ఇసుక బంద్‌.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్‌ | All the sand yards across the state are empty | Sakshi
Sakshi News home page

ఇసుక బంద్‌.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్‌

Published Thu, Oct 3 2024 5:31 AM | Last Updated on Thu, Oct 3 2024 7:08 AM

All the sand yards across the state are empty

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇసుక యార్డులు ఖాళీ  

అన్ని జిల్లాల్లో తీవ్రంగా మారిన ఇసుక కొరత 

లేని ఇసుక కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ అంటూ బిల్డప్‌.. అది కూడా 2 వారాలుగా నిలిపివేత 

అంతకుముందు.. ముందు జాగ్రత్తగా 80 లక్షల టన్నులను నిల్వ ఉంచిన గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 

అధికారంలోకి రాగానే ఇందులో 40 లక్షల టన్నులను దోచేసిన టీడీపీ కూటమి నేతలు  

ప్రభుత్వ ఖజానాకు పైసా కూడా చెల్లించని ‘పచ్చ’బ్యాచ్‌.. ఉచితం పేరుతో 

భారీ దోపిడీ.. అన్ని జిల్లాల్లో పూర్తిగా స్తంభించిన నిర్మాణ రంగం 

నిండా ముంచారని చంద్రబాబుపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికుల ఫైర్‌  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌ :  ఇసుక ఉచితం.. ఇసుక ఉచితం అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చి0ది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకడంలేదు. అన్ని జిల్లాల్లోనూ స్టాక్‌ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం తర్వాతే ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయని.. అప్పటివరకు ఇసుక ఉండదని అధికారులు తేల్చిచెబుతున్నారు. 

మరోవైపు.. ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరక్కుండా చేశారని జనం.. తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి.. స్టాక్‌ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వచేసిన 80 లక్షల టన్నుల ఇసుకకుగాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చీ రాగానే 40 లక్షల టన్నులను ఊడ్చేసి సొమ్ము చేసుకోవడంవల్లే ఈ పరిస్థితి దాపురించింది. 

ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు. అక్కడక్కడా కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్‌ మార్కెట్‌కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్‌ కొడుతోంది. ఎంతలా అంటే.. 18 టన్నుల లారీ ఇసుక రూ.30 నుంచి రూ.60 వేలు పలుకుతోంది. దీంతో నిర్మాణ రంగం రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది. 

లేని ఇసుక కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌.. 
ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు గెలవగానే వారంతా ముందుగా ఇసుక స్టాక్‌ యార్డులపై పడ్డారు. వీరు ఆ ఇసుకను మొత్తం ఊడ్చేశాక ప్రభుత్వం సెపె్టంబరు 13 నుంచి ఆన్‌లైన్‌ ఇసుక బుకింగ్‌ను ప్రారంభించింది. మొదట్లో ఉ.10 నుంచి సా.5 గంటల వరకు స్లాట్లు ఓపెన్‌ అవుతాయని చెప్పారు. ఫోన్‌ యాప్‌ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ బుకింగ్‌ అవకాశం ఉంటుందన్నారు. తీరా ఆచరణలోకి వచ్చాక వాటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలుకాలేదు. 

స్టాక్‌ యార్డుల్లో ఇసుక ఖాళీ అయిపోవడంతో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఉపయోగం లేకుండాపోయింది. దీంతో ప్రజలకు ఇసుక కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక కొద్దిరోజులుగా అయితే అసలు ఇసుక బుకింగ్‌ పోర్టల్‌ తెరుచుకోవడమేలేదు. అంతకుముందు కూడా అప్పుడప్పుడు రాత్రి 12 గంటల సమయంలో ఓపెన్‌ అయ్యేదని.. 10 నిమిషాల్లోనే స్లాట్లన్నీ అయిపోయేవని, ఎంత ప్రయతి్నంచినా తాము ఇసుకను బుక్‌ చేసుకోలేకపోయామని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.  

కూటమి నేతల అక్రమ తవ్వకాలు.. 
మ్యాన్యువల్‌గా ఇసుక బుకింగ్‌లు లేకపోవడంతో ఎవరిని అడగాలో తెలీక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌వల్ల లారీ ఓనర్లు సిండికేట్‌ అయిపోయి బల్క్‌ బుకింగ్‌లు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నందిగామలో ఒక వ్యక్తి మూడు టిప్పర్ల ఇసుక కోసం ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ శతవిధాలుగా ప్రయత్నించినా ఇసుక దొరకలేదు. 

సామాన్య జనం ఇలా ఇసుక దొరక్క అల్లాడుతుంటే ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలకు చెందిన కొందరు అక్రమార్కులు మాత్రం నదులు, పొలాల్లో అక్రమంగా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటున్నారు. వీరి అక్రమాలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇసుక మాఫియా వారిపై దాడులకూ తెగబడుతోంది. ఈ వార్తలు రాసే విలేకరులను సైతం భయకంపితుల్ని చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తాం.. నువ్వు అడ్డుకోగలవా.. దమ్ముంటే రా అని సవాల్‌ చేస్తున్నారు.

భవన నిర్మాణ కార్మికులు కుదేలు..
మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా స్టాక్‌ పాయింట్లు ఏర్పాటుచేయకుండా తమ పార్టీ నాయకులకు లబి్ధచేకూరేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. దీంతో పెద్దపెద్ద బిల్డర్లు తప్ప సాధారణ ప్రజానీకం ఎవరూ ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితిలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ రంగం స్తంభించిపోయింది. 

ఫలితంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు..  ఇసుక ఎగుమతి, దిగుమతి కూలీలు పస్తులుండాల్సిన దుస్థితి. వీరితోపాటు.. ఈ రంగంపై ఆధారపడ్డ టైల్స్‌ కార్మికులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇతర కార్మికులకు సైతం పనులు తగ్గిపోయాయి. 

ఉత్తరాంధ్రలో 18 టన్నుల లారీ రూ.40 వేల పైనే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఇసుక ధర పేలుతోంది. 18 టన్నుల ఇసుక లారీ ధర రూ.40 వేలకు పైమాటే పలుకుతోంది. రాత్రి సమయాల్లో అక్కడక్కడ అనధికారికంగా తవ్వకాలు చేపడుతున్న కూటమి నేతలు ఇష్టమొచ్చిన రేట్లకు  అమ్ముకుంటున్నారు. టన్ను ఇసుక రూ.2,200 నుంచి రూ.2,300 చొప్పున విక్రయిస్తున్నారు. 

వాస్తవానికి.. ఎన్నికలకు ముందు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా నాలుగు లక్షల టన్నుల ఇసుకను స్టాకు పాయింట్ల వద్ద నిల్వ ఉంచింది. అయితే, ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు రాత్రికి రాత్రి ఈ ఇసుక మొత్తాన్ని స్వాహా చేసేశారు. మిగిలిన కొద్దిపాటి ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలోని కొన్నిచోట్ల చీకటిపడితే ఇసుక లారీల జాతర నడుస్తోంది.

అధికారంలోకి రాగానే 40 లక్షల టన్నుల ఇసుక హాంఫట్‌..నిజానికి.. వర్షాకాలంలో ఇసుక కొరత వస్తుందనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 70కి పైగా స్టాక్‌యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వచేసింది. కానీ, జూన్‌లో అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ఆ నిల్వలను అడ్డగోలుగా అమ్మేసుకున్నారు. రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నులకు పైగా ఇసుకను దోచేశారు. ఆ తర్వాత చంద్రబాబు తీరిగ్గా ఉచిత ఇసుక విధానమని ప్రకటించినా ఎక్కడా ఉచితంగా ఇచ్చిన పాపానపోలేదు. ప్రతిచోటా వినియోగదారులు రెట్టింపు రేట్లకు ఇసుకను కొనుక్కోక తప్పలేదు. 

18 టన్నుల ఇసుక లారీ రూ.30 వేల నుంచి రూ.60 వేలకు చేరుకోవడంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరీవాహక ప్రాంతం రావులపాలెంలో అయితే ఐదు యూనిట్ల ఇసుక రూ.25 వేల వరకు ధర పలికింది. మిగిలిన చోట్ల ఇది రూ.30 వేల వరకు ధర పలుకుతోంది. గతంలో ఎనీ్టఆర్‌ జిల్లా పరిధిలో లారీ ఇసుక ధర రూ.13 వేలు ఉండేదని.. ఇప్పుడు రూ.36 వేలకు చేరిందంటున్నారు. 

ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు అధిక రేట్లతో ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం కూడా రాలేదు. ఇక టీడీపీ నేతలు దోపిడీ చేయగా అక్కడక్కడా కొన్ని స్టాక్‌ యార్డుల్లో మిగిలిన కొద్దిపాటి ఇసుకను వారు రెట్టింపు రేట్లకు అమ్ముకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఏ స్టాక్‌ యార్డులోనూ ఇసుక లేకపోవడంతో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉంది. వర్షాకాలం తర్వాతే ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతుండడంతో నిర్మాణ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

ఇసుక కోసం నానా ఇబ్బందులు.. 
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఒక్క ఇసుక రీచ్‌ కూడా పూర్తిగా తెరవలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డైరెక్ట్‌గా ఇసుక రీచ్‌లోనే టన్ను రూ.475కి ఇచ్చేవారు. దీనిని మేం కస్టమర్‌కి రూ.1,000 లేదా రూ.1,100కి విక్రయించే వాళ్లం. ఇప్పుడు అష్టకష్టాలు పడితే శ్రీకాకుళం రీచ్‌లో రూ.1,200కి టన్ను ఇసుక దొరుకుతోంది. 

దానిని విశాఖ తీసుకొచ్చి రూ.2,200 నుంచి రూ.2,300 చొప్పున విక్రయిస్తున్నాం. ప్రస్తుతం వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లారీ యజమానులూ రోడ్డున పడ్డారు.  – కర్రి వెంకటరమణ, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి, మధురవాడ (విశాఖ జిల్లా) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement