⇒ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
అమరావతిః స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నేతలకు శిక్షణ పేరుతో ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలపై మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యం అని హోదా కోసం మహానాడులో తీర్మానాలు చేసిన చంద్రబాబుకు హోదా తెచ్చే శక్తిలేక, తన సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేసేందుకు ప్యాకేజీ జపం చేస్తున్నారన్నారని విమర్శించారు.
శిక్షణా తరగతులు అంటూ ప్యాకేజీపై ప్రచారం చేయాలని తెలుగు తమ్ముళ్లకు చెప్పడం వెనుక ఆయనకు ఉన్న భయమేమిటో అర్థం అవుతోందన్నారు. హోదా విషయంలో తన రక్తం మరిగిపోతుందని, ఎంతటి పోరాటానికైనా సిద్ధం అన్న చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించడంలో తన సొంత ప్రయోజనాలకే పెద్దపీఠ వేశారని తేటతెల్లమైందన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతకు భయపడే టీడీపీ నాయకులకు శిక్షణ పేరుతో ప్యాకేజీ పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. నాడు హోదా...నేడు ప్యాకేజీ అంటున్న చంద్రబాబును ప్రజలు గమనిస్తున్నారని ఇందులో భాగంగానే ప్రజల వద్దకే కాంగ్రెస్ అంటూ తిరుపతిలో ప్రజా బ్యాలెట్ కార్యక్రమం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. హోదా కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.
'చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది'
Published Thu, Oct 6 2016 7:36 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement