లక్ష మెజార్టీ బాధ్యతను పెంచింది
తిరుపతి కార్పొరేషన్ భర్త చనిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను తిరుపతి ప్రజలు ఉప ఎన్నికల్లో 1.16 లక్ష ల ఓట్లతో గెలిపించి పెద్ద బాధ్యత అప్పగించారని ఎమ్మెల్యేగా గెలిచిన మన్నూరు సుగుణమ్మ చారిత్రాత్మక విజయం అందించినందుకు తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. బయటకు రాలేని పరిస్థితి లో ఎన్నికల్లోకి వచ్చిన తనపై తిరుపతి ఓటర్లు సానుభూతి చూపించారన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనపై అభ్యర్థిని పోటీకి దింపకపోవడం, ఆ పార్టీ తిరుపతి నాయకుల సహకారంతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐల మద్ధతుతో చారిత్రాత్మక విజ యాన్ని సొంతం చేసుకున్నానని తెలిపారు.
అందుకు కారణమైన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చింతా మోహన్ స్వార్థంతో తనపై పోటికి అ భ్యర్థిని దింపడం, చనిపోయిన వ్యక్తిపై అవినీతి ఆ రోపణలు చేశారని వి మర్శించారు. దీనిని తిరుపతి ప్రజలు నమ్మకపోగా ఓటు ఆయుధం తో తీర్పు చెప్పారని తెలిపారు. తన భర్త ఆశయాలను నెరవేరుస్తామన్నారు. తిరుపతి ప్రజలు వేసవిలో నీటిఎద్దడి ఎదుర్కొంటున్నారని, ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆమె వెంట కుటుంబ స భ్యులు, పార్టీ నాయకులు శ్రీధర్‌వర్మ, దంపూ రి భాస్కర్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, మునిశేఖర్, ఆముదాల తులసీరామ్, పు ష్పావతి, విజ యల క్ష్మి, లతారెడ్డి, గంగులయ్య ఉన్నారు.