turupati by-poll
-
చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి
-
చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీదేవి డిమాండ్ చేశారు. సుగుణమ్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆమె సూచించారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ చేతిలో పరాజయం పొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరోవైపు ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ.. గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ పోటీ చేయలేదని, కాంగ్రెస్ దురుద్దేశ పూర్వకంగానే పోటీ చేసిందన్నారు. తన గెలుపు ప్రజల విజయంగా సుగుణమ్మ అభివర్ణించారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. -
లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం
-
లక్షకు పైగా మెజార్టీతో సుగుణమ్మ విజయం
తిరుపతి : తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ ఘన విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థి శ్రీదేవిపై 1,16,524 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి 9628 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ తిరుపతి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానన్నారు. అత్యధిక మెజార్టీ అందించిన తిరుపతి ప్రజలకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. తిరుపతి ప్రజల సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కాగా టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దాంతో ఆయన సతీమణి సుగుణమ్మ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఇక గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో దూరంగా ఉన్న విషయం తెలిసిందే.