కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతపురంలో ఎస్ బీఐ ఎదుట ఆయన ధర్నాకు దిగారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.