'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది' | doctor's responsibility for MLA Venkata Ramana death | Sakshi
Sakshi News home page

'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది'

Published Mon, Dec 15 2014 2:48 PM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది'

'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది'

చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆయన సోదరుడి కుమారుడు యుగంధర్ ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే వెంకటరమణ ప్రాణాలు తీసిందని అన్నారు.

వెంకటరమణ శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని, దీనికి వైద్యులే బాధ్యత వహించాలని యుగంధర్ డిమాండ్ చేశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరమణ సోమవారం ఉదయం కనుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ఆదివారం అపోలో వైద్యులు బైపాస్ సర్జరీ చేసినా.. ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement