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అనంతపురం: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మాటలు తెలంగాణకు నష్టం కలిగిస్తాయని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ గతంలో ఒక పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాబోతున్న తొలి ముఖ్యమంత్రి. అలాంటప్పుడు ఆయన ఎంతో హుందాగా ఉండాల’ని హితవు పలికారు. ‘గతంలో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటే అర్థముంది. ఇప్పుడు ఆ అవసరం ఏముంది? ఇప్పుడూ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ తప్పు చేస్తున్నారు. ఆయన మాటలు తెలంగాణకు నష్టం కలిగిస్తాయ’ని అన్నారు. తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, అక్కడున్న ఏ ఒక్కరిపైనా ఈగ కూడా వాలకుండా రక్షణ కవచంగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. -
వైఎస్ఆర్ బాటలో నడువు చంద్రబాబు: రఘువీరా
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన వెంటనే ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారని... అలాగే రుణమాఫీపై సంతకం చేయాలని ఆంధప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సూచించారు. అప్పుడే చంద్రబాబును ప్రజలు నమ్ముతారన్నారు. శుక్రవారం అనంతపురంలో రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. 2004 ఎన్నికల నేపథ్యంలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరడ్డి 2004లో సీఎం పదవి చేపట్టగానే తొలిగా ఫైల్‌పై సంతకం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని రఘువీరా రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. 2014లో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో ప్రజలు చంద్రబాబు హామీలను విశ్వసించి ఓట్లు వేశారు. దీంతో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. త్వరలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై తొలి సంతకం చేయాలని రఘువీరా ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు. -
చిరంజీవి కాంగ్రెస్‌ను వీడరు: రఘువీరా
సాక్షి, హైదరాబాద్/మడకశిర, న్యూస్‌లైన్: రాజ్యసభ సభ్యుడు, ఏపీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ సారథి చిరంజీవి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి తోసిపుచ్చారు. చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా మడకశిరలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గెలుపోటములు ఏ పార్టీకైనా సాధారణమని, ఏపీ అభివృద్ధి విషయంలో వాచ్‌డాగ్‌లా వ్యవహరించడంతోపాటు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వెంటనే రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఖరీఫ్ వ్యవసాయం కుంటుపడే ప్రమాదముందన్నారు. మరోపక్క, చిరంజీవి పార్టీ మారుతున్నారనే వార్తలను ఏపీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి రుద్రరాజు పద్మరాజు కూడా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆయన హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ చొరవ చూపాలి.. రాష్ట్రంలో వరి రైతులను ఆదుకునేందుకు గవర్నర్ చొరవ చూపాలని పద్మరాజు కోరారు. అకాల వర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిని ఆదుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరముందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో సాధారణ రకానికి రూ.1,300, గ్రేడ్ ఏ రకానికి రూ.1,340 ఇచ్చిన విషయాన్ని పద్మరాజు గుర్తుచేశారు. వరి గిట్టుబాటు ధర సాధారణ రకానికి కనీసం రూ.1,310, ఏ గ్రేడ్‌కు రూ.1,340 ఇవ్వాలని సూచించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు తన మేనిఫెస్టోలో ఫీజు రియింబర్స్‌మెంట్ అంశాన్ని పేర్కొనలేదని, ఫలితంగా విద్యార్థుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
చిరంజీవిపై కోడిగుడ్లు.. చెప్పులు
గోరంట్ల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సారథి, సినీనటుడు చిరంజీవిపైకి బుధవారం రాత్రి అనంతపురం జిల్లా గోరంట్లలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. తొలుత ఏపీసీసీ చీఫ్, పెనుకొండ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.రఘువీరారెడ్డితో కలిసి ఆయన రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా కొందరు కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అవి చిరంజీవికి తగలకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పూలతో కలిపి వేసిన కోడిగుడ్లు మాత్రం చిరంజీవికి తగిలాయి. దీంతో చిరు తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నగదు బదిలీ మేనిఫెస్టోలో లేదేం?
చంద్రబాబును ప్రశ్నించిన రఘువీరా శ్రీకాకుళం/గరివిడి, నగదు బదిలీ పథకం అమలుచేస్తామని గత ఎన్నికల్లో చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల పార్టీ మేనిఫెస్టో లో ఆ అంశాన్ని ఎందుకు పొందుపరచలేదని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. ప్రజలను మోసగించేందుకు బాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారని విమర్శించారు. శ్రీకాకుళం లో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో, విజయనగరం జిల్లా గరివిడిలో విలేకరులతోను ఆయన మాట్లాడారు. నగదు బదిలీ పథకాన్ని గతంలో ప్రజలు నమ్మలేదని, అందుకే ఈసారి దానిని వదిలేసి మరికొన్ని మోసపూరిత హామీలతో ముందుకు వస్తున్నారన్నారు. అధికారం కోసం ఏ గడ్డినైనా కరిచే మనస్తత్వం చంద్రబాబుదన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, పార్టీ మేనిఫెస్టోను వారివద్దకు తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
కిరణ్‌కు సీఎం కుర్చీ ఇవ్వడం పొరపాటే
ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నెల్లూరు: ఎలాంటి అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం తమ పార్టీ చేసిన పెద్ద పొరపాటని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను పలువురు నేతలు వీడటంతో పీడ విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. విశ్వాస ఘాతకుడైన కిరణ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. స్వతంత్ర అభ్యర్థులకైనా నాలుగు ఓట్లు వస్తాయని, కిరణ్ పార్టీకి అవీ రావన్నారు. విభజన విషయమై ప్రతిదీ ముందే తెలిసినప్పటికీ తమకెవరికీ చెప్పకుండా మభ్యపెట్టారని విరుచుకుపడ్డారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేశాక తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు కిరణ్ అడ్డు తగిలారని, కేవలం సీఎంగా కొనసాగేందుకే కాలయాపన చేశారని మండిపడ్డారు. కిరణ్ గురించి మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. -
సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు బీఫాంలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలకు ప్రజలకు వివరించాలని కేంద్ర మంత్రి, సీమాంధ్ర పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి అన్నారు. అందరినీ కలుపుకుపోవాలని అభ్యర్ధులకు సూచించారు. సీమాంధ్ర కాంగ్రెస్ అభ్యర్ధులకు ఇందిరాభవన్‌లో బీఫాంలు అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గెలిచే విధంగా పనిచేస్తామంటూ అభ్యర్ధులచే సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల్లో అవలంభించాల్సిన తీరుపై అభ్యర్ధులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకే అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చామని రఘువీరా అన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తారన్న ఆశాభావాన్ని జాతీయ నేత వయలార్ రవి వ్యక్తం చేశారు. పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో రాహుల్ ప్రచారం'
సీమాంధ్ర లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ఎంపికపై చర్చ పూరైందని ఏపీ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరా రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఉదయం న్యూఢిల్లీ నుంచి రఘువీరా రెడ్డి, చిరంజీవి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా రఘువీరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... సీమాంధ్రలో 163 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారైయ్యారని, సాయంత్రంలోగా మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. రేపటిలోగా సీమాంధ్ర అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సీమాంధ్రలోని ప్రతి జిల్లాలో ప్రచారం చేస్తారని రఘువీరా రెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లును పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి గురువారం ఆ పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి తొలి విడత జాబితాలో ఒంగోలు, బాపట్ల, నెల్లూరు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఒంగోలుకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దరిశి పవన్‌కుమార్, బాపట్లకు ప్రస్తుత కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, నెల్లూరుకు వాకాటి నారాయణరెడ్డి పేర్లు సిఫార్సు చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు, కొండపి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బాపట్ల లోక్‌సభ పరిధిలో సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కందుకూరు నియోజకవర్గం మాత్రమే ఉంది. -
రఘువీరాకు తమ్ముళ్ల అభయం!
సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? ఆది నుంచి పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలోని ఓ వర్గం ఈ ఎన్నికల్లో అతడికి చెక్ పెట్టేందుకు వ్యూహం పన్నుతోందా? తాజా ఘటనలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి ఈసారి పెనుకొండ బరి నుంచి దిగుతానని స్పష్టం చేయడం ఇందుకు బలం చేకూరుతోంది. వివరాల్లోకి వెళితే.. 2009లో మడకశిర నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో కళ్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లతో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తరచూ రఘువీరా చెబుతుంటారు. అదే నిజమైతే అక్కడ ప్రజలు ఆయన్ను ఆదరించాలి. అయితే క్షేత్ర స్థాయిలో అభివద్ధి మేడి పండు చందంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. పైగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతుండడంతో అక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన రఘువీరారెడ్డి పెనుకొండ నుంచి బరిలోకి దిగాలని భావించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని బుధవారం మడకశిర, పెనుకొండలో జరిగిన సమావేశాల్లో ప్రకటించారు. కాగా పెనుకొండ నుంచి పోటీ చేయనున్న రఘువీరాకు ఆ నియోజకవర్గంలోని ఓ వర్గం టీడీపీ నేతలు సహకరించనున్నట్లు తెలిసింది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తప్పకుండా మీకే పడేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు సమాచారం. పైగా గతంలో జరిగిన ఓ ఘటనలో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంపై కేసు నమోదైతే అరెస్ట్ కాకుండా మంత్రి హోదాలో ఉన్న రఘువీరా అప్పట్లో సహాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు మొదట్నుంచి పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధిని వ్యతిరేకిస్తున్న ఆ వర్గం నేతలు.. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన అభయంతోనే ఈ సారి పెనుకొండ నుంచి పోటీ చేస్తానని రఘువీరా ప్రకటించినట్లు సమాచారం. పనిలో పనిగా సత్యసాయి ట్రస్ట్ సాయంతో పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ సారి పెనుకొండ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను బాబు మోసగించారు
రఘువీరారెడ్డి ధ్వజం టీడీపీకి సీమాంధ్రలో షాక్ తప్పదు కాంగ్రెస్‌లో చిరు అభిమానులకు చోటు హైదరాబాద్: మతతత్వ బీజేపీతో పొత్తుపెట్టుకొని చంద్రబాబునాయుడు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీవర్గాలను ఘోరంగా మోసగించారని, తెలుగుదేశం పార్టీ వైఖరిపై ఆ వర్గాలు అప్రమత్తతతో ఉండాలని ఏపీపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. టీడీపీ మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని, వీళ్లు మనుషులేనా అన్న ఆవేదన కలుగుతోందని అన్నారు. తెలుగుదేశం పార్టీకి సీమాంధ్రలో గట్టి షాకే తగులుతుందని, తెలంగాణలో ఆ పార్టీ ఒక్క సీటూ గెల్చుకోలేదని తెలిపారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవి మంగళవారం ఇందిరా భవన్లో తన అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రఘువీరా మాట్లాడుతూ టీడీపీ బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ రహస్య సంబంధాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు గుణపాఠం నేర్పాలన్నారు. చిరంజీవి అభిమానులకు పీసీసీ, డీసీసీలు, అనుబంధ సంఘాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గెలుపు అవకాశాలున్న వారికి ఎన్నికల్లో సీట్లు ఇస్తామని చెప్పారు. నామినేషన్లలోగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది అభిమానులను పార్టీలో చేర్పించాలని, కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై పనిచేయాలని కోరారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని, ఎస్సీలకు సీఎం పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. సీమాంధ్రలోని 175 స్థానాలకు 1,300 దరఖాస్తులు అందాయని, గెలిచేవారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని తెలిపారు. 70 శాతం స్థానాల్లో కొత్తవారికి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. యువత, బీసీ, మహిళలకు ఎక్కువ అవకాశాలుంటాయన్నారు. సీఎంలు, మంత్రులు పార్టీని వీడినా కాంగ్రెస్‌కు నష్టం లేదన్నారు. చిరంజీవి మాట్లాడుతూ కాంగ్రెస్‌ను పటిష్టం చేసి, విజయపథంలో నడిపించేందుకు అభిమానులంతా కృషి చేయాలని కోరారు. బీజేపీ ప్రజలను వంచిస్తోందని, మోడీ ప్రచారాలకోసం ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏ నాయకులు ఎటు పోతున్నారో అర్థం కావడంలేదని, పార్టీల మధ్య అక్రమసంబంధాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా పార్టీ రూపొందించిన ప్రచార సీడీని చిరంజీవి ఆవిష్కరించారు. కిరణ్ గోముఖ వ్యాఘ్రం : ఆనం కాంగ్రెస్ పార్టీని మోసగించి కొత్త పార్టీని పెట్టిన కిరణ్‌కుమార్ రెడ్డి గోముఖ వ్యాఘ్రమని ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. చిరంజీవి అభిమానులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చివరివరకు పార్టీలో ఉన్నత స్థానాల్లో కొనసాగి చివరకు పార్టీని వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తి తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తామంటే తాము అంగీకరించబోమన్నారు. ఈనెల 11, 12 తేదీల్లో పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. 12 లేదా 13న మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. -
కాంగ్రెస్ కసరత్తు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సీమాంధ్రలోని మిగిలిన జిల్లాల్లో అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉన్నా.. తన సొంత జిల్లాలో మాత్రం కొంతమేరకైనా పోటీ ఇవ్వగల సత్తా ఉన్న అభ్యర్థులను బరిలోకి దించాలని చూస్తున్నారు. కులాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల వారికే రఘువీరా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం లేదా పెనుకొండ నుంచి రఘువీరా లేక ఆయన సతీమణి సునీత పోటీ చేయాలా వద్దా అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. కేవలం పార్టీ ఫండ్‌ను దృష్టిలో ఉంచుకొని పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారు కాకుండా అంతో ఇంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకోగల వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏ నియోజకవర్గంలోనైనా గట్టి పోటీ ఇచ్చే వారికి మాత్రమే పార్టీ ఫండ్ ఇచ్చే అవకాశం వుందని బహిరంగంగా చెబుతున్నట్లు తెలిసింది. సీమాంధ్రలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మంగళవారం ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలకు బీసీ వర్గానికి చెందిన వారినే బరిలో దింపాలని యోచిస్తున్నారు. రఘువీరారెడ్డి లేదా ఆయన సతీమణి పెనుకొండ నుంచి పోటీ చేస్తే ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్న కేటీ శ్రీధర్‌కు హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అనంతపురం పార్లమెంటు స్థానానికి బోయ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గం నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోతే రాప్తాడు నియోజకవర్గానికి చెందిన బుక్కచెర్ల నాగరాజుకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. అయితే పార్లమెంట్ స్థానానికి బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ముందుకు వస్తే నాగరాజుకు అనంతపురం అసెంబ్లీ స్థానానికి టికెట్ దాదాపు ఖాయమైనట్లు పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం స్థానాలకు ఒక్కొక్క పేరును మాత్రమే అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇక పెనుకొండ, కళ్యాణదుర్గంలో ఏదో ఒక స్థానం నుంచి రఘువీరారెడ్డి లేదా ఆయన సతీమణి సునీత పోటీ చేసే అవకాశం ఉండటంతో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు సూచించలేదు. అధిష్టానానికి పంపిన జాబితా అనంతపురం - బుక్కచెర్ల నాగరాజు, దాదా గాంధీ, దేవమ్మ శింగనమల - శంకర్, పసులూరు ఓబిళేసు, లక్ష్మినారాయణ, సదానందం ఉరవకొండ - జగన్మోహన్రెడ్డి, గుర్రం చెన్నకేశవులు రాయదుర్గం - వడ్డె చిన్న, అలివేలు శ్రీనివాస్ (వడ్డే చిన్న పేరు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది) తాడిపత్రి - బోడాల పద్మావతి లేదా చల్లా సుబ్బరాయుడు కుటుంబంలో ఒకరికి అవకాశం గుంతకల్లు - పూల రమణ, తిమ్మప్ప (వీరిలో పూల రమణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వుంది) హిందూపురం - ఇనయతుల్లా రాప్తాడు - న్యాయవాది నాగిరెడ్డి, చెన్నేకొత్తపల్లి రమణారెడ్డి, కర్రా హనుమంతరెడ్డి మడకశిర - సుధాకర్ కదిరి - సుబ్బారెడ్డి పుట్టపర్తి - శ్రీరాంనాయక్, నాగరాజరెడ్డి, కె.రవీందర్, రమణ ధర్మవరం - రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎజ్జెన్న -
వారినే ఎందుకు చేర్చుకుంటున్నారు?
అనంతపురం: చంద్రబాబుకు విలువలు లేవని సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు రౌడీలు, గూండాలన్న చంద్రబాబు ఇప్పుడు వారినే టీడీపీలోకి ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖే కారణమని ఆరోపించారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర మంత్రి చిరంజీవి దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా కోసం యత్నించింది కేంద్ర మంత్రులేనని వెల్లడించారు. -
తుస్సుమన్న బస్సు యాత్ర
సాక్షి, తిరుపతి: సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మంగళవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభ ఆపార్టీ శ్రేణులను నిరాశపరిచింది. ఈ సభ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేదనే చెప్పాలి. నిర్ణీత సమయానికి రెండున్నర గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, ఎన్నికల ప్రచారకమిటీ సారధి చిరంజీవి, కేంద్రమంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, జేడీ. శీలం, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు బస్సు యాత్రలో తిరుపతికి వచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. సాయంత్రం 4 గంటలకు సభ జరగాల్సి ఉన్నప్పటికీ జనం లేకపోవడంతో ఆరున్నర గంటలకు ప్రారంభించారు. సభకు సుమారు రెండువేల మంది హాజరయ్యారని అంచనా వే స్తున్నారు. ఆలస్యం కావడంతో సభ ప్రారంభంలోనే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. ప్రధాన వక్తల్లో చిరంజీవి ప్రసంగం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. అంతో ఇంతో రఘువీరారెడ్డి మెప్పించగలిగారు. ఇద్దరి ప్రసంగాల్లోనూ రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్‌లో సీమాంధ్రలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. వీటితోపాటు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల సొంతజిల్లా కావడంతో వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేగాకుండా జిల్లాలో ఎంతోకాలంగా పదవులను అనుభవించి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని తిట్టినవారే ఇప్పుడు ఆ పార్టీ పంచన చేరడం పదవీ కాంక్షేనని విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి వారందరినీ ఓడించాలని, కసితో పనిచేయాలని రఘువీరారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభా ప్రాంగణంలో జనం పలుచగా ఉండడంతో రఘువీరారెడ్డి ఇది బహిరంగ సభ కాదని, కార్యకర్తల సమావేశమని చెప్పుకోవాల్సి వచ్చిం ది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 65 జెడ్పీటీసీ స్థానాలకు 29 మంది, 901 ఎంపీటీసీ స్థానాలకు 60 మంది, 219 వార్డు సభ్యుల పదవులకు 39 మంది కాంగ్రెస్ తరఫున నామినేషన్లు వేశారని పరోక్షంగా పార్టీ దుస్థితిని వివరించారు. ప్రముఖులు లేక నిండుదనం కోల్పోయిన వేదిక కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన సభలో జిల్లాకు చెందిన ప్రముఖులు లేకపోవడంతో వేదిక నిండుదనం కోల్పోయినట్టు కనిపించింది. ఒకప్పుడు కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ హోదాల్లోని పదవులు పొందిన వారితో కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయింది. జిల్లాకు సంబంధించినంత వరకు తిరుపతి ఎంపీ చింతామోహన్ మినహా ప్రముఖులెవరూ లేరు. డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి కూడా మొన్నటి వరకు జిల్లా అంతటా తెలిసిన నేత కాదు. వేదిక నిండుగా బస్సుయాత్రలో వచ్చిన నేతలే కనిపించారు. -
కాంగ్రెస్‌ను వీడిన వారంతా ద్రోహులే..
పసీసీ అధ్యక్షుడు రఘువీరా ఏలూరు: కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిన వారందరూ ద్రోహులేనని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి వివుర్శించారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర ఆదివారం ఏలూరు, విజయువాడల్లో సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యకర్తల సవూవేశాల్లో రఘువీరా మాట్లాడుతూ ఇప్పటి వరకు పదవులు అనుభవించిన కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రి జంప్ జిలానీలుగా మారుతున్నారని వివుర్శించారు. మంత్రిగా కూడా చేయని కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు. కేంద్రవుంత్రి చిరంజీవి వూట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మళ్లీ ప్రజారాజ్యం పార్టీ పెడితే చాంపియన్‌గా ఉండవచ్చని పలువురు తనకు చెప్పారన్నారు. ప్రజారాజ్యం పార్టీలో సామాజిక న్యాయం పేరుతో బీసీలకు, మైనారిటీలకు, ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినా తగిన ంత ఆదరణ దక్కలేదని, అందుకే మహాశక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. మహాకూటమిలో కలిసి తప్పు చేశానని, బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పిన చంద్రబాబు అదే పార్టీతో ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపన కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ను నిస్సహాయ స్థితిలోకి నెట్టారని చెప్పారు. అవసాన దశలో ఉన్న కాంగ్రెస్‌కు అంద రూ అండగా నిలవాలని కోరారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ తాను జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. కేంద్రమంత్రులు పళ్లంరాజు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, జేడీ శీలం, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, మాజీమంత్రులు వట్టి వసంత్‌కుమార్, కోండ్రు మురళి, దేవినేని నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. -
రక్షమాం.. పాహిమాం
ఏలూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు పూనుకుని కష్టాల్లో మునిగిపోరుున కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలే ఆదుకోవాలని కేంద్ర మంత్రి, పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు కొణిదల చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకునే చర్యల్లో భాగంగా బస్సుయూత్ర చేపట్టిన సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రులు జేడీ శీలం, ఎంఎం పళ్లంరాజు, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి ఆదివారం ఉదయం ఏలూరు చేరుకున్నారు. స్థానిక మర్చంట్ చాంబర్ కల్యాణ మండపం వద్ద చిరంజీవికి, కేంద్ర మంత్రులకు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం రఘువీరారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు పెద్దగా రాకపోవడంతో సభ వెలవెలబోరుుంది. అతికొద్ది మంది కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు హాజరుకాగా, వారితోనే సభ నడిపించారు. చిరంజీవి అభిమానులు ‘సీఎం చిరంజీవి, జై చిరంజీవా’ అంటూ నినాదాలు చేయడంతో అలా అనొద్దని చిరంజీవి సైగలతో వారిని వారించారు. ఈ నినాదాల మధ్య సభను నడ పలేక మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ ఒకానొక దశలో అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జేడీ శీలం కూడా మీకిది మర్యాద కాదంటూ చిరంజీవి అభిమానులను హెచ్చరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతుండగా, ఉంగుటూరు నుంచి వసంత్‌కుమార్ పోటీ చేయాలని పలువురు కేకలు వేశారు. కాంగ్రెస్‌కు శీల పరీక్ష కేంద్ర మంత్రులు చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ విభజన పాపం కాంగ్రెస్‌ది కాదని చెప్పుకొచ్చారు. దీనికి టీడీపీ సహా పలు పార్టీలు మద్దతు పలకడం వల్లే సీడబ్ల్యుసీ తీర్మానం చేసిందన్నారు. విభజన భాధాకరమని.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ శీఘ్రంగా కోలుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని నమ్మబలికారు. పాతనీరు పోతే పోయిందని.. కొత్త వారికి అవకాశాలు వస్తాయన్నారు. చంద్రబాబు వలసలను ప్రోత్సహించడం.. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా అందులో చేరిపోవడం వారి అనైతికతకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సమైక్య చాంపియన్ అయిపోదామనుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రం విడిపోయూక కొత్తపార్టీ పెట్టి నవ్వుల పాలయ్యూరని రఘువీరా నిప్పులు చెరిగారు. బస్సు యాత్ర ద్వారా పార్టీల కుతంత్రాలను ప్రజలకు వివరిస్తున్నామని, రథయూత్ర తరహాలో సాగుతున్న దీని చక్రాల కింద ఇతర పార్టీలు నలిగిపోరుు నాశనం అవుతాయని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ శీల పరీక్ష ఎదుర్కొంటోందని, ఈ గండం నుంచి పార్టీని గట్టెక్కించి నవ్యాంధ్రప్రదేశ్ కోసం అందరూ పనిచేయాలని కోరారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇతర రంగాల్లో సీమాంధ్రను దేశంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామని వివరించారు. కేంద్ర మంత్రులు ఎంఎం పళ్లంరాజు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మి, రాష్ట్ర తాజా మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, కొండ్రు మురళి, నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తదితరులు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేయూలని కోరారు. ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కరాటం రాంబాబు, డీసీసీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మల్లిపూడి కనకదుర్గ, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె వెంకటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఆర్‌కే చౌదరి, పీసీీసీ ప్రధాన కార్యదర్శి రాజనాల రామ్మోహన్రావు, అలగా రవికుమార్, బీవీ రాఘవయ్య చౌదరి, బద్దా ఆనంద్‌కుమార్, కమ్ముల కృష్ణ, చిట్టిబొమ్మ వెంకటస్వామి పాల్గొన్నారు. సభ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులకు వీడ్కోలు పలికిన చిరంజీవి బస్సుయాత్ర విజయవాడకు బయల్దేరింది. -
అంపశయ్యపై కాంగ్రెస్
సాక్షి, ఒంగోలు: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరుగా వీడిపోతున్న క్రమంలో.. ఆ పార్టీ తరఫున జెండా పట్టుకునే వారే కరువయ్యారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రాతినిధ్యం నామమాత్రమే.. పార్టీ సీనియర్లే పక్కకు తప్పుకుంటుండటంతో కేడర్ సైతం కాడి నేలకేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు జిల్లాకొస్తున్నారు. బస్సుయాత్ర పేరిట ఒంగోలులో సోమవారం పర్యటించనున్నారు. సీమాంధ్ర సారథిగా పార్టీ తరఫున మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి ఈ యాత్ర చేయనున్నారు. వారికి స్వాగతం పలికి కండువా కప్పేందుకు జిల్లాలో కార్యకర్తలు కరువయ్యార ని ఇప్పటికే అధిష్టానం గుర్తించింది. ఈమేరకు చుట్టుపక్కల జిల్లాల కేడర్ కూడా ఇక్కడకొచ్చి ఇంకా పార్టీలో మిగిలిన అరాకొరా కార్యకర్తలతో సమావేశమవుతోంది. రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్‌ను వీడి జిల్లా నుంచి భారీగా నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేసి నెగ్గలేమనే భయం కేడర్‌లో నెలకొన్న నేపథ్యంలో... కాంగ్రెస్ పెద్దలు బస్సుయాత్ర పెట్టడం ద్వారా ఒనగూరే ప్రయోజనమేమీ లేదంటున్నాయి రాజకీయ వర్గాలు. పరువా..? పరాభవమా..? సీమాంధ్ర పీసీసీ బాధ్యతలు స్వీకరించిన మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డితో పాటు కేంద్రమంత్రి చిరంజీవి తదితర నేతలు జిల్లాకొచ్చి ఇక్కడి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోస్తారని డీసీసీ చెబుతున్న మాటలపై జిల్లా శ్రేణులెవరూ పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి .. ఇతర పార్టీల ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ అభిప్రాయ సేకరణల్లో ఉన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేసి, ప్రత్యామ్నాయ రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నిస్తుండగా, ఆయన తర్వాత జిల్లా పార్టీని భుజాలకెత్తుకున్న ఒంగోలు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు జడా బాలనాగేంద్ర సైతం కిరణ్‌పార్టీ కండువా వేసుకున్నారు. గిద్దలూరు, మార్కాపురం, పర్చూరు, ఒంగోలు, కొండపి, చీరాల, కనిగిరి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు దాదాపు మూతపడ్డాయి. మాజీమంత్రి, కందుకూరు ఎమ్మెల్యే ఎం.మహీధర్‌రెడ్డి తన రాజకీయ భవితవ్యంపై ఆలోచిస్తూ నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాద్‌కే పరిమితమవగా, ఇప్పటికే పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో తాను పోటీచేయనని ప్రకటించారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ రేపోమాపో మరోపార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కనిగిరి ఎమ్మెల్యే, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి సైతం అవకాశాలుంటే..వలసకు సిద్ధంగా ఉన్నట్లు అనుచరవర్గాల సమాచారం. ఇక పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ అయినాబత్తిని ఘనశ్యామ్, మరో నేత మంత్రి శ్రీనివాస్ కూడా కాంగ్రెస్‌కు అంటీముట్టనట్టుగానే ఉన్నారు. ఇటీవల మద్దిపాడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మారం వెంకారెడ్డి కూడా కాంగ్రెస్‌ను కాదని .. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యాలయం ముఖం చూడడం లేదు. అధిష్టాన పెద్దలు జిల్లాకొస్తున్న నేపథ్యంలో వారికి స్వాగతం పలికి పరువు కాపాడాలని ద్వితీయశ్రేణి నేతల్ని ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి ఫోన్లు చేసి బతిమాలుతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రులపై జిల్లా జనం భగ్గు.. రాష్ట్ర విభజన బిల్లులో కీలకపాత్ర పోషించి.. సొంత నియోజకవర్గాల్లో తలెత్తుకుని క్యాడర్ ముందు తిరగలేక.. అధిష్టానం పెద్దలతో పాటు జిల్లాకొస్తున్న కేంద్రమంత్రులు జేడీ శీలం, పనబాక లక్ష్మి పేరెత్తితేనే జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఇటీవల పనబాక లక్ష్మి పలుచోట్ల సమావేశాలు నిర్వహించగా, కార్యకర్తల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. జిల్లాలోని కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్ అంపశయ్యపై ఉందన్న చేదు నిజాన్ని విని అధిష్టాన పెద్దలు ఏవిధంగా జీర్ణించుకుంటారో వేచిచూడాల్సిందే. -
'కాళ్లు పట్టుకుని మరీ టీడీపీలో చేర్చుకుంటున్నారు'
కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం నింపేందుకే బస్సు యాత్ర చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర శనివారం విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్బంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ...తాము చేపట్టిన బస్సు యాత్ర ముగిసేలోపు కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. తమ బస్సు యాత్ర వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందన్న భావన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చాయని, అయితే కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. విభజనతో పార్టీ నుంచి బయటకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను కాళ్లు పట్టుకుని మరీ పచ్చ పార్టీ చేర్చుకుంటుందని టీడీపీపై రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. -
కేసీఆర్ పప్పులుడకవ్: రఘువీరా
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. సీమాంధ్రకు నీళ్లు వదలబోమని, సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవలసిందేనన్న కేసీఆర్ ప్రకటనలను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో చట్టం, నిబంధనలు ఉంటాయని, వాటి ప్రకారమే అన్నీ జరుగుతాయి తప్ప కేసీఆర్ చెప్పినట్లు కాదని చెప్పారు. కేసీఆర్ ఎన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఆ పప్పులేమీ ఉడకవన్నారు. ఇందిరాభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ కేసీఆర్‌ది సీఎం కుర్చీలో కూర్చోవాలనే ఆరాటం తప్ప తెలంగాణను బాగుచేసుకోవాలన్న దృష్టి లేదు. కేసీఆర్ మాట తప్పిన విషయం అందరికీ తెలుసు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులే కాకుండా ఎవరికీ ఇబ్బందులు లేకుండా రక్షక కవచంగా ఉంటానని చెప్పి ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టడం విచారకరం. -
దయచేసి పార్టీలోకి తిరిగి రండి: రఘువీరా
హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను ఆ ప్రాంత పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి వెల్లడించారు. 21 నుంచి 27 వరకు బస్సుయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. 21న ఉదయం శ్రీకాకుళంలో, మధ్యాహ్నం విజయనగరంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 27న అనంతపురం కర్నూలు జిల్లాల్లో బస్సుయాత్ర ఉంటుందన్నారు. తమ పార్టీలో జెండా మోసే కార్యకర్తలకు లోటు లేదన్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి గల కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పోటీకకి నేతలు లేనిచోట కొత్త నాయకత్వానికి అవకాశమిస్తామన్నారు. కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కల్పించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లినవారు దయచేసి తిరిగి రావాలని రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు చిరంజీవి, ఆనం రామనారాయణ రెడ్డి తదితర నేతలతో రఘువీరా భేటీ అయ్యారు. -
బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్
బీసీ రాష్ట్రవ్యాప్త సదస్సులో నేతలు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే విజయం వెనుకబడిన వర్గాల అభివృద్ధికి తీర్మానాలు మహిళలకు 50శాతం రిజర్వేషన్లపై చర్చ సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణల్లోని బీసీలకే పీసీసీ అధ్యక్ష పదవులు కట్టబెట్టడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ జె. చిత్తరంజన్ దాస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఆదివారం ‘రాష్ట్ర కాంగ్రెస్-వెనుకబడిన తరగతుల సదస్సు’ జరిగింది. కార్యక్రమంలో ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు కె.సి. లెంక మాట్లాడుతూ.. బీసీలకు పెద్దపీట వేయడమే కాంగ్రెస్ సంకల్పమన్నారు. రెండు రోజుల క్రితం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రానున్న ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, చట్టసభల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించే అంశాలపైనే చర్చించారన్నారు. బీసీలకు టికెట్లు కేటాయింపులో పీసీసీ అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకునేలా జాబితా రూపొందించాలని రాహుల్ సూచించినట్టు తెలిపారు. అందరికీ న్యాయం: పొన్నాల తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు మేలు జరిగేలా మ్యానిఫెస్టోలో పలు పథకాలు పొందుపరుస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ప్రభుత్వ నియామకాల్లో బీసీలకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా, బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, బీసీ విద్యార్థులకు ఉచిత విద్య, ప్రత్యేక మోడల్ స్కూళ్లు, 25 వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ అమలు, జిల్లాల్లోనూ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు బీసీలకు 50 శాతం అమలు వంటి తీర్మానాల్ని వేదికపై ప్రకటించారు. త్వరలో కొత్త చైర్మన్లు ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి మాట్లాడుతూ కొత్త రాష్ట్రానికీ బీసీ సెల్ చైర్మన్లను త్వరలోనే నిర్మిస్తామన్నారు. బీసీలకు భరోసా ఇవ్వడానికే కె.సి.లెంక వచ్చారన్నారు. దళితుడిని సీఎం చేసిన ఘనత, పీసీసీ అధ్యక్ష పదవుల్ని బీసీలకు కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఇతర పార్టీ నాయకులు అలా చేయగలరా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని బీసీలకు ఆసక్తి ఉంటే తనను సంప్రదించ వచ్చన్నారు. ఇదిలావుంటే, విపక్షాల మాయ మాటల్ని నమ్మొద్దని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా అన్నారు. -
రఘువీరా.. అస్త్ర సన్యాసం!
అనంతపురం: యుద్ధభేరి మోగక ముందే సీమాంధ్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రఘువీరాకు ఎదురుగాలి వీస్తోంది. దీంతో పుట్టపర్తి, పెనుకొండల్లో సర్వేలు చేయించుకున్నారు. సర్వేల్లోనూ ప్రతికూలంగా ఉండటంతో సరి కొత్త వాదన అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్ర వ్యాపంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన పరిస్థితుల్లో తాను పోటీకి దూరం గా ఉంటానని రఘువీరా తన సన్నిహితులతో స్పష్టీకరించారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ చెవిలో శనివారం వేశారు. దిగ్విజయ్‌కు స్పష్టం చేసిన రఘువీరా సీమాంధ్ర పీసీసీ చీఫ్ పదవిని అనూహ్యంగా దక్కించుకున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో శనివారం బాధ్యతలు స్వీకరించారు. దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో సీమాంధ్ర పీసీసీ కాంగ్రెస్ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని దిగ్విజయ్‌సింగ్‌కు రఘువీరా స్పష్టీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన దృష్ట్యా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్న ఆయన అభిప్రాయంతో దిగ్విజయ్‌సింగ్ ఏకీభవించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయక ముందే రఘువీరా అస్త్ర సన్యాసం చే యడంపై కాంగ్రెస్ వర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగుతోంది. పలు సర్వేల అనంతరం పోటీకి దూరంగా.. నియోజకవర్గాల పునర్విభజనలో సొంత శాసనసభ స్థానం మడకశిర ఎస్సీలకు రిజర్వు అయ్యింది. దాంతో.. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రఘువీరా వలస వెళ్లారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో టీడీపీకి కంచుకోట అయిన కళ్యాణదుర్గం నుంచి రఘువీరా ఘన విజయం సాధించారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాగ్రహం దెబ్బకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ సాహసించని దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన పరిణామాలకు ముందే.. సహకార, పంచాయతీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే సురక్షిత స్థానం కోసం జిల్లా వ్యాప్తంగా సర్వేలు చేయించారు. పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వేలు చేయించారు. అక్కడ కూడా తనకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయని వెల్లడవడంతో రఘువీరా తీవ్రంగా ఆందోళన చెందుతూ వచ్చారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం ద్వారా ఓటమిని తప్పించుకోవాలని భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో రఘువీరా ఊపిరిపీల్చుకున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన పొన్నాల, రఘువీరా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా ఎన్.రఘువీరా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలు శనివారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలను బొత్స సత్యనారాయణ నుంచి రఘువీరా, పొన్నాలకు స్వీకరించారు. గాంధీభవన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఇందిరాభవన్‌ను దిగ్విజయ్ ప్రారంభించారు. ఈ సందర్బంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కష్టకాలంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరుప్రాంతాలలో బలోపేతం చేయాల్సిన అవశ్యకతను ఆయన ఈ సందర్బంగా వివరించారు. రెండు పీసీసీ ఏర్పాటుతో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతున్నామని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఇందిరా భవన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకలాపాలు, గాంధీభవన్‌లో తెలంగాణ పీసీసీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. పీసీసీ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఇరు ప్రాంతాల నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
జానారెడ్డితో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ పెద్దలు వ్యవహరించిన తీరుపట్ల జానారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనైన నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ కూడా దిగ్విజయ్‌తోపాటు జానారెడ్డిని కలిశారు. టీపీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో హైకమాండ్ అనుసరించిన తీరు, ఈ విషయంలో ఏర్పడిన గందరగోళంపై చర్చించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు రాహుల్‌గాంధీ కార్యాలయం ఫోన్‌చేసి ఢిల్లీ రావాలని కోరారని, ఆ సమయంలో జానారెడ్డికి ఫోన్‌చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. జరిగినదంతా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తు, కేసీఆర్ ప్రతిపాదనలపైనా వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, పొత్తు సాధ్యంకాని పక్షంలో ఒంటరిగా పోటీచేసేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌లోకి తిరిగిరండి: రఘువీరారెడ్డి
పార్టీని వదిలివెళ్లిన వారికి రఘువీరారెడ్డి పిలుపు సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి బాగుందని చెప్పలేను పార్టీ ఓటమి పాలైతే ఆ అప్రతిష్ట నేనే మోస్తా.. అధిష్టానం ఆదేశిస్తే పోటీ కిరణ్ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన పనిలేదు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలివెళ్లడం సరికాదని, పార్టీని వీడిన నేతలంతా తిరిగి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో సమష్టిగా కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని విన్నవించారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆయన ఇక్కడి ఓ ప్రైవేటు హోటల్లో తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీని వీడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘విభజనతో ప్రజలు ఆదరించరనో, ఓట్లు పడవనో మీకు భయం ఉన్నట్లుంది. అంతలా భయపడాల్సిన పని లేదు. చేవలేని వాళ్లమా? చేతకాని వాళ్లమా? రాజకీయాలకు కొత్తా? కాంగ్రెస్ ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నో చూసింది. ఆయా సందర్భాల్లో ప్రజల నుంచి తొలుత వ్యతిరేకత వచ్చినా అవన్నీ తాత్కాలికమే అయ్యాయి. మళ్లీ కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరించారు’’ అని చెప్పారు. పార్టీని ఆది నుంచి ద్వేషించేవారు, పార్టీలోనే ఉంటూ పదవులు అనుభవించిన కొందరు కాంగ్రెస్‌పై విషం కక్కుతున్నారని, ఈ సమయంలో కార్యకర్తలు పార్టీకి అండగా నిలవాలని కోరారు. సీపీఎం మినహా అన్ని పార్టీలు అంగీకరించాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని, దీనికి కాంగ్రెస్ పార్టీనే తప్పుబట్టడం సరికాదన్నారు. సోనియా, మన్మోహన్ సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలను, పోలవరానికి జాతీయహోదా వంటివి బిల్లులో పొందుపరిచారన్నారు. ఇవి ఆచరణలోకి రావాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు వీలుగా ఆనం రామనారాయణరెడ్డి నేతృత్వంలో మేనిఫెస్టో, విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, చిరంజీవి నేతృత్వంలో పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని సాగిస్తామన్నారు. చిరు సోదరుడు పవన్‌కల్యాణ్ కొత్త పార్టీ గురించి ప్రస్తావిస్తూ.. భార్యాభర్తలు, అన్నదమ్ములు ముఖాముఖి పోటీపడుతుంటారని, పవన్ పార్టీ కూడా అలాంటిదేనన్నారు. కిరణ్ పార్టీ గురించి విలేకరులు ప్రశ్నించగా వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సీమాంధ్రలో మునిగిపోయిన నావగా ఉన్న కాంగ్రెస్ బాధ్యతలను మీకు అప్పగించడంపై ఎలా భావిస్తున్నారని ప్రశ్నించగా ‘‘కాంగ్రెస్ పరిస్థితిపై పెద్దగా విశ్లేషణ అవసరం లేదు. పార్టీ పరిస్థితి బాగోలేదన్న విషయం అందరికీ తెలుసు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. నిజమైన కార్యకర్తలు, నేతలు కష్టమైనా నష్టమైనా పార్టీలోనే ఉంటారు’’ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే ఆ అప్రతిష్ట తానే మోస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే తాను భావిస్తున్నానని, అంతిమంగా పార్టీ ఎలా చెబితే అలా నడుస్తానన్నారు. తెలంగాణలో ఎస్సీలకు సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ చెబుతోందని, సీమాంధ్రలో ఎవరికి అవకాశమిస్తారని అడగ్గా.. తాను చిన్నవాడినని రఘువీరా స్పందించారు. తన ఎంపికపై పార్టీలో అసంతృప్తి ఉందో లేదో తనకు తెలియదని, తన కన్నా సీనియర్లు అనేకమంది ఉన్నారని, వారిలో ఎవరిని అధ్యక్షునిగా చేసినా సంతోషించే వాడినని రఘువీరా చెప్పారు. ఏపీపీసీసీ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో, ప్రచార కమిటీలతో శనివారం దిగ్విజయ్‌సింగ్ సమావేశమవుతారని చెప్పారు. -
డబ్బులిస్తాం రండి..
సాక్షి, అనంతపురం : జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది. ఆ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్, కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆఖరుకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి వద్దకు నేరుగా నాయకులే వెళ్లి కాంగ్రెస్ తరఫున బీఫారం తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నా వారి నుంచి స్పష్టమైన హామీ రావడం లేదు. ఇందులో భాగంగానే అనంతపురం నగరంలో 35 డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి.. వారందరూ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఒప్పుకున్నారని మంగళవారం సాయంత్రం నేతలకు సమాచారం ఇచ్చారు. ఆ 35 మంది బుధవారం నామినేషన్లు వేసినా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు అందులో సగం మంది కూడా ఒప్పుకోకపోవడంతో నాయకుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో పరువు నిలవాలంటే అన్ని చోట్లా అభ్యర్థులను రంగంలో దింపాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులు రంగంలో వుండాల్సిందేనంటూ తన అనుచరవర్గానికి రఘువీరారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టంగా మారడంతో ఏం చేయాలో దిక్కుతోచక నాయకులు తలలు బాదుకుంటున్నారు. జిల్లాలో అనంతపురం నగర పాలక సంస్థతో పాటు హిందూపురం, ధర్మవరం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, పుట్టపర్తి, కళ్యాణదుర్గం, మడకశిర, పామిడి, గుత్తి మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నామినేషన్లు వేసేందుకు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఆ లోపు అభ్యర్థులను ఎంపిక చేయడం కష్టంగా మారిందని ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత వాపోయారు. ఇప్పటి వరకు రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గమైన మడకశిర మున్సిపాలిటీలో మాత్రమే అన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారు. మిగిలిన 10 మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. మడకశిర మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన వారందరికీ తానే ఖర్చు భరిస్తానని రఘువీరారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిసింది. కదిరి మున్సిపాలిటీలో బుధవారం నాటికి కాంగ్రెస్ తరఫున ఒక వార్డుకు మాత్రమే నామినేషన్ వేశారు. హిందూపురంలో నాయకులకు ఏదో ఒక ఆశ చూపి కనీసం కొన్ని వార్డుల్లోనైనా అభ్యర్థులను పోటీ చేయించాలనే ఉద్దేశంతో రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుని హోదాలో మొదటి సారిగా పట్టణంలో పర్యటించి ఒక్కో నాయకున్ని పిలిపించి మాట్లాడారు. అయినా అక్కడ ఆశించిన స్థాయిలో స్పందన కన్పించకపోవడంతో దిక్కు తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గెలుపు ఓటములను పక్కన పెట్టి కనీసం అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను మాత్రం ఎంపిక చేయాలంటూ ఒత్తిళ్లు వస్తుండటంతో నాయకులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితి నెలకొంది. పోటీ చేసేందుకు రండి బాబూ రండి... ఖర్చు అంతా తామే భరిస్తామని హామీ ఇస్తున్నా నమ్మడం లేదు. అనంతపురంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ఎన్నికలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని నేరుగా తమకు ఇస్తామంటేనే పోటీ చేస్తామని తెగేసి చెప్పినట్లు తెలిసింది. పదవులను అడ్డం పెట్టుకొని నాయకులు ఇన్నాళ్లూ కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటూ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల పుణ్యమా అంటూ తమ వద్దకు వస్తారా అంటూ పలువురు నాయకులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు. సీమాంధ్ర ప్రాంతంలో మిగిలిన మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటో గాని అనంతపురం జిల్లాలో మాత్రం మున్సిపాలిటీల్లోని అన్ని వార్డులకు అభ్యర్థులను పోటీ చేయించి పరువు నిలపాలని నేతలను బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. -
పీసీసీ పీఠంపై రఘువీరా
సాక్షి, అనంతపురం : సీమాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్.రఘువీరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా నుంచి పీసీసీ చీఫ్‌గా కుర్చీని అధిష్టించిన వారిలో రఘువీరారెడ్డి రెండో వ్యక్తి కావడం విశేషం. 1937లో అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన నీలం సంజీవరెడ్డి (మాజీ రాష్ట్రపతి) పని చేశారు. ఆయన తరువాత ప్రస్తుతం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురానికి చెందిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి సీమాంధ్ర పీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టనున్నారు. జిల్లాకు చెందిన రఘువీరారెడ్డి 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రవేశం చేశారు. 1994 ఎన్నికల్లో మడకశిర నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి వైటీ ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో మడకశిర నుంచి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మడకశిర నుంచి విజయం సాధించిన రఘువీరా.. దివంగత వైఎస్ మంత్రివర్గంలో ఐదేళ్లపాటు వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో మడకశిర నియోజకవర్గం 2009 ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వు కావడంతో జనరల్ నియోజకవర్గం కళ్యాణదుర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మూడోసారి విజయం సాధించిన రఘువీరారెడ్డి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో రెండోసారి వ్యవసాయశాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. వైఎస్ హఠాన్మరణంతో రోశయ్య మంత్రివర్గంలోనూ అదే శాఖను రఘువీరా నిర్వహించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో మూడున్నరేళ్లపాటూ రెవెన్యూశాఖను నిర్వహించారు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగంగా మంగళవారం అనంతపురం వచ్చిన రఘువీరారెడ్డికి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ఫోన్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. -
మేము పిరికిపందలం కాదు: రఘువీరా
అనంతపురం, న్యూస్‌లైన్: ‘రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏ తప్పూ చేయలేదు. అధికారంలో ఉన్న సమయంలో కొందరు పదవులు అనుభవించి, నేడు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. వారిలా మేము పిరికిపందలం కాదు’ అని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. విభజనలో కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తర్వాతేనన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇలాంటి ఆటుపోట్లను ఎన్నోసార్లు ఎదుర్కొందన్నారు. కొంత మంది కాంగ్రె స్ పార్టీని దోషిగా చూపిస్తున్నారని, పార్టీలో ఉన్న వారు కొంతమంది బయటకు పోతూపోతూ బురదజల్లి పోతుండడం బాధ కలిగిస్తోందన్నారు. త్వరలో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్ ప్రణాళిక విడుదల చేస్తామని ప్రకటించారు. ఎన్నికల అనంతరం సీమాంధ్ర నాయకులు అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
చెదిరిన స్వప్నం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఆశలపై కేంద్ర మంత్రి మండలి నీళ్లు చల్లింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదిస్తూ తీర్మానించడంతో రఘువీరా చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పదవి కలగానే మిగిలిపోయింది. వివరాల్లోకి వెళితే.. రోమ్ నగరం తగలబడి పోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రఘువీరా.. తెలుగుజాతిని రెండు ముక్కలు చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవడానికి తహతహలాడారు. పీసీసీ చీఫ్ బొత్స, అప్పటి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మినారాయణతో కలిసి ఫిబ్రవరి 21న గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. సీఎం కిరణ్ రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొద్దని కోరారు. తమ నలుగురిలో ఒకరికి అవకాశం ఇస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు విన్నవించారు. అనంతరం ఆ నలుగురూ కిరణ్‌ను వ్యతిరేకిస్తున్న మంత్రులను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లి అధినేత్రి సోనియా, కాంగ్రెస్ కోర్ కమిటీని కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఒత్తిడి తెచ్చారు. తనకు సన్నిహితులైన కేంద్రమంత్రులు వీరప్ప మెయిలీ, మల్లికార్జున ఖర్గేల ద్వారా లాబీయింగ్ కూడా చేశారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్‌తో కూడా అధినేత్రిపై తనకు సీఎం పదవి ఇప్పించేలా ఒత్తిడి తెచ్చారు. కానీ శుక్రవారం కేంద్ర మంత్రి మండలి రఘువీరా ఆశలను అడియాశలు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు లేవని తేల్చి... రాష్ట్రపతి పాలనకు ప్రతిపాదిస్తూ తీర్మానం చేసింది. ఏడాదిన్నర క్రితం రంగారెడ్డి జిల్లాలో ఓ డిస్టిలరీ కొనుగోలు వ్యవహారంలో సీఎం కిరణ్‌తో విభేదాలు వచ్చినప్పటి నుంచి ఆ పదవిపై కన్నేసి వ్యూహాత్మంగా అడుగులు వేశారు. హంద్రీ-నీవా ట్రయల్ రన్‌ను పురస్కరించుకుని నవంబర్ 17, 2012న కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకూ భగీరథ విజయాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆ పాదయాత్రకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురిని రప్పించుకుని తన పరపతి చాటుకున్నారు. ఇది గమనించి సీఎం కిరణ్.. శైలజానాథ్‌కు సహకారం పెంచారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్యలతో సాన్నిహిత్యం పెంచుకుని ఏడాది కాలంగా సీఎం పదవి కోసం ప్రయత్నించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తన కలను సాకారం చేసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్న తరుణంలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో ఆయన డీలా పడ్డారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. -
శతకోటి లింగాల్లో..
సాక్షి, న్యూఢిల్లీ: కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టే పార్టీ శతకోటి లింగాల్లో బోడిలింగం లాంటిదని మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయిన అనంతరం 11 మంది మంత్రుల బృందంలో పలువురు మీడియాతో మాట్లాడారు. కిరణ్ పెడుతున్న కొత్త పార్టీపై మీ స్పందన ఏంటని కోరగా రఘువీరా ఇలా స్పందించారు. ‘ఎన్నో పార్టీలు వచ్చాయి. పోయాయి. ఇప్పుడూ వస్తాయి’ అన్నారు. ‘క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీని బలోపేతం చేస్తామని, అందుకు మా శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తామని సోనియాకు చెప్పాం. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతకు విభజన తోడైంది. మా ముందు ఇప్పుడు రెండే లక్ష్యాలున్నాయి. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, విభజన తరువాత కొత్త ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలబెట్టడం. రాహుల్‌గాంధీని ప్రధాని చేస్తామన్న ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాం. ప్రభుత్వ ఏర్పాటుపై ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని సోనియాకు చెప్పాం’ అన్నారు. ఎన్నికలు వాయిదావేయాలని కోరారా అని ప్రశ్నించగా అలా నిర్దిష్టంగా ఏమీ అడగలేదని, మాటల మధ్యలో ఆ ప్రస్తావన వస్తే వచ్చి ఉండొచ్చని అన్నారు. ఆరు నెలలైతే పుంజుకుంటుంది: మంత్రి కొండ్రు ‘‘మేడమ్ అన్నీ సావధానంగా విన్నారు.గ్యాస్ కేటాయింపులు కోరాం. సానుకూలంగా స్పందించారు. కనీసం ఆరు నెలలైనా గడిస్తే కాంగ్రెస్ శ్రేణులన్నీ మళ్లీ పుంజుకుంటాయని, రాష్ట్రపతి పాలన వద్దని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరితే పరిశీలిస్తామన్నారు. సీమాంధ్రకు సహకరిస్తామని చెప్పారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరలేదు’’ ఎన్నికల వాయిదా కోరాం: మంత్రి బాలరాజు ‘‘ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందో లేదో చెప్పలేం. సీ మాంధ్రకు మరికొన్ని అభివృద్ధి ప్యాకేజీలడిగాం. పర్యాటకం, ఆరోగ్యం, కోస్తా కారిడార్ తదితరాలను ప్రస్తావించాం. గిరిజనాభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరాం. ఎన్నికల వాయిదా దిశగా ఆలోచన చేయాలని కోరాం’’ కొత్త పీసీసీ చీఫ్ వచ్చాకే ఎన్నికలకు: మంత్రి ఆనం ‘‘మరిన్ని వరాలడిగాం. మరింత ఎక్కువ సాయం ఎలా చేయగలమో ప్రధాని దృష్టికి, తన దృష్టికి తీసుకురమ్మని దిగ్విజయ్‌కి సోనియా సూచించారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. రెండు పీసీసీలు రానున్నాయి. కొత్త పీసీసీ అధ్యక్షుని నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తాం. ప్రభుత్వ ఏర్పాటుపై బహుశా రేపు కేబినెట్లో నిర్ణయిస్తారేమో!’’ -
పిరికిపందల్లా పారిపోతారా ?
సీఎంతో సహా రాజీనామాలు చేస్తున్న నేతలపై ఆనం, రఘువీరా ధ్వజం సాక్షి, హైదరాబాద్: పదవులన్నీ అనుభవించి పార్టీ కష్టాల్లో ఉన్నపుడు రాజీనామాలు చేసి పిరికిపందల్లా పారిపోతారా అంటూ కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్న నేతలపై సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్. రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టడం సరికాదన్నారు. పార్టీని ఏ ఒక్కరూ విడిచి వెళ్లరాదని, సీమాంధ్రలో కాంగ్రెస్‌ను రక్షించుకోవలసిన బాధ్యత కార్యకర్తలందరిపైనా ఉందని చెప్పారు. సీమాంధ్ర అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్ వల్లనే సాధ్యమన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని ప్రయత్నించినా చివరకు విఫలమయ్యామన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించేలా నేతలంతా పనిచేయాలన్నారు. విభజన తప్పు మొత్తాన్ని కాంగ్రెస్పైకే నెట్టేయడం తగదన్నారు. ప్రతిపక్షాలు సీమాంధ్రుల గొంతుల్ని తడిగుడ్డతో కోశాయన్నారు. కాంగ్రెస్‌ను బతికించుకోవడానికి ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తరఫునే పోటీచేస్తామని ప్రకటించారు. రాజధాని ఎక్కడన్న అంశంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయానికి రాజకీయ నేతలతో పాటు మీడియా కూడా దోషేనని ఆనం ఆరోపించారు. సమైక్యాంధ్రను 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేశామని, సీమాంధ్రను పదేళ్లలో పురోగతి బాట పట్టిస్తామన్నారు. మీడియా సమావేశానంతరం ఆనం, రఘువీరా కాంగ్రెస్ టోపీ ధరించి, జెండాలు చేబూని కార్యాలయం బయట మీడియా కెమెరాల ముందు నిలబడ్డారు. వారి కార్లకు ఉన్న జాతీయ జెండాల స్థానంలో పార్టీ జెండాలను పెట్టించారు. ఈలోగా అక్కడకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇంద్రసేనారెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలకు పార్టీ జెండాలు అందించారు. -
కిరణ్ పార్టీలోకి వెళ్లను: రాంచంద్రయ్య
నెల్లూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడితే తాము వెళ్లబోమని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి సి. రాంచంద్రయ్య తెలిపారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. చంద్రబాబు 4 సీట్లు సంపాదించుకునేందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలవారు తెలుగువారి భవిష్యత్తును నిర్ణయించడం సరికాదని మంత్రి కాసు కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో అన్నారు. సీఎం కిరణ్ రాజీనామాపై ఇప్పుడే మాట్లాడడం అపరిపక్వత అవుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలన్నీ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రాన్ని మోసం చేశాయని మంత్రి రఘువీరా రెడ్డి అనంతపురంలో అన్నారు. పార్టీలన్నీ కలసివెళ్లి ప్రధానిని కలిసి మొరపెట్టుకుంటే రాష్ట్ర విభజన ఆగిపోతుందన్నారు. -
రఘువీరా ‘షో
రఘువీరా ‘షో ఒకే రోజు 386 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కళ్యాణదుర్గం, : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చివరి ‘షో’కు తెరతీశారు. శనివారం ఆయన తన నియోజకవర్గ కేంద్రమైన కళ్యాణదుర్గంలో 386 అభివృద్ధి పనులకు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు గావించారు. మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణదుర్గం భవన్ (మంత్రి నివాసం) నుంచి బైక్‌ర్యాలీ ప్రారంభించారు. మార్గం మధ్యలో వాల్మీకి, గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బళ్లారి బైపాస్‌రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రింగ్‌రోడ్డులో 14 కిలోమీటర్ల మేర బైక్‌లతో కలియదిరిగారు. అనంతరం స్థానిక మార్కెట్ యార్డులో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఒకే చోట ఉంచి ఆవిష్కరించడం ద్వారా ‘ఘనత’ను చాటుకున్నారు. కార్యక్రమం అనంతరం కాంట్రాక్టర్లు, కమీషన్లు పొందిన కాంగ్రెస్ నాయకులు వారివారి గ్రామాలలో శిలఫలకాలను ఏర్పాటు చేయడానికి అవస్థలు పడుతూ తీసుకెళ్లడం కన్పించింది. రూ.190 కోట్ల ఖర్చుతో చేపట్టిన శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పనులు పూర్తి కాకపోయినా, ప్రారంభోత్సవం చేయడం కొసమెరుపు. -
గట్టెక్కేదెలా?
సాక్షి, అనంతపురం : ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకే జంకుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నా కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకోవడంలో విఫలం కావడంతో జిల్లాలో విజయం సాధిస్తామనే ధీమా ఒక్కరిలోనూ లేదు. ఈ ఎన్నికల్లో గట్టెక్కేదెలా అని తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. దీంతో ఈసారి పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తన సన్నిహితుల వద్ద మంత్రి ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కళ్యాణదుర్గం నుంచి గెలుపొందినా నియోజకవర్గ ప్రజలకు సరిగా అందుబాటులో లేరనే అపవాదు మూటగట్టుకున్నారు. దీంతోపాటు రాష్ట్రాన్ని విభజించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముందుకెళ్తున్నా సమైక్యంగా ఉంచాలని ఇప్పటివరకు పెద్దగా స్పందించిన పాపాన పోలేదు. కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ కేడర్ కూడా నిర్వీర్యం కావడంతో రానున్న ఎన్నికల్లో విజయం కష్టమని భావించి పెనుకొండపై దృష్టి కేంద్రీకరించారు. ఇదిలా ఉండగా అనంతపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అనంతపురం నగరపాలక సంస్థ మాజీ మేయర్ రాగే పరశురాంను పోటీ చేయాలని ఆ పార్టీ ముఖ్య నేతలు ఒత్తిడి తెస్తున్నా ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఏదో ఒక విధంగా పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా మునిగే పడవను తానెందుకు ఎక్కుతానంటూ పర శురాం తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో మేయర్‌గా ఎన్నికై పదవిని అనుభవించి.. ప్రస్తుతం పార్టీ గెలవదనే కారణంతో పోటీ చేసేందుకు వెనుకాడితే ఎలా అంటూ ఆయన్ను వారు ప్రశ్నించినట్లు తెలిసింది. జిల్లాలో ముఖ్యంగా రాప్తాడు, కదిరి, హిందూపురం, రాయదుర్గం, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరూ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. ఎన్నికల్లో పోటీ చేసే వారి నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు ఇటీవల ఏఐసీసీ నుంచి ప్రతినిధి బృందం సభ్యులు వచ్చినా వారిని కలవడానికి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు ఎవరూ ముందుకు రాకపోవడం విశేషం. సామాన్య కార్యకర్తలు మినహా గతంలో పదవులు పొందిన వారెవ్వరూ దరఖాస్తులు ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటున్నారు. హిందూపురం పార్లమెంటు స్థానానికి దరఖాస్తు ఇచ్చిన ఎమ్మెల్సీ తిప్పేస్వామి మినహా నియోజకవర్గాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించగా ఆ స్థాయి తగ్గ నాయకులెవ్వరూ లేరని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలే బహిరంగంగా చెబుతున్నారు. గుంతకల్లు, తాడిపత్రి ఎమ్మెల్యేలతో పాటు శింగ నమల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శైలజానాథ్ సైతం ఈ దఫా కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఇష్ట పడటం లేదు. -
'పూర్తి పారదర్శకంగా వీఆర్ఓ పరీక్ష'
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. ఈ పోస్టులలో 1657 వీఆర్ఓ పోస్టులకు గానూ 13,13వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 4305 వీఆర్ఏ పోస్టులకు 69వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్టు మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. అయితే ఈ పరీక్షను పూర్తి పారదర్శకంగా ఉండేలా నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. రాజకీయ నాయకుల సహా దళారులు ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మెద్దని చెప్పారు. దీనిపై ఎలాంటి సమాచారం అందినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని మంత్రి రఘువీరా పేర్కొన్నారు. -
వీరిద్దరికీ ఏమైంది?
శుంఠ, స్టూపిడ్... ఈ మాటలన్నది మామూలు మనుషులు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అమాత్య పదవులు తలపండిన రాజకీయ నాయకుల నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాలివి. కేంద్రమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయల్లో దిగజారుతున్న విలువలకు అద్దం పడుతున్నాయి. మంచి వక్తగా పేరున్న కేంద్ర మతం జైపాల్ రెడ్డి, ఆచితూచి మాట్లాడే రాష్ట్ర మంత్రి ఎన్. రఘువీరారెడ్డి లాంటి నాయకులు కూడా మాట జారడంతో వీరిద్దరికీ ఏమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను సీమాంధ్ర నాయకులు ఖండించారు. ఇరు ప్రాంతాల్లో శుంఠలున్నారని రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి కౌంటర్ ఇచ్చారు. జైపాల్‌రెడ్డి లాంటి సీనియర్ రాజకీయ వేత్త ఇలా మాట్లాడడం తగదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు హితపు పలికారు. వేతనాలు పెంచాలని కోరిన పాపానికి ఓ వీఆర్ఏపై ఒంటికాలిపై లేచారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో తహసీల్దార్ కార్యాలయ భవన శంకుస్థాపనకు వచ్చిన మంత్రిని.. తమకు వేతనాలు ఎప్పుడు పెంచుతారని శేఖర్ అనే వీఆర్ఏ ప్రశ్నించాడు. దీంతో మంత్రిగారికి చిర్రెత్తుకొచ్చింది. 'నోర్ముయ్...స్టుపిడ్..' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మరో మంత్రి మహీధర్ రెడ్డి కలుగచేసుకుని వేలు చూపిస్తూ...'ఏయ్...ఇక్కడ గోల చేయొద్దు' అంటూ కన్నెర్ర చేశారు. అమాత్యుల వైఖరితో అక్కడున్నవారంతా ముక్కుపై వేలేసుకున్నారు. బాధ్యతయుత పదవుల్లో పెద్ద మనుషులు విచక్షణ కోల్పోయి వ్యాఖ్యలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువయింది. తమ కింది వారిని నోటికొచ్చినట్టు దూషించడం అలవాటుగా మారు తోంది. కొంతమంది నేతాశ్రీలు చేతికి పని చెప్పిన సందర్భాలు లేకపోలేదు. నాయకుడనేవాడు మార్గదర్శిగా ఉండాలి. ప్రజా ప్రతినిధి జనం సమస్యలను పరిష్కరించాలి గాని శిక్షించకూడదు. అధికారం ఉంద కదా అని మాట జారితే ప్రజల దృష్టిలో చులకనవడమే కాదు, విలువనూ కోల్పోతారు. -
నువ్వా.. నేనా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా కాంగ్రెస్‌లో సరి కొత్త వర్గపోరుకు తెరలేచింది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష పదవి వేదికగా రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పదవీ కాలం ముగియకున్నా రషీద్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించడంపైనా.. తన వర్గీయుడైన బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి పదవి కట్టబెట్టడంలో శైలజానాథ్ వ్యవహరించిన తీరుపై మంత్రి రఘువీరా, అనంత వెంకట్రామిరెడ్డి మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ రఘువీరా వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాలో రఘువీరా వర్గానికి చెక్ పెట్టడం కోసం సీఎం కిరణ్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ను దగ్గరకు తీశారు. శైలజానాథ్ మాటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2011 జనవరి 18న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన రషీద్ అహ్మద్ ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 జనవరి 18 నాటికి రషీద్ అహ్మద్ పదవీకాలం ముగిసింది. అప్పట్లో తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలన్న రషీద్ అహ్మద్ అభ్యర్థనను ప్రభుత్వం మన్నించింది. రషీద్ అహ్మద్ పదవీకాలం 2014 జనవరి 18తో ముగియనుంది. కానీ.. మంత్రి శైలజానాథ్ ఇవేవీ పట్టించుకోలేదు. తన శాఖ పరిధిలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి కట్టబెట్టాలని సీఎం కిరణ్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం.. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి రఘువీరా, ఎంపీ అనంత.. సీఎం కిరణ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రషీద్ అహ్మద్ పదవీకాలం ముగియకున్నా ఎందుకు తొలగించారంటూ సీఎంను నిలదీశారు. ఇది పసిగట్టిన మంత్రి శైలజానాథ్ డిసెంబర్ 21నే తన నివాసంలోనే బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డితో రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం తమ మాటలు లెక్క చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని రషీద్ అహ్మద్‌కు రఘువీరా, అనంత సూచించారు. జిల్లాలో కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 26 మంది సజీవ దహనమైన రోజే.. అనంతపురంలో ఘనంగా బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సభ నిర్వహించారు. రఘువీరా సూచన మేరకు రషీద్ అహ్మద్ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ కాలం ముగిసే వరకూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో రషీద్ అహ్మద్ కొనసాగేలా చూడాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తానని రషీద్ అహ్మద్ ‘సాక్షి’కి తెలిపారు. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టడంలో క్విడ్‌ప్రోకో జరిగిందని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. అనంతపురం మున్సిపాల్టీ పరిధిలో వివాదంలో ఉన్న సర్వే నెంబరు 342లోని 25.50 సెంట్ల భూమిని మంత్రి శైలజానాథ్‌కు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ముట్టజెప్పిన తర్వాతనే.. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించారని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి రఘువీరా వర్గం ఫిర్యాదు చేయడం కొసమెరుపు. -
ఇక ‘అనంత’ సస్యశ్యామలం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: కరువు కబంధ హస్తాల నుంచి ‘అనంత’ రైతన్నకు శాశ్వత విముక్తి కల్పిస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. రూ.7,676 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ‘ప్రాజెక్టు అనంత’ ద్వారా సుస్థిర వ్యవసాయం అందుబాటులోకి తెస్తామన్నారు. దీని కోసం పార్టీలకతీతంగా అందరూ చేయీచేయి కలిపి రైతును రాజుగా చేద్దామని పిలుపునిచ్చారు. అనంతపురంలోని రైతుబజార్ ప్రాంగణంలో ‘ప్రాజెక్టు అనంత’ కార్యాలయాన్ని గురువారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘ప్రాజెక్టు అనంత’ స్పెషల్ ప్రాజెక్టు డెరైక్టర్ చంద్రమౌళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలోని హై పవర్ టెక్నికల్ కమిటీ జిల్లాలో పర్యటించి కరువు పరిస్థితులపై అధ్యయనం చేసిన తరువాత రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయన్నారు. నిధులు మంజూరు చేయడానికి సానుకూలత వ్యక్తం చేయడం వల్ల అమలు చేయడానికి శ్రీకారం చుట్టామన్నారు. వరుస కరువులతో సేద్యం చేయడానికి ముందుకు రాని ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా మార్చివేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం నిబద్ధత కలిగిన విశ్రాంత ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అందరి ఆమోదంతో నియమించుకున్నామన్నారు. ఇందులో రాజకీయ జోక్యం ఏ మాత్రం ఉండదని, రైతులను భాగస్వాములు చేసి ‘అనంత’ వ్యవసాయ గమనాన్ని సమూలంగా మార్చాలని అధికారులకు పిలుపునిచ్చారు. 42 లక్షల జనాభా కలిగిన జిల్లాలో 35 లక్షల ఎకరాల సాగుభూమి ఉందన్నారు. వచ్చే ఐదేళ్లలో జిల్లాను సస్యశ్యామలం చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నా వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వాలు అధికారం చేపట్టినా ‘ప్రాజెక్టు అనంత’ నిర్విఘ్నంగా కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది నియోజక వర్గానికి ఒకటి చొప్పున 14 గ్రామాలు ఎంపిక చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఏయే అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉందో గుర్తించి ‘ఆదర్శగ్రామాలు’గా తీర్చిదిద్దుతామన్నారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, పరిశ్రమలతో యువతకు ఉపాధి లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ‘అనంత’ రైతుల సమగ్రాభివృద్ధి విషయంలో తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తామని ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపరాదని ఎమ్మెల్యేలు కోరారు. ఎంపిక చేసిన 14 గ్రామాలలో కౌకుంట్ల, రుద్రంపేట, కుమ్మరవాండ్లపల్లి, అల్లాపల్లి, బండ్లపల్లి గ్రామాల నుంచి ఒక్క రైతు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. సమావేశంలో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మధుసూదన్‌గుప్తా, సుధాకర్, పల్లె రఘునాథ్‌రెడ్డి, బీకే పార్థసారధి, అబ్దుల్‌ఘని, మార్కెట్‌యార్డు చైర్మన్ వై.నారాయణరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్, ఏపీడీ ఇక్బాల్‌తో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి కాళ్లుపట్టుకున్న కొండపల్లి నాగరాజు మంత్రి రఘువీరారెడ్డి వేదికపైకి రాగానే కింద నుంచి ఓ రైతు మంత్రి కాళ్లుపట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం ఏమిటని ఆరాతీయగా... కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కురుబ నాగరాజుగా పరిచయం చేసుకున్నాడు. తనకున్న 4.98 ఎకరాల పొలంలో వేరుశనగ పంట వేసుకున్నాన్నాడు. ఎండిపోతుండటంతో రూ. 4 లక్షల దాకా అప్పు చేసి 13 బోర్లు వేసినట్లు తెలిపారు. అందులో లేకలేక ఒక బోరులో మాత్రమే నీళ్లు వచ్చాయన్నాడు. అయితే ఆ నీళ్లు కూడా తనకు దక్కకుండా ఎవరో ఫిర్యాదు చేయడంతో అధికారులు బోరు సీజ్ చేశారని వాపోయాడు. ఈ పరిస్థితుల్లో తనకు ఆత్మహత్యే శరణ్యమని కంటతడిపెట్టాడు. తనకు ఐదుగురు పిల్లలున్నట్లు తెలిపాడు. ఎమ్మెల్సీ గేయానంద్‌కు చేదు అనుభవం ‘ప్రాజెక్టు అనంత’ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం 5 గంటలకు రైతుబజార్‌కు వెళ్లేందుకు స్కూటర్లో సుభాష్‌రోడ్డు క్రాస్ దగ్గరకు రాగానే స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధిని అని చెప్పినా ‘అయితే మాకేంటి?’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ ముందుకు వెళ్లనీయలేదు. 20 నిమిషాల పాటు ఆయనను అక్కడే నిలిపేశారు. చివరకు ఎస్ఐ రెడ్డప్ప అక్కడికి వచ్చి ఎమ్మెల్సీ వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. -
‘భూ పంపిణీకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్సే’
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నిరుపేదలకు భూములు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ర్ట రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నగరంలోని కృష్ణకళామందిరంలో మంగళవారం ఏడో విడత భూ పంపిణీ అట్టహాసంగా జరిగింది. అనంతపురం రెవెన్యూ డివిజన్లోని 3833 ఎకరాల భూ పంపిణీకి 2076 మందిని ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో 593 మంది ఎస్సీలు, 147 మంది గిరిజనులు, 1031 మంది వెనుకబడిన తరగతుల వారు, 11 మంది మైనార్టీలు, 294 మంది ఓసీలు ఉన్నారు. వీరిలో కొందరికి మంత్రి రఘువీరా చేతుల మీదుగా పట్టా పాసుపుస్తకాలు, టైటిల్డీడ్లను అందజేశారు. సాగుదారులకే పట్టాలు పంచామని మంత్రి అన్నారు. పేదలకు సామాజిక భద్రతతోపాటు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అసెంబ్లీలో రాష్ర్ట విభజన బిల్లును ఓడించేందుకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఒకేతాటిపైకి రావాలన్నారు. రాష్ర్ట ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ సాగు చేస్తున్న వారికే పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నీటి కేటాయింపుల విషయంలో అనంతపురం జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఏజేసీ వెంకటేశం, ఆర్డీఓ హుస్సేన్‌సాబ్ పాల్గొన్నారు. సాగు భూములకు పట్టాలతో భద్రత కదిరి అర్బన్ : ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు భూ పంపిణీకింద అందజేసిన పట్టాలతో భద్రత కల్పిస్తున్నామని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. కదిరి బాలికల ఉన్నతపాఠశాలలో ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. భూ పంపిణీకి కదిరి నియోజకవర్గంలో 1727 మంది, పుట్టపర్తి నియోజకవర్గంలో 985 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరందరికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మంత్రి చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. త్వరలోనే రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. సంక్రాంతి లోపు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. జిల్లాలోని 63 మండలాలనూ కరువు మండలాలుగా ప్రకటిస్తామని చెప్పారు. అంతకు ముందు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించాలని కోరారు. -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
నార్పల, న్యూస్‌లైన్ : నార్పలలోని ప్రభుత్వ బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం నుంచి రాష్ర్టస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన (ఇన్స్పైర్)-2013 నిర్వహించనున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ప్రదర్శనను రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభిస్తారు. తొలిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఉంటాయి. 29వ తేదీ వరకూ ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాట్లను కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం పర్యవేక్షించారు. 12 జిల్లాల నుంచి వస్తున్న విద్యార్ధులు, వారి కేర్ టేకర్ల కోసం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రెవేట్ పాఠశాలలను పరిశీలించారు. అనంతరం అధికారులు, ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యార్థులను తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయబృందంతో వచ్చేలా ప్రోత్సహించి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్వీఎం పీఓ రామారావు, డీఈఓ మధుసూదన్‌రావు, సైన్స్ మ్యూజియం క్యూరేటర్ రాఘవయ్య, కోఆర్డినేటర్ ఆనందభాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
వచ్చేస్తోంది..
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: ఇదిగో అదిగో అంటూ నెలల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది రైతులకు ఎట్టకేలకు త్వరలోనే ఇన్పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) పరిహారం అందనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేయడం రైతులకు ఊరట కలిగించింది. జిల్లాకు రూ.263.26 కోట్లు పరిహారం విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 2011, 2012 సంవత్సరాల ఇన్పుట్ సబ్సిడీతో పాటు గతేడాది నీలం తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 19 జిల్లాలకు రూ.427.03 కోట్లు ఇవ్వనుండగా అందులో ‘అనంత’కు అత్యధికంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మంత్రి విడుదల చేసిన ప్రకటన ప్రకారం 2011కు సంబంధించి 55,855 మంది రైతులకు రూ.42.12 కోట్లు, 2012కు సంబంధించి 2,11,666 మంది రైతులకు రూ.221.14 కోట్లు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తమ్మీద 2,67,521 మంది రైతులకు పంపిణీ చేయడానికి వీలుగా రూ.263.26 కోట్లు మంజూరు చేశారు. నాలుగు ఇన్పుట్ జాబితాలకు గాను మూడింటికి అనుమతి... 2011, 2012కు సంబంధించి పరిహారం విడుదల చేయాలని కొన్ని నెలల కిందట జిల్లా వ్యవసాయశాఖ అధికారులు నాలుగు జాబితాలు పంపారు. మొత్తం 3.26 లక్షల మంది రైతులకు గాను రూ.394 కోట్ల పరిహారం విడుదల చేయాలని కోరారు. అందులో 2011కు సంబంధించి 69,408 మంది రైతులకు సరిపడా రూ.43.98 కోట్లతో మిస్‌మ్యాచింగ్ జాబితా తయారు చేసి పంపారు. మరొక జాబితాలో 47,633 మందికి అందజేయడానికి వీలుగా రూ.28.40 కోట్లు అవసరమని నివేదించారు. ఈ రెండింటిలో మొదటి జాబితాకు రూ.1.86 కోట్లు కోత వేసి మిగతా రూ.42.12 కోట్లకు అనుమతి ఇచ్చారు. 2012 ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండో విడతగా 24 మండలాలకు చెందిన 1.95 లక్షల మంది రైతులకు రూ.206.75 కోట్లతో ఒక జాబితా పంపగా, 14 వేల మంది రైతులకు సరిపడా రూ.14.39 కోట్లతో మరొక జాబితా పంపారు. ప్రస్తుతానికి ఈ రెండింటికీ అనుమతి ఇచ్చారు. పంపిన నాలుగు జాబితాల్లో ఇంకా 57 వేల మంది రైతులకు గాను రూ.31 కోట్లు విడుదల కావాల్సివుంది. అది విడుదల చేస్తారా లేదా అనేది చెప్పడం లేదు. ఇదిలా ఉండగా... 2011కు సంబంధించి విడుదల చేసిన పరిహారం వెంటనే బ్యాంకుల్లో జమ చేసే పరిస్థితి ఉండగా... 2012కు సంబంధించి విడుదల చేసిన పరిహారం బ్యాంకుల్లో వేయడానికి తొలి విడత పంపిణీ అడ్డంకిగా మారింది. తొలి విడతగా 39 మండలాల రైతులకు రూ.407.16 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో రూ.378 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కాగా మిగతాది మిస్ మ్యాచింగ్ జాబితాలో మిగిలిపోయింది. పంపిణీ చేసినది, మిస్ మ్యాచింగ్‌లో మిగిలిపోయిన పరిహారానికి బ్యాంకుల నుంచి పూర్తి స్థాయిలో వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు-యూసీలు) వస్తేకాని ట్రెజరీ అధికారులు పరిహారం విడుదల చేసే పరిస్థితి లేదు. గత నెల రోజులుగా తిరుగుతున్నా తొలి విడత యూసీలు సగం కూడా సేకరించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ యూసీల సేకరణ యుద్ధప్రాతిపదికన చేపడితే సకాలంలో రెండో విడత పరిహారం విడుదలకు మార్గం సుగమమవుతుంది. జనవరి మొదటి వారంలో పంపిణీ.. ఇన్పుట్ పరిహారం విడుదలకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం కానీ జీవో కాని రాలేదని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రేపోమాపో వచ్చినా యూసీల విషయం, బిల్లులు సిద్ధం చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే జనవరి మొదటి వారంలో బ్యాంకుల్లో జమ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆ తరువాత బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. -
వీఆర్వో, వీఆర్ఏ దరఖాస్తు రుసుం తగ్గింపు: రఘువీరా
వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు దరఖాస్తు రుసుం తగ్గించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ... ఓసీ, బీసీలకు రుసుం రూ. 500 నుంచి రూ. 300కు తగ్గించినట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు కూడా దరఖాస్తు రుసుం రూ. 300 నుంచి 150 కు తగ్గించినట్లు చెప్పారు. ఏడో విడత భూపంపిణి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు రఘువీరారెడ్డి వివరించారు. -
బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతోంది
గుంటూరు, న్యూస్‌లైన్: అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజనకు తొలి సంతకం చేస్తామని చెబుతున్న బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతిస్తామని ఆ పార్టీతో ఏకగీవ్ర తీర్మానం చేయించాలని రాష్ర్ట రెవెన్యూ శాఖ రాష్ర్ట మంత్రి ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు. గుంటూరులో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రఘువీరారెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసినా రాష్ర్ట విభజన జరగదని రఘువీరారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామంటూ పార్టీ తీర్మానం ఇచ్చిన చంద్రబాబు నేడు ఏ గడ్డపై ఆగడ్డ మాట మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను చంపమీద కొట్టాలని వ్యాఖ్యానించడం సరికాదని దిగ్విజయ్‌కు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. జగన్ డీఎన్ఏ కాంగ్రెస్‌దే అనడంలో తప్పులేదన్నారు. చంద్రబాబు సైతం ఒకప్పుడు తనలో 30 శాతం కాంగ్రెస్ పార్టీ రక్తం ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ ఫొటోతో ఉద్యమం సరికాదు... మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2009 ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బహిరంగానే అన్నారని, అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వైఎస్ ఫొటో పెట్టుకుని జగన్ సమైక్యాంధ్ర ఉద్యమం చేయటం ఏ మేరకు భావ్యమో చెప్పాలన్నారు. వెంటనే వైఎస్ ఫొటో తీసి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. విజయమ్మ సమన్యాయం చేయాలని దీక్ష చేస్తే, జగన్ సమైక్యాంధ్ర కోసం ఉద్యమం చేస్తున్నారని, అసలు వైఎస్సార్ సీపీ వైఖరేమిటే స్పష్టం చేయాలని కోరారు. తాము రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని అధిష్టానం వద్ద అనుమతి తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు తదితరులు ఉన్నారు. -
రఘువీరాకు సమైక్య సెగ
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డికి శనివారం అనంతపురంలో వైఎస్సార్సీపీ నేతల నుంచి ‘సమైక్య’ సెగ తగిలింది. ఆర్అండ్బీ అతిథి గృహంలో మంత్రి ఉన్నారని తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్‌పీరా, యువజన విభాగం నగరాధ్యక్షుడు మారుతీనాయుడుతోపాటు మహిళా నేతలు అక్కడకు చేరుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. మంత్రి బయటకు రావాలంటూ నినదించారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న సీమాంధ్ర-తెలంగాణ ప్రజలను స్వార్థ రాజకీయాల కోసం వేరు చేయాలని చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం అగ్నిగుండంలా మారితే మీరు నీతిమాలిన రాజకీయాలు చేస్తూ కూర్చుంటున్నారా అని విరుచుకుపడ్డారు. సమైక్యాంధ్రపై మీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిర్వాకంతోనే తెలంగాణ వాదం తెరపైకి వచ్చిందని మండిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన మంత్రి తాను మొదట్నుంచీ సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తూనే ఉన్నానన్నారు. ఇలాంటి కంటితుడుపు మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని నాయకులు హితవు పలికారు. స్పష్టమైన వైఖరి తెలియజేయకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. తమను కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుందని పలువురు మహిళలు మట్టి పోసి శాపనార్థాలు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని భావించి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చాంద్‌బాషా, జిలాన్ బాషా, బండిపరుశురాం, మారుతీ ప్రకాష్, శ్రీదేవి, దేవి, కదిరి నిర్మల, రాజేశ్వరి, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. మంత్రిపై మండిపడ్డ ఎస్కేయూ జేఏసీ నేతలు మంత్రి రఘువీరారెడ్డిని ఎస్కేయూ జేఏసీ నాయకులు ఫ్రొఫెసర్ సదాశివరెడ్డి, రాజేశ్వర్‌రావు తదితరులు నిలదీశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు వెన్నంటి ఉండాల్సింది పోయి, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ మంత్రిపై మండిపడ్డారు. వీరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుందుర్పిలో వైఎస్సార్ సీపీ నేతలు, సమైక్యవాదుల ముందస్తు అరెస్ట్ కుందుర్పి మండల కేంద్రంలో మంత్రి రఘువీరారెడ్డికి ‘సమైక్య’ సెగ తగలకుండా, ‘రచ్చబండ’కు ఆటంకం కలగకుండా పోలీసులు శనివారం ఉదయం ఆరు గంటలకే వైఎస్సార్సీపీ నేతలను, సమైక్యవాదులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేత ఇ.రాము, స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.టి.రాము, ఎస్సీ సెల్ నాయకులు బాబు, కేఎన్ రాజు, జేఏసీ నాయకులు కే,క్రిష్టమూర్తి, మల్లికార్జున, కరిగానిపల్లి మల్లికార్జున తదితరులు ఉన్నారు.‘రచ్చబండ’ ముగిసిన తర్వాత వారిని పోలీసులు వదిలిపెట్టారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
ధర్మవరంటౌన్, న్యూస్‌లైన్: అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి పేర్కొన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో జిల్లాలో 7లక్షల రేషన్‌కార్డులు ఉండగా, తాము అధికారం చేపట్టినప్పటి నుంచి 11.5 లక్షల రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. గతంలో 97వేల పింఛన్లు ఉండగా, ప్రస్తుతం తాము 5.19 లక్షల పించన్లు ఇస్తున్నామని, 6లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లయ్యేవరకు వారికి అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరించేలా బంగారు తల్లి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు, రైతులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అనంతరం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 30వేల రేషన్‌కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం పట్టణంలోని 15 నుంచి 30వ వార్డులకు సంబందించిన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, మెప్మా పీడీ నీలకంఠారెడ్డి, ధర్మవరం ఆర్డీఓ నాగరాజు, తహసీల్దార్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఎంపీడీఓ భాస్కరరెడ్డిలతోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి, ఎమ్మెల్యేకు సమైక్య సెగ
కదిరి/అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాలకు సమైక్య సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం కదిరిలో కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి సోదరుడు నవీన్‌కుమార్‌రెడ్డి వివాహానికి మంత్రి రఘువీరా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి బయటకు రాగానే జేఏసీ నాయకులు జేవీ రమణ, వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు మంత్రిని అడ్డుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీంతో తాను కూడా సమైక్యవాదినేనని, అయితే బాధ్యత గల హోదాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రానున్న ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు కాదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దీంతో విభజనను అడ్డుకోవడంలో సీమాంధ్ర మంత్రులు విఫలమయ్యారని, వారిలో మీరు కూడా ఒకరని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి మంత్రిని కలిసి సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. నగరంలో వాగ్వాదం.. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ‘రాయల తెలంగాణ’ అంశంపై మీడియా సమావేశం నిర్వహించి బయటకు వస్తున్న డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాను ఎస్కేయూ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. ఈ క్రమంలో ప్రెస్‌క్లబ్‌లోని స్టాండ్ విరిగిపోయింది. ఈ సందర్భంగా కొట్రికెకు, ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, విద్యార్థి జేఏసీ నేతలు పరశురాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ సందర్భంలో సహనం కోల్పోయిన కొట్రికె.. మీడియా సమక్షంలోనే పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్దలకు ఏ మాత్రం తెలీకుండా కేంద్రం తెలంగాణ ప్రకటన చేసి మోసం చేసిందని కొట్రికె చెప్పగానే.. వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. దీంతో తాను ఇప్పటికే రాజీనామా చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహంతోనే డీసీసీ కార్యాలయంలో కాకుండా ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించానన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ పార్టీ ముందుకొచ్చినా పూర్తి మద్దతిస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనతో మాట్లాడానని, సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న జగన్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదలి వస్తే చంద్రబాబుకు కూడా మద్దతిస్తానన్నారు. అనంతరం ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అందులో అన్ని పార్టీలు సమైక్యాంధ్ర తీర్మాణం చేయాలని సదాశివరెడ్డి చెప్పడంతో అందుకు ఎమ్మెల్యే సరేనన్నారు. కొట్రికెను అడ్డుకున్న వారిలో జేఏసీ నేతలు పులిరాజు,వెంకటేష్, లక్ష్మినారాయణ, సోమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
ఘనంగా ఎంపీ నిమ్మల తనయుడి వివాహం
గోరంట్ల, న్యూస్‌లైన్: హిందూపురం పార్లమెంట్ సభ్యుడు నిమ్మల కిష్టప్ప తనయుడు నిమ్మల అంబరీష్ వివాహం గోరంట్లలో గురువారం వైభవంగా నిర్వహించారు. వివాహ వేడుకలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆయన తనయుడు నారా లోకేష్, రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి ఎన్.రఘువీరారెడ్డి, ఎంపీలు అనంత వెంకటరామిరెడ్డి, నామా నాగేశ్వరరావు, సుజనచౌదరి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ శివప్రసాద్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, అబ్దుల్ఘనీ, ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు, పార్టీ నేతలు వర్లరామయ్య, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, మహాలక్ష్మి శ్రీనివాస్, కేటీ శ్రీధర్, అంబిక లక్ష్మినారాయణ పాల్గొన్నారు. చంద్రబాబుకు సమైక్య సెగ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అనంతపురం జిల్లా గోరంట్లలో గురువారం సమైక్య సెగ తగిలింది. ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు అంబరీష్ దంపతులను ఆశీర్వదించి పక్కకు రాగానే.. సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు అక్కడికి చేరుకొని సమైక్య నినాదాలు చేశారు. వాహనంలో ఎక్కి కూర్చొని వెళ్లబోగా చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని వారించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని చంద్రబాబుకు సమైక్యవాదులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ప్రముఖ పురోహితుడు, మాజీ డీజీపీ అరవిందరావు సమీప బంధువు స్వామి తారానాథ్.. చంద్రబాబును కలిసి రాష్ట్ర ప్రజల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ‘ప్రజలందరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా ఉంచే శక్తి మీకుందని భావిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి’ అంటూ విన్నవించారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తున్నమంత్రి రఘువీరా కాన్వాయ్‌ని కూడా సమైక్యవాదులు అ డ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల సహాయం తో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
భారీ వర్షాలకు 10 మంది మృతి: ప్రభుత్వం
హైదరాబాద్: భారీ వర్షాలకు రాష్ట్రంలో 10 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని రాష్ట్ర రెవెన్యు మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ప్రకటించారు. 300 ఇళ్లు కూలిపోయాయని వెల్లడించారు. 19 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయడానికి కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. అధికారుల సూచనలకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారీ వర్షాలతో కుదేలయిన శ్రీకాకుళం జిల్లాకు నాలుగు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను ప్రభుత్వం పంపింది. -
74 వేల మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు
టెక్కలి రూరల్, న్యూస్‌లైన్: పై-లీన్ తుపాను ప్రభావాన్ని జిల్లాలో సమర్ధంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్తి నష్టాలను పక్కన పెడితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. తుపాను ప్రభావిత తీర గ్రామాలకు చెందిన సుమారు 74 వేల మత్స్యకార కుటుంబాలను నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తుపాన్ నష్టాలను పారదర్శకంగా అంచనా వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 2014 ఎన్నికల వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు బాలరా జు, గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. నష్టపరిహారం అందిస్తాం.. సోంపేట(కంచిలి): తుపాను వల్ల నష్టపోయినవారికి పరిహారం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం హామీ ఇచ్చింది. తుపాను బాధిత గ్రామాలైన బారువ కొత్తూరు, వాడపాలెం, కవిటి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మంత్రుల బృందం పర్యటించింది. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. బోట్లు, వలలు సముద్రంలో కొట్టుకుపోవటం, చిరిగిపోవటంతో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల్లో నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు వాపోయారు. కంటి తుడుపు చర్యగా వచ్చి పరామర్శించి వెళ్లిపోవటం సరికాదని కొందరు మహిళలు మంత్రుల్ని నిలదీశారు. ప్రభుత్వ స్పందన బాగోలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇంతటి నష్టం జరగటం బాధాకరమేనని, తొందర్లో సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్, గంటా శ్రీనివాస్, బాలరాజు పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్.దాస్ తదితరులు పాల్గొన్నారు.