ఉప ఎన్నికల అభ్యర్థికి దూరంగా ముఖ్య నేతలు
చింతామోహన్ ఏకపక్ష నిర్ణయాలపై కినుక
బుజ్జగించేందుకు ఫిబ్రవరి రెండున రఘువీరా రాక
అధిష్టానం నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం, పార్టీ అధికార ప్రతినిధి ఆశోక్ సామ్రాట్, పీసీసీ కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాగంటి గోపాల్‌రెడ్డిలను చింతామోహన్‌తో కలిసి చర్చించి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని సూచించింది. వీరంతా చింతాతో సమావేశమైనప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వెంట కేవలం చింతామోహన్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగతా పార్టీ శ్రేణులంతా అసంతృప్తితో రగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మబ్బు దేవనాథరెడ్డితో పాటు ప్రమీలమ్మ వంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థికి సహకరించేది లేదని తెగేసి చెప్పినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.
రంగంలోకి పీసీసీ నేత
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడంతో సమస్యను పరిష్కరించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఫిబ్రవరి రెండో తేదీన తిరుపతికి వస్తున్నట్లు సమాచారం. ఆయన అసంతృప్త నేతలను బుజ్జగించి సమష్టిగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కూడా కొంత మంది నేతలు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థికి సహకరించేది లేదని ఖరాఖండిగా తెగేసి చెప్పినట్లు సమాచారం. కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పరువు ఎలా కాపాడుకోవాలని పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్‌లో ముసలం
Published Fri, Jan 30 2015 2:03 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement