The by-election
-
ఖాళీల భర్తీ ఎప్పుడో
రెండేళ్లయినా భర్తీ లేదు ఉప ఎన్నికల కోసం నిరీక్షణ నూజివీడు: పంచాయతీలలో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ ప్రశ్నార్ధకరంగా తయారైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే ఇక్కడ ఎన్నికలను కూడా సరైన సమయానికి నిర్వహించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులలో ప్రభుత్వం ఉండటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి చనిపోయినా, పదవి నుంచి వైదొలగినా తిరిగి ఆరునెలలోగా ఉప ఎన్నిక నిర్వహించాలి. అప్పుడే ప్రజాస్వామ్యానికి బలం పెరుగడటంతో పాటు స్థానిక సంస్థలకు కూడా అధిక ప్రాధాన్యతనిచ్చినట్లవుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు 2013వ సంవత్సరం జులై నెలలో జరిగాయి. ఆ తరువాత కొన్నిచోట్ల సర్పంచులు తమ పదవులకు రాజీనామా చేయడం, మరికొన్ని చోట్ల చనిపోవడం, వార్డు సభ్యులు కూడా రాజీనామా చేయడం, చనిపోవడం జరిగింది. ఇవి జరిగి రెండేళ్లవుతున్నా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గాని, ప్రభుత్వం గాని పట్టించుకోకుండా స్థానిక సంస్థలను గాలికొదిలేసింది. 33వార్డు సభ్యులు, 4 సర్పంచి పదవులు ఖాళీ నూజివీడు డివిజన్లోని 14మండలాల్లో కలిపి 33 వార్డుసభ్యుల పదవులు, నాలుగు సర్పంచి పదవులు, ఆరు ఉపసర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి. బాపులపాడు మండలం రేమల్లె, గంపలగూడెం మండలం వినగడప, గన్నవరం మండలం బూతిమిల్లిపాడు, ఉంగుటూరు మండలం ఉంగుటూరు సర్పంచి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఉంగుటూరు సర్పంచి రాజీనామా చేయగా, మిగిలిన పంచాయతీల సర్పంచిలు చనిపోవడంతో ఖాళీ అయ్యాయి. ఏ కొండూరు మండలం చీమలపాడు, ఆగిరిపల్లి మండలం గొల్లగూడెం, బాపులపాడు మండలం రంగన్నగూడెం, గంపలగూడెం మండలం కొనిజర్ల, గాదెవారిగూడెం, ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి పంచాయతీల ఉపసర్పంచిల పదవులు ఖాళీగా ఉన్నాయి. వార్డు సభ్యుల పదవులకు సంబంధించి ఏ కొండూరు, ఆగిరిపల్లి, చాట్రాయి, గన్నవరం, ముసునూరు, పమిడిముక్కల మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, బాపులపాడు మండలంలో 3, గంపలగూడెంలో 6, నూజివీడులో 4, తిరువూరులో 5, ఉంగుటూరులో 3, విస్సన్నపేటలో 3, ఉయ్యూరులో 2 చొప్పున ఖాళీగా ఉన్నాయి. ఈ పదవులు దాదాపు రెండేళ్లుగా ఉన్నా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని పలు రాజకీయ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. బాపులపాడు మండలం రేమల్లె సర్పంచి 2015 ఫిబ్రవరి 7వ తేదీన మరణించారు. గంపలగూడెం మండలం వినగడప సర్పంచి 2015 ఆగస్టు 8వ తేదీన, గన్నవరం మండలం బూతిమిల్లిపాడు సర్పంచి 2014 మే 29న చనిపోయారు. ఇలా సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం గమనర్హం. ఇప్పటికైనా ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎమ్మెల్యేగా తుమ్మల ప్రమాణం
అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ నియోకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చే శారు. గురువారం అసెంబ్లీలోని తన చాంబర్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తుమ్మలతో ప్రమాణం చేయించారు. రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తుమ్మల, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన రెండో రోజే ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మంత్రులు మహేందర్‌రెడ్డి, పద్మారావు గౌడ్ , ఖమ్మం నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చే సిన తుమ్మల అభినందన సభకు వచ్చిన పలువురు మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఈ సభకు హాజరయ్యారు. కాగా, అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మిర్యాలగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, పలువురు నేతలు తుమ్మలను కలసి అభినందించారు. నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటానని తుమ్మల పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేశాక మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తానన్నారు. -
మీ ఆదరణ మరువలేను..
వరంగల్ ప్రజలకు ధన్యవాదాలు అన్ని సందర్భాల్లోనూ అండగా నిలిచారు చెల్పూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ వరంగల్ : జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని సందర్భాల్లో వరంగల్ జిల్లా ప్రజలు టీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నారని అన్నారు. గణపురం మండలం చెల్పూరులో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) రెండో దశ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జాతికి అంకితం చేశారు. అనంతరం కేటీపీపీ ఆవరణలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘వరంగల్ జిల్లా ప్రజలు ఆనాడు ఉద్యమంలో, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అండగా నిలిచారు. మీరు ఇచ్చిన ప్రేమను ఈ జన్మలో ఏమిచ్చినా నేను తీర్చుకోలేను. అంతగొప్ప అభిమానాన్ని చూపిస్తున్నారు. ఉప ఎన్నికలో ఎందరో ఎన్నో అవాకులు చవాకులు పేలిన్రు. ఎన్నో మాట్లాడిన్రు. కరెక్టు పంథాలో గవర్నమెంటు పోతాంది, ఇంకా గట్టిగా పనిచేయండని చెప్పి, మొన్న మీరు వరంగల్‌లో ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. వరంగల్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వరంగల్ జిల్లా ప్రత్యేక అభివృద్ధికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాకు మంచి రోజులు రానున్నాయి. ఎల్ఎండీ నుంచి ఉన్న కాకతీయ కాల్వ సామర్థ్యం 8వేల క్యూసెక్కులు. సమైక్య రాష్ట్రంలో పట్టించుకోకపోవడం వల్ల అన్ని నీళ్లు రావడం లేదు. వచ్చే ఏడాది నుంచి 8వేల క్యూసెక్కుల సామర్థ్యంతోని నీరు రావడానికి కాల్వల మరమ్మతు కోసం రూ.138 కోట్లు మంజూరు చేసినం. ఆ పనులన్నీ ఈ వేసవిలోనే పూర్తవుతాయి. కాకతీయ కాల్వ కింద ఉన్న నీటి పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని త్వరితగతిన రిపేర్ చేసి రైతులకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టరును, అధికారులను కోరుతున్నా. ఎంత డబ్బు అయినా సరే ఇవ్వడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఈ డీబీఎం, ఆ డీబీఎం, ఈ ఊరు ఆ ఊరు అని కాదు కాకతీయ కాలువ కింద మొత్తం నీటి పంపిణీ వ్యవస్థ బాగుపడాలి. మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తితోని ఈ రోజు, రేపు మధ్యామ్నం మూడు నాలుగు గంటల దాక ఉంట. చాలా నిర్ణయాలు రేపు నేను ప్రకటిస్తా. వరంగల్ నుంచి మొత్తం జిల్లాకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రకటిస్తా. ప్రత్యేకంగా వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. తెలంగాణలోనే రెండో పెద్ద పట్టణం మన వరంగల్ పట్టణం. ఇప్పుడు వచ్చేటప్పుడు హెలికాప్టర్లో చూస్తుంటే బాధపడే పరిస్థితి ఉంది. ఆ పట్టణాన్ని ఏం చేయాలే, జిల్లా అభివృద్ధికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలేంది. సాగునీరేంది, కరెంటేందీ, మంచేంది, చెడ్డేంది చూసుకుందాం. ఆ ప్రకారంగా ముందుకు పోదామని తెలియజేస్తున్నాను’ అని అన్నారు. భూపాలపల్లికి వరాలు... ‘దేవాదుల ప్రాజెక్టు మూడోదశ వరకు పూర్తయితే భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. ఒక్క రూపాయూ ఖర్చు చేయకుండా, ఏ లిఫ్టు చేయకుండా కాలువ తవ్వుకుంటే రామప్ప, గణపురం, లక్నవరం చెరువులు నిండే పరిస్థితి ఉంది. ఈ చెరువుల కింద రెండు పంటలు పండించి చూపిస్తా అని నేను మీకు హామీ ఇస్తున్నా. మధుసూదనాచారి నాయకత్వంలో ఆ కాల్వలు సత్వరమే ఈ నెలలోపే శాంక్షన్ చేయించి.. ఈ సీజన్లోనే తవ్వించి.. వచ్చే సీజన్ నుంచే మీరు బ్రహ్మాండంగా రెండు పంటలు పండించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తదని చెప్పి హామీ ఇస్తున్నా. భీంఘన్‌పూర్ నుంచి చిన్నలిఫ్టు పెడితే కమలాపూర్, రాంపూర్, దీక్షకుంట, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, పందిపంపుల, నందిగామ, పంబాపూర్ గ్రామాలన్నింటీకి నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. రేపు హైదరాబాద్ పోయిన తర్వాత ఎస్టిమేట్ తెప్పించి. ఈ జనవరి నెలలోనే దాన్ని శాంక్షన్ చేయిస్తం. కచ్చితంగా ఫిబ్రవరిలో పనులు మొదలుపెడ్తం. ఆ ప్రాంతాలకు నీళ్లు వస్తయి. చల్వాయి ప్రాజెక్టు పర్మినెంట్‌గా ఉంటది. త్వరలోనే భీంఘన్‌పూర్ లిఫ్టుకు నేనే పునాది రాయి వేస్తానని తెలియజేస్తున్న. భూపాలపల్లి ప్రాంతంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం. గాంధీనగర్ ప్రాంతంలో పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేస్తం. పోస్టు గ్రాడ్యుయేషన్ సెంటర్‌కు భవనాలను మంజూరు చేస్తామని హామీ ఇస్తున్నా. మైనింగ్ ట్రేడ్స్తోని పాలిటెక్నిక్ కాలేజీని మంజూరు చేస్తున్నం. వచ్చే మార్చి తర్వాత ప్రారంభించుకునేలా భూపాలపల్లి నియోజకవర్గానికి అదనంగా అదనంగా రెండు వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నాం’ అని అన్నారు. విద్యుత్ వారికి ధన్యవాదాలు... ‘అనుకున్న దానికంటే ముందే భూపాలపల్లి 600 మెగావాట్ల పవర్ ప్లాంటును పూర్తి చేసి ప్రారంభోత్సవం జరిపించిన విద్యుత్ శాఖ వారికి పేరుపేరునా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్న. విద్యుత్ మంత్రి జగదీశ్వర్‌రెడ్డికి, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు, విద్యుత్ ఇంజనీర్లకు అభినందనలు తెలుపుతున్నా’ అన్నారు. పోచారం ప్రస్తావన.. పోచారం శ్రీనివాసరెడ్డిని తీరు నాకు చాలా సంతోశమేసింది. వారిది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా. ప్రజల పట్ల అవగాహన ఉన్న నాయకులు ఉంటే ఎలా ఉంటరంటే వీరిని చూస్తే తెలుస్తంది. భూపాలపల్లితో వారికి అటాచ్మెంట్ లేదు. మొన్న ఎన్నికలప్పుడు వచ్చి తిరిగిగారు. ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉంది అభివృద్ధి చేయాలి అన్నరు’ అని సీఎం కేసీఆర్ సభలో చెప్పారు. -
ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ సమీక్ష
జిల్లా నేతలతో సమావేశమైన రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’ కాజీపేట రూరల్ : ఇటీవల జరిగిన వరంగల్ లో క్‌సభ ఉప ఎన్నికపై వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో సోమవారం పార్టీ జిల్లా నాయకులతో సమావేశమైన ఆయన ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్, పార్టీకి పోలైన ఓట్లపై చ ర్చించారని జిల్లా అధికార ప్రతినిధి అప్పం కిష న్ తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జి ల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, రాష్ర్ట కార్యదర్శులు మునిగాల విలియం, పూజారి సాంబయ్య, సంగాల ఈర్మియా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాడెం శాంతికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీడికంటి శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి చల్లా అమరేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షు డు కాయిత రాజ్‌కుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మంచె అశోక్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కౌటిల్‌రెడ్డి, ప్రచార క మిటీ అధ్యక్షుడు కె.అచ్చిరెడ్డి, జిల్లా నాయకులు సుమిత్, శరన్, కళ్యాణ్, వీరగోని రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ వాకాటి కరుణ విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు సీపీ సుధీర్‌బాబు వరంగల్ సిటీ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను మంగళవారం లెక్కించేందుకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ వా కాటి కరుణ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ రెండో గేట్ సమీపంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్‌బాబు తో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి మాక్ కౌంటింగ్ నిర్వహిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఏడు కౌంటిం గ్ హాళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభవుతుందన్నారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ కౌంటింగ్ హాళ్ల పరిసర ప్రాంతాలలో 144సెక్షన్ విధించామని,విజయోత్సవ ర్యాలీలు నిషేధమని తెలిపారు. ప్రజాప్రతినిదులు, వివిధ పార్టీల నాయకులు తమకు సహకరించాలని కోరారు. అనుమతి పాస్‌లు లేకుండా ఎవరూ కౌం టింగ్హాల్ లోపలికి వెళ్లవద్దని సూచించారు. -
నేడు లెక్కింపు
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం 11 గంటల వరకు ఫలితం వెల్లడి ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు అత్యధికంగా భూపాలపల్లిలో 22 రౌండ్లు.. తక్కువగా వరంగల్ తూర్పులో 16 రౌండ్ల లెక్కింపు విధుల్లో 600 మంది ఉద్యోగులు హన్మకొండ అర్బన్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. 11 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని చెప్పారు. కౌంటింగ్ విధుల్లో 600 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కోదానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. మొదట 14 ఈవీఎంలు స్ట్రాంగ్ రూం నుంచి తీసుకొచ్చి ఒక్కో టేబుల్‌పై ఒక్కొక్కటి చొప్పున లెక్కిస్తారు. ఆ తర్వాత మరో 14.. ఇలా అన్ని ఈవీఎంలు లెక్కిస్తారు. చివరకు రెండు ఈవీఎంలను లెక్కించినా దాన్ని కూడా ఒక రౌండ్‌గానే పరిగణిస్తారు. ఒక రౌండ్ లెక్కింపునకు సుమారు 10 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అభ్యర్ధుల కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్లు, కౌంటింగ్ హాల్లో జాలీలు ఏర్పాటు చేశారు. సమాచారం అందజేసేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌కు ఫలితాలను ప్రకటిస్తారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సహా మొత్తం 23 మంది బరిలో ఉన్నారు. పోలైన ఓట్లు 10, 35,656... ఉప ఎన్నికలో మొత్తం 15,09,671 ఓట్లకు గాను 1788 కేంద్రాలలో 10,35,656 ఓట్లు (69.19 శాతం) పోలయ్యాయి. భూపాలపల్లి అసెంబ్లీ పరిధిలో 297 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఆ నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. ఆ తర్వాత అధికంగా 274 కేంద్రాలు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఉండగా, అక్కడ 19 రౌండ్లు కౌంటింగ్ చేయనున్నారు. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ లెక్కింపు 16 రౌండ్లలో ముగియనుంది. రౌండ్ల వారీ ఫలితాలను ఏఆర్ఓలు వెల్లడించనుండగా, తుది ఫలితాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కరుణ ప్రకటిస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు.. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం 500 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపగా కేవలం 126 మాత్రమే తిరిగి వచ్చారుు. వీటి లెక్కింపు తర్వాత రౌండ్ల వారీగా మిగితా ఓట్లు కౌంట్ చేస్తారు. -
ఎక్కడ.. ఎవరికి
మెజారిటీపై ఎమ్మెల్యేల లెక్కలు గెలుపు ధీమాతో ప్రతిపక్ష నేతలు పెరిగిన పోలింగ్‌తో ఎవరికి లాభమో.. వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక ఫలితం మంగళవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు కొన్ని గంటల్లో మొదలుకానుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నిక కావడంతో ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపోటములు, ఓటింగ్ శాతం తీరు ఎలా ఉంటుందనే విషయంపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలప్పుడు వచ్చిన మెజారిటీ వస్తుందా.. లేదా అనే అంశంపై ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. ఉప ఎన్నికలో వచ్చే తీర్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల పరిపాలన తీరు తెలిసిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ, వరంగల్ ఉప ఎన్నికలో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడం.. ఏ రాజకీయ పార్టీకి బలం చేకూరుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అరుుతే, ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని, సాధారణ ఎన్నికల్లో కంటే మెజారిటీ తగ్గినా స్పష్టమైన ఆధిక్యత ఉంటుందని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమకు ఆధిక్యం వస్తుందని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో కంటే తమకు పరిస్థితులు మెరుగయ్యాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు ఓటింగ్ మారిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగం చేశారని, ప్రజలు తమకే మద్దతు తెలిపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భూపాలపల్లి, పరకాలలో తమకు ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. ఇక, వరంగల్ ఉప ఎన్నికలో మొదటిసారి పోటీ చేసిన వైఎస్సార్సీపీ ఓటింగ్ తీరుపై ఆశాభావంతో ఉంది. ఓటర్లు తమ పార్టీకి మద్దతు తెలిపారని భావిస్తోంది. ఎన్డీయే నేతలు సైతం ఉప ఎన్నిక ఫలితంపై ఆశావాహ ధృక్పథంతో ఉన్నారు. గతంలో కంటే తమకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, ఉప ఎన్నిక ఫలితంతో ఇది స్పష్టమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో తమ పార్టీకి బలం పెరిగిందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వామపక్ష కూటమి సైతం ఓటింగ్ శాతంపై ధీమాతో ఉంది. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత.. ఓటింగ్ శాతంలో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. రాజకీయ పార్టీల అంచనాలు ఇలా ఉండగా.. తుది ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికలో ఓట్లు ఇలా... 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ లో 12,69,008 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 6,95,918 (54.83 శాతం) ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 3,02,981 (23.87 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన రామగల్ల పరమేశ్వర్‌కు 2,06,200 (16.24 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. -
ఉప ఎన్నికలో గెలుపు మాదే..
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి హన్మకొండ చౌరస్తా : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే విషయం ఫలితాలతో స్పష్టమవుతుందని చెప్పా రు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజ య్య, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్తోకలిసి ఆయన హన్మకొండలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆది వారం విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్ రోజున ప్రతిపక్ష కాం గ్రెస్, బీజేపీలకు పోలింగ్ ఏజెంట్లు సైతం దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీనేతలు డబ్బుల కోసం ఆశపడ్డారని, అవి రాకపోవడం తో ఆయూపార్టీల నేతలు ఎన్నిక రోజు జాడలేకుండా పోయూరని అన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, బస్వరాజు సారయ్య పోలింగ్ బూత్‌లకు రాకుండా ఎందుకు తోకముడిచారో చెప్పాలని ప్రశ్నించారు. ఓట ర్లను ఓటు అడగడం పక్కనపెట్టి కేసీఆరే లక్ష్యంగా విమర్శలు చేశారన్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తన పార్టీ నేతలనే సమన్వయం చేయలేకపోయూడని విమర్శించారు. అధికార పార్టీ అరుునా టీఆర్ఎస్ ఎన్నికల నియమావళికి లోబడి వ్యవహరించిందని అన్నారు. ప్రచారం ముగి సిన తర్వాత ప్రెస్మీట్లు పెట్టి కాం గ్రెస్, బీజేపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని ఆరోపించారు. ఎ మ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ప్రతిపక్షాలను ప్రజ లు పట్టించుకోలేదని ఉప ఎన్నికలో తేలిపోయిందన్నారు. టీఆర్ఎస్ జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, కన్నెబోయిన రాజయ్యయాదవ్ పాల్గొన్నారు. -
సత్తా చాటనున్న వైఎస్సార్సీపీ
పార్టీ అధినేత జగన్ ప్రచారంతో పెరిగిన బలం మహానేత జ్ఞాపకాల్లో పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు వరంగల్ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ సత్తా చాటనుంది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రచారానికి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి స్పందన వచ్చింది. జగన్ ఈనెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు ప్రచారం నిర్వహించారు. ఈ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్రెడ్డి పర్యటనతో వైఎస్సార్ సీపీ కొత్త ఉత్సాహం వచ్చింది. మహానేత వైఎస్ పథకాలు మరవని ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా జనం కేరింతలు కొట్టారు. ఉప ఎన్నికలో తమకు తిరుగుండదని భావించిన రాజకీయ పార్టీలు.. జగన్ సభలకు వచ్చిన ప్రజా స్పందన చూసి డోలాయమానంలో పడ్డాయి. హామీల అమలులో అధికార పార్టీ తీరుపై జగన్మోహన్రెడ్డి చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. హన్మకొండలో నిర్వహించిన బహిరంగసభకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడం, టీఆర్ఎస్కు ఊపునిచ్చిన జిల్లాలో జగన్‌కు లభించిన ఆదరణ చూస్తే భవిష్యత్‌లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
పోలింగ్‌కు సిద్ధం
తొలి ఓటరుకు పూలతో స్వాగతం 90 శాతం ఓటర్లకు స్లిప్పులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలిపోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు కోడ్ ఉల్లంఘనపై 30 ఫిర్యాదులు అందాయి 8 మందికి నోటీసులు ఇచ్చాం ‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణ వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణ తెలిపారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయూలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆమె ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ అంశాలు ఆమె మాటల్లోనే... {పజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవి. ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. వరంగల్ ఉప ఎన్నికలో పోలింగ్ శా తం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలను శుక్రవారం వరకు నిర్వహించాం. 97 శాతం మంది ఓటర్లకు ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశాం. అందుబాటులో లేని 20 వేల మంది ఓటర్లకు మాత్రమేు అందించలేకపోయాం. ఓటరు స్లిప్పులు అందని వారు నేరుగా పో లింగ్ కేంద్రాల వద్ద ఉన్న బూత్ స్థాయి అధికారి వద్ద కు వెళ్లి వీటిని పొంది ఓటు హక్కున వినియోగించుకోవచ్చు. వరంగల్ నగరంలో దీని కోసం 30 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ సహాయక కేంద్రాల ద్వారా పోలింగ్స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చు. లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గ పరిధి లో శనివారం స్థానిక సెలవు ఉంటుంది. ఎన్నిక జరిగే ప్రాంతాల్లోని దుకాణాల్లో పనిచేసే కార్మికులకు సెలవు ప్రకటించాం. పోలింగ్ కేంద్రానికి వచ్చే తొలి ఓటరుకు పూలతో స్వాగతం పలకనున్నాం. రాజకీయ పార్టీల జెండాల రంగులు ఉండే పూలు లేకుండా జిల్లా కేం ద్రం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలకు పూలు లేదా బొ కేలు పంపిస్తున్నాం. ఓటు వేసేందుకు ముందు వచ్చే వారిని అభినందించేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా రు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,57,231 పురుషులు, 7,52,293 స్త్రీలు, 147 మంది ఇతరులు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చి మ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1778 పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2400 కంట్రోల్ యూనిట్, 4800 బ్యాలెట్ యూనిట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో పెట్టాం. పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు 1974 మంది ప్రిసైడింగ్ ఆధికారులను, 2008 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులను, 738 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించాం. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పరంగా ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకున్నాం. 20 కం పెనీల భద్రతా దళాలను మోహరించాం. ఎన్నికల నిర్వహణ సామగ్రి ఒకరోజు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరవేశాం. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం కలుగకుండా కనీస అవసరాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యుత్, బారికేడింగ్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. 1778 కేంద్రాల్లో 819 అత్యంత సమస్యాత్మక, 393 సమస్యాత్మక, 566 సాధారణ కేంద్రాలుగా గుర్తించాం. వీటికి అనుగుణం గా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. 5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్‌పై నిషేధం పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్‌లోని అన్ని ఓ టింగ్ యంత్రాలను ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్‌కు తీసువచ్చి భద్రపరుస్తాం. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్ నిర్వహణ, ఎగ్జిట్‌పోల్ ఫలితం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణ, ప్రసారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 30 ఫిర్యాదులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో 30 ఫిర్యాదులు వచ్చాయి. 27 ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాం. ప్రచార సభలకు వచ్చిన ప్రజలకు డబ్బులు, మద్యం పంపిణీ విషయంలో ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. నవంబరు 19న సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ప్రచారం చేశారనే అంశంపైనా ఫిర్యాదులు వచ్చాయి. అభ్యర్థుల ప్రవర్తనపైనా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో రాజకీయ పార్టీలన్నింటిపైనా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రసంగంపై కొన్ని పార్టీల వారు ఫిర్యాదు చేశారు. నియమావళి ఉల్లంఘన విషయంలో 8 మందికి నోటీసులు ఇచ్చాము. -
రాజన్న బిడ్డకు నీరాజనం
ఓరుగల్లులో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రోడ్‌షో భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మహానేత అభిమానులు బోనాలు, బతుకమ్మలతో ఆత్మీయ స్వాగతం పాలకుర్తిటౌన్ / పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా జిల్లాలో చేపట్టిన ప్రచారానికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల గుండా కొనసాగిన రోడ్‌షోకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహానేత వైఎస్సార్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ మేరకు పాల కుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రోడ్‌షోకు తరలివచ్చిన ప్రజానీకానికి అభివాదం చేశారు. మధ్యమధ్యలో చిన్నారులు, వృద్ధులు, రైతు లు, గిరిజనులను ఆప్యాయంగా పలకరించారు. కాగా, తొలుత పాలకుర్తికి చేరుకున్న అధినేత జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బొకే లు అందజేసి స్వాగ తం పలికారు. ఇది లా ఉండగా రోడ్ షోలో కార్యకర్తల బైక్ ర్యాలీ, వైఎస్సార్సీపీ సాంస్కృతిక బృందం పాడిన పాటలు అలరించాయి. స్వాగతం పలికిన చాకలి ఐలమ్మ మనవరాలు.. రోడ్‌షోకు హాజరైన వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల సంధ్యారాణి ఘన స్వాగతం పలికారు. అలాగే మండల కేంద్రంలోని వాగ్ధేవి జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా స్వాగతం పలికారు. రోడ్‌షోలో వైఎస్సార్సీపీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, ఎమ్మెల్సీ ఎండీ రహమాన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బండి లక్ష్మణ్, మాదిరెడ్డి భగంవంత్రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఎస్. శేఖర్‌పంతులు, తమ్మాళి బాల్‌రాజ్, మాడరాజు యాకయ్య, గుడ్ల వెంకన్న పాల్గొన్నారు. -
జగన్ ప్రచారంతో నూతనోత్సాహం
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’ పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రవేశంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్‌కు ఏ పా ర్టీ నుంచి పోటీ లేకుం డా పోయిందని ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తొర్రూరు బస్టాండ్ ఆవరణలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పార్లమెంట్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని తమకు పోటీగా భావించామని.. ప్రస్తుతం వైఎస్.జగన్మోహన్రెడ్డి రాగా అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, అపూర్వ స్వాగతంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయిందని తెలిపారు. తప్పుడు హామీలు, మోసపూరిత విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయూలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్ పాలనతో ప్రస్తుత పాలనను పోల్చుకుని వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కొండా రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, విజయ్‌చందర్, కళ్యాణ్‌రాజు, శ్యాంసుందర్‌రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఇబ్రహీం, బిజ్జాల అశోక్, కోటగిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ప్రచార బరిలోకి సీఎం
నేడు బహిరంగ సభ కు హాజరుకానున్న కేసీఆర్ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు హన్మకొండ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం వరంగల్ రానున్నారు. ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసునూరి దయాకర్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యాన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరున్నర గంటలకు జరగనున్న ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. సాధారణ ఎన్నికల మాదిరిగానే తమ పార్టీ అభ్యర్థిని అదే మె జార్టీతో గెలిపించుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, టీఆర్ఎస్ అగ్రనేత లు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రచా రం చేస్తుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థి తరపున ప్రచారానికి ఊపు తెచ్చేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ వస్తున్నారు. అరుుతే, ఈనెల 21వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలూ ప్రచార జోరు పెంచా రుు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరఫున జాతీయస్థాయి నేతలుగా పేరొందిన దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్, కొప్పుల రాజు, సుశీల్‌కుమార్‌షిండే ప్రచా రం చేస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఆర్ట్స్ కళాశాలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభ విజయవంతానకి టీఆర్ఎస్ శ్రేణులు భా రీగా ఏర్పాట్లు చేశారుు. లక్ష మందిని ఈ సభకు తరలించాలని నిర్ణయించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్‌మ్యాప్‌ను వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు పరిశీలించారు. గుడిమళ్ల ఇంటికి కేసీఆర్... వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ గౌరవఅధ్యక్షు డు గుడిమళ్ల రవికుమార్ టికెట్ ఆశించగా చివరి ని ముషంలో చేజారిన విషయం విదితే. ఈ మేరకు ఆ యన ఇంటికి వరంగల్ పర్యటనలో భాగంగా ము ఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గుడిమళ్ల రవికుమార్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్తారని షెడ్యూల్లో పేర్కొన్నారు. -
నామినేషన్లు 38
ఉప ఎన్నికకు ముగిసిన తొలి ఘట్టం హన్మకొండ అర్బన్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 38 నామినేషన్లు దాఖలయ్యూరుు. బుధవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ప్రధానపార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలతో హోరెత్తించారు. అభ్యర్థులంతా మధ్యాహ్నం తరువాత ఎన్నికల అధికారి కార్యాలయానికి రావడంతో అధికారులు అభ్యర్థులకు నెంబర్లు వేసిన చీటీలు అందజేశారు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమయం పూర్తయిన తరువాత కార్యాలయంలో సుమారు 15మంది వరకు అభ్యర్థులు వెయిటింగ్లో ఉన్నారు. దీంతో అందరి పత్రాలు ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ రాత్రి 7గంటల వరకు తీసుకున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అట్టహాసంగా వస్తే.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ సాదాసీదాగా పార్టీ ప్రముఖులతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ బహిరంగ సభ అనంతరం తన రెండవ సెట్ నామినేష్ పత్రాలు అందజేశారు. మంగళశారం నాటికి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. చివరి రోజు బుధవారం 32మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 38కు చేరింది. -
దయాకర్..క్లియర్
-
దయాకర్.. క్లియర్
టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి ఎంపిక కలిసొచ్చిన విధేయత తెలంగాణ భవన్లో రెండు రోజులుగా చర్చలు హన్మకొండ: వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పసునూరి దయాకర్ ఎన్నికల బరిలో దిగనున్నారు. రెండురోజుల తర్జనభర్జనల అనంతరం దయాకర్ పేరును ఖరారు చేస్తూ శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ఆ పార్టీ ప్రకటించింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి పసునూరి దయాకర్ నిబ ద్ధత, విధేయత కలిగిన నాయకుడిగా టీఆర్ ఎస్‌లో పని చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎట్టకేలకు ఖరారు.. వరంగల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జిల్లా పార్టీ నేతలంతా హైదరాబాద్‌లో సమావేశమై గురు, శుక్రవారాల్లో విస్తృతంగా సంప్రదించారు. ఎన్నికల బరిలో నిలిచే పార్టీ అభ్యర్థి పార్లమెంటు, ఢిల్లీ రాజకీయాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సమర్థత కలిగి ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యమ నేపథ్యం ఉండి, చట్టాలపై అవగాహనతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలలో పట్టున్న వ్యక్తిని ఎన్నికల బరిలో నిలుపుతామని ప్రకటించారు. దీంతో గుడిమళ్ల రవికుమార్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగింది. అరుుతే రవికుమార్ అభ్యర్థిత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో టీఆర్ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. కడియం శ్రీహరి, కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్‌తో పాటు జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు శుక్రవారం మరోసారి సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆఖరి నిమిషం వరకు రవికుమార్, దయాకర్ మధ్య అభ్యర్థిత్వ ఖరారు అంశం ఊగిసలాడగా చివరకు దయాకర్‌ను ఎంపిక చేశారు. కలిసి వచ్చిన విధేయత.. సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన దయాకర్‌కు వివాదరహితుడిగా పేరుంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2008-11 మధ్య టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా, 2011 నుంచి 2013 వరకు వర్ధన్నపేట నియోజకర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా పని చేశారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోయినా పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. మలిదశ ఉద్యమంలో పని చేస్తున్నప్పుడే అగ్నిమాపకశాఖలో ఉద్యోగం వచ్చినా వదులుకుని తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. ఇవన్నీ గుర్తించిన కేసీఆర్ ఆయనకు ఉప ఎన్నికల బరిలో అవకాశం కల్పించారు. ప్రతిష్టగా మారిన ఎన్నికలు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య నియమితులయాయరు. అనూహ్య రాజకీయ పరిణామాల నడుమ ఆయన బర్తరఫ్ కావడంతో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి ఆ పదవి ద క్కింది. ఫలితంగా వ రంగల్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ ఎస్‌లో అంతర్గత మార్పులతోనే ఈ ఎన్నిక జరుగుతుండటంతో పార్టీ విజయం తప్పనిసరని భావించిన కేసీఆర్.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించారు. -
మంత్రులకు ఉప ఎన్నిక బాధ్యతలు
వరంగల్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ మంత్రులకు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఉప ఎన్నిక అన్ని పార్టీల మధ్య పోటా పోటీగా సాగ నుండటంతో.. టీఆర్ఎస్ అధినేత అభ్యర్థి ఎన్నిక నుంచి.. ప్రచారం వరకూ ప్రతి అంశంపై స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్ గడ్డమీద విజయ కేతనం ఎగరేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే... అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా.. మంత్రులకు ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లకు వరంగల్ తూర్పు , వరంగల్ పశ్చిమ నియోజక వార్గాల ఇన్ చార్జిలుగా బాధ్యతలు ఇచ్చిన కేసీఆర్.. పరకాల నియోజక వర్గాన్ని ఈటల, భూపాల్ పల్లి నియోజక వర్గాన్ని పోచారం శ్రీనివాస్, వర్ధన్న పేట నియోజక వర్గాన్ని జోగు రామన్నల కు అప్పగించారు. ఇక స్టేషన్ ఘన్పూర్ కి ఇంద్రకరణ్ రెడ్డి, పాలకుర్తికి జగదీష్ రెడ్డిలు పార్టీ ఎన్నికల ఇచ్ చార్జ్ లుగా వ్యవహరిస్తారు. -
యంత్రాంగం సన్నద్ధం
ఎన్నికల విధులకు బాధ్యుల నియూమకం 13 విభాగాలకు 20 మంది అధికారులు వారికి సహాయకులుగా 100 మంది సిబ్బంది సమీక్షించిన రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. వచ్చే నెల 21వ తేదీన జరిగే పోలింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రశాంత వాతావరణంలో ఉప ఎన్నిక జరిగేందుకు ఎన్నికల అధికారి వాకాటి కరుణ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులతో ఆమె సోమవారం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించినందున ప్రస్తుతం ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న వారందరూ డిప్యూటేషన్‌పై భారత ఎన్నికల కమిషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు భావించాలని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయూలని, వ్యయ పరిశీలన తదితర ప్రాధాన్యత అంశాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా ఉండే 13 విభాగాలకు 20 మంది జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. వీరికి సహాయకులుగా 100 మంది సిబ్బందిని నియమించారు. వీరి నియూమకాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి వాకాటి కరుణ తీసుకున్న నిర్ణయం మేరకు సహాయక రిటర్నింగ్ అధికారి(డీఆర్వో) కె.శోభ ఉత్తర్వులు జారీ చేశారు. తప్పులు లేని ఓటర్ల జాబితా అంశాన్ని మెప్మా పీడీ పురుషోత్తం, పోలింగ్ కేంద్రాల్లో వీడియో పర్యవేక్షణ బాధ్యతలను దళిత సంక్షేమ అభివృద్ధి శాఖ ఏడీ శంకర్లు నిర్వహిస్తారు. మానవ వనరుల నిర్వహణను ముఖ్య ప్రణాళికాధికారి వి.లలిత్‌కు, రవాణా నిర్వహణకు డీటీసీ శివనాగయ్యకు అప్పగించారు. సిబ్బంది శిక్షణ నిర్వహణను డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రావు, సామగ్రి(మెటీరియల్) నిర్వహణను ఎన్సీఎల్ ప్రాజెక్టు అధికారి కె.ప్రసాదరావు పర్యవేక్షిస్తారు. మీడియా సర్టిఫికెషన్, మానిటరింగ్ కమిటీని సమాచార శాఖ ఏడీ డీఎస్ జగన్, మీడియా, కమ్యూనికేషన్‌ను పీఆర్వో పి.శ్రీనివాస్, ఎన్నికల అంశాల కంప్యూటరైజేషన్, కమ్యూనికేషన్ ప్రణాళికను జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి వి.విజయకుమార్‌లు నిర్వర్తిస్తారు. పోలింగ్ స్టేషన్లకు విద్యుత్, ఇంటర్నెట్, ర్యాంపులు తదితర సౌకర్యాలను పోలింగ్ స్టేషన్లకు కల్పించే ఎన్పీడీసీఎల్ ఎస్ఈ టి.మధుసూదన్, బీఎస్ఎన్ఎల్ డీఈ కౌండిన్యకుమార్, ఆర్వీఎం ఈఈ ఎం.రవీందర్‌లకు అప్పగించారు. పోలింగ్ స్టేషన్లకు తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లను వరంగల్ మునిసిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్ఈ ఎల్.రామ్‌చంద్ పర్యవేక్షిస్తారు. రేపటి వరకు అవకాశం... మెరుగైన ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరూ బుధవారంలోపు ఓటరుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు కాలేజీల ప్రిన్సిపాళ్లు యువతను ప్రోత్సహించాలని కోరారు. ఈ-సేవా కేంద్రాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో యువత తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ కరుణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. -
సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?
తలసాని ఏమైనా రాజీనామా చేశారా?:నాయిని హైదరాబాద్: ‘‘సనత్‌నగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)కు ఉప ఎన్నిక ఎందుకు.. ఆయన (తలసాని) ఏమైనా రాజీనామా చేసిండా?’’ అంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాయిని ఓ ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీడీపీ తరపున ఎన్నికైన తలసాని టీఆర్ఎస్లో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి ఆపై మంత్రి పదవి చేపట్టడం తెలిసిందే. ఆయన రాజీనామా వ్యవహారం ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండటంతో దీనిపై టీడీపీ.. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో కేసు వేయడమూ విదితమే. ఈ విషయాలను విస్మరించి హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నాయిని వ్యాఖ్యలతో జగదీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని విలేకరుల సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. -
జోరు లేని కారు
టీఆర్ఎస్లో వీడని స్తబ్దత కాంగ్రెస్‌లో పెరిగిన హడావుడి కార్యాచరణలో ప్రతిపక్ష పార్టీలు ముంచుకొస్తున్న వరంగల్ ఉప ఎన్నిక వరంగల్ : వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. బీహార్ అసెంబ్లీతోపాటే వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. అక్టోబరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని... దీనికి 45 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఎన్నికలకు వేగంగా సన్నద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే ప్రక్రియలో భాగంగా తాజాగా తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలూ కార్యాచరణ ముమ్మరం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ విషయంలో కాస్త ముందంజలో ఉంది. బీజేపీ, టీడీపీ ఇదే స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యి. వామపక్షాలు, వైఎస్సార్ సీపీ కార్యాచరణ మొదలుపెట్టాయి. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ మాత్రం ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టడంలేదు. టీఆర్ఎస్ పార్టీలో 4 నెలలుగా స్తబ్దత నెల కొంది. పార్టీ కార్యక్రమాలు అనేవే జరగడంలేదు. అధికార పార్టీగా టీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారనున్న వరంగల్ ఉప ఎన్నిక విషయంలో ఆ పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల్లో కదలిక కనిపించడంలేదు. టీఆర్ఎస్కు సంబంధించి అన్ని నిర్ణయాలు అధినేత కేసీఆర్ చేతుల్లోనే ఉన్నా... ఎన్నికల విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి కలిగిస్తోంది. టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న కొందరు నేతలు తప్పితే.. మిగిలిన వారు ఈ విషయంపై చర్చ కూడా జరపడంలేదు. మొత్తంగా వరంగల్ ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్లో పూర్తిగా స్తబ్దత నెలకొంది. ఉపఎన్నిక విషయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు పీసీసీ చీఫ్ వంటి నేతలు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మూడు వారాలకు ఓ సారి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, డి.శ్రీధర్‌బాబు వంటి నేతలు నియోజకర్గాల బాధ్యతలను తీసుకున్నారు. జిల్లా నేతలు వీరికి అనుబంధంగా పనిచేస్తున్నారు. సమావేశాలు నిర్వహించడం బాగానే ఉన్నా... పార్టీ ప్రకటించిన ప్రకారం కార్యక్రమాలు జరగడంలేదనే అసంతృప్తి కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మండల, డివిజన్, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు కోసమే నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ పెద్దలు ప్రకటించినప్పటికీ.. అవి పూర్తి స్థాయిలో ఆచరణకు రావడంలేదు. ఎక్కువ మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయకుండా దాటవేస్తున్నారు. టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ఏ పార్టీ పోటీ చేయాలనే విషయంలో స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడలేదు. రెండు పార్టీలు బరిలో దిగాలని భావిస్తున్నాయి. పైకి కూటమి గా కనిపిస్తున్నా... రెండు పార్టీలు ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నిక విషయంలో సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ముఖ్యనేతలు జిల్లాకు ఎక్కువగా వస్తున్నారు. టీడీపీ సైతం కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టింది. వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాయి. సీపీఎం, సీపీఐ పార్టీలు ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికలు లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఇటీవలే కార్యాచరణ సిద్ధం చేసింది. వైఎస్సార్సీపీ ముఖ్య నేత షర్మిల పరామర్శ యూత్ర త్వరలో మొదలయ్యే అవకాశం ఉండడంతో పార్టీ నాయకులు ఈ మేరకు ఏర్పా ట్లు చేస్తున్నారు. మొత్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీల్లో వరంగల్ లోక్‌సభ ఎన్నిక వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. -
మీ రాక కోసం..
ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్య కేసీఆర్ రాక జిల్లాలో రెండు రోజులు సీఎం టూర్ ఎంపీ టిక్కెట్ ఆశావహుల ఎదురుచూపు కేసీఆర్‌తో ప్రత్యేక భేటీకి ప్రయత్నాలు వరంగల్ : వరంగల్ లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పేరుకు ఉప ఎన్నిక అయినా వరంగల్ లోక్‌సభ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానుంది. ఈ ఎన్నిక ఫలితం ఆధారంగా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఎలా ఉండబోయేది స్పష్టం కానుంది. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారనుంది. కీలకమైన ఈ ఎన్నికలో టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ఆ పార్టీలోని దళిత నేతలు ప్రయత్నాలు తీవ్రం చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 7న జిల్లాకు రానున్నారని సమాచారం. ఆ రోజు కాకుంటే, ఈ నెల 10 లోపే కేసీఆర్ జిల్లా పర్యటన ఉంటుందని.. రెండు రోజులు జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. మొదట హరితహారంలో పాల్గొని రాత్రి వరంగల్‌లోనే బస చేస్తారని.. మరుసటి రోజు గ్రేటర్ వరంగల్‌లో ఇళ్ల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన ఉంటుందనే సమాచారం ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నాయకుల్లో ఆశలు కలిగిస్తోంది. కేసీఆర్‌ను ఎలాగైనా స్వయంగా కలిసి తమ ఆకాంక్షను తెలియజేయాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కీలక నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ద్వారా సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరికివారు వ్యక్తిగతంగా కలవడంతోపాటు.. జిల్లా నేతలుృబందంగా కేసీఆర్ వద్దకు వెళ్లి స్థానిక నేతలకే టిక్కెట్ ఇవ్వాలని కోరాలని భావిస్తున్నారు. పెరుగుతున్న జాబితా.. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక టీఆర్ఎస్ టిక్కెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై గులాబీ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఎన్నిక ఎప్పుడు జరుతుందనే విషయంలో స్పష్టత లేకున్నా.. టిక్కెట్ ఆశించే వారి జాబితా రోజురోజుకు పెరుగుతోంది. టీఆర్ఎస్ నేతలు గుడిమల్ల రవికుమార్, జోరిక రమేశ్, పసునూరి దయాకర్, చింతల యాదగిరి, జన్ను జకారియా, ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ పి.ఎస్.సుగుణాకర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య, బూజుగుండ్ల రాజేంద్రకుమార్ టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు టీఆర్ఎస్ ముఖ్యనేతలు టి.హరీశ్‌రావు, కె.తారకరామారావు, కె.కవితకు సంబంధించిన ఉద్యమ కేసులో వరంగల్ కోర్టులో న్యాయవాదిగా వ్యవహరిస్తున్న గుడిమల్ల రవికుమార్ టిక్కెట్‌పై ఆశలుపెట్టుకున్నారు. జనగామ కేంద్రంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ నాయకుడు డాక్టర్ పి.ఎస్.సుగుణాకర్‌రాజు.. అరుదైన శస్త్ర చికిత్సలు, దళిత ఉద్యమాలలో కీలకంగా పని చేయడం తనకు అనుకూల అంశాలని భావిస్తున్నారు. జిల్లాలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ద్వారా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. కొసమెరుపు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభ స్థానానికి జూన్ 11న రాజీనామా చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్‌ను ఢిల్లీలో స్వయంగా కలిసి కడియం తన రాజీనామా లేఖను అందజేశారు. కడియం శ్రీహరి రాజీనామా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. దీంతో సాంకేతికంగా వరంగల్ లోక్‌సభ స్థానం ఇంకా ఖాళీ కానట్లేనని నిపుణులు చెబుతున్నారు. -
‘పొన్నాల’పై పోరు
- ప్రత్యర్థుల విమర్శల దాడి - ఎన్నికలకు దూరంగా పెట్టే వ్యూహం - అయోమయంలో పొన్నాల లక్ష్మయ్య వర్గం - కాంగ్రెస్‌లో కొత్త రాజకీయం సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో కొత్త రాజకీయం మొదలవుతోంది. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గం లక్ష్యంగా ప్రత్యర్థులు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. లోక్‌సభ ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో పొన్నాలకు పార్టీ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండా ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన లక్ష్మయ్యను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శల దాడి పెంచుతుండడం దీనినే సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 25న జరిగిన పార్టీ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముందే పలువురు కార్యకర్తలు పొన్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారిని కాదని.. సొంత వాళ్లకు టిక్కెట్ వచ్చేలా చేసిన కారణంగానే జిల్లాలో పార్టీ ఘోర పరాజయం పాలైందని గుర్తు చేశారు. కార్యకర్తల సభలోనూ పొన్నాల అనుచరులే ఎక్కువ మంది ఉండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో, లోక్‌సభ ఉప ఎన్నికలో పొన్నాలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని గట్టిగా నినాదాలు చేశారు. దీనికి కొనసాగింపుగా.. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ ములుగులో పొన్నాలపై నేరుగా విమర్శలు చేశారు. పొన్నాల కారణంగానే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. పొన్నాల ప్రత్యర్థివర్గంగా ఉన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బస్వరాజు సారయ్య, పోదెం వీరయ్యలతో కలిసి బలరాంనాయక్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నాలను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రత్యర్థి వర్గం ఇలా వరుసగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. పొన్నాల వర్గీయులు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ సభలో నాయకులకు వ్యతిరేకంగా కొందరు మాట్లాడడం సాధారణంగా జరిగేదేనని పేర్కొంటున్నారు. పొన్నాలకు తగ్గుతున్న ప్రాధాన్యం మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో క్రియాశీలంగా ఉంటున్న పొన్నాల లక్ష్మయ్యకు సాధారణ ఎన్నికల తర్వాత ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. పదేళ్లపాటు వరుసగా మంత్రి పదవిలో ఉన్న ఆయనజిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. తెలంగాణకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటుతో మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సారథిగా వ్యవహరించారు. టిక్కెట్ల పంపిణీ విషయంలో జిల్లాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డికి టిక్కెట్ రాకుండా చేశారనే ప్రచారం పొన్నాలకు అప్రతిష్టత తెచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సాధారణ ఎన్నికల్లో పొన్నాల ఓడిపోవడం.. దొంతి మాధవరెడ్డి గెలవడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలను పీసీసీ పదవి నుంచి తొలగించింది. దీంతో పొన్నాల ప్రత్యర్థి వర్గం క్రియాశీలంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికలను వేదికగా మార్చుకుని జిల్లా కాంగ్రెస్‌లో పొన్నాల ప్రభావాన్ని పూర్తిగా లేకుండా చేసేందుకు సిద్ధమవుతోంది. పొన్నాల వర్గీయులు ఈ పరిమాణాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు. ఎన్నికల నాటికి రెండు వర్గాల రాజకీయం ఎటువైపు దారితీస్తోందనేది ఆసక్తికరంగా మారింది. ఇంటర్లో పలు సబ్జెక్టుల్లో మారిన సిలబస్ విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్లో ఈ విద్యాసంవత్సరంలో కొన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి సిలబస్ మారినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఎం.మలహల్రావు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో ద్వితీయ భాష తెలుగు, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వాణిజ్యశాస్త్రం,ద్వితీయ సంవత్సరంలో చరిత్ర సిలబస్ మారిందని, కొత్త పాఠ్యపుస్తకాలు త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. -
లక్ష మెజార్టీ బాధ్యతను పెంచింది
తిరుపతి కార్పొరేషన్ భర్త చనిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను తిరుపతి ప్రజలు ఉప ఎన్నికల్లో 1.16 లక్ష ల ఓట్లతో గెలిపించి పెద్ద బాధ్యత అప్పగించారని ఎమ్మెల్యేగా గెలిచిన మన్నూరు సుగుణమ్మ చారిత్రాత్మక విజయం అందించినందుకు తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. బయటకు రాలేని పరిస్థితి లో ఎన్నికల్లోకి వచ్చిన తనపై తిరుపతి ఓటర్లు సానుభూతి చూపించారన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తనపై అభ్యర్థిని పోటీకి దింపకపోవడం, ఆ పార్టీ తిరుపతి నాయకుల సహకారంతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐల మద్ధతుతో చారిత్రాత్మక విజ యాన్ని సొంతం చేసుకున్నానని తెలిపారు. అందుకు కారణమైన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చింతా మోహన్ స్వార్థంతో తనపై పోటికి అ భ్యర్థిని దింపడం, చనిపోయిన వ్యక్తిపై అవినీతి ఆ రోపణలు చేశారని వి మర్శించారు. దీనిని తిరుపతి ప్రజలు నమ్మకపోగా ఓటు ఆయుధం తో తీర్పు చెప్పారని తెలిపారు. తన భర్త ఆశయాలను నెరవేరుస్తామన్నారు. తిరుపతి ప్రజలు వేసవిలో నీటిఎద్దడి ఎదుర్కొంటున్నారని, ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆమె వెంట కుటుంబ స భ్యులు, పార్టీ నాయకులు శ్రీధర్‌వర్మ, దంపూ రి భాస్కర్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, మునిశేఖర్, ఆముదాల తులసీరామ్, పు ష్పావతి, విజ యల క్ష్మి, లతారెడ్డి, గంగులయ్య ఉన్నారు. -
ఇక సమరమే..
బరిలో 13 మంది అభ్యర్థులు చివరివరకు టీడీపీ బేరసారాలు ఫలించని ఏకగ్రీవం యత్నాలు సానుభూతిపైనే సుగుణమ్మ ఆశలు వ్యతిరేకత కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా తిరుపతి: ఉప ఎన్నికలో పోటీ అనివార్యమైంది. ఏకగ్రీవం కోసం తెలుగుదేశం పడరాని పాట్లు పడింది. అభ్యర్థులను పోటీ నుంచి ఉపసంహరించేందుకు బేరసారాలకు దిగింది. అన్ని ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో పోటీలో తలపడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశాక ఆసక్తికర పరిమాణాలు చోటుచేసుకున్నాయి. ఏకగ్రీవం కోసం నేరుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితోనే కొంతమంది రహస్య మంతనాలు జరిపారు. దీనిని ముందే పసిగట్టిన మాజీ ఎంపీ చింతామోహన్ తన నివాసం నుంచి పార్టీ అభ్యర్థి ఎక్కడికి వెళ్లకుండా కట్టుదిట్ట ఏర్పాట్లు చేసుకోవడంతో దేశం ఆశలు గల్లంతయ్యాయి. ఓ దశలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు ముందే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదట దీనిని తేలికగా తీసుకున్నా పార్టీ అభ్యర్థి బరిలో దిగిన తరువాత తెలుగుదేశం పార్టీ అందోళనకు గురై బేరసారాలకు ప్రయత్నించింది. దీనికితోడు కొంత మంది తెలుగు దేశం నేతలు సైతం ఎన్నికల ఖర్చు భరిస్తామని పోటీ నుంచి ఉపసంహారించుకోవద్దని స్వతంత్ర అభ్యర్థులను ప్రలోభ పెట్టినట్లు తెలిసింది. దీన్ని బట్టే టీడీపీ అభ్యర్థిపై పార్టీలో ఎంత వ్యతిరేఖత వ్యక్తమయ్యేదీ అర్థమైపోతోంది. సానుభూతిపైనే ఆశలు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సానుభూతిపైనే ఆశలు పెట్టుకొంది. పార్టీలో అసమ్మతి అభ్యర్థికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కడ పుట్టి ముంచుతాయోనని అధిష్టానం అందోళన చెందుతోంది. గత ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తమవుతోందనే సంకేతాలు వెళతాయని దేశం పార్టీ ముఖ్య నేతలు సైతం హైరానా పడుతున్నట్లు పార్టీవర్గాలే పేర్కొంటున్నాయి. ఉపఎన్నిక గండం నుంచి గట్టేక్కెదెలా అని అధిష్టానం తల పట్టుకుంటున్నట్లు సమాచారం కాంగ్రెస్‌లో అసమ్మతి.. కాంగ్రెస్ అభ్యర్థిని సైతం అసమ్మతి వెంటాడుతూనే ఉంది. మాజీ ఎంపీ చింతామోహన్ తప్ప ఆమెకు ఎవరూ సహకరించడం లేదు. దీంతో అభ్యర్థికి ఒంటరి పోరు తప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతపై ఆశలు పెట్టుకుంది. డ్వాక్రా రుణాల మాఫీ కాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ అంశం కలసి వస్తుందని అంచనా వేస్తోంది. -
కాంగ్రెస్‌లో ముసలం
ఉప ఎన్నికల అభ్యర్థికి దూరంగా ముఖ్య నేతలు చింతామోహన్ ఏకపక్ష నిర్ణయాలపై కినుక బుజ్జగించేందుకు ఫిబ్రవరి రెండున రఘువీరా రాక అధిష్టానం నగరంలో కాంగ్రెస్ పార్టీ నేతలను సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం, పార్టీ అధికార ప్రతినిధి ఆశోక్ సామ్రాట్, పీసీసీ కార్యదర్శి ఎన్.శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాగంటి గోపాల్‌రెడ్డిలను చింతామోహన్‌తో కలిసి చర్చించి పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయాలని సూచించింది. వీరంతా చింతాతో సమావేశమైనప్పటికీ సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి వెంట కేవలం చింతామోహన్‌తో పాటు డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. మిగతా పార్టీ శ్రేణులంతా అసంతృప్తితో రగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మబ్బు దేవనాథరెడ్డితో పాటు ప్రమీలమ్మ వంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యర్థికి సహకరించేది లేదని తెగేసి చెప్పినట్లు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. రంగంలోకి పీసీసీ నేత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడంతో సమస్యను పరిష్కరించేందుకు ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఫిబ్రవరి రెండో తేదీన తిరుపతికి వస్తున్నట్లు సమాచారం. ఆయన అసంతృప్త నేతలను బుజ్జగించి సమష్టిగా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కూడా కొంత మంది నేతలు డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థికి సహకరించేది లేదని ఖరాఖండిగా తెగేసి చెప్పినట్లు సమాచారం. కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ పరువు ఎలా కాపాడుకోవాలని పార్టీ అధినేతలు తలలు పట్టుకుంటున్నారు. -
తిరుపతి ఉప ఎన్నికకు మోగిన నగారా
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 19న నోటిఫికేషన్.. అదే రోజున నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 19న జారీచేయనున్నారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 27 తుదిగడువు. ఈనెల 30 మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంల్లో పోలైన ఓట్లను ఫిబ్రవరి 16న లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ఎం.వెంకటరమణ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. తిరుపతి శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసివిజయం సాధించారు. అనారోగ్యం బారిన పడిన వెంకటరమణ డిసెంబర్ 15న చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అంటే ఫిబ్రవరి 19 వరకూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతారన్నది చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం.సుగుణను బరిలోకి దించుతారా..? వారి కుటుంబ సభ్యుల్లో మరొకరిని పోటీకి దించుతారా..? ఇతరులను బరిలోకి దించుతారా...? అన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే ఉప ఎన్నిక ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
మార్చిలో ఉప ఎన్నిక
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం పెద్ద విషయం కాకున్నా, జయను పదవీచ్యుతురాలిని చేసిన శ్రీరంగం కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన కారణంగా 1951 సెక్షన్ 8 ప్రకారం జయ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటిస్తే గానీ శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లుగా ఈసీ పరిగణించదు. బెంగళూరు కోర్టు నుంచి జయ శిక్షకు సంబంధించిన నకలు పత్రాలు రావడంలో జాప్యం చోటుచేసుకుంది. శ్రీరంగంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు తహతహలాడుతూ ఈసీపై ఒత్తిడి పెంచాయి. జయలలిత జైలు శిక్ష కోర్టు పత్రాల పరిశీలనను అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ పూర్తిచేశారు. సాంకేతికంగా నిర్ధారించుకున్న తరువాత ఈనెల 8వ తేదీన శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. నిర్ధారణ పత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పంపగా, వారి ద్వారా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌కు చేరడం కూడా పూర్తయింది. చర్యలు చేపట్టిన ఈసీ: అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరిపించాలని ఈసీ నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో ఓటర్ల జాబితా పనులు సాగుతున్నాయి. కొత్త ఓటర్ల చేరిక, ఇటీవలే పంపిణీ చేసిన కలర్ గుర్తింపు కార్డుల్లో తప్పుల సవరణ వంటి చర్యల్లో ఈసీ తలమునకలై ఉంది. సవరింపులు పూర్తయి జనవరి 5వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఆరునెలల్లోగా ఉప ఎన్నిక అంటే మార్చి 27వ తేదీకి గడువు పూర్తికానుంది. ఓటర్ల తుది జాబితా సిద్ధమైన తరువాతనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమిళులు ఎక్కువగా సంబరాలు జరుపుకునే జనవరి పొంగల్ పండుగ నాటికి ఉప ఎన్నికల కోలాహలంలో శ్రీరంగం మునిగి తేలే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకం: సెలబ్రెటీలు వాడి వదిలేసిన వస్తువులకు వచ్చే గిరాకీ, మోజు వంటిదే తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పడింది. జయలలితను మాజీ ముఖ్యమంత్రిని చేసిన నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్నాడీఎంకే సైతం సహజంగానే శ్రీరంగం చేజారిపోకుండా కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎన్నికల సమయంలో తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా శ్రీరంగంను ఎగరేసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు విజయం ఆమడదూరంలో ఉండిపోయింది. ఉప ఎన్నిక, పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటా అన్నాడీఎంకేదే విజయకేతనంగా మారిపోయింది. అమ్మధాటికి తట్టుకోలేక నీరసించిపోయిన ప్రతిపక్షాలు వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఉప ఎన్నిక ద్వారా ఊపిరి పోసుకోవాలని ఆశపడుతున్నాయి. -
బైపోల్లో బీజేపీ బోల్తా
-
కమిలిన కమలం
ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ 24 సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకుగాను 10 సీట్లలోనే గెలుపు యూపీలో సమాజ్‌వాదీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా గుజరాత్లో కమలనాథులకు ఊరట మోదీ స్థానం వడోదరలో బీజేపీకి భారీగా తగ్గిన మెజారిటీ 3 లోక్‌సభ స్థానాల్లో ఒక్కోటి చొప్పున దక్కించుకున్న బీజేపీ, సమాజ్‌వాదీ, టీఆర్ఎస్ ఫలితాలు వెలువడిన 32 అసెంబ్లీ స్థానాలకు బీజేపీకి 12, ఎస్పీకి 8, కాంగ్రెస్‌కు 7 ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున దక్కించుకున్న టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, ఏఐయూడీఎఫ్ సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు 20న వెలువడనున్న ఆంటాగఢ్ అసెంబ్లీ స్థానం ఫలితాలు సీనియర్లను పక్కనపెట్టిన ఫలితమే: బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా ఉప ఎన్నికల ఫలితాల్లో చతికిలపడ్డ బీజేపీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని ఒక ఊపు ఊపి సంచలనం సృష్టించిన కమలనాథులకు ఊహించని షాక్ ఇది. అధికారం చేపట్టిన తర్వాత అతికొద్ది కాలంలోనే జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ చతికిలపడింది. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభావం కూడా కనిపించలేదని స్పష్టమవుతోంది. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో మొన్నటివరకు తమ చేతిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో(1 మిత్రపక్షం) 14 సీట్లను బీజేపీ ఇప్పుడు కోల్పోయింది. 20న ఆంటాగఢ్ ఫలితాలు.. సోమవారం ఫలితాలు వెలువడిన 9 రాష్ట్రాల్లోని 32 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 12 గెలుచుకోగా.. కాంగ్రెస్ ఏడు, సమాజ్‌వాదీ పార్టీ 8, టీడీపీ, ఏఐయూడీఎఫ్, టీఎంసీ, సీపీఎంలు ఒక్కో స్థానం చొప్పున దక్కించుకున్నాయి. సిక్కింలోని ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, ఎస్పీలు ఒక్కోటి చొప్పున దక్కించుకున్నాయి. ఆ పార్టీల స్థానాలు ఆ పార్టీలకే దక్కాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఆంటాగఢ్ స్థానం ఫలితాలు ఈ నెల 20న వెలువడతాయి. ఎన్నికల ఫలితాలు మోదీకి పరీక్ష కాదని బీజేపీ పేర్కొంటున్నప్పటికీ, ప్రతికూల ఫలితాలపై సమీక్ష చేయాల్సిన అవసరం ఉందంటున్నాయి. యూపీ, రాజస్థాన్‌లో ఫలితాలు బీజేపీని నిరుత్సాహానికి గురిచేయగా, గుజరాత్లో ఆరు స్థానాల్లో గెలవడం, బెంగాల్లో ఖాతా తెరుచుకోవడం కొంత ఊరటనిచ్చింది. యూపీలో దూసుకెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ... యూపీలో సమాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్లింది. సార్వత్రిక ఎన్నికల్లో 73 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా రావడం కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉప ఎన్నిక జరిగిన 11 స్థానాల్లో 10 స్థానాలు బీజేపీ అభ్యర్థులు, 1 బీజేపీ మిత్రపక్షం అప్నాదళ్ ఖాళీ చేసినవే. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ మూడు స్థానాల్లోనే విజయం సాధించింది. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు ఎస్పీ ఖాతాలోకి వెళ్లాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్ సత్తాచాటుకున్నారు. నోయిడా, సహరన్‌పుర్, తూర్పు లక్నో అసెంబ్లీ స్థానాల్లో కమలం వికసించగా, బిజ్నోర్, ఠాకుర్ద్వారా, నిఘాసన్, హమీర్పుర్, చర్ఖారి, సిరాథు,బల్హా, రొహానియా అసెంబ్లీల్లో ఎస్పీ అభ్యర్థులు గెలిచారు. గుజరాత్లో బీజేపీకి ఊరట..గుజరాత్లో అధికారంలో ఉన్న బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిచ్చింది. అక్కడ క్లీన్‌స్వీప్ చేయాలనుకున్న బీజేపీ కలలు కల్లలయ్యాయి. 9 అసెంబ్లీను గెలిపించి ప్రధాని మోదీకి జన్మదిన కానుక ఇవ్వడానికి ఆ రాష్ట్ర సీఎం ఆనంది చేసిన హామీ చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా మారింది. ఫలితాలు మాత్రం బీజేపీకి కొంత ఊరటనిచ్చాయి. వడోదర లోక్‌సభతో పాటు, మనినగర్, టంకారా, తేలాజా, ఆనంద్, మటర్, లిమ్ఖేడా అసెంబ్లీను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకోగా, దీసా, ఖంభాలియా, మంగ్రోల్లలో కాంగ్రెస్ గెలిచింది.. మోదీ ఖాళీ చేసిన వ డోదరలో బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్.. కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్రపై 3.29 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో ఈ స్థానాన్ని మోదీ 5.7 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా..రాజస్థాన్‌లోని అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానం (దక్షిణ కోటా నియోజకవర్గం)లో గెలుపొందగా, మిగిలిన మూడు స్థానాలు.. సూరజ్గర్హ, వుయీర్, నసీరాబాద్ అసెంబ్లీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈశాన్యంలోనూ కమలానికి ప్రతికూల ఫలితాలొచ్చాయి. త్రిపురలోని మను అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకోగా, సిక్కింలోని రామ్గంగ్-యాన్గంగ్ అసెంబ్లీ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అస్సాంలో సిలిచర్‌లో బీజేపీ, లఖీపుర్లో కాంగ్రెస్, జమునాముఖ్లో ఏఐయూడీఎఫ్ గెలిచాయి. పశ్చిమబెంగాల్లో ఖాతా తెరిచిన బీజేపీ బెంగాల్‌లోని చౌరంగి నియోజకవర్గంలో బీజేపీ గెలుపొందగా, దక్షిణ బషీర్హాట్ స్థానం టీఎంసీకి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థిని తంగిరాల సౌమ్య గెలుపొందారు. తెలంగాణలోని మెదక్ లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి కె.ప్రభాకర్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. -
నందిగామలో టీడీపీ ఘనవిజయం
74,827 ఓట్ల మెజారిటీతో తంగిరాల సౌమ్య గెలుపు ప్రతిపక్షం పోటీ చేయకపోవడంతో అధికార పార్టీకి భారీ మెజారిటీ నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య 74,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి తంగి రాల ప్రభాకర్‌రావు ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగిన విషయం తెలి సిందే. అయితే.. గత సంప్రదాయాలను అనుసరించి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవతా దృక్పథంతో ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేదు. టీడీపీ అభ్యర్థిగా తం గిరాల సౌమ్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు, స్వతంత్ర అభ్యర్థులుగా కటారపు పుల్లయ్య, మాతంగి పుల్లారావులు పోటీ చేశా రు. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన ఎన్నికల కమిషన్.. మంగళవారం ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 99,748 ఓట్లు రాగా.. కాం గ్రెస్ అభ్యర్థికి 24,961 ఓట్లు వచ్చి డిపాజిట్ దక్కించుకున్నారు. ఇటీవల సాధారణ ఎన్నికల్లో కేవలం 5,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన టీడీపీకి.. ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పోటీలో లేకపోవటంతో ఈసారి భారీ మెజారిటీ లభించింది. మా పనితీరును ప్రజలు ఆమోదించారు: చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ వంద రోజుల పరిపాలనపై ప్రజా తీర్పుకు కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపే నిదర్శనమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభివర్ణించారు. -
కంగుతిన్న కమలనాథులు
అంతలోనే నరేంద్రమోదీ కథ అడ్డం తిరిగిందా? నాలుగు మాసాల క్రితం ప్రభంజనం సృష్టించిన మోదీ ఇంత వేగంగా సమ్మోహన శక్తిని కోల్పోయాడా? పది రాష్ట్రాలలో మూడు లోక్‌సభ స్థానాలకూ, 33 అసెంబ్లీ స్థానాలకూ జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాదాపు సగం స్థానాలు కోల్పోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్వత్రిక ఎన్నికలలో భాజపా ఘనవిజయాలు సాధించిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కమలనాథులకు బలమైన ప్రతికూల పవనాలు వీచడం వెనుక కారణాలు ఏమిటి? కేంద్రంలో మోదీ సర్కార్ పనితీరు పట్ల వైముఖ్యమా? రాష్ట్రాలలో బీజేపీ నేతల నిర్వాకమా? లేకపోతే భాజపా కొత్త సారథి అమిత్ షా వైఫల్యమా? మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన భాజపా సభ్యులు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసిన కారణంగా అవసరమైన ఉప ఎన్నికలలో భాజపా, దాని మిత్రపక్షాలు అవలీలగా గెలుపొందుతాయని అందరూ ఊహించారు. చావుదెబ్బ తిన్న కొద్ది మాసాలకే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు లేచినిలబడతాయని కానీ, సీట్లు గెలుచుకుంటాయని కానీ ఎవ్వరూ అనుకోలేదు. లోక్‌సభ ఎన్నికలలో భాజపా విజయం విస్తృతి ఎంత అనూహ్యమో ఈ ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి సైతం అంతే ఆశ్చర్యకరం. లోక్‌సభ ఎన్నికలలో భాజపా అద్భుత విజయానికి ప్రధాన కారణం మోదీ అసాధారణ ప్రచార వ్యూహం అయితే, రెండవ ముఖ్యకారణం కాంగ్రెస్ దయనీయ స్థితి. పదేళ్ల అస్తవ్యస్త పరిపాలన, కుంభకోణాల ఫలితంగా దిగజారిన ఆత్మవిశ్వాసం, పేలవంగా సాగిన ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పోలింగ్‌కు పూర్వమే పరాజయాన్ని అంగీకరించాయి. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలనూ, అవినీతి చరిత్రనూ ఎండగడుతూ నరేంద్రమోదీ శక్తిమంతంగా సాగించిన ఎన్నికల ప్రచార హోరు, ప్రసార, ప్రచార సాధనాలను అత్యంత చాకచాక్యంగా ఆయన వినియోగించుకున్న తీరు భాజపాకు అపూర్వమైన ఫలితాలు సాధించిపెట్టాయి. నాలుగు నెలల కిందటి వాతావరణం వేరు. అప్పటి ఎన్నికలలో ఓటర్లు జాతీయ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించారు. చాలా స్పష్టమైన, నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన తీర్పు ఇచ్చారు. జాతీయ స్థాయిలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటానికి దారి చూపించారు. రాష్ట్రాలలో గత వారం జరిగిన ఎన్నికలపైన ఆయా రాష్ట్రాలలోని రాజకీయ వాతావరణం, అక్కడి ప్రజల మధ్య నలుగుతున్న చర్చనీయాంశాలు ప్రభావం చూపించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉప ఎన్నికలలో వివిధ పార్టీలు అనుసరించిన వ్యూహాలు ఫలితాలను నిర్ణయించాయి. ఈ వ్యూహాలు సార్వత్రిక ఎన్నికలలో విజయాన్ని లేదా పరాజయాన్ని ఆయా పార్టీలు అర్థం చేసుకున్న విధానం ప్రకారం రూపొందుతాయి. ఎన్నికలలో పరాజయాన్ని అర్థం చేసుకోవడం తేలిక. విజయాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అమిత్ షా యూపీలో తన ఘనవిజయాన్ని అపార్థం చేసుకున్న కారణంగానే ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను మతతత్వం మూర్తీభవించిన యోగి ఆదిత్యనాథ్‌కు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సృష్టించిన మతావేశ పూరితమైన వాతావరణం, మతప్రాతిపదికపైన ప్రజల సమీకరణం కారణంగా యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలలోనూ 71 స్థానాలను భాజపా కైవసం చేసుకున్నదని భ్రమించిన భాజపా ప్రేమోగ్రవాదం (లవ్‌జిహాద్) పేరుమీద చేసిన ప్రమాదకరమైన ప్రచారాన్ని ప్రజలు హర్షించలేదు. మోదీ నియోజకవర్గం వారణాసి సరిహద్దులోని అసెంబ్లీ స్థానంలో సైతం ఎస్పీ గెలుపొందింది. భాజపా ఓడిపోయినంత మాత్రాన యూపీ ముఖ్యమంత్రి చెప్పుకున్నట్టు మతశక్తులు పరాజయం పాలై లౌకికశక్తులు విజయం సాధించాయని భావించనక్కరలేదు. ఎస్పీ గెలుపొందిన మాట వాస్తవమే కానీ ఆ పార్టీ లౌకికపార్టీ అని చెప్పుకునే అర్హత... నిరుడు ముజఫర్‌నగర్‌లో మతకలహాలు చెలరేగినప్పుడు అఖిలేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అభిశంసించినప్పుడే కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పోటీచేయకపోవడం కూడా ఎస్పీకి లాభించిందని భావించాలి. గుజరాత్‌లోని తొమ్మిది భాజపా స్థానాలలో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం కొత్త ముఖ్యమంత్రి ఆనందినీ బెన్ను ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆమోదించ లేదనీ, మోదీ హస్తినకు వెళ్లడాన్ని పూర్తిగా జీర్ణించుకోలేదనీ భావించాలి. ఇక రాజస్థాన్‌లో నాలుగు స్థానాలలో మూడింటిని అధికార పార్టీ కోల్పోవడానికి కారణం ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా పాలన తీరుతెన్నుల పట్ల ప్రజలు ప్రదర్శించిన ఆగ్రహంగా గుర్తించాలి. కొన్ని మాసాల కిందటే మొత్తం 200 అసెంబ్లీ స్థానాలలో 163 స్థానాలు కైవసం చేసుకొని ఘనవిజయం సాధించిన వసుంధర పదకొండు మందికే కేబినెట్‌ను పరిమితం చేయడం, తన చేతిలో 47 శాఖలు పెట్టుకోవడం, ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలుసుకోవాలి.. మోదీ, ములాయంసింగ్ యాదవ్, సరికొత్త రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖాళీ చేసిన లోక్‌సభ స్థానాలను వారి పార్టీ అభ్యర్థులే గెలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు. మెదక్ లోక్‌సభ స్థానంలో విజయబావుటా ఎగురవేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రాబల్యాన్ని నిలుపుకున్నట్టు నిరూపించుకున్నది. అదే విధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం తన పార్టీకి చెందిన నందిగామ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఈసారి వైఎస్సార్సీపీ రంగంలో లేకపోవడం అక్కడ టీడీపీకి ఎక్కువ మెజారిటీ రావడానికి కారణమయింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు భాజపాకు మొదటి హెచ్చరిక చేశాయి, వాపును బలుపుగా భావించరాదనీ, ప్రభంజనం ఒకసారి వచ్చి వెళ్లిపోయేదే కానీ శాశ్వతంగా ఉండదనీ భాజపా నేర్చుకోవలసిన మొదటి పాఠం. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా ప్రతిసారీ అదృష్టం వరిస్తుందని ఆశించడం అత్యాశ. యూపీలో మతభావనలు రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని మతప్రాతిపదికపైన చీల్చిన ఫలితంగా లోక్‌సభ ఎన్నికలలో యూపీలో ఘనవిజయం సాధించినట్టు భాజపా అంచనా వేసుకోవడం శుద్ధతప్పు అని కూడా గ్రహించాలి. వ్యూహాత్మకంగా మోదీ అభివృద్ధి మంత్రాన్ని ప్రచారం చేస్తూ అమిత్ షా మతావేశాన్ని రాజేసే కార్యక్రమాలను పరోక్షంగా అనుమతిస్తూ సాగించిన జమిలి వ్యూహం విజయానికి కారణం కాదనీ, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మోదీ సకారాత్మక ప్రచారం, ఆత్మన్యూనతకు లోనైన కాంగ్రెస్ పేలవమైన పోరాటం సార్వత్రిక ఎన్నికలలో భాజపాకి కనీవినీ ఎరుగని విజయం అందించాయని అధికారపార్టీ అగ్రనాయకత్వం అర్థం చేసుకోవాలి. ఘోరపరాజయం పాలైనప్పటికీ సర్వస్వం కోల్పోలేదనీ, పార్టీని పునర్నిర్మించుకునే అవకాశం ఉన్నదనీ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలలో సందేశం ఉంది. -
ఉప ఎన్నిక కౌంటింగ్ నేడు
నందిగామ : ఉప ఎన్నికల కౌంటింగ్ సమర్థంగా నిర్వహిం చేందుకు కౌంటింగ్ విధులు నిర్వహించే వారు అధికారులకు సహకరించాలని నియోజవకర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు పలు శాఖల అధికారులకు సూచించారు. నందిగామ కేవీఆర్ కళాశాలలో మంగళవారం జరిగే కౌంటింగ్‌లో అధికారులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహించేటప్పుడు అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్‌లో ఉన్న ఈవీఎంలు లెక్కింపు కేంద్రానికి తీసుకువచ్చేటప్పుడు, లెక్కించే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. నందిగామ తహశీల్దార్ ఎంసీహెచ్ నాగేశ్వరరావుతో పాటు ఎంపీడీవో పి.సుశీల పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతం
69.46 శాతం పోలింగ్ నమోదు గతం కంటే 15.54 శాతం తగ్గిన పోలింగ్ 16న ఓట్ల లెక్కింపు నందిగామ : నందిగామ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శనివారం ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది. ఓటర్ల నుంచి స్పందన కొరవడటంతో పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. మూడు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం 15.54 శాతం తక్కువగా 69.46 శాతం పోలింగ్ నమోదైంది. టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ సిట్టింగ్ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ తరఫున తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బోడపాటి బాబురావు, సీపీఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా వీరులపాడు మండలానికి చెందిన మాతంగి పుల్లారావు, మరో స్వతంత్ర అభ్యర్థిగా నందిగామకు చెందిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి కటారపు పుల్లయ్య పోటీ చేశారు. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ సాగింది. పోలింగ్ సరళి ఇలా... ఉదయం ఏడు గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో 181వ నంబరు పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించటంతో అరగంట సేపు పోలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. వెంటనే అధికారులు పరిస్థితిని చక్కదిద్దటంతో పోలింగ్ యథావిధిగా కొనసాగింది. మధ్యాహ్నం వరకు పోలింగ్ మందకొడిగా సాగింది. ఉదయం 9 గంటలకు 12 శాతం నమోదైన పోలింగ్ క్రమేపీ పెరిగింది. 11 గంటలకు 26.55 శాతం, ఒంటి గంటకు 47 శాతం, 3 గంటలకు 56 శాతం, 5 గంటలకు 61 శాతం, చివరకు 69.46 శాతం నమోదైంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 200 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 129 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 15 బూత్‌లలో ఏజెంట్లు లేకపోవడంతో అధికార పార్టీకి అడ్డులేకుండా పోయింది. కంచికచర్లలో 30 మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, ఎస్పీ విజయ్‌కుమార్ పరిశీలించారు. చందర్లపాడు, కంచికచర్ల, నందిగామ, వీరులపాడు మండలాల్లో బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఆయన నందిగామలో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నందిగామలో పోలింగ్ బూత్‌లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని సమీక్షించారు. 1,400 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. 1,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పోలింగ్ ముగిసిన అనంతరం శనివారం రాత్రికి నందిగామలోని కేవీఆర్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎంలను తరలించారు. 16న కౌంటింగ్ నందిగామలోని కేవీఆర్ కళాశాలలో ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. సోమవారంలోపు కౌంటిం గ్‌కు ఏర్పాట్లు పూర్తి చేస్తామని రిటర్నింగ్ అధికారి పి.రజనీకాంతరావు తెలిపారు. -
ఓటరు చూపెటో?
సాక్షి, సంగారెడ్డి: మెదక్ లోక్‌సభ స్థానానికి శనివారం జరగనున్న ఉప పోరులో ఓటరు తన తీర్పు ఇవ్వనున్నాడు. ఈ మేర కు రెండు వారాలుగా పలు రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు విజయమే లక్ష్యంగా శ్రమించాయి. శనివారం ఎన్నికలు జరగనుండటంతో ఓటరు దేవుడు ఎటువైపు మొగ్గు చూపుతాడోనన్న ఉత్కంఠ ఆయా పార్టీల్లో నెలకొంది. మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,43,075 మంది ఓటర్లు ఉండగా వీరిలో 7.79 లక్షల పురుష, 7.63 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో మూడు చోట్ల వీరి తీర్పు కీలకం కానుంది. సంగారెడ్డి, పటాన్చెరు, సిద్దిపేట నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో స్థానికేతర ఓటర్లు ఉండటంతో స్థానికేతరులు వీరు ఎటు వైపు మొగ్గు చూపుతారోనని ప్రధాన పార్టీలు ఆరా తీస్తున్నాయి. టీడీపీ-బీజేపీలు స్థానికేతర ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలు, మైనార్టీల ఓటర్లపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ సంప్రదాయ ఓటు బ్యాంకుపైనే ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతోపాటు మైనార్టీలు ఉప పోరులో తమకు అండగా నిలుస్తాయని ఆ పార్టీ భరోసాతో ఉంది. టీఆర్ఎస్ పార్టీ తమ విజయం ఖాయమని, మెజార్టీపైనే మా దృష్టి అని చెబుతోంది. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఈ పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటుంది. దీంతో మూడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు మిగితా పార్టీల కంటే అధిక మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగితా నాలుగు నియోజకవర్గాల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉద్యోగులు, మైనార్టీలు తమకు అండగా ఉంటాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే మోడీ ప్రభావం, జగ్గారెడ్డి చరిష్మా, టీడీపీ ఓటు బ్యాంకు, యువత బలం తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు స్థానికేతర ఓటర్లు తమవైపు మొగ్గుచూపుతారని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఓటర్లు ఎటు వైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. ఓటరు ఆసక్తి చూపేనా... మెదక్ ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుదలకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంది. గత ఏడాది 77.23 శాతం పోలింగ్ నమోదు కాగా ఈ దఫా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇవి ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి. శనివారం ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికలు తెలంగాణలో తొలిసారి కావడం, కేసీఆర్ బరిలో ఉన్నందున ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవటంపై ఈ పరిస్థితి ఉంటుందో లేదోనన్న సంశయం వ్యక్తమవుతోంది. -
ఉప ఎన్నిక ఖాయం
నందిగామ కాంగ్రెస్ అభ్యర్థిగా బోడపాటి బాబూరావు నేడు నామినేషన్ నందిగామ : నందిగామ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు పార్టీ ప్రకటించడంతో పోటీ అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో ఉప ఎన్నిక జరుగనుంది. చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో ఉంటే పోటీ పెట్టకూడదని ఒక సంప్రదాయం ఉంది. ఆ క్రమంలోనే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను టీడీపీ అధిష్టానంతో సహా నాయకులంతా సౌమ్య ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరారు. ఇతర రాజకీయ పార్టీలు ఎవ రూ పోటీ చేయరని మంగళవారం మధ్యాహ్నం వరకు ప్రజలు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నందిగామ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బోడపాటి బాబురావును పోటీలో దింపుతున్నట్లు ప్రకటించడంతో పోటీ అనివార్యం కానుంది. చిన్న, చితకా పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను పోటీ చేయకుండా ఉంచేందుకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వారిని బుజ్జగించి నామినేషన్లు వేయకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అవాక్కయింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు మధ్య గట్టి పోటీ జరిగింది. తంగిరాల ప్రభాకరరావు 5212ఓట్లతో విజయం సాధించారు. కానీ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయకుండానే గుండెపోటుతో మరణించారు. -
ఈ ‘కుల’కలం ఫలితాలనిస్తుందా?
జననేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నితీష్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. జాతీయ రాజకీయ హీరోగా ఆవిర్భవించాలనే స్వప్నం ఫలించదని అర్థమైంది. రాజకీయ అస్తిత్వం కోసం పాతమిత్రులతో పొత్తు తప్పదని గ్రహించారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తెలి సిందే. బీహార్ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ (ఆర్జేడీ), నితీష్ కుమార్ (జేడీయూ) తమ విభేదాలను పక్కనబెట్టి 10 శాసనసభ స్థానాలకు ఆగస్టు 21న జరగనున్న ఉప ఎన్నికల్లో చే తులు కలిపారు. బీజేపీని ఐక్యంగా ఎదుర్కొనే ప్రాతిపదికన పొత్తు కుదుర్చుకుంటున్నామని నితీష్ ప్రకటించారు. సార్వ త్రిక ఎన్నికల్లో తల బొప్పి కట్టిన కాంగ్రెస్ కూడా పొత్తుకు సై అంది. కోల్పోయిన చోటే దొరకబుచ్చుకోవాలన్న ఈ ఆరా టానికి ప్రాతిపదిక ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలకు బీహార్‌లో 44.3 శాతం ఓట్లు రాగా, అధికారం దక్కించుకున్న ఎన్డీయేకి 38.8 శాతం ఓట్లు వచ్చాయి. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌కు మొత్తం ఓట్లలో 49.83 శాతం రాగా, బీజేపీ, ఎల్జేపీలకు 23.21 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐక్య పోరాటం ద్వారానే రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోగలమని పై మూడు పార్టీలూ గ్రహించాయి. గత పదేళ్లుగా మీడియాలో మోతాదుకు మించి లభిం చిన ప్రచారంతో నితీష్ ఏకంగా ప్రధాన మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్నారు. సోషలిస్టుగా చెప్పుకునే నితీష్, ఒక ప్పటి మిత్రుడు లాలూను వీడి, మతతత్వ పార్టీగా పేరుమో సిన బీజేపీతో చెయ్యి కలిపి 17 సంవత్సరాలుగా ఎన్డీయేతో కలిసి బీహార్ రాజకీయాల్లో వెలిగారు. లాలూ, కాంగ్రెస్‌లను వరుస ఎన్నికల్లో ఓడించారు. ప్రధాని పదవిపై ఆశతో నరేం ద్రమోడీకి వ్యతిరేకంగా నిలిచి, ఎన్డీయేను వీడారు. లోక్‌సభ ఎన్నికల్లో దానికి భారీ మూల్యం చెల్లించారు. రాష్ట్రంలోని 40 ఎంపీ స్థానాల్లో 38 స్థానాలను ఎగురేసుకుపోయిన ఎన్డీఏ కూటమి నితీష్ సీఎం పదవికే ఎసరు తెచ్చింది. దీంతో నితీష్‌కు కొత్త పొత్తు అవసరమైంది. చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రమే ఓట్లు సాధించి పెట్టవని గ్రహిం చారు. అలాగే, పశు దాణా కుంభకోణంలో అప్రతిష్టపాలైన లాలూ, 2004 కేంద్రంలో రైల్వే మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఒక్క బీహార్ రాష్ట్రానికే రూ. 52 వేల కోట్ల విలువైన రైల్వే తదితర అభివృద్ధి ప్రాజెక్టులను తీసుకువచ్చారు. అయితే ఇవేవీ లాలూను కాపాడలేదు. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో ఇద్దరు నేతలకు తమ ఒకప్పటి మైత్రి, సోష లిస్టు, సెక్యులర్ భావజాలం గుర్తుకొచ్చింది. పార్లమెంటు ఎన్నికల ముందు పెట్టుకోవలసిన పొత్తును అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏర్పర్చుకోవడంలో అర్థం ఏమి టన్నది సందేహం. నిజానికి ఈ పొత్తు తాత్కాలికం కాదు. లోక్‌సభ ఎన్నికలు దేశంలో కుల సమీకరణలకు సంబం ధించి కొత్త కోణాన్ని ముందుకు తీసుకువచ్చాయి. కుల ప్రాతిపదికన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో పాతుకుపో యిన రాజకీయ పార్టీల కంచుకోటలను బీజేపీ, సంఘ్ పరి వార్ బద్దలు కొట్టాయి. ప్రజల్లోని అభివృద్ధి కాంక్షకు విలువ ఇవ్వనిదే హిందుత్వ రాజకీయాలు విజయవంతం కావని అవి గుర్తించాయి. ముస్లింలతో సహా అన్ని కులాలు, కమ్యూ నిటీలను సమీకరించాలనే వ్యూహాన్ని అమలు పర్చడం ద్వారా వీరు మతాన్ని, అభివృద్ధిని విజయ మంత్రంగా మార్చారు. ఉత్తర భారతాన్ని కుల రాజకీయాలతో శాసి స్తున్న అన్ని పార్టీలకూ ఇది సవాలుగా మారింది. అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం లభించనందునే బీసీలు, దళిత నేతల పాలనను ఓటర్లు తిరస్కరించారని ఎన్నికలు తేల్చి చెప్పాయి. 2015లో బీహార్‌లో, 2017లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఈ మారుతున్న కుల సమీకరణాలతోటే మరో యుద్ధానికి తెర తీయనున్నాయి. లాలూ, నితీష్ మధ్య కుదిరిన పొత్తు ఉప ఎన్నికలకు పరిమితం కాదు. మత అస్తిత్వ రాజకీయాలను కుల అస్తిత్వ రాజకీయాలతో అడ్డుకోగలమనే పకడ్బందీ వ్యూహంలో భాగంగానే వీరి మధ్య పొత్తు కుదిరింది. ఈ ఫార్ములాను లాలూ మరింత స్పష్టంగా ముందుకు తెచ్చారు. మండల్ ద్వారానే కమండలాన్ని నిలువరిద్దాం అనే నినాదాన్ని ప్రతిపాదించారు. నితీష్ తన ముఖ్యమంత్రి పదవిని త్యజించడం కూడా ఈ వ్యూహంలో భాగంగానే జరిగింది. ఎన్నికల్లో ఎందుకు దెబ్బతిన్నామన్న గ్రహింపుతో, రాష్ట్రంలో బాగా వెనుకబడిన ముషాహర్ కులానికి చెందిన జితన్ మజికి సీఎం పదవిని కట్టబెట్టారు. అయితే తనకు బలమైన పునాదిగా నిలిచిన మహా దళిత్ సామాజిక బృందాలకు, తాను కొత్తగా కూడగడుతున్న యాదవులు, భూమిహార్లకు మధ్య సమతూకం ఎలా సాధిస్తారనే అంశంపైనే నితిన్ భవిష్యత్తు ఆధారపడనుంది. దేశాన్ని కుదిపేసిన మండల్, మందిర్ రాజకీయాల కాలంలో లాలూ ప్రసాద్, నితీష్‌లు ఒక వెలుగు వెలిగారు. పాతికేళ్ల తర్వాత అదే మండల్ రాజకీయాల పునరుద్ధరణతో కమండల రాజకీయాలను నిలువరించాలని వీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనే ప్రశ్నకు కాలమే జవాబు చెప్పాలి. - కె.రాజశేఖరరాజు