rivers connectivity
-
ఈ చికిత్స సరైనదేనా?
ఆలోచన మంచిదే. కానీ, ఆచరణలో చిత్తశుద్ధి చూపితే మరీ మంచిది. దేశంలోని 13 ప్రధాన నదుల ‘పునరుజ్జీవనం’ కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన ప్రణాళిక, చేసిన ప్రకటన చూశాక నిపుణులు చేస్తున్న వ్యాఖ్య ఇది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో 57.45 శాతం మేర భాగాన్ని చుట్టి వచ్చే 13 ప్రధాన నదులు, వాటి 202 ఉపనదుల జలాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ చెబుతున్నట్టే అంతా జరిగితే, పెను మార్పు వస్తుంది. దేశంలో అటవీ విస్తీర్ణం 7,417 చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుంది. కాకపోతే, నదుల క్షీణత వెనుక ఉన్న అసలు కారణాలను వదిలేసి, అటవీ పెంపకమంటూ కొత్త సీసాలో పాత సారాగా ఈ ప్రతిపాదన తెచ్చారా? కాగితాల మీది పదును సర్కారు కార్యాచరణలోనూ కనపడుతుందా? గత రెండు, మూడు దశాబ్దాలుగా వ్యవసాయంలో నీటి దుర్వినియోగం, పెచ్చుమీరిన పట్టణీ కరణతో నీటి కోసం ఒత్తిడి పెరిగింది. నదీగర్భాలు ఎండిపోతున్నాయి. సహజసిద్ధంగా సాగాల్సిన భూగర్భ జలమట్టాల పెంపునకు గండిపడుతోంది. భూసారం క్షీణిస్తోంది. వర్షపునీటితో నిండు కుండలు కావాల్సిన నదులు ఎండమావులవుతున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న జనాభాతో దేశంలో సగటు నీటి లభ్యత బాగా తగ్గిపోతోంది. నదుల రాష్ట్రంగా పేరున్న పంజాబ్‌లోని దక్షిణ ప్రాంతం సహా అనేక రాష్ట్రాలు ఎడారులయ్యే ప్రమాదంలో పడ్డాం. సారవంతమైన భూములనూ, భారీ పంట దిగుబడులనూ కోల్పోయే పరిస్థితి వచ్చింది. దానికి పరిష్కారంగా ప్రభుత్వం చెబుతున్న నదుల పునరుజ్జీవనం సుమారు రూ. 19,300 కోట్ల పైగా అంచనా వ్యయంతో కూడిన పంచవర్ష ప్రణాళిక. 23 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించిన నదులకు కాయకల్ప చికిత్స. హిమాలయ ప్రాంతంలోని ఝీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్, యమున, బ్రహ్మపుత్ర, ఎండిపోయిన నదుల విభాగంలో లూనీ, దక్కన్ భూభాగంలోని కృష్ణా, గోదావరి, కావేరి, నర్మద, మహానది – ఇలా మొత్తం 13 నదులు ఈ భారీ పునరుజ్జీవన ప్రణాళికలో ఉన్నాయి. ఈ నదులకు కొత్త జవజీవాలు కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలతో వివరణాత్మకమైన ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లను డెహ్రాడూన్‌లోని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్’ (ఐసీఎఫ్ఆర్ఈ) సిద్ధం చేసింది. ప్రాథమికంగా నదీ తీరం వెంట చెట్లను పెంచడం ద్వారా నదీజలాలకు పునరుత్తేజం తేవాలన్నది ఆలోచన. అలా పెంచే నదీ తీరస్థ అడవులన్నీ ‘సహజసిద్ధమైన బఫర్లు’గా, ‘బయోఫిల్టర్లు’గా నదుల స్వీయ శుద్ధీకరణకు తోడ్పడతాయని భావన. గతం గమనిస్తే – 2030 నాటికల్లా 50 లక్షల హెక్టార్ల మేర క్షీణించిన భూభాగాన్ని పునరుద్ధరిస్తామంటూ ‘బాన్ ఛాలెంజ్’ కింద 2015లో మన దేశం వాగ్దానం చేసింది. తాజాగా నదీజలాల పునరుజ్జీవన ప్రణాళికతో ఆ లక్ష్యానికి చేరువ కావచ్చని ప్రభుత్వ వర్గాల ఆశాభావం. అందుకు తగ్గట్లే, కొత్తగా పెంచే ఈ నదీ తీరస్థ అడవులు ‘కార్బన్ సింక్’లుగా పదేళ్ళలో, ఆపైన ఇరవై ఏళ్ళలో ఎన్ని మిలియన్ టన్నుల మేరకు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయనే లెక్క కూడా కట్టారు. కేవలం కర్బన వాయువులను పీల్చుకోవడానికే కాక, భూగర్భ నీటిమట్టం పెరగడానికీ, భూక్షయాన్ని అరికట్టడానికీ ఈ నదుల పునరుజ్జీవన ప్రాజెక్ట్ తోడ్పడుతుందని అంచనా. ఒక రకంగా 2015–16లో ప్రయోగాత్మకంగా చేపట్టిన గంగా నది పునరుజ్జీవన పథకం లాంటిదే ఈ సరికొత్త 13 నదుల ప్రణాళిక! ఆర్భాటంగా మొదలైన ఆ ప్రభుత్వ పథకం ఏ మేరకు వాస్తవంగా సఫలమైందో చూస్తూనే ఉన్నాం. ఎనిమిదేళ్ళ తర్వాత ఇప్పటికీ గంగా నదీజలాల స్వచ్ఛత మాటలకే పరిమితమైంది. ఇప్పుడు ఈ పునరుజ్జీవన పథకమూ అదే బాటలో నడిస్తే లాభం లేదు. నదుల పునరుజ్జీవన ప్రణాళికకు వాతావరణ మార్పుల లాంటి అడ్డంకులూ ఉన్నాయి. సరైన రీతిలో మొక్కల పెంపకం లాంటి వివిధ అంశాలపై ప్రాజెక్ట్ సఫలత ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా, నాటే చెట్ల వయసు, పరిమాణం లాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనవాటిని నాటితేనే ఫలితం. నదీ తీరం వెంట మొక్కలు నాటడాని కన్నా ముందుగా భూసారం, నేలలోని తడిని పరి రక్షించే చర్యలు చేపట్టడం కీలకం. నదీ తీరస్థ అటవీ పెంపకం పేరిట స్థానిక పర్యావరణాన్ని దెబ్బ తీయకూడదు. ఆ ప్రాంతాలకే ప్రత్యేకమైన చెట్టూచేమా, పొదలు, తుప్పలను కాపాడుకోవాలి. నిజానికి, నదీ జలాల సహజ ప్రవాహాలను అడ్డుకుంటూ అనేక చిన్నా పెద్ద ఆనకట్టల నిర్మాణం, పారిశ్రామిక కాలుష్యం, వాతావరణ మార్పులతో హిమానీనదాలు కరిగిపోవడం, భూగర్భజలాల దుర్వినియోగం – ఇలా నదుల క్షీణతకు అసలు కారణాలు అనేకం. వాటిని పరిష్కరించే ఆలోచన చేయకుండా, పిడుగుకీ బియ్యానికీ ఒకే మంత్రంలాగా నదీతీరంలో మొక్కలు నాటితే చాలనుకోవడం ఏమిటి? పర్యావరణవేత్తలు వేస్తున్న ప్రశ్న ఇదే. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడం మొదలు నదుల ఆయకట్టులోని అటవీ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం లాంటివి నదులకు కొత్త జవజీవాలను ఇస్తాయి. అవేమీ చేయకుండా, తప్పనిసరి అటవీ పెంపక చట్టం (క్యాంపా) కింద హిమాచల్‌లో, సత్లెజ్ ఎగువ ఆయకట్టులో చెట్లు పెంచితే, ఆ ఆలోచన విఫలమైంది. ఆ ప్రాంత భూభాగ సహజ స్వభావాన్ని దెబ్బతీసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే కష్టం. అన్ని సమస్యలకూ పరిష్కారం ఒకటే అనుకుంటే నష్టం. ఎక్కడో గాయానికి, మరెక్కడో మందు పూస్తే సరిపోదని గ్రహించి, పాలకులు చిత్తశుద్ధితో నదీజలాల పునరుజ్జీవన చర్యలు చేపట్టాలి. -
కార్పొరేట్ల కోసమే నదుల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నదులను తమ అధీనంలోకి తీసుకోవడానికే కేంద్రం నదుల అనుసంధానానికి కుట్రలు చేస్తోందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే పురస్కార గ్రహీత రాజేందర్‌సింగ్ ధ్వజమెత్తారు. కార్పొరేట్ కంపెనీల జేబుల్లోకి డబ్బులు నింపడం, అవినీతి, అక్రమాల కోసమే కేంద్రం నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టిందని మండిపడ్డారు. వాటర్ ప్రైవేటీకరణ, కమర్షియలైజేషన్, మార్కెటైజేషన్కు కుట్ర పన్ను తోందని ఆరోపించారు. నదుల అనుసంధానంతో దేశానికి చెడు జరుగుతుందని, పర్యావరణ సమతు ల్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని, అన్ని రకాలుగా ఇది ప్రజలకు తీరని నష్టాన్ని కలిగి స్తుందన్నారు. దేశంలో ఏ ఒక్క సీఎం కూడా తమ వాటా నీటిని ఇతర రాష్ట్రాలకు ఇచ్చేందుకు సిద్ధం గా లేరని గుర్తు చేశారు. జలసౌధలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇండియన్ పెని న్సులార్ రివర్ బేసిన్ కౌన్సిల్, ఇండియన్ హిమాల యన్ రివర్ బేసిన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో నదులపై జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. నీటి మేనిఫెస్టోను సదస్సులో విడుదల చేస్తామన్నారు. కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇతర రాష్ట్రాల సీఎంలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాల్సి ఉందని రాజేందర్ అన్నారు. ఇక్కడ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలు ఇతర అన్ని రాష్ట్రాలకు అనుసరణీయమని చెప్పారు. రాష్ట్రంలో జల వర్సిటీ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ‘మిషన్ భగీరథ ద్వారా ప్రతీ గ్రామంలో పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయడం హర్షణీయం. తెలంగాణలో ఎక్కడా ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు. అందుకే జాతీయ సదస్సు కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేశాం. నదులపై అవగాహన కల్పించడానికి చేపడుతున్న ఉద్యమంలో ప్రజలూ భాగస్వాములు కావాలి’ అని ఆయన చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని, మూడు చెరువుల నుంచి ఆలయానికి నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ అని కితాబునిచ్చారు. కృష్ణా, గోదావరి నదులను స్వాధీనంచేసుకోవానికి కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు సాగునీటి కోసం రూ.3–4 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. వర్షం నీటిని ఒడిసి పట్టుకుంటే ఎకరాకు రూ.5వేల ఖర్చు మాత్రమే అవుతుందని ఉదహరించారు. -
నదుల అనుసంధానానికి తొలి అడుగు
(రామగోపాలరెడ్డి ఆలమూరు – సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టేందుకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన రెండు దశాబ్దాల తర్వాత కేంద్రం తొలి అడుగు వేసింది. కెన్ – బెట్వా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది. ఈ రెండు నదుల అనుసంధానికి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వర్చువల్ విధానంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ నదుల అనుసంధానికి రూ.37,611 కోట్లు వ్యయం అవుతుంది. మధ్యప్రదేశ్‌కు 82 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 8.11 లక్షల హెక్టార్లు.. ఉత్తరప్రదేశ్‌కు 59.98 టీఎంసీలను సరఫరా చేయడం ద్వారా 2.51 లక్షల హెక్టార్లకు నీళ్లందించనున్నారు. రెండు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా 62 లక్షల మందికి తాగు నీటిని అందించనున్నారు. 103 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడంలో భాగంగా 90 శాతం నిధులను వ్యయం చేసేందుకు కేంద్రం అంగీకరించింది. మిగతా పది శాతం నిధులను ఆయకట్టు ఆధారంగా దామాషా పద్దతిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు భరిస్తాయి. ఎనిమిదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరీ అనుసంధానాన్ని చేపట్టడంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. కావేరికి గో‘దారి’పై సమాలోచనలు ► గోదావరి – కృష్ణా(నాగార్జునసాగర్) – పెన్నా(సోమశిల) – గ్రాండ్ ఆనకట్ట(కావేరీ) అనుసంధానానికి 2019లో ఎన్‌డబ్ల్యూడీఏ రెండు ప్రతిపాదనలు చేసింది. ► తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇచ్చంపల్లి వద్ద మిగులుగా ఉన్న 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో కావేరికి తరలించాలని సూచించింది. ఇందులో ప్రవాహ నష్టాలు పోను ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. ► ఉమ్మడి వరంగల్ జిల్లా జానంపేట వద్ద నుంచి కావేరికి మొదటి దశలో 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని సూచించింది. ఇందులో ఏపీకి 108, తెలంగాణకు 39, తమిళనాడుకు 83 టీఎంసీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. దీనిపై ప్రయోజనం పొందే రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. ► గతేడాది జూలై 12న ఎన్‌డబ్ల్యూడీఏ సర్వసభ్య సమావేశంలో.. జూలై 28న సంప్రదింపుల సమావేశంలో గోదావరి – కావేరి అనుసంధానం రెండు ప్రతిపాదనలపై బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. దీంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ అంశాన్ని టాస్క్‌ఫోర్స్ కమిటీకి పంపింది. గత నెల 25న కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇచ్చంపల్లి నుంచి గోదావరి – కావేరీ అనుసంధానాన్ని చేపట్టాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దిశా నిర్దేశం చేసింది. ► తమ అవసరాలు తీర్చాకే ఇతర రాష్ట్రాలకు గోదావరి జలాలను తరలించాలని ఏపీ, తెలంగాణలు స్పష్టం చేస్తుండగా.. తమ వాటా జలాలను వాడుకోవడానికి అంగీకరించబోమని ఛత్తీస్‌గఢ్ తెగేసి చెబుతోంది. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ కర్ణాటక, మహారాష్ట్ర పట్టుపడుతున్నాయి. ఇదే రీతిలో కావేరీ జలాల్లో అదనపు వాటా కావాలంటే కేరళ, కర్ణాటకలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను ఒప్పించడం కేంద్రానికి సవాలే. ఐదు అడ్డంకులు.. ► నదుల అనుసంధానంపై ఇప్పటి వరకు స్పెషల్ కమిటీ 18 సార్లు, సబ్ కమిటీ (కాంప్రహెన్షివ్ ఎవల్యూషన్) ఎనిమిది సార్లు, సబ్ కమిటీ (నదుల అధ్యయనం) 15 సార్లు, సంప్రదింపుల కోసం ఏర్పాటైన సబ్ కమిటీ మూడు సార్లు, టాస్క్‌ఫోర్స్ 13 సార్లు, న్యాయపరమైన అంశాల కమిటీ పది సార్లు, ఆర్థిక అంశాల కమిటీ 13 సార్లు సమావేశాలను నిర్వహించింది. ► ఈ సమావేశాల్లో కేవలం కెన్ – బెట్వా నదుల అనుసంధానంపై మాత్రం రాష్ట్రాలను ఒప్పించగలిగింది. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఒక బేసిన్ (నదీ పరీవాహక ప్రాంతం) నుంచి మరో బేసిన్‌కు మళ్లించే నీటిలో వాటా కోసం ఆ బేసిన్‌లోని ఎగువ రాష్ట్రాలు పట్టుబడుతుండటం, బేసిన్లో మిగులు జలాలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రాలు ఆ విషయాన్ని అంగీకరించకపోవడం జరుగుతోంది. ► దీనికితోడు నదీ జలాలను పంపిణీ చేస్తూ ట్రిబ్యునల్లు ఇచ్చిన తీర్పులు, అనుసంధానం వ్యయంలో 90 శాతం కేంద్రమే భరించాలని రాష్ట్రాలు ఒత్తిడి తెస్తుండటం లాంటి అంశాల కారణంగా దేశంలో నదుల అనుసంధానం కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని ఎన్‌డబ్ల్యూడీఏ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రూ.5.60 లక్షల కోట్ల వ్యయం ► దేశంలో ఏటా కురిసే వర్షపాతం పరిమాణం నాలుగు వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు. (1,41,260 టీఎంసీలు). గంగా, బ్రహ్మపుత్రా, గోదావరి, మహానది తదితర నదుల ద్వారా ఏటా వేలాది టీఎంసీల జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ► హిమాలయ, ద్వీపకల్పంలోని 37 నదులను అనుసంధానం చేయడం ద్వారా 6,144.81 టీఎంసీలను మళ్లించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 14 లింక్‌ల ద్వారా హిమాలయ నదులను, 16 లింక్‌ల ద్వారా ద్వీపకల్ప నదులను అనుసంధానం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ► ఈ నదుల అనుసంధానం వల్ల కొత్తగా 8.65 కోట్ల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 34 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. జల రవాణాకు ఊతమిస్తుంది. ఈ పనులు చేపట్టడానికి 2002 – 03 ధరల ప్రకారం రూ.5.60 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ధరల ప్రకారం నదుల అనుసంధానానికి రూ.పది లక్షల కోట్ల మేర అవసరం అవుతాయని అంచనా. ► నదుల అనుసంధానానికి వెచ్చించే వ్యయం.. ఆయకట్టులో ఉత్పత్తయ్యే పంటలపై వేసే పన్నులు, జల విద్యుత్ ఉత్పత్తి తదితర రూపాల్లో కేవలం పదేళ్లలో ఖజానాకు ఆ మొత్తం వెనక్కి వస్తుందని ఆర్థిక నిపుణులు తేల్చిచెప్పారు. ► దేశంలో దుర్భిక్షాన్ని తరిమికొట్టడానికి.. పేదరికాన్ని నిర్మూలించడానికి నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని.. ఆ పనులు చేపట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ 2002లో దాఖలైన రిట్ పిటిషన్‌పై 2002 ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నదుల అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. ► సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 జూలై 14న నదుల అనుసంధానాన్ని చేపట్టడానికి కేంద్ర కేబినెట్ అంగీకరించింది. ఇందుకోసం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 సెప్టెంబరు 23న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి గో‘దారి’!
సాక్షి, అమరావతి: గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి అనుసంధానానికి మొదట చేసిన ప్రతిపాదనకే ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) మొగ్గు చూపింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్ (కృష్ణా)కు, అక్కడి నుంచి సోమశిల (పెన్నా), అక్కడి నుంచి గ్రాండ్ ఆనకట్ట (కావేరీ)కు తరలించడం ద్వారా నాలుగు నదులను అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ఇచ్చంపల్లి వద్ద మిగులుగా 175 టీఎంసీలు, ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్‌గఢ్ వినియోగించుకోని 72 టీఎంసీలు.. వెరసి 247 టీఎంసీల గోదావరి జలాలను మొదటి దశలో తరలించాలని సూచించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 81, తెలంగాణకు 66, తమిళనాడుకు 83 టీఎంసీలు కేటాయించాలని పేర్కొంది. మహానది–గోదావరిని అనుసంధానం చేశాక.. మహానది నుంచి గోదావరికి తరలించిన జలాలను రెండో దశలో కావేరికి తీసుకెళ్లాలని పేర్కొంది. కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఈ నెల 25న ఢిల్లీలో భేటీ కానుంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధ్యక్షులు ఎస్కే హల్దార్, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్, ఎనిమిది మంది సభ్యులు, పది మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. ఇతర నదుల అనుసంధానంతో పాటు ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ భేటీలో వెల్లడైన అంశాల ఆధారంగా మార్చి 4న తిరుపతిలో నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సులో గోదావరి–కావేరీ అనుసంధానంపై భాగస్వామ్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, కె.పళనిస్వామి, యడియూరప్ప, పి.విజయన్‌లతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంప్రదింపులు జరపనున్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే, ఆ రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోందని సీడబ్ల్యూసీ అధికారవర్గాలు వెల్లడించాయి. అయితే మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు వాడుకోకపోవడం వల్లే గోదావరి నికర జలాల్లో మిగులు జలాలు కన్పిస్తున్నాయని, ఆ రాష్ట్రాలు వాటా జలాలను ఉపయోగించుకుంటే మిగులు జలాలు ఉండే అవకాశం లేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వరద జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి ట్రిబ్యునల్ సంపూర్ణ హక్కు కల్పించిన నేపథ్యంలో.. గోదావరి నుంచి మళ్లించే నీటిలో సింహభాగం ఏపీకే కేటాయించాలని సూచిస్తున్నారు. ఆ మూడు ప్రతిపాదనలు వెనక్కి గోదావరి–కావేరి నదుల అనుసంధానానికి ఎన్‌డబ్ల్యూడీఏ 2019లో మూడు ప్రతిపాదనలు చేసింది. జానంపల్లి, దమ్ముగూడెం, అకినేపల్లిల నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించడం ద్వారా అనుసంధానం చేయాలని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై భాగస్వామ్య రాష్ట్రాలు సానుకూలంగా స్పందించలేదు. గోదావరిలో నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాక ఈ అనుసంధానంపై చర్చించాలని సూచించాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చేసిన మూడు ప్రతిపాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ పక్కన పెట్టింది. 2002లో మొదట చేసిన ప్రతిపాదననే మళ్లీ తెరపైకి తెచ్చింది. అయితే గోదావరి జలాలను ఇతర బేసిన్లకు మళ్లిస్తే.. కృష్ణా, కావేరి జలాల్లో అదనపు వాటా కేటాయించాలని కర్ణాటక, కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీటిపై ఈనెల 25న టాస్క్‌ఫోర్స్ కమిటీ చర్చించి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు నివేదిక ఇవ్వనుంది. మార్చి 4న తిరుపతిలో జరగనున్న సదస్సులో ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీసుకోనున్నారు. నీటి లభ్యతపై స్పష్టమైన లెక్క తేల్చాకే మిగులు జలాలను మళ్లించాలని ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశాలు స్పష్టం చేసిన నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాలను కేంద్రం ఎలా ఒప్పిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. చదవండి: ముక్కు మూసుకున్న అధికారులు: ‘నారాయణ’పై సీరియస్ మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం -
అనుసంధానంపై త్వరగా తేల్చండి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి – కృష్ణా – కావేరి నదుల అనుసంధానంపై తాము సూచించిన ప్రతి పాదనలను పరిశీలించి త్వరగా తమకు నివేదిక ఇవ్వాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. జానంపేట్ మీదుగా గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించి అటు నుంచి కావేరికి తీసుకెళ్లే ప్రతిపాదనపై అభ్యంతరాలు, పరిశీలనను త్వరగా తెలపాలని సూచించింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ ఖటారియా అధ్యక్షతన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) 17వ ప్రత్యేక కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీ ఉపేంద్రప్రతాప్ సింగ్, ఎన్‌డబ్ల్యూడీఏ డీజీ భూపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ అధికారులు, ఇంజనీర్లు సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి – కృష్ణా – కావేరి (గ్రాండ్ ఆనికట్) అనుసంధానం ప్రాజెక్టును తొలి ప్రాధాన్యతగా చేపట్టాలని తమిళనాడు అధికారులు కేంద్రాన్ని కోరారు. గోదావరితో అనుసంధానం చేస్తే తప్ప తమ రాష్ట్ర నీటి కష్టాలు తీరవని స్పష్టం చేశారు. గోదావరి నీటిని జానంపేట మీదుగా కృష్ణాకు, అటుగా తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్‌కు 247 టీఎంసీల నీటిని తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, దీన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియతో తెలంగాణలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు లబ్ధి కలుగుతుందని, ఈ దృష్ట్యా ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ వైఖరి వెంట నే చెప్పాలని కేంద్రమంత్రి రాష్ట్ర ఇంజనీర్లకు సూచించారు. కేంద్ర సూచనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రాష్ట్రం నుంచి సమావేశంలో పాల్గొన్న అంతర్రాష్ట్ర జల విభాగ ఎస్ఈ నరహరిబాబు, డిప్యూటీ డైరెక్టర్ కె. ప్రసాద్ తెలిపారు. ఏపీ అవసరాలు తీరాకే తమిళనాడుకు తమ రాష్ట్రం గోదావరి, కృష్ణాలో కేటాయింపుల మేర నీటిని ఉపయోగించుకున్న తర్వాత ఇంకా నీళ్లు మిగిలితేనే తమిళనాడుకు నీటిని తరలించాలని ఏపీ వాదించింది. ఈమేరకు ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రతిపాదన అందజేసింది. గోదావరి, కృష్ణాలో కలిపి తమ కేటాయింపుల మేరకు నీటిని ఉపయోగించుకుంటామని ఇందుకోసం గోదావరి – కృష్ణా అనుసంధానం ప్రాజెక్టు చేపడుతామని నివేదించింది. తమ అవసరాలు తీరాక పెన్నా బేసిన్ మీదుగా గ్రాండ్ ఆనికట్‌కి నీటిని తరలిస్తే తమకేమి అభ్యంతరం లేదని చెప్పింది. ఇంద్రావతి నీళ్లపై ఛత్తీస్‌గఢ్ కొత్త వాదన ఇంద్రావతి నీళ్లను పూర్తిగా ఉపయోగించుకుంటామని ఛత్తీస్‌గఢ్ ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రస్తావించింది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని, వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచిం చింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆ నీటిని తమ అవసరాలకు ఉపయోగించుకుంటామని చె ప్పింది. గోదావరి – కావేరి అనుసంధానం ఆమోదం తెలుపబోమని తేల్చి చెప్పింది. -
‘అకినేపల్లి’పై మాతో చర్చించండి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చేసిన ప్రతిపాదనలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో చర్చించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రాలను సంప్రదించి వారు సూచించే ప్రత్యామ్నాయాలను పరిశీలించాకే అనుసం ధానంపై తుది నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి ఇటీవల కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్‌కు లేఖ రాశారు. నదుల అనుసంధా నాన్ని తెలంగాణ స్వాగతిస్తోందని.. అనుసం ధానంపై ఖర్చు చేస్తున్న వ్యయంతో పాటు, సాగు, తాగు, పరిశ్రమలకు అవసరాలకు కలిగే ప్రయోజనంపై పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇతర ప్రాజెక్టుల నీటి లభ్యతలను 40ఏళ్ల సిరీస్ ఆధారంగా లెక్కించి అకినేపల్లి వద్ద నీటి లభ్యత విషయంలో 110 ఏళ్ల సిరీస్ ఆధారంగా లెక్కించడాన్ని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దిగువన ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందన్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదలేదీ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్‌కు 16 టీఎంసీలు విడుదల చేయాలని, సాగర్ కనీస నీటి మట్టాలను 520 మీటర్లకు ఉంచాలని కోరుతున్నా నీటి విడుదల జరగలేదని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది. -
కావేరికి దారేదీ?
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) రూపొందించిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న అకినేపల్లి–నాగార్జునసాగర్ అనుసంధానంతో తెలంగాణకు ఒనగూరే ప్రయోజనం స్వల్పమేనని నీటి పారుదల శాఖ భావిస్తోంది. మహానది మిగులు జలాలపై తేల్చకుండా, అకినేపల్లి బ్యారేజీ నిర్మాణం ముంపుపై శాస్త్రీయ అధ్యయనం చేయకుండా, రాష్ట్ర అవసరాలను గుర్తించకుండా గోదావరి నీటిని తమిళనాడుకు తరలించడం తమకేమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తోంది. దీనిపై త్వరలోనే తన అభిప్రాయాన్ని కేంద్రానికి నివేదించనుంది. మహానది నీళ్లు లేకుండా మిగులెక్కడ? మహానది–గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరిలను అనుసంధానించే ప్రక్రియను కేంద్రం మొదలు పెట్టగా.. దక్షిణాది రాష్ట్రాల నదుల్లో ఎగువన ఉన్న ఒడిశానే దీనికి అనేక అభ్యంతరాలు తెలిపింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నాయన్న లెక్క తప్పని, మహానది–గోదావరిల అసునంధానంతో తమ పరీవాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని స్పష్టం చేసింది. దీంతో వెనక్కి తగ్గిన కేంద్రం.. మహానది నుంచి ఎంతమేర మిగులు జలాలను గోదావరికి తరలిస్తారన్నది స్పష్టం చేయకుండా ప్రాణహిత, గోదావరి, ఇంద్రావతులు కలిసే ప్రాం తానికి దిగువన అకినేపల్లి నుంచి నీటిని తరలిస్తామని ప్రతిపాదన తెచ్చింది.దీనిపై తెలంగాణ నీటి పారుదల అధికారులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహానది మిగులు జలాలు ఏ మేరకు గోదావరికి వస్తా యో తెలపకుండా కేవలం గోదావరిలో మిగు లు జలాలను తరలిస్తామనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గోదావరిలో లభ్యంగా ఉన్న 954.2 టీఎంసీల నీళ్లు రాష్ట్ర అవసరాలకే సరిపోతా యని తెలంగాణ చెబుతోంది. గోదావరిలో తెలంగాణకు హక్కుగా ఉన్న నీటిలో నిర్మితమైన, నిర్మితమవుతున్న, ప్రతిపాదనల దశలో ఉన్న ప్రాజెక్టుల్తో కలిపి మొత్తంగా 684 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోనున్నారని, మిగతా 270 టీఎంసీలు మిగులు జలాలేనని ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతున్న లెక్కలను తప్పుపడుతోంది. రాష్ట్రానికి ఉన్న వాటా 954.2 టీఎంసీలకు తమ వద్ద ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికలు ఉన్నాయని స్పష్టం చేసింది. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల కింద 433.04 టీఎంసీలు వినియోగంలో ఉండగా, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులతో 475.79 టీఎంసీలు, చేపట్టనున్న ప్రాజెక్టులతో మరో 45.38 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ఉందని చెబుతోంది. మరి అలాంటప్పుడు మిగులు జలాలు ఎక్కడి నుంచి వస్తాయని అధికారులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముంపు ఎందుకు ఉండదు? ప్రస్తుత కేంద్ర ప్రతిపాదనలో భాగంగా గోదా వరి నదిపై అకినేపల్లి వద్ద 590 మిలియన్ క్యూ బిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో అంటే 20 టీఎంసీల సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. ఈ బ్యారేజీలో 12 వేల హెక్టార్లు (30 వేల ఎకరాలు) భూమి ముంపునకు గురవుతుంది. ఈ భూమి అంతా నదీ గర్భంలోనే ఉంటుంది కాబట్టి ముంపు సమస్య ఉండదని ఎన్‌డబ్ల్యూడీఏ చెబుతోంది. దీనిపై తెలంగాణ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. 16 టీఎంసీలతో మేడిగడ్డ, 6.94 టీఎంసీల తో తుపాకులగూడెం వంటి బ్యారేజీలను గోదావరిపైనే కడుతుంటే అక్కడ నదీ గర్భం తో సంబంధం లేకుండా వందల ఎకరాల భూసేకరణ అవసరం అవుతోంది. అలాంటిది 20 టీఎంసీలతో కడితే ముంపు లేదనడం ఆశ్చ ర్యంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే.. గోదావరిపైనే తెలంగాణ నిర్మిస్తున్న తుపాకుల గూడెం నుంచి ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2 కింది 7.50 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు, ఉదయ సముద్రం కింద మరో లక్ష ఎకరాలు, ఏఎమ్మార్పీ ద్వారా 80 వేలు, నాగార్జునసాగర్ కింద నల్లగొండ జిల్లాలోని 3.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అం దించే అవకాశముందని రాష్ట్ర అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. అలాకాకుండా తెలంగాణ, ఏపీల మధ్య పొత్తు పెట్టేలా సాగ ర్కు నీటిని తరలించడం, అక్కడి నుంచి కావే రికి నీటిని తరలించడం సరికాదని పేర్కొంటు న్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాకే ప్రక్రి య మొదలుపెట్టాలని స్పష్టం చేస్తున్నారు. లభ్యతపైనా అనుమానాలు.. అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలు పోనూ 50% నీటి లభ్యత (డిపెండబులిటీ) ఆధారంగా 8,194 మిలియన్ క్యూబిక్ మీటర్లు (289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత (డిపెండబులిటీ) ఆధారంగా 12,104 మిలియన్ క్యూబిక్ మీటర్లు (427 టీఎంసీలు) మిగు లు ఉంటుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది. ఈ అంచనా కూడా తప్పుల తడకగా ఉందని, 50% నీటి లభ్యతతో పోలిస్తే 75% నీటి లభ్యత తక్కువగా ఉండాలని, కానీ ఇక్కడ తారుమారుగా చెప్పడంపైనా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘అనుసంధానం’పై అధ్యయనం అధికారులకు మంత్రి హరీశ్ ఆదేశం గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. నదుల అనుసంధానంపై కేంద్రం మొండి పట్టుదలతో ఉండటం, ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర అధ్యయనం జరిపించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు.. అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడారు. లాభనష్టాలను బేరీజు వేసి ఓ ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా గోదావరి మిగులు జలాల అంశాన్ని, ముంపును, తెలంగాణకు అనుసంధానంతో దక్కే అదనపు ప్రయోజనాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. దీంతో అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం తన పని ప్రారంభించింది. కంతనపల్లి దిగువన నీటి లభ్యత, ప్రస్తుతం చేసిన ప్రతిపాదనకు భిన్నంగా తెలంగాణకు మరింత లాభించే ప్రత్యామ్నాయాలపై చర్చలు ప్రారంభించింది. మరోవైపు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం శనివారం భేటీ కావాలని నిర్ణయించింది. పాత దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ నుంచి సాగర్ అనుసంధాన నిర్ణయాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ యావత్తూ వ్యతిరేకించిన నేపథ్యంలో.. ప్రస్తుత ప్రతిపాదనలను పూర్తిగా వ్యతిరేకిస్తుందా? లేక ప్రత్యామ్నాయాలు కోరుతుందా? వేచి చూడాల్సిందే. -
గోదావరి టూ కావేరి.. తెలంగాణ దారి
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానంపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన ఈ ప్రక్రియకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. మూడు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల్లోని వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చేలా కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించింది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని సూచించింది. దీనికి మొత్తంగా రూ.45,049 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిని (టెక్నికల్ ఫీజబులిటీ నోట్) సిద్ధం చేసింది. కొత్త అధ్యయనం.. కొంగొత్త అధ్యాయం! దక్షిణాదిలో నదుల అభివృద్ధి కోసం ద్వీపకల్ప నదుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నట్లుగా అంచనాలున్న దృష్ట్యా... ఆ నీటిని కృష్ణా, కావేరి పరీవాహకాలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం. ఇందుకోసం తొలుత తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా తప్పుపట్టాయి. దాదాపు ఏడాది పాటు మరుగున పడిన ఈ అంశం తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో తిరిగి తెరపైకి వచ్చింది. అయితే ఒడిశాలోని మణిభద్ర ప్రాజెక్టు, తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టులు నిర్మించలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీలు లభ్యతగా జలాలు ఉంటాయని లెక్కించింది. అందులో తెలంగాణ, ఏపీలు తమ ప్రాజెక్టులకు వినియోగించుకోగా.. 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని అంచనా వేసింది. దీంతో అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు నీటిని తరలించేలా ప్రణాళిక వేసింది. ఈ కాలువ పెద్దవాగు, కిన్నెరసాని, మురేడు. పాలేరు, మూసీ నదులను దాటి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అనుసంధానం ప్రతిపాదనలివీ.. ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు కలసిన తర్వాత గోదావరి నది నిండుగా ప్రవహిస్తుంది. ఇచ్చంపల్లికి 63 కిలోమీటర్ల దిగువన ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలుపోగా... 50 శాతం నీటి లభ్యత ఆధారంగా 8,194 మిలియన్ క్యూబిక్ మీటర్లు(289 టీఎంసీలు), 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 12,104 మిలియన్ క్యూబిక్ మీటర్లు (427 టీఎంసీలు) మిగులు ఉంటుందని అంచనా వేసింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు 62.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు రెండు టీఎంసీలు) చొప్పున తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలోని ప్రధాన అంశాలు.. – గోదావరి నదిపై అకినేపల్లి వద్ద 590 మిలియన్ క్యూబిక్ మీటర్ల (సుమారు 20 టీఎంసీలు) నిల్వ సామర్థ్యంతో 72.50 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మించాలి. దీనితో 12 వేల హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుంది. అయితే ఈ భూమి అంతా నదీ గర్భంలోనే ఉంటుంది కాబట్టి ముంపు సమస్య ఉండదు. – అకినేపల్లి బ్యారేజీ నుంచి 30 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత కాలువ ద్వారా 4.3 కిలోమీటర్ల దూరం తరలిస్తారు. అక్కడి నుంచి తిరిగి 100.57 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. 324.2 కిలోమీటర్ల పొడవున కాలువ, 12.50 కిలోమీటర్ల సొరంగాల ద్వారా గ్రావిటీతో నాగార్జునసాగర్‌కు నీరు చేరుతుంది. – నాగార్జునసాగర్ కుడిగట్టు వద్ద హెడ్ రెగ్యులేటర్ నిర్మిస్తారు. దాని నుంచి 393.02 కిలోమీటర్ల పొడవైన కాలువల(1.265 కిలోమీటర్ల సొరంగం కలిపి)ద్వారా నీటిని సోమశిల (పెన్నా) రిజర్వాయర్‌కు తరలిస్తారు. – సోమశిల రిజర్వాయర్ కుడిగట్టుపై రెగ్యులేటర్ నిర్మిస్తారు. దాని నుంచి కండలేరు వరద కాలువకు సమాంతరంగా 529.19 కిలోమీటర్ల పొడవున కాలువ తవ్వి తమిళనాడులోని తంజావూరు జిల్లాలో కావేరీ నదిపై నిర్మించిన గ్రాండ్ ఆనకట్టకు జలాలను చేరుస్తారు. – మొత్తంగా ఈ అనుసంధానం పూర్తి చేయడానికి రూ.45,049 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. దీనిని రెండు దశల్లో చేపట్టాలని ప్రతిపాదించారు. తొలిదశలో అకినేపల్లి–నాగార్జునసాగర్ వరకు.. రెండో దశలో నాగార్జునసాగర్–సోమశిల–కావేరీ గ్రాండ్ ఆనకట్ట వరకు పనులు చేస్తారు. మూడు రాష్ట్రాలకూ ప్రయోజనకరమే.. నదుల అనుసంధానంతో మూడు రాష్ట్రాలకూ ప్రయోజనం దక్కుతుందని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా సాగు అవసరాలు తీరడంతో పాటు పరీవాహక గ్రామాల తాగు అవసరాలు, పరిశ్రమల నీటి అవసరాలు తీరుతాయని చెబుతోంది. ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదనల ప్రకారం.. అనుసంధానంతో మొత్తంగా 11.16 లక్షల హెక్టార్ల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇందులో తెలంగాణలో 3.10 లక్షల హెక్టార్లు, ఏపీలో 4.04 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 4.01 లక్షల హెక్టార్లకు నీరందుతుంది. ఆయకట్టులో పండించే పంటలు, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, కాలువ గట్లపై పండ్ల మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ.13,354 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ అంచనా వేసింది. జలాల తరలింపు ఇలా.. గోదావరి నుంచి కృష్ణాకు: 247 కృష్ణా నుంచి పెన్నాకు: 143 పెన్నా నుంచి కావేరికి: 88.83 రాష్ట్రాల వారీగా ఉండే ఆయకట్టు.. (హెక్టార్లలో) రాష్ట్రం ఆయకట్టు తెలంగాణ 3,10,200 ఏపీ 4,04,600 తమిళనాడు 4,01,400 మొత్తం 11,16,200 వ్యయ అంచనాలు ఇవీ.. (రూ.కోట్లలో) అనుసంధానం వ్యయం గోదావరి–కృష్ణా 16,868 కృష్ణా–పెన్నా 14,822 పెన్నా–కావేరి 13,359 మొత్తం 45,049 -
'చంద్రబాబు గొప్పలు హాస్యాస్పదం'
కడప: నదుల అనుసంధానంపై చంద్రబాబు, ఆయన బృందం గొప్పులు చెప్పుకోవడం హాస్యాస్పదమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మూడేళ్ల క్రితమే కృష్ణా నీటిని హాంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా పెన్నాకు అనుసంధానం చేశామని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ద్వారా నదులను అనుసంధానం చేస్తే అది నిజమైన అనుసంధానం అని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నవన్నీ తాత్కాలిక పనులేనని అన్నారు. చంద్రబాబుది అంతా ఇంకుగుంతల జాతకమని, ఆయన ఎప్పుడూ ప్రాజెక్టులకు వ్యతిరేమని రఘువీరా పేర్కొన్నారు. -
'ఎగనామం పెట్టే పనులు చేయొద్దు'
హైదరాబాద్: నదుల అనుసంధానం ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిందని వైఎస్సార్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు. కృష్ణా, గోదావరి అనుసంధానం చేశామని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏలూరు దగ్గర కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎప్పుడో జరిగిందని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల ఫలితాలను తమవిగా టీడీపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. మోసపూరిత ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మాయాల గారడీ ప్రభుత్వం ప్రజలను పాలిస్తోంది, దానికి నాయకుడు మహా మాంత్రికుడు అని ఎద్దేవా చేశారు. వాస్తవాలకు దగ్గర ఆలోచన చేయాలని, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించాలని సూచించారు. రైతాంగానికి ఎగనామం పెట్టే పనులు చేయొద్దని హితవు పలికారు. -
'ఎగనామం పెట్టే పనులు చేయొద్దు'
-
అబ్బురపడేలా తీర్చిదిద్దటమే మోదీ లక్ష్యం
# దేశాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా కృషి # కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ # నదుల్లో రవాణా పథకానికి గోదావరి ఎంపిక దిశగా కేంద్రం యోచన # టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శ # మోదీ ప్రభుత్వ పనితీరుపై ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అన్నారు. ప్రపంచం అబ్బురపడేలా దేశాన్ని తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారని చెప్పారు. ఏడు నెలల కేంద్ర ప్రభుత్వ పనితీరుపై బీజేపీ తెలంగాణ శాఖ హైదరాబాద్‌లో ఆదివారం ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్న వెదిరె శ్రీరామ్.. శాఖల వారీగా మోదీ ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అవినీతికి అడ్డుకట్ట వేస్తూనే... కాలం చెల్లిన నిబంధనలకు స్వస్తి పలికి, పారదర్శక విధానాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తొలి ఆరు మాసాల కాలంలో కొత్త విధానాలకు రూ పకల్పన చేసిన మోదీ ప్రభుత్వం... ఇప్పుడు వాటిని అమలుచేస్తూ శరవేగంగా ఫలితాలు సాధిస్తోందని శ్రీరాం చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ‘ప్రధాని కృషి సించయ్ యోజన ’ చేపట్టారన్నారు. దీని కింద మట్టి నమూనాలు పరిశీలించి పంటలు వేసే విధానం, జిల్లాల వారీగా పంట లపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిం చటం వంటివి మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నా రు.‘స్వచ్ఛ భారత్’తో ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం పట్ల భారీ కసరత్తు జరుగుతోందని, ఇది తెలంగాణకు ఉపయోగపడేలా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన ప్రణాళిక రూపొందించనున్నామని శ్రీరాం తెలిపారు. నదులను కూడా రవాణాకు వినియోగించే ఆలోచనను కార్యరూపంలోకి తేనున్నట్టు వెల్లడించారు. ఈ పథకానికి తొలుత గోదావరి నదినే ఎంపిక చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నా... దీనిపై తెలంగాణ ప్రభుత్వం అంతగా స్పందించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుగా నియమితులైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో... శ్రీరాం వెదిరెను పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. గంగా ప్రక్షాళన, నదుల అనుసంధానంలో శ్రీరామ్‌దే కీలక పాత్ర అని కేంద్రమంత్రి దత్తాత్రేయ కొనియాడారు. అంకితభావంతో పనిచేయటమే శ్రీరామ్ విజయ రహస్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అభినందించారు. కేంద్రంతో సామరస్యంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేఎల్పీ నేత లక్ష్మణ్ సూచించారు. కథలు చెప్పి కాలయాపన చేయటం రాష్ట్రప్రభుత్వానికి అలవాటుగా మారిందని నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు.