సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు? | Why SANATHNAGAR to the elections? | Sakshi
Sakshi News home page

సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?

Published Fri, Oct 9 2015 2:57 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు? - Sakshi

సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?

తలసాని ఏమైనా రాజీనామా చేశారా?:నాయిని

హైదరాబాద్: ‘‘సనత్‌నగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)కు ఉప ఎన్నిక ఎందుకు.. ఆయన (తలసాని) ఏమైనా రాజీనామా చేసిండా?’’ అంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాయిని ఓ ప్రశ్నకు ఇలా బదులిచ్చారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీడీపీ తరపున ఎన్నికైన తలసాని టీఆర్‌ఎస్‌లో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి ఆపై మంత్రి పదవి చేపట్టడం తెలిసిందే. ఆయన రాజీనామా వ్యవహారం ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండటంతో దీనిపై టీడీపీ.. రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో కేసు వేయడమూ విదితమే. ఈ విషయాలను విస్మరించి హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నాయిని వ్యాఖ్యలతో జగదీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని విలేకరుల సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement