తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు.
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంగళవారం హైదరాబాద్లో చంద్రబాబును సుగుణమ్మ కలిశారు. అనంతరం సుగుణమ్మ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ, తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు... తనను కోరారని చెప్పారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఈ సందర్బంగా బాబు హామీ ఇచ్చారన్నారు.