సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చేసిన ప్రతిపాదనలను బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో చర్చించాలని తెలంగాణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రాలను సంప్రదించి వారు సూచించే ప్రత్యామ్నాయాలను పరిశీలించాకే అనుసం ధానంపై తుది నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి ఇటీవల కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్‌కు లేఖ రాశారు.
నదుల అనుసంధా నాన్ని తెలంగాణ స్వాగతిస్తోందని.. అనుసం ధానంపై ఖర్చు చేస్తున్న వ్యయంతో పాటు, సాగు, తాగు, పరిశ్రమలకు అవసరాలకు కలిగే ప్రయోజనంపై పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. ఇతర ప్రాజెక్టుల నీటి లభ్యతలను 40ఏళ్ల సిరీస్ ఆధారంగా లెక్కించి అకినేపల్లి వద్ద నీటి లభ్యత విషయంలో 110 ఏళ్ల సిరీస్ ఆధారంగా లెక్కించడాన్ని ప్రశ్నించారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే దిగువన ప్రాజెక్టులపై ప్రభావం పడుతుందన్నారు.
శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదలేదీ
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్‌కు 16 టీఎంసీలు విడుదల చేయాలని, సాగర్ కనీస నీటి మట్టాలను 520 మీటర్లకు ఉంచాలని కోరుతున్నా నీటి విడుదల జరగలేదని కృష్ణా బోర్డు తెలిపింది. ఈ మేరకు మంగళవారం తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసింది.
Comments
Please login to add a commentAdd a comment