లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం | TDP condidate sugunamma wins tirupati bypoll | Sakshi
Sakshi News home page

లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం

Published Mon, Feb 16 2015 12:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం - Sakshi

లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం

తిరుపతి : తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థి శ్రీదేవిపై 1,16,524 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి 9628 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ తిరుపతి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు.  అత్యధిక మెజార్టీ అందించిన తిరుపతి ప్రజలకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

 

కాగా టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో  తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దాంతో ఆయన సతీమణి సుగుణమ్మ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement