ప్రభుత్వానికి ప్రజలు, పేదల కష్టాలు పట్టడంలేదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు.
• ఐదు నదులున్నా అర కిలో ఇసుక దొరకదు
• చంద్రబాబు చేతిలో ప్రజలు మోసపోయారు
• ఎమ్మెల్యే కలమట వెంకటరమణ
పాతపట్నం : ప్రభుత్వానికి ప్రజలు, పేదల కష్టాలు పట్టడంలేదని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆరోపించారు. కార్పొరేట్ బాసులకు చిన్న కష్టం కూడా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పాతపట్నంలోని పీఆర్ అతిథి గృహంలో విలేకర్లతో శుక్రవారం ఆయన మాట్లాడారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బాహుదా, స్వర్ణముఖి వంటి రెండు ప్రధాన, మూడు చిన్న నదులు కలిపి ఐదు నదులు జిల్లాలో ఉన్నప్పటికీ బాబు ప్రకటించిన పలు విధానాల కారణంగా అరకిలో ఇసుక కూడా అవసరమైన వారికి దొరకడంలేదని ఆం దోళన వ్యక్తం చేశారు.
రాత్రి సమయంలో ట్రాక్టర్లతో ఇసుక తరలిపోతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇసుక అక్రమ వ్యాపారం అధికార పార్టీకి చెందిన ట్రాక్టరు యజమానులకు కాసులు కురుపిస్తున్నాయన్నా రు. ఒక వైపు ఇసుక లభ్యంకాక, మరో వైపు సిమెం టు ధరలు పెరిగిపోవడం, కొత్తగా కాలనీ ఇళ్లు మంజూరు లేకపోవడంతో గృహనిర్మాణ రంగం సంక్షోభంలో పడిందన్నారు. దీని కారణంగా వేలాది మంది కార్మికుల బతుకులు వీధిన పడ్డాయన్నారు. చంద్రబాబుకు ఒట్లేసి తప్పుచేశామని ఇప్పుడు అన్ని వర్గాలవారూ క్షోభకు గురవుతున్నారన్నా రు. సమావేశంలో పార్టీ నా యకులు గంగు వాసు, మజ్జి బుజంగరావు, శివాల చిన్నయ్య, తూలుగు బుజంగరావు, రేగేటి షణ్ముఖరావు, కె.చంద్రశేఖరరావు, నల్లి లక్ష్మణరావు, డి.ఆదినారాయణరావు, పి.వి.రమణ, కె.కర్రెన్న పాల్గొన్నారు.
నేటి సమావేశానికి తరలిరండి
పాతపట్నంలో శనివారం జరగనున్న వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పార్టీ సర్పం చ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యు లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావా లని ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పిలుపుని చ్చారు. ఐదు మండలాల పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్లా నాయకులు పాల్గొంటారని చెప్పారు.