టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్‌తో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ వాగ్వాదం
తిరుమల: మహా సంప్రోక్షణ సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయాలని ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళితే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రెన్స్ దగ్గర వెళ్లి కనుక్కోవాలని చెప్పారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సన్నిథిలోని ల్యాండ్ లైన్‌కు కాల్ చేస్తే ఈ రోజు అనుమతి లేదని, రేపు రమ్మన్నారని అధికారులు తెలపడంతో ఆమె ఆగ్రహం చెందారు.
స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఆలయ ప్రవేశానికి అనుమతి ఉందా లేదా..? స్వామి వారి మహా శాంతి తిరుమంజనానికి ఆలయంలో ఉన్న మహా భక్తులు ఎవరో తమకు చూపించాలని ఆమె మండిపడ్డారు. ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్, ఈఓ ఇతర మహా భక్తులకు ఎలా ఆహ్వానం ఇచ్చరో తనకు తెలియాలని నిలదీశారు. తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. 2006లో జరిగిన సంప్రోక్షణను తాము అప్పటి ఎమ్మెల్యే వెంకటరమణతో కలిసి చూశామన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్ ఆలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు నచ్చజెప్పారు. బోర్డు సభ్యులను కూడా ఎవరూ పిలవలేదని పేర్కొన్నారు. దీనిపై ఆవేదన చెందాల్సిన పనిలేదని గురువారం ఉదయం స్వామివారి దర్శనానికి తీసుకెళుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment