sugunamma
-
చంద్రబాబు సొంత అడ్డాలో టికెట్ లోల్లి
-
కన్నీళ్లు పెట్టుకున్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
-
జనసేనకు తిరుపతి టికెట్.. సుగుణమ్మ కంటతడి
సాక్షి, తిరుపతి: విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు చల్లరాడం లేదు. అసెంబ్లీ, ఎంపీ టికెట్ ఆశించిన ఆశావాహలు.. సీట్లు దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరికో మద్దతు పలకమంటే తాను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించదని పేర్కొన్నారు. తిరుపతి టికెట్‌పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలొచిస్తారని నమ్ముతున్నానని అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన నేతలు అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఉన్నపళంగా పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదన్న సుగుణమ్మ.. తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్ మారిందా? -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చుక్కెదురు!
చిత్తూరు కలెక్టరేట్: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మకు హైకోర్టులో చుక్కెదురైంది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరుకు సమీపంలో శ్రీనివాసపురం వద్ద చెరువు పోరంబోకు భూమిలో భవనం నిర్మాణాన్ని నిలిపివేయాలని హైకోర్టు ఇటీవల తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. సర్వే నంబర్ 241/3లోని 1.90 ఎకరాలు చెరువు పోరంబోకు భూములని, వాటిని ఆక్రమించి మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ, బిల్డర్ ఆనందరావు అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ భూమి విలువ దాదాపు రూ. 90 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ అక్రమ భూ బాగోతాన్ని గత ఏడాది నవంబర్ 9వ తేదీన ‘‘అల్లుడు.. గిల్లుడు.. ఎన్ని కోట్లు’’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఈ ఆక్రమణలపై ఈ ఏడాది ఫిబ్రవరి 10న కడప జిల్లాకు చెందిన బొల్ల రాజేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంతవరకు ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. అలాగే తుది తీర్పు ఇచ్చే వరకు జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై కలెక్టర్ హరినారాయణన్‌ను వివరణ కోరగా హైకోర్టు ఉత్తర్వులను పరిశీలిస్తామన్నారు. -
వెరైటీ 'అవ్వ'.. 30 ఏళ్లుగా చాయ్‌తోనే
చండూరు: ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం.. రాత్రి భోజనం.. మూడు పూటలా తింటున్నా.. మధ్యలో స్నాక్స్ అని.. ఏవేవో లాగించే రోజులివి. కానీ ఓ వృద్ధురాలు 30 ఏళ్లుగా భోజనం చేయకుండా కేవలం చాయ్ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ (60)కు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందారు. సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స జరిగిన కొన్నిరోజుల తర్వాత అన్నం తింటే జీర్ణం కాక వాంతులయ్యాయి. దాంతో ఇక అన్నంపై విరక్తి పెంచుకున్న ఆమె.. కేవలం చాయ్ తాగడం మొదలు పెట్టింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకుంది. ఇప్పటికీ సుగుణమ్మ రోజూ ఒకేసారి చాయ్ చేసుకోవడం.. ప్లాస్క్‌లో నింపుతుంది. ఆకలేసినప్పుడల్లా చాయ్ తాగుతూ క్షుద్బాధ తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు చాయ్‌లో మరమరాలు వేసుకుంటుంది. సుగుణమ్మ కూతురికి పెళ్లికాగా, కుమారుడు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. -
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడంతే!
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుళ్ల తీరుపై ఆరోపణల పరంపర కొనసాగుతునే ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దల్లుడికి సొంత పార్టీలోనూ.. ప్రజల్లోనూ అనేక అవినీతి మరకలంటుకున్నాయి. ప్రభుత్వ భూముల భూకబ్జాలు.. రియల్ ఎస్టేట్ మోసాలు.. సెటిల్మెంట్లు.. చేస్తున్నారని ఆ పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. తాజాగాఆ కుటుంబానికి అనుచరులుగా ఉన్న వారే బాధితులయ్యారు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు తీసుకుని చిన్నల్లుడు మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాచేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. తిరుపతి అర్బన్: అధికారంలో ఉన్నప్పుడే కాదు.. అధికారానికి దూరమైనా తిరుపతి మాజీ ఎమ్మెల్యే అల్లుళ్ల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మోసం చేశారని ఇప్పటికే అనేకమంది బాధితులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు తిరుపతి మెప్మాలో చోటుచేసుకున్న లక్షలాది రూపాయల అవినీతి అక్రమాల్లోనూ మాజీ ఎమ్మెల్యే అల్లుడి పేరే ప్రధానంగా వినిపిస్తోంది. కొంతమంది గ్రూపు లీడర్లను అడ్డుగా పెట్టుకుని మెప్మా నిధులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. తాజాగా గతంలో మాజీ ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్న వారు కూడా బాధితులుగా మిగిలారు. న్యాయం చేయాలని ఇంటి ముందు బైఠాయించారు. అడ్డూ అదుపు లేకుండా కబ్జాలు గత ప్రభుత్వ హయాంలో కొందరు ప్రభుత్వ, మఠం భూములను ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసి, కోట్లాది రూపాయలకు విక్రయించేశారు. కబ్జాలు అంటేనే ఆ కుటుంబంపై వేలెత్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే తరఫున ఆమె అల్లుడు అంతా తానై వ్యవహరించేవారు. గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున భూములు కబ్జాచేశారని తెలుగుదేశం పార్టీ నాయకులే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. కాంట్రాక్టర్లనుంచి వసూళ్లు, రెవెన్యూ, కార్పొరేషన్, పోలీస్, మెడికల్ విభాగాల నుంచి మామూళ్ల దందాలు చేపట్టారు. ఆ కుటుంబం తీరుతో నియోజకవర్గంలో పార్టీ కూడా వర్గాలుగా మారిపోయింది. తానేమీ తక్కువ కాదని.. ఇన్నాళ్లు అవినీతి అక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దల్లుడి పేరు మాత్రమే వినిపించేది. తాజాగా తానేమీ తక్కువ కాదంటూ చిన్నల్లుడు దందాలు, మోసాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన పలువురి నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో ఆ కుటుంబానికి అనుచరుడిగా ఉన్న మహ్మద్ రఫీ మంగళవారం సుగుణమ్మ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. మహ్మద్ రఫీకి ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాజీ ఎమ్మెల్యే చిన్నల్లుడు రూ.7 లక్షలు తీసుకున్నాడు. నాలుగేళ్లు అవుతున్నా ఉద్యోగం ఇప్పించలేదు. ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని ఎంత ప్రాథేయపడినా పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద బాధితుల ఆందోళన న్యాయం చేయండి మా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిందే.. నాకు న్యాయం చేయండి మహా ప్రభూ. నేను పేదోడిని. మమ్మల్ని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు ఉద్యోగాల పేరుతో దారుణంగా మోసం చేశారు. మా దగ్గర నాలుగేళ్ల క్రితం తిరుపతి ఎస్వీ యూనివర్సీటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.7లక్షలు తీసుకున్నారు. అతన్ని నమ్మి మా బంధువులు అప్పులు చేసి.. నా ద్వారా అతనికి ఇచ్చాం. ఉద్యోగాలు ఇప్పించలేదు. మా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆయన చుట్టూ తిరుగుతున్నాం. అయితే ఇదిగో అదిగో అంటూ ఏళ్ల తరబడి తిప్పించుకున్నారు. మేం ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో ఆరు నెలల క్రితం కొంత మొత్తానికి చెక్కు.. మరి కొంత మొత్తానికి బాండ్ పత్రాన్ని ఇచ్చారు. అయినా వాటి ద్వారా ప్రయోజనం లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద మౌనదీక్ష చేపట్టాం. అయితే వారి మనుషులు న్యాయం చేస్తామంటూ అక్కడి నుంచి దౌర్జన్యంగా పంపించారు. అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. –మహ్మద్ రఫీ, జీవకోన -
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చేదు అనుభవం
-
టీడీపీలో అసమ్మతి సెగలు
-
టీడీపీలో అసమ్మతి సెగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. తాజాగా తిరుపతి టీడీపీలో అసమ్మతి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మకు టిక్కెట్ ఇవొద్దంటూ వ్యతిరేక వర్గం గట్టిగా గళమెత్తింది. ఆమెకు వ్యతిరేకంగా తుడా చైర్మన్ నరసింహ యాదవ్ సహా 50 డివిజన్ల అసమ్మతి నాయకులు శనివారం సమావేశమయ్యారు. సుగుణమ్మ వైఖరితో పార్టీ నష్టపోతుందని అసమ్మతి వర్గం నేతలు పేర్కొన్నారు. ఆమెకు టిక్కెట్ ఇస్తే సహకరించబోమని స్పష్టం చేశారు. రెండు వర్గాల అధిపత్యపోరుతో టీడీపీలో లుకలుకలు వీధికెక్కాయి. ఈ పరిణామాలు కచ్చితంగా పార్టీపై ప్రభావం చూపుతాయని టీడీపీ నాయకులు భయపడుతున్నారు. మరోవైపు తిరుపతి అసెంబ్లీ టిక్కెట్‌ను అధినేత చంద్రబాబు ఎవరికీ కేటాయిస్తారనే దానిపై టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా, చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. (పెరుగుతున్న వైఎస్సార్సీపీ బలం) -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ సుగుణమ్మ
-
టీటీడీ అధికారులపై తిరుపతి ఎమ్మెల్యే ఆగ్రహం
తిరుమల: మహా సంప్రోక్షణ సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళితే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రెన్స్ దగ్గర వెళ్లి కనుక్కోవాలని చెప్పారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సన్నిథిలోని ల్యాండ్ లైన్‌కు కాల్ చేస్తే ఈ రోజు అనుమతి లేదని, రేపు రమ్మన్నారని అధికారులు తెలపడంతో ఆమె ఆగ్రహం చెందారు. స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఆలయ ప్రవేశానికి అనుమతి ఉందా లేదా..? స్వామి వారి మహా శాంతి తిరుమంజనానికి ఆలయంలో ఉన్న మహా భక్తులు ఎవరో తమకు చూపించాలని ఆమె మండిపడ్డారు. ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్, ఈఓ ఇతర మహా భక్తులకు ఎలా ఆహ్వానం ఇచ్చరో తనకు తెలియాలని నిలదీశారు. తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. 2006లో జరిగిన సంప్రోక్షణను తాము అప్పటి ఎమ్మెల్యే వెంకటరమణతో కలిసి చూశామన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ ఆలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. బోర్డు సభ్యులను కూడా ఎవరూ పిలవలేదని పేర్కొన్నారు. దీనిపై ఆవేదన చెందాల్సిన పనిలేదని గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి తీసుకెళుతామని తెలిపారు. -
చొక్కా పట్టుకు లాగారు
సమాజం పీలికలు పీలికలైపోయిందివ్యవస్థ చివికిపోయిన వస్త్రంలా అయ్యింది.అనుబంధాలు ఛిద్రమైపోతున్నాయి.మానవత్వం ముళ్లకంచెకు ఓ చిరుగులా వేలాడుతుంది. చొక్కా పట్టుకు లాగారుడొంక కదిలింది.కాలం ప్రయాణంలో కొన్ని ఘాతుకాలు మరుగున పడిపోవచ్చు. కానీ, ఆ కాలమే కొన్ని ఘాతుకాలను పైకి తీసుకురాగలదు. నిజాల నిగ్గు తేల్చగలదు. 1995 సంవత్సరం.తెనాలి దగ్గరి చేబ్రోలు.‘కొడుకా.. నన్నొదిలి ఏడికి పోయినవ్రా..! నిన్ను ఎక్కడని వెదికేదిరా’ ఏడుస్తోంది సుగుణమ్మ.అప్పటికి సంవత్సరం దాటిపోయింది.ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. లేదంటే సుగుణమ్మ ఏడుపుతో నిండి ఉంటుంది. కొడుకు కనపడని దుఃఖం ఒకరు ఆర్చితే ఆరుతుందా, తీర్చితే తీరుతుందా? ‘ఏంటి సుగుణక్కా! కొడుకు కోసం ఎన్నాళ్లని ఏడుస్తా్తవ్. ఎక్కడో ఉండే ఉంటాడులే. నీమీద కోపంతో ఏ పట్నం పోయాడో, లేకపోతే దుబాయే పోయాడో..’ అంది పక్కింటి అలివేలు. ‘ఒక్కగానొక్క కొడుకు. వాళ్ల అయ్య సచ్చి నన్ను దిక్కులేనిదాన్ని చేశాడు. వీడు ఇలా నన్నొదిలిపోతాడు అనుకోలేదు. మోటారు బండి కొంట పైసలు కావాలని ఒకటే గోల చేస్తుంటే తిట్టిన డబ్బులు ఏడున్నాయ్ అని. కాదన్నానని అలిగిపోయాడు. ఇప్పటిదాకా రాలేదు. ఆ పొలం పాడుగాను.దాన్ని అమ్మినా నా కొడుకు నా కళ్ల ముందు ఉండేవాడు..’ కొడుకును తలుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న సుగుణమ్మ వైపు జాలిగా చూశారు చుట్టూ చేరిన జనం. ‘ఇలా కాదు. పోయి పోలీసులకు చెప్పుపో.. నీ కొడుకు ఏడున్నా వాళ్లే పట్టుకొస్తరు.. ’ అన్నడు అప్పుడే పొలం నుంచి ఇంటికి వస్తున్న రాజయ్య. ‘అదే మంచిది సుగుణక్కా, రాజయ్య చెప్పినట్టు చేయి! పోలీసులకు జెప్తే వాళ్లే తీసుకొస్తారు’ అంది వరసకు చెల్లెలైన వెంకటి. చుట్టూ చేరిన జనం కూడా అదే మంచిదన్నారు. సుగుణమ్మ కళ్ల నీళ్లు తుడుచుకుని, జుట్టు ముడేసుకొని, తలుపులు మూసి తాళం వేసింది.టౌన్లో ఉన్న పోలీసుస్టేషన్‌కి చేరింది. ‘ఏంటీ నీ కొడుకు కనిపించక ఏడాదిన్నర అవుతుందా?! ఇన్నాళ్లూ ఏం చేశావు?!’ ఆశ్చర్యంగా అడిగారు పోలీసులు.‘వాడే వస్తాడులే అనుకున్నా. ఏడాదిన్నర అవుతున్నా జాడ దొరకలేదు. కొంచెం మీరే సూడాలయ్యా’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది సుగుణమ్మ.చేతికి అందివచ్చిన కొడుకు దూరమై ఆ తల్లి పడుతున్న బాధను చూస్తుంటే పోలీసుల మనసు చలించిపోయింది. ‘సరే సరే, చివరిసారి నీతో ఏమైనా మాట్లాడాడా .. ఆ వివరాలు చెప్పు’ అన్నాడు ఎస్.ఐ. మిస్సింగ్ కేస్‌గా వివరాలు రాసుకోవడం మొదలుపెట్టారు పోలీసులు.తప్పిపోయినవాడి పేరు వీరేశం. వయసు 20 ఏళ్లు. ‘అయ్యా, నా కొడుకు చివరిసారిగా మా తమ్ముడువీరభద్రంతో కలిసి టౌన్‌కి వెళ్లినట్టు ఎవరో చెప్పారు’ చెప్పింది సుగుణమ్మ. వీరభద్రాన్ని పిలిపించారు పోలీసులు. ‘అయ్యా! మేం ఆ రోజు సినిమాకని వెళ్లాం. కానీ, రాత్రికి తిరిగొచ్చాక ఎవరిళ్లకు వాళ్లం వెళ్లిపోయాం. మరుసటి రోజు మా చుట్టాలింట్లో పని ఉండి ఊరెళ్లాను. తిరిగొచ్చాక తెలిసింది వీరేశం కనపడతలేడని’ అన్నాడు వీరభద్రం. ‘చివరిసారి నీతో ఏమైనా మాట్లాడాడా!’ అడిగాడు ఎస్.ఐ.‘ఎందుకు మాట్లాడలేదు సారూ.. వాడికేమో మోటారు సైకిలు కొనుక్కోవాలని ఉండేది. వాళ్లమ్మ భూమి అమ్మనంది. పట్నంలోనే ఏదైనా పని చూసుకొని బండి కొనుక్కున్నాకే ఊరొస్తానంటే.. నేనే నచ్చజెప్పి తీసుకొచ్చా. అయినా వాడు మళ్లీ వెళ్లిపోయాడంటే మా అక్క తిట్టిన తిట్ల వల్లనే సార్!’ అన్నాడు వీరభద్రం. ‘వీరభద్రం.. ఆ రాత్రి కూడా వాడు ఇంటికి రాలేదురా’ అంది సుగుణమ్మ కళ్లు నీళ్లు తుడుచుకుంటూ. ‘అవునా, ఊరికైతే వచ్చాం సారూ. తర్వాత వాడ్ని ఇంటికి పొమ్మని నేను మా ఇంటికి పోయాను’ అన్నాడు వీరభద్రం.‘సరే, మీరేళ్లండి!’ అని వాళ్లను పంపించారు పోలీసులు. ఆ రోజు వీరభద్రం వెళ్లిన చుట్టాలెవరో వాకబు చేశారు. అతను చెప్పింది నిజమే అని తేలింది. ‘వీరేశం మిస్సింగ్ కేసు అనుమానాస్పదంగా ఉంది. కానీ, రుజువులు కావాలి.. ’ ఆలోచనలో పడ్డాడు ఎస్.ఐ.సిబ్బందిని పిలిచి ‘ముందు వీరేశం ఊరెళ్దాం. ఏమైనా క్లూ దొరుకుద్దేమో’ అన్నాడు. పోలీసులు ఊరు బయల్దేరారు. ఊళ్లో చుట్టుపక్కల వారిని కలిసి, మరికొన్ని వివరాలు రాసుకున్నారు. కానీ, ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ‘మనం పొరపాటుగా ఆలోచిస్తున్నామేమో! నిజంగానే తల్లి మీద అలిగి వీరేశం పట్నం వెళ్లిపోయుంటాడు. పట్నంలోని అన్నిపోలీసు స్టేషన్లకి వీరేశం ఫొటోలు, వివరాలు పంపి చూద్దాం’ అన్నాడు ఎస్.ఐ. ‘అవున్సార్.. అదే అయ్యుంటుంది. అలాగే చేద్దాం’ అన్నారు సిబ్బంది. తిరుగు ప్రయాణానికి జీప్ స్టార్ట్ అయ్యింది. వీరేశం ఊరికీ టౌన్కీ మధ్య మూడు కిలోమీటర్ల మట్టిదారి. ఆ దారంతా కంపచెట్లు ఉన్నాయి. అప్పటికే ఒకసారి పరిశీలించిన ప్రాంతం. ఎస్.ఐ యధాలాపంగా కంపచెట్లవైపు చూస్తూ ఒక చోట ఆగాడు. ‘కానిస్టేబుల్స్ ఆ కంపచెట్లకు కొన్ని పాత గుడ్డలు చుట్టుకొని ఉన్నాయి చూడండి. వాటిని జాగ్రత్తగా విప్పి ఇలా తీసుకరండి’ అని పురమాయించాడు. సిబ్బంది కొంత ప్రయత్నం చేస్తే ముళ్ల చెట్టుకు పట్టుకు వేళాడుతున్న పీలికల గుడ్డలు వచ్చాయి. ఆ చిరిగిపోయిన, పాత గుడ్డ పీలికలను తీసుకొని స్టేషన్‌కి వెళ్లిపోయారు పోలీసులు.మరుసటి రోజు సుగుణమ్మను పిలిపించారు పోలీసులు. ‘చూడమ్మా! పట్నంలోని అన్ని పోలీసు స్టేషన్లకి నీ కొడుకు ఫొటోలు పంపించాం. ఎక్కడున్నా త్వరలోనే పట్టుకుంటాం..’ అన్నాడు ఎస్.ఐ.అలాగేనని తలూపిన సుగుణమ్మ టేబుల్ మీద పీలికలైన గుడ్డ పీలికలను చూసింది. అందులో పీలికలైన ఒక చొక్కాను చూస్తూ ‘ఇది మావాడిదే! చారల చొక్కా. ఆ రోజు ఇదే వేసుకున్నాడు సారూ’ అంది ఏడుస్తూ! పోలీసులు ఉలిక్కిపడ్డారు.ఒకరిమొహాలు ఒకరు చూసుకున్నారు. పోలీసుల ఊహకు సుగుణమ్మ చెప్పిన వాస్తవం తొడయ్యింది. పీలికలైన చొక్కా ‘క్లూ’ అయ్యింది. ఆ చొక్కా దొరికిన ప్రాంతానికి వెంటనే చేరుకున్నారు పోలీసులు. ఆ ప్రాంతమంతా మళ్ళీ మళ్ళీ పరిశీలించారు. మరే ఆధారమూ దొరకలేదు.ఆ చుట్టుపక్కల ఐదు వ్యవసాయ బావులు మాత్రం కనిపించాయి. బావులకు సంబంధించిన వారిని పిలిపించి, మోటర్లను ఆన్ చేశారు. ఉదయం మొదలైన నీటి ప్రవాహం సాయంత్రం దాకా బయటకు వస్తూనే ఉంది. గంటలు గంటలు గడుస్తున్నాయి. అక్కడున్న అన్ని బావుల నీళ్లూ బయటకు వచ్చేశాయి. సాయంకాలం వేళ ఆ బావులు నీళ్లు మింగేసిన రాకాసి గొంతుల్లా ఉన్నాయి. పోలీసు సిబ్బంది ఒక్కో బావిలోకి దిగి గాలించారు. చెట్లు, గుబురు పొదలతో కప్పబడినట్టుగా ఉన్న ఐదవ బావి వద్దకు వచ్చారు. అడుగున ఇంకా కొన్ని నీళ్లు మిగిలే ఉన్నాయి, ఆ మిగిలిన నీళ్లలోనే గాలించారు. పుర్రె, ఎముకలు చేతికి తగిలాయి. వాటిని బయటకు తీసి, పేరిస్తే మనిషి ఎముకలని తేలింది. వీరభద్రాన్ని తీసుకొచ్చి కూచోబెట్టారు. చాలా వేడిగా ఉన్న టీ తెచ్చారు. అది తాగమని చెప్పేటందుకు కాదనీ, తేడా వస్తే బొబ్బలెక్కేలా ముఖాన కొడతారని వీరభద్రానికి అర్థమైంది.‘ఎందుకు చేశావీపని’ అన్నాడు ఎస్.ఐ. ‘నేనే మా మేనల్లుడిని హత్య చేశాను. తప్పయిపోయింది సార్. ఆ రోజు నుంచి నా మనసు మనసులో లేదు. చేసిన తప్పుకు కుళ్లి కుళ్లి చస్తున్నాను సార్’ అంటూ రెండు చేతులు జోడించాడు వీరభద్రం. ‘అక్క కొడుకునే చంపేటంత కక్ష నీకేంటి?’ గద్దించారు పోలీసులు.‘మా బావ చనిపోయి మూడేళ్లయ్యింది. అక్క పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ ఇప్పుడు కోట్లకు పెరిగింది. మేనల్లుడిని అడ్డు తొలగిస్తే వారసులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆస్తి అంతా నాకే వస్తుందని ఈ పని చేశాను. ఆ రోజు సినిమాకు వెళ్లింది నిజమే. తిరుగు ప్రయాణంలో బాగా చీకటి పడింది. దారిలో ఇంకెవరూ లేరు. ముందు వాడు నడుస్తుంటే నేను వెనకగా నడుస్తూ రాయితో తలమీద మోదాను. పెనుగులాటలో వాడి చొక్కా నా చేతికొచ్చింది. వాడ్ని చంపి, నీళ్లలో తేలకుండా ఉండేందుకు. నడుముకు రాయి కట్టి అక్కడే వ్యవసాయబావిలో పడేశాను. చొక్కాను గొయ్యి తీసి పాతిపెట్టి, ఇంటికొచ్చేశాను’ వివరించాడు వీరభద్రం. నేరం ఎప్పటికీ దాగదు. బయట పడాల్సిందే.వీరభద్రం కంగారులో పైపైన గొయ్యి తీసి, మట్టిలో చొక్కాను కప్పెట్టాడు. కానీ, అది కొన్నాళ్లకి బయటపడి, గాలి వాటానికి కొట్టుకపోయి కంపచెట్టుకు చిక్కుకుని ఉండిపోయింది. పీలికలైన ఆ పాత చొక్కాతోనే కేసును ఛేదించారు పోలీసులు. కొడుకు ఇక రాడని, లేడని తెలిసిన సుగుణమ్మ గుండె పగిలేలా ఏడ్చింది. ‘సారూ, నా కొడుకు ఇక తిరిగి రాడు. కానీ అలా తిరిగి రాకుండా చేసినవాడిని మాత్రం జైలు నుంచి తిరిగి రానంత కాలం ఉంచే బాధ్యత మీదేనయ్యా’ అంటూ పోలీసులకు దణ్ణం పెట్టింది. వీరభద్రం ప్రస్తుతం శిక్ష అనుభశిస్తున్నారు. (పస్తుత వరంగల్ పోలీస కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ తెనాలిలో పని చేసినప్పుడు చేధించిన కేసు డిటైల్స్ ఆధారంగా) ‘ఏంటీ నీ కొడుకు కనిపించక ఏడాదిన్నర అవుతుందా?! ఇన్నాళ్లూ ఏం చేశావు?!’ ఆశ్చర్యంగా అడిగారు పోలీసులు.‘వాడే వస్తాడులే అనుకున్నా. ఏడాదిన్నర అవుతున్నా జాడ దొరకలేదు. కొంచెం మీరే సూడాలయ్యా’ రెండు చేతులెత్తి దణ్ణం పెట్టింది సుగుణమ్మ. – కృష్ణగోవింద్, సాక్షి బ్యూరో ఇన్చార్జ్, వరంగల్ -
అవినీతి నిర్మూలనతోనే ప్రగతి సాధ్యం
ఆలిండియా పెన్షనర్స్ డే వేడుకల్లో తిరుపతి ఎంపీ వరప్రసాద్ తిరుపతి సెంట్రల్ : రాజకీయ అవినీతిని ఎప్పుడైతే నిర్మూలించగలమో అప్పుడే దేశం మరింత అభివృద్ధిచెందుతుందని తిరుపతి ఎంపీ వి.వరప్రసాద్ తెలిపారు. స్థానిక ఏపీ ఎన్జీవో కార్యాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి శాఖ నిర్వహించిన ఆల్ ఇండియా పెన్షనర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజాంలో రాజకీయ అవినీతి వల్ల అభివృద్ది ఆగి పోయిందన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించగలిగితే మరో 30 శాతం అదనంగా అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎంపీ నిధు ల నుంచి రూ. 5లక్షల గ్రాంట్‌ను విడుదల చేసినట్టు ఉత్తర్వులు అందించారు. ఇంకనూ తన వంతుగా భవన నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తానని తెలిపా రు. ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ పెన్షనర్ల భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. రిటైరై 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 20 మంది పెన్షనర్లను ఘనం గా సన్మానించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తిరుపతి శాఖ అధ్యక్షుడు పి.కోదండపాణి రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.బాలాజి, ఉపాధ్యక్షులు జయరామయ్య, జిల్లా అధ్యక్షుడు ఎం. కోదండ పాణి రెడ్డి, కోశాధికారి సిద్ద,సబ్ కమిటీ సభ్యులు చిన్నబ్బ,జయరామ్,కౌసల్య, కస్తూరి పాల్గొన్నారు. -
తొండుపల్లిలో దొంగల బీభత్సం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న బాబు, సుగుణమ్మ దంపతులపై అర్థరాత్రి సమయంలో దాడిచేసి నగదు, ఆభరణాలను దోచుకుపోయారు. శుక్రవారం ఉదయం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు. -
గవర్నర్‌తో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం రాజభవన్లో భేటీ అయ్యారు. ఇద్దరూ సుమారు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వైఎస్ చౌదరి కూడా పాల్గొన్నారు. శుక్రవారం హోలీ కావటంతో గవర్నర్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాల సమాచారం. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన సుగుణమ్మ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సుగుణమ్మ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమెతో ప్రమాణం చేయించారు. -
సుగుణమ్మను అభినందించిన చంద్రబాబు
-
సుగుణమ్మను అభినందించిన చంద్రబాబు
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లో చంద్రబాబును సుగుణమ్మ కలిశారు. అనంతరం సుగుణమ్మ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ, తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు... తనను కోరారని చెప్పారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఈ సందర్బంగా బాబు హామీ ఇచ్చారన్నారు. -
లక్ష మెజార్టీ బాధ్యతను పెంచింది
తిరుపతి కార్పొరేషన్ భర్త చనిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తనను తిరుపతి ప్రజలు ఉప ఎన్నికల్లో 1.16 లక్ష ల ఓట్లతో గెలిపించి పెద్ద బాధ్యత అప్పగించారని ఎమ్మెల్యేగా గెలిచిన మన్నూరు సుగుణమ్మ చారిత్రాత్మక విజయం అందించినందుకు తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. బయటకు రాలేని పరిస్థితి లో ఎన్నికల్లోకి వచ్చిన తనపై తిరుపతి ఓటర్లు సానుభూతి చూపించారన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తనపై అభ్యర్థిని పోటీకి దింపకపోవడం, ఆ పార్టీ తిరుపతి నాయకుల సహకారంతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐల మద్ధతుతో చారిత్రాత్మక విజ యాన్ని సొంతం చేసుకున్నానని తెలిపారు. అందుకు కారణమైన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చింతా మోహన్ స్వార్థంతో తనపై పోటికి అ భ్యర్థిని దింపడం, చనిపోయిన వ్యక్తిపై అవినీతి ఆ రోపణలు చేశారని వి మర్శించారు. దీనిని తిరుపతి ప్రజలు నమ్మకపోగా ఓటు ఆయుధం తో తీర్పు చెప్పారని తెలిపారు. తన భర్త ఆశయాలను నెరవేరుస్తామన్నారు. తిరుపతి ప్రజలు వేసవిలో నీటిఎద్దడి ఎదుర్కొంటున్నారని, ఈనెల 19న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి సమ స్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆమె వెంట కుటుంబ స భ్యులు, పార్టీ నాయకులు శ్రీధర్‌వర్మ, దంపూ రి భాస్కర్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ ఆశాలత, మునిశేఖర్, ఆముదాల తులసీరామ్, పు ష్పావతి, విజ యల క్ష్మి, లతారెడ్డి, గంగులయ్య ఉన్నారు. -
విజేత సుగుణమ్మ
తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల్లో టీడీపీ అభ్యర్థికి 1,16,524 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు నోటాకు 2,152 ఓట్లు తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి మన్నూరు సుగుణమ్మ 1,16,542 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సహా మిగిలిన స్వతంత్య్ర అభ్యర్థులకు డిపాజిట్ దక్కలేదు. వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో పోటీచేయకపోవడంతో ఓటింగ్‌పై ప్రజల్లోనూ పెద్దగా స్పందన కనిపించలేదు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించకుండా పోటీచేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. పోలింగ్‌రోజున ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు, పోలీసుల సహాయంతో టీడీపీ ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంది. దీనికితోడు సానుభూతి ఓట్లు తోడవడంతో ఉహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సోమవారం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో కౌంటింగ్ ప్రారంభం నుంచి చివరివరకు తెలుగు దేశం అభ్యర్థికి భారీ మొజార్టీ వచ్చింది. ఏ రౌండ్లోను కాంగ్రెస్ అభ్యర్థికి అశించిన స్థాయిలో ఓట్లు మాత్రం రాలేదు. గత ఎన్నికల్లో 2,650 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో కొంతమేర ఓట్లు పెరిగాయనే తృప్తి మాత్రమే మిగిలింది. లోక్‌సత్తా అభ్యర్థి కల్లూరి బాల సుబ్రమణ్యం, పోతిరెడ్డి వెంకటరెడ్డి కొంతమేరకు ప్రభావం చూపగలిగారు. మిగిలిన పది మంది అభ్యర్థులకు 500 ఓట్లు వరకు రావడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తిరస్కరిస్తూ 2,152 మంది నోటాను వినియోగించుకున్నారు. భారీ ఏర్పాట్లు కౌంటింగ్‌కు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాక ముందే కౌంటింగ్ కేంద్రంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని రెవెన్యూ సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన వ్యక్తంచేశారు. పోలీసులు క్షమాపణ చెప్పే వరకు కౌంటింగ్‌లో పాల్గొనేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య అధికారులకు నచ్చజెప్పడంతో సమస్య పరిష్కరమైంది. దీంతో కాస్త ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల పరిశీలకుడు హర్షదీప్ కాంబ్లే పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు సాగింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ లెక్కింపును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మధ్యలో వచ్చిన సుగుణమ్మ ఓట్ల లెక్కింపు ముందే కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని లెక్కింపును పర్యవేక్షించారు. తెలుగుదేశం అభ్యర్థి తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకుని మధ్యలో వచ్చారు. చివరి రౌండ్ కౌంటింగ్ తరువాత 1,16,524 ఓట్ల మెజారిటీతో సుగుణమ్మ గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి వీరబ్రహ్మయ్య ప్రకటించారు. అనంతరం ఎమ్యెల్యేగా ఎన్నికైనట్లు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందించారు.టీడీపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. రంగులు చల్లుకుంటూ, బాణసంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. -
చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి
-
చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీదేవి డిమాండ్ చేశారు. సుగుణమ్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆమె సూచించారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ చేతిలో పరాజయం పొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరోవైపు ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ.. గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ పోటీ చేయలేదని, కాంగ్రెస్ దురుద్దేశ పూర్వకంగానే పోటీ చేసిందన్నారు. తన గెలుపు ప్రజల విజయంగా సుగుణమ్మ అభివర్ణించారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. -
లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం
-
లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం
తిరుపతి : తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థి శ్రీదేవిపై 1,16,524 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి 9628 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ తిరుపతి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. అత్యధిక మెజార్టీ అందించిన తిరుపతి ప్రజలకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దాంతో ఆయన సతీమణి సుగుణమ్మ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో దూరంగా ఉన్న విషయం తెలిసిందే. -
లక్ష ఓట్ల మెజారిటీతో ‘చింతా’కు గుణపాఠం
హోం మంత్రి చిన్న రాజప్ప భవానీనగర్‌లో రోడ్ షో సుగుణమ్మను గెలిపించాలని విజ్ఞప్తి తిరుపతి మంగళం: ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి మాజీ ఎంపీ చింతామోహన్‌కు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చిన్న రాజప్ప పిలుపునిచ్చారు. భవానీనగర్‌లో సోమవారం పార్టీ నాయకుడు మునిశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, హోంమంత్రి చిన్న రాజప్ప రోడ్ షో నిర్వహించారు. నగర పరిధిలోని రాయల్‌నగర్‌లో టీ డీపీ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్ళపల్లె సుధారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న రాజప్ప మాట్లాడుతూ కేవలం చింతా మోహన్ స్వార్థం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవత్వంతో ఉపఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పోటీగా అభ్యర్థిని నిలబెట్టడం సిగ్గుచేటన్నారు. భర్త ఆశయాల కోసం ఎన్నిక ల్లో పోటీచేస్తున్న సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్లు మెజారీటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మం త్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత మాట్లాడుతూ చింతా మోహన్ స్వార్ధం కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తూ పేదల సంక్షేమం కోసమే నిరంతరం తపించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడం దారుణమన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కమలాపురం ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవానికి మద్దతిచ్చిన వైఎస్సార్ సీపీకి కృతజ్ఞతలు
ఈ మంచి సంప్రదాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి తిరుపతిలో సుగుణమ్మను పోటీలేకుండా గెలిపించుకుందాం రాష్ట్ర మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి తిరుపతి కార్పొరేషన్ : తిరుపతి ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్ సీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్రెడ్డికి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలిపిం ది. ఈ మంచి సంప్రదాయాన్ని అన్ని పా ర్టీలు పాటించాలని శనివారం తిరుపతి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. మానవత్వంతో అన్ని రాజకీయ పార్టీలు సుగుణమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. మాజీ మంత్రి గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పో టీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అయినా నందిగామ, ఆళ్లగడ్డ, తిరుపతిలోనూ మానవత్వంతో ఒక మంచి సంప్రదాయాన్ని వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు పాటిస్తున్నాయని గుర్తుచేశారు. ఏకగ్రీవానికి మద్దతిచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ, అభినందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. నందిగామలో పోటీ పెట్టి, ఆళ్లగడ్డలో తప్పుకుని, తిరుపతిలో పోటీ పెడ తామనడం బాధాకరమన్నారు. బీసీ మహిళపై ఎస్సీ అభ్యర్థిని పోటీకి దించుతామని సోనియాగాంధీ చెప్పడం ఆమె స్థాయికి సరికాదన్నారు. లోక్‌సత్తా, ఇండిపెండింట్ల కూడా ఏకగ్రీవానికి సహకరించాలని కోరతామన్నారు. ఇలా వస్తానని అనుకోలేదు టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ ఇంటికే పరిమితమైన తాను ఇలా బయటకు వస్తానని అనుకోలేదన్నారు. భర్త చనిపోవడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసం ఇలా ముందుకు వచ్చానన్నారు. ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్ఆర్ సీపీ లాగ అన్ని పార్టీలు సహకరించాలని వేడుకున్నారు. తన భర్త కాంగ్రెస్‌లో క్రమశిక్షణగల కార్యకర్తగా రాష్ట్ర విభజన సమయం లో విధిలేని పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలు గుర్తించి తన ఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని వేడుకున్నారు. టీడీపీ నాయకులు గౌనివారి శ్రీనివాసులు, శ్రీధర్‌వర్మ, సూరా సుధాకర్‌రెడ్డి, నరసింహయాదవ్, దంపూరి భాస్కర్, క్రిష్ణాయాదవ్, జనతాగిరి, పుష్పావతి, విజయలక్ష్మీ పాల్గొన్నారు. -
ఏకగ్రీవంపై ఉత్కంఠ
తిరుపతి ఉప ఎన్నికపై వీడని సస్పెన్స్ నామినేషన్ వేసిన అధికార పార్టీ అభ్యర్థి సుగుణమ్మ పోటీకి దూరమని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఎటూ తేల్చని కాంగ్రెస్, సీపీఎం నామినేషన్లు వేసిన లోక్‌సత్తా, జనసంఘ్ ఇప్పటికే మొత్తం 9 మంది నామినేషన్లు చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఏకగ్రీవంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఏకగ్రీవానికి సహకరించాలని టీడీపీ అభ్యర్థి సుగుణమ్మతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పలు దఫాలుగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. చర్చలు సైతం జరిపారు. టీడీపీ అభ్యర్థనతో ఉప ఎన్నికల బరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుకుంది. జిల్లా నేతలతో చర్చించిన అధినేత జగన్మోహన్రెడ్డి ఆ పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. దీంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. ఉపఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తామంటూ తొలుత ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత కొంత వెనక్కు తగ్గింది. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని చెప్పింది. పోటీ విషయమై పార్టీ అధిష్టానం ఇప్పటికీ ఎటూ తేల్చలేదు. పోటీలో ఉండాలని కొందరు, పోటీకి దూరంగా ఉండాలని మరికొందరు పట్టుబడుతుండడంతో ఆ పార్టీ ఇప్పటికీ ఎటూ తేల్చలేకపోతోంది. ఇక ఉపఎన్నికల బరిలో నిలుస్తామని సీపీఎం ప్రకటించింది. ఈ మేరకు పార్టీలో చర్చించింది. కానీ ఇంకా నిర్ణయం వెలువరించలేదు. పోటీ చేసే అవకాశం ఎక్కువని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక నామినేషన్‌కు మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే లోకసత్తా,జనసంఘ్ తదితర పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 9 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్,సీపీఎంతో పాటు మిగిలిన వారు పోటీలో నిలిచే పక్షంలో తిరుపతి అసెంబ్లీకి ఉపఎన్నిక రసకందాయంలో పడనుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రగిలింది. మున్ముందు ఎవరు బరిలో నిలుస్తారో...? ఆయా రాజకీయ పార్టీలు ఏమీ నిర్ణయం తీసుకుంటాయన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తిరుపతికి మూడోసారి ఉపఎన్నిక తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇప్పటికీ రెండుమార్లు ఉపఎన్నికలు జరిగాయి. 1983లో ఎన్టీఆర్ తిరుపతితో పాటు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలుపొందారు. ఆయన గుడివాడ వైపు మొగ్గు చూపడంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక తప్పలేదు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందిన చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో తిరుపతికి ఉపఎన్నిక జరిగింది. తాజాగా వెంకటరమణ మృతితో తిరుపతికి మూడోసారి ఉపఎన్నిక జరుగుతోంది. ఉపఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ జనవరి 12 షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల నామినేషన్ల దాఖలుకు 27వ తేదీ తుది గడువు, 28న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 13న పోలింగ్ జరగనుంది, 16న ఓట్ల లెక్కింపు తంతు ముగియనుంది. 18 నాటికి ఎన్నికల కోడ్ ముగియనుంది. -
తిరుపతి టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నిక టీడీపీ అభ్యర్థిగా సుగుణమ్మ పేరును సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. సుగుణమ్మ తిరుపతి నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య. నారావారిపల్లెలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఎన్నిక ఏకగ్రీవం కోసం ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరపాలని పార్టీ నాయకులను ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.