Tirupati MLA
-
సుగుణమ్మను అభినందించిన చంద్రబాబు
-
సుగుణమ్మను అభినందించిన చంద్రబాబు
హైదరాబాద్: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లో చంద్రబాబును సుగుణమ్మ కలిశారు. అనంతరం సుగుణమ్మ విలేకర్లతో మాట్లాడుతూ... పార్టీ, తిరుపతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు... తనను కోరారని చెప్పారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఈ సందర్బంగా బాబు హామీ ఇచ్చారన్నారు. -
'సహనానికి మారు పేరు వెంకటరమణ'
హైదరాబాద్: ఇటీవల మరణించిన తిరుపతి ఎమ్మెల్యే ఎం. వెంకటరమణ సహనానికి మారు పేరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈ నేపథ్యంలో వెంకటరమణ మృతిపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం వెంకటరమణ సేవలను చంద్రబాబు కొనియాడారు. తొలుత తిరుపతి పట్టణ కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆయన అనంతరం ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు వెంకటరమణ నిత్యం ముందు ఉండేవారని అన్నారు. -
'సహనానికి మారు పేరు వెంకటరమణ'
-
'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది'
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆయన సోదరుడి కుమారుడు యుగంధర్ ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే వెంకటరమణ ప్రాణాలు తీసిందని అన్నారు. వెంకటరమణ శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని, దీనికి వైద్యులే బాధ్యత వహించాలని యుగంధర్ డిమాండ్ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరమణ సోమవారం ఉదయం కనుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ఆదివారం అపోలో వైద్యులు బైపాస్ సర్జరీ చేసినా.. ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. -
టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
-
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
చెన్నై: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ సోమవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకట రమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో... మృతి చెందారు. వెంకట రమణ పూర్తి పేరు మన్నేరి వెంకటరమణ. 1947 మార్చి 1వ తేదీన తిరుపతిలో జన్మించిన రమణ...ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. అంచలంచెలుగా ఎదిగిన రమణ...2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ పొంది.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో... 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంకట రమణకు మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య తిరుపతిలో సంచలనం రేపిన ఓ వివాహిత జంట వివాదం వెంకటరమణ చొరవతోనే సమసిపోయింది. కాగా వెంకట రమణ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు వెంకట రమణ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తున్నారు. -
కోలుకున్న ఎమ్మెల్యే వెంకటరమణ
రెండు రోజుల తరువాతవెంటిలేటర్ తొలగింపు మరో 48గంటల పాటు వైద్య సేవలు హెల్త్ బులెటిన్‌లో స్విమ్స్ డైరె క్టర్ వెల్లడి తిరుపతి కార్పొరేషన్: తీవ్ర అస్వస్థతకు గురై, రెండు రోజులుగా స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం మెరుగుపడింది. ఎమ్మెల్యే కోలుకున్నట్టు సోమవారం రాత్రి 8.30 గంటలకు స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ బి.వెంగమ్మ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. షుగర్, బీపీ లెవల్స్ స్థాయి పడిపోవడం, కిడ్నీకి సంబంధించిన వ్యాధితో శనివారం నుంచి స్విమ్స్ ఆర్ఐసీయూలో వైద్య సేవలు అందించామని తెలిపారు. 48 గంటల పాటు వెంటిలేటర్‌పై మెరుగైన వైద్య సేవలు అందించడంతో, సోమవారం ఉదయం 8 గంటలకు వెంటిలేటర్‌ను తొలగించామన్నారు. అప్పటి నుంచి స్వతహాగా శ్వాస తీసుకుంటున్నారని, తన వద్దకు వచ్చే వారిని గుర్తించి, మాట్లాడుతున్నట్టు డాక్టర్ వెంగమ్మ తెలిపారు. వెంటిలేటర్ తొలగించినా కిడ్నీ వ్యాధి కావడంతో మరో 48 గంటల పాటు డయాలసిస్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, పల్స్ రేట్ 68, బీపీ 140/80 గా ఉందని హెల్త్ బులెటిన్‌లో డాక్టర్ వెంగమ్మ స్పష్టం చేశారు. నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ శివకుమార్, స్విమ్స్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, ఆర్ఎంవో కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెంటకరమణకు వైద్య సేవలు అందిస్తున్నారు.