హైదరాబాద్ సిటీ: కాంగ్రెస్ తరపున మీడియాతో మాట్లాడేందుకు 18 మందితో కూడిన ప్రతినిధుల జాబితాను పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సోమవారం విడుదల చేశారు. జాబితాలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మాజీ మంత్రులు పసుపులేటి బాలరాజు, సాకే శైలజానాథ్, కొండ్రు మురళీమోహన్, పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం, ఆనం వివేకానందరెడ్డి, ఎమ్మెల్సీ చెంగల్ రాయుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఉన్నారు.
అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్.తులసిరెడ్డి, తూర్పు గోదావరి, చిత్తూరు పీసీసీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, కంచన వేణుగోపాల్‌రెడ్డి, విజయవాడ, గుంటూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాది విష్ణువర్ధన్‌రావు, షేక్ మస్తాన్ వలి, మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, పీసీసీ కిసాన్, ఎస్సీ సెల్ చైర్మన్లు కె.రవిచంద్రారెడ్డి, సీహెచ్ సుందరరామ శర్మలను ఈ కమిటీలో వేశారు.
కాంగ్రెస్ తరపున మీడియాతో మాట్లాడేది వీరే
Published Mon, Jul 13 2015 11:52 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement
Advertisement