వైఎస్ఆర్ బాటలో నడువు చంద్రబాబు: రఘువీరా | ap pcc chief N. Raghu Veera Reddy advise to Chandrababu naidu | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ బాటలో నడువు చంద్రబాబు: రఘువీరా

Published Fri, May 23 2014 2:43 PM | Last Updated on Wed, Aug 29 2018 6:00 PM

వైఎస్ఆర్ బాటలో నడువు చంద్రబాబు: రఘువీరా - Sakshi

వైఎస్ఆర్ బాటలో నడువు చంద్రబాబు: రఘువీరా

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన వెంటనే ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేశారని... అలాగే రుణమాఫీపై సంతకం చేయాలని ఆంధప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సూచించారు. అప్పుడే చంద్రబాబును ప్రజలు నమ్ముతారన్నారు. శుక్రవారం అనంతపురంలో రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడారు. 2004 ఎన్నికల నేపథ్యంలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరడ్డి 2004లో సీఎం పదవి చేపట్టగానే తొలిగా ఫైల్పై సంతకం చేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారని రఘువీరా రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు.

 

2014లో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ  అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో ప్రజలు చంద్రబాబు హామీలను విశ్వసించి ఓట్లు వేశారు. దీంతో ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. త్వరలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాపీపై తొలి సంతకం చేయాలని రఘువీరా ఈ సందర్భంగా చంద్రబాబుకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement