
'చంద్రబాబు గొప్పలు హాస్యాస్పదం'
కడప: నదుల అనుసంధానంపై చంద్రబాబు, ఆయన బృందం గొప్పులు చెప్పుకోవడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడేళ్ల క్రితమే కృష్ణా నీటిని హాంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా పెన్నాకు అనుసంధానం చేశామని గుర్తు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ద్వారా నదులను అనుసంధానం చేస్తే అది నిజమైన అనుసంధానం అని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నవన్నీ తాత్కాలిక పనులేనని అన్నారు. చంద్రబాబుది అంతా ఇంకుగుంతల జాతకమని, ఆయన ఎప్పుడూ ప్రాజెక్టులకు వ్యతిరేమని రఘువీరా పేర్కొన్నారు.