ప్రత్యామ్నాయం చూపకుండా అనాలోచితంగా పాత పెద్ద నోట్లు రద్దు చేశారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో సామాన్యులు కష్టాలు పడుతున్నారని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాత పెద్ద నోట్లను రద్దు చేసిందని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని గుర్తు చేశారు.