
ఏకగ్రీవానికి మద్దతిచ్చిన వైఎస్సార్ సీపీకి కృతజ్ఞతలు
ఈ మంచి సంప్రదాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు పాటించాలి
తిరుపతిలో సుగుణమ్మను పోటీలేకుండా గెలిపించుకుందాం
రాష్ట్ర మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి
తిరుపతి కార్పొరేషన్ : తిరుపతి ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మద్దతు ఇచ్చిన వైఎస్‌ఆర్ సీపీకి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ కృతజ్ఞతలు తెలిపిం ది. ఈ మంచి సంప్రదాయాన్ని అన్ని పా ర్టీలు పాటించాలని శనివారం తిరుపతి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ర్ట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. మానవత్వంతో అన్ని రాజకీయ పార్టీలు సుగుణమ్మ ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు. మాజీ మంత్రి గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పో టీ చేసే అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అయినా నందిగామ, ఆళ్లగడ్డ, తిరుపతిలోనూ మానవత్వంతో ఒక మంచి సంప్రదాయాన్ని వైఎస్‌ఆర్ కాం గ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు పాటిస్తున్నాయని గుర్తుచేశారు.
ఏకగ్రీవానికి మద్దతిచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు చెబుతూ, అభినందిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. నందిగామలో పోటీ పెట్టి, ఆళ్లగడ్డలో తప్పుకుని, తిరుపతిలో పోటీ పెడ తామనడం బాధాకరమన్నారు. బీసీ మహిళపై ఎస్సీ అభ్యర్థిని పోటీకి దించుతామని సోనియాగాంధీ చెప్పడం ఆమె స్థాయికి సరికాదన్నారు. లోక్‌సత్తా, ఇండిపెండింట్ల కూడా ఏకగ్రీవానికి సహకరించాలని కోరతామన్నారు.
ఇలా వస్తానని అనుకోలేదు
టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ ఇంటికే పరిమితమైన తాను ఇలా బయటకు వస్తానని అనుకోలేదన్నారు. భర్త చనిపోవడంతో పార్టీ కార్యకర్తలు, ప్రజల కోసం ఇలా ముందుకు వచ్చానన్నారు. ఎన్నిక ఏకగ్రీవానికి వైఎస్‌ఆర్ సీపీ లాగ అన్ని పార్టీలు సహకరించాలని వేడుకున్నారు. తన భర్త కాంగ్రెస్‌లో క్రమశిక్షణగల కార్యకర్తగా రాష్ట్ర విభజన సమయం లో విధిలేని పరిస్థితుల్లో టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలు గుర్తించి తన ఎన్నిక ఏకగ్రీవానికి మద్దతు ఇవ్వాలని వేడుకున్నారు. టీడీపీ నాయకులు గౌనివారి శ్రీనివాసులు, శ్రీధర్‌వర్మ, సూరా సుధాకర్‌రెడ్డి, నరసింహయాదవ్, దంపూరి భాస్కర్, క్రిష్ణాయాదవ్, జనతాగిరి, పుష్పావతి, విజయలక్ష్మీ పాల్గొన్నారు.