MLA Venkata Ramana
-
సాక్షి ఎఫెక్ట్ : విజిలెన్స్ దాడులు
శ్రీకాకుళం : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఇసుక మాఫియాపై సాక్షి కథనాలతో శ్రీకాకుళం జిల్లా అధికారులు స్పందించారు. ఇసుక ర్యాంపులపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులకు దిగారు. కొత్తూరు మండలం మాతల పెనుగోటివాడ ఇసుక ర్యాంపులపై అధికారులు దాడులు చేశారు. రైతుల ముసుగులో ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఎమ్మెల్యే అనుచరులను అధికారులు గుర్తించారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహరంపై గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపై విజిలెన్స్ అధికారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పేదల కష్టాలు పట్టని సర్కార్
• ఐదు నదులున్నా అర కిలో ఇసుక దొరకదు • చంద్రబాబు చేతిలో ప్రజలు మోసపోయారు • ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాతపట్నం : ప్రభుత్వానికి ప్రజలు, పేదల కష్టాలు పట్టడంలేదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. కార్పొరేట్ బాసులకు చిన్న కష్టం కూడా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పాతపట్నంలోని పీఆర్ అతిథి గృహంలో విలేకర్లతో శుక్రవారం ఆయన మాట్లాడారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా, స్వర్ణముఖి వంటి రెండు ప్రధాన, మూడు చిన్న నదులు కలిపి ఐదు నదులు జిల్లాలో ఉన్నప్పటికీ బాబు ప్రకటించిన పలు విధానాల కారణంగా అరకిలో ఇసుక కూడా అవసరమైన వారికి దొరకడంలేదని ఆం దోళన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక అక్రమ వ్యాపారం అధికార పార్టీకి చెందిన ట్రాక్టరు యజమానులకు కాసులు కురుపిస్తున్నాయన్నా రు. ఒక వైపు ఇసుక లభ్యంకాక, మరో వైపు సిమెం టు ధరలు పెరిగిపోవడం, కొత్తగా కాలనీ ఇళ్లు మంజూరు లేకపోవడంతో గృహనిర్మాణ రంగం సంక్షోభంలో పడిందన్నారు. దీని కారణంగా వేలాది మంది కార్మికుల బతుకులు వీధిన పడ్డాయన్నారు. చంద్రబాబుకు ఒట్లేసి తప్పుచేశామని ఇప్పుడు అన్ని వర్గాలవారూ క్షోభకు గురవుతున్నారన్నా రు. సమావేశంలో పార్టీ నా యకులు గంగు వాసు, మజ్జి బుజంగరావు, శివాల చిన్నయ్య, తూలుగు బుజంగరావు, రేగేటి షణ్ముఖరావు, కె.చంద్రశేఖరరావు, నల్లి లక్ష్మణరావు, డి.ఆదినారాయణరావు, పి.వి.రమణ, కె.కర్రెన్న పాల్గొన్నారు. నేటి సమావేశానికి తరలిరండి పాతపట్నంలో శనివారం జరగనున్న వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ సర్పం చ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యు లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావా లని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పిలుపుని చ్చారు. ఐదు మండలాల పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లా నాయకులు పాల్గొంటారని చెప్పారు. -
'వైద్యుల నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది'
చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆయన సోదరుడి కుమారుడు యుగంధర్ ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే వెంకటరమణ ప్రాణాలు తీసిందని అన్నారు. వెంకటరమణ శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ అయిందని, దీనికి వైద్యులే బాధ్యత వహించాలని యుగంధర్ డిమాండ్ చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటరమణ సోమవారం ఉదయం కనుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ఆదివారం అపోలో వైద్యులు బైపాస్ సర్జరీ చేసినా.. ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. -
టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
-
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ కన్నుమూత
చెన్నై: చిత్తూరు జిల్లా తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ సోమవారం కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకట రమణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఆదివారం అపోలో ఆస్పత్రి వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. అయితే ఈరోజు ఉదయం ఆరోగ్యం విషమించడంతో... మృతి చెందారు. వెంకట రమణ పూర్తి పేరు మన్నేరి వెంకటరమణ. 1947 మార్చి 1వ తేదీన తిరుపతిలో జన్మించిన రమణ...ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. అంచలంచెలుగా ఎదిగిన రమణ...2004లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించింది. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ పొంది.... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో... 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. వెంకట రమణకు మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు ఉంది. ఈ మధ్య తిరుపతిలో సంచలనం రేపిన ఓ వివాహిత జంట వివాదం వెంకటరమణ చొరవతోనే సమసిపోయింది. కాగా వెంకట రమణ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. మరోవైపు వెంకట రమణ భౌతికకాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చెన్నై నుంచి తిరుపతికి తరలిస్తున్నారు. -
క్షీణించిన ఎమ్మెల్యే వెంకటరమణ ఆరోగ్యం!
తిరుపతి: స్థానిక టీడీపి ఎమ్మెల్యే ఎం.వెంకట రమణ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు షుగర్ లెవల్స్ బాగా తగ్గాయి. కిడ్నీ, గుండె జబ్బులతో ఆయన బాధపడుతున్నారు. వెంకట రమణ ప్రస్తుతం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. **