'వైఎస్ఆర్ లేని లోటు అనుక్షణం అనుభవిస్తున్నాం' | we still feel bad about demise of YS Rajasekhar reddy, says Raghuveera Reddy | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ లేని లోటు అనుక్షణం అనుభవిస్తున్నాం'

Published Tue, Sep 2 2014 1:55 PM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM

'వైఎస్ఆర్ లేని లోటు అనుక్షణం అనుభవిస్తున్నాం' - Sakshi

'వైఎస్ఆర్ లేని లోటు అనుక్షణం అనుభవిస్తున్నాం'

హైదరాబాద్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. ఆ మహానేత ఐదవ వర్థంతి హైదరాబాద్లోని ఇందిరాభవన్లో మంగళవారం ఆయన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 

ఈ సందర్బంగా రఘువీరా మాట్లాడుతూ...  వైఎస్ఆర్ తాను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి క్రమశిక్షణగా వ్యవహారించారని రఘువీరా వెల్లడించారు. వైఎస్ఆర్ వ్యవసాయ రంగాన్ని అమితంగా ప్రేమించారని... ఆయన సీఎంగా ఉన్న హయాంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. వైఎస్ లేని లోటును అనుక్షణం అనుభవిస్తామని రఘువీరా ఆవేదనతో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement