SANATHNAGAR
-
ఎవర్ గ్రీన్ పబ్ లో మహిళలతో అశ్లీల నృత్యాలు
-
సీఎంను అందించిన భాగ్యనగరం!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని భాగ్యనగరం మూటగట్టుకుంది. రాజకీయ ఉద్దండుడు మర్రి చెన్నారెడ్డి 1989లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సనత్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1989 డిసెంబర్ 3 నుంచి 1990 డిసెంబర్ 17 వరకు సీఎం బాధ్యతలు చేపట్టారు. నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి తనదైన మార్క్‌ను సాధించారు. సనత్‌నగర్ నుంచి పోటీ చేయకముందే 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబర్ 11 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న సనత్‌నగర్ నియోజకవర్గం 1978లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా నాలుగో ఎమ్మెల్యేగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు మర్రి శశిధర్‌రెడ్డిని నిలబెట్టి 1992లో గెలిపించుకుని తన రాజకీయ వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకుసాగారు. దశాబ్ద కాలం క్రితం వరకు సనత్‌నగర్ అంటే మర్రి కుటుంబం, మర్రి అంటే సనత్‌నగర్‌గా ఉంటూ వచ్చింది. ఇవి చదవండి: TS Election 2023: దోస్త్ వర్సెస్ దోస్త్..! -
హైదరాబాద్: ఆర్థిక తగాదాలతోనే బాలుడు వహీద్ హత్య
-
సనత్ నగర్ లో లోకో పైలట్ వాసవి అదృశ్యం
-
Hyderabad: ఈ ప్రాంతాల్లో జనవరి 31 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని జింకలవాడ ఎదురుగా ఉన్న నాలా కల్వర్టు స్థానంలో బాక్స్ టైప్ కల్వర్టు నిర్మాణం చేపడుతున్న దృష్ట్యా ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 వరకు రెండు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ►బాలానగర్ నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చే ద్విచక్ర వాహనాలను అనుమతిస్తారు. అయితే ఖైతాన్నగర్ వద్ద వాహనాలను కుడివైపు మళ్లించి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్, జింకలవాడ నాలా, దుర్గామాత ఆలయం, సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ మీదుగా భరత్‌నగర్ మార్కెట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ►మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను నర్సాపూర్ క్రాస్ రోడ్డు నుంచి జింకలవాడ మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు అనుమతించరు. వాటిని నర్సాపూర్ క్రాస్‌రోడ్డు నుంచి కూకట్పల్లి వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తీసుకుని మూసాపేట క్రాస్‌రోడ్డు మీదుగా భరత్‌నగర్ మార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ► ద్విచక్ర వాహనాల రాకపోకలు మాత్రమే భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్ రోడ్డు వైపునకు అనుమతిస్తారు. ఈ వాహనాలను సనత్‌నగర్ రైల్వే క్వార్టర్స్ (ఎదురుగా ఎడమ వైపునకు), దుర్గామాత ఆలయం(కుడి మలుపు), జింకలవాడ నాలా, ట్రాన్స్‌కాన్ ఇండస్ట్రీస్(కుడి మలుపు), సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఐటీఐ కళాశాల, ఖైతాన్నగర్ రహదారిలో ఎడమవైపు తీసుకుని నర్సాపూర్ క్రాస్‌రోడ్డుకు చేరుకోవాల్సి ఉంటుంది. ►ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు, లైట్ మోటార్ వాహనాలు, మినీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, గూడ్స్ వాహనాలు, హెవీ గూడ్స్ వాహనాలు, బస్సులను భరత్‌నగర్ మార్కెట్ నుంచి జింకలవాడ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు అనుమతించరు. వాటిని భరత్‌నగర్ మార్కెట్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ వైపు మళ్లిస్తారు. వై జంక్షన్ వద్ద కుడివైపు మళ్లి ఐడీపీఎల్ కంపెనీ మీదుగా నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వైపు వెళ్లాల్సి ఉంటుంది. చదవండి: జైళ్లో పెట్టుకోండి.. అంతకంటే ఏం చేయగలరు?: ఎమ్మెల్సీ కవిత ఫైర్ -
నలుగురిని కిడ్నాప్ చేసిన బంగారం స్మగ్లింగ్ గ్యాంగ్
సనత్‌నగర్: దుబాయ్ నుంచి నగరానికి బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ఓ ముఠా నలుగురిని కిడ్నాప్ చేయడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరు.. నగరానికి చెందిన ఓ ముఠా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేయిస్తూ అక్రమ సంపాదన చేస్తోంది. ఎవరైనా పర్యటన నిమిత్తం దుబాయ్‌కు వెళితే వారిని గుర్తించే ఈ ముఠా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే పర్యటన ఖర్చులతో పాటు మరింత డబ్బును అదనంగా ఇస్తామని చెబుతుంది. ఇలాగే పాతబస్తీకి చెందిన సహబాజ్(21) ద్వారా పరిచయం అయిన ఈ ముఠా షహబాజ్‌తో పాటు శ్రీనగర్‌కాలనీకి చెందిన ఆయాజ్(22), అశోక్‌కాలనీకి చెందిన పహద్(23)లను గత 15 రోజుల క్రితం దుబాయ్‌కి పంపించారు. అక్కడ ఈ ముఠాకు చెందిన సభ్యులు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని కాళ్లకు చుట్టుకుని రావలసి ఉంటుంది. దుబాయ్‌కి వెళ్లిన ఆయాజ బంగారాన్ని తీసుకుని హైదరాబాద్‌కు ముందుగానే చేరుకున్నాడు. షహబాజ్, పహద్లు శుక్రవారం నగరానికి రావాల్సి ఉంది. అయితే పహద్ దుబాయ్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కకుండా అదృశ్యయమయ్యాడు. బంగారంతో పాటు అదృశ్యమైన పహద్ కోసం నగరంతో పాటు దుబాయ్‌లోని స్మగ్లర్లు గాలింపు చేపట్టి వెదుకుతున్నారు. పహద్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాలంటూ నగరానికి వచ్చిన అయాజ్, షహబాజ్‌లతో పాటు పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, వారి దగ్గర బంధువు ఆసిమ్‌లను ఇంటి దగ్గర నుంచి కిడ్నాప్ చేవారు. అలాగే దుబాయ్‌లో ఉండే పహద్ దగ్గరి బంధువు ఆకిబ్‌ను కూడా దుబాయిలో కిడ్నాప్ చేశారు. నగరంలో కిడ్నాప్ చేసిన నలుగురిలో షహబాజ్, ఆయాజ్, ఆసిమ్‌లను విడిచిపెట్టారు. పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్‌ను కుటుంబ సభ్యులు బుధవారం సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని గుర్తించిన కిడ్నాపర్లు ఆయనను కూడా వదలిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. (చదవండి: కదం తొక్కిన కార్మికులు) -
10 వేలు ఆపినోడు 25 ఇస్తామంటే నమ్ముతారా?
-
దారుణం..పసికందు అక్కడికక్కడే మృతి
-
దారుణం..పసికందు అక్కడికక్కడే మృతి
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో 14 రోజుల పసికందుని భవనం పైనుంచి కిందపడేసింది ఓ తల్లి. పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఫతేనగర్ డివిజన్ నేతాజీ నగర్లో వేణుగోపాల్ లావణ్య దంపతుల నివసిస్తున్నారు. వీరికి 2016లో వివాహమైంది. మూడేళ్ల బాబు ఉన్నాడు. రెండో సంతానంలో అమ్మాయి పుట్టడంతో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో శనివారం మరోసారి గొడవ జరగడంతో కోపంతో లావణ్య 14 రోజుల పసికందును మూడో అంతస్తు నుంచి పై నుంచి కింద పడేయడంతో చిన్నారి మృతి చెందింది. సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం
సనత్‌నగర్: లాక్డౌన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్ పోస్ట్ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్‌కు చెందిన ఓ యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని క్వారంటైన్ కు పంపనున్నట్లు తెలిపారు. -
రోటీశ్వరి
సక్సెస్ స్టోరీలన్నీ కష్టాల నుంచే మొదలవ్వవు. మంచి ఆలోచనల నుంచి కూడా అవి ‘తయారవుతాయి’. శశిరేఖకు మొదట వచ్చిన ఆలోచన.. ఇంటి పనిలో దొరికించుకున్న ఖాళీ సమయంలో తనేదైనా పని చెయ్యాలని. రెండో ఆలోచన.. తను పని చేస్తూ, కొంతమందికి పని కల్పించాలని. అలా మొదలైందే.. జీవీఎస్ ఫుడ్స్. రెడీమేడ్ రొట్టెలతో అమ్మకాలను మించిన నమ్మకాన్ని పొందుతున్న శశిరేఖను రోటీశ్వరి అనడమే ఆమె విజయానికి సరైన పోలిక. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఉంటారు శశిరేఖ. గృహిణి. భర్త ప్రైవేట్ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. అంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు భార్యాభర్తల మాటల్లోకి చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు వచ్చాయి. ‘‘అవును, ఇప్పుడంతా ఉదయం పూట టిఫిన్‌గా, రాత్రి భోజనానికి బదులుగా అవే తింటున్నారు’’ అని భార్య అంటే.. బయట మార్కెట్లో కూడా బాగా గిరాకీ కనిపిస్తోంది’’ అని భర్త అన్నాడు. అప్పుడొచ్చింది శశిరేఖకు ఆలోచన. తను కూడా చపాతీలు, జొన్నరొట్టెలు, పుల్కాలు చేసి అమ్మితే?! అయితే అప్పటికప్పుడు వాటిని తయారు చేసి అమ్మడం కాకుండా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినేందుకు వీలుగా ప్యాక్ చేసి మార్కెట్‌కు వెయ్యడం కరెక్ట్ అనిపించింది ఆమెకు. భర్త బాలరాజుకూ ఆ ఆలోచన నచ్చింది. ఆవిర్భావం! భర్త ఓకే అన్నాడు. కావలసిన సామగ్రి తెచ్చిపెట్టాడు. తయారీకి ఐదుగురు మహిళల్ని తీసుకున్నారు. కొద్దిపాటి వ్యాపారమే. మెల్లిగా వృద్ధి చెందడం మొదలైంది. ఇక చేతులు సరిపోవడం లేదు. యంత్రాలు కావలసిందే. ఉన్నవి అమ్ముకుని కొంత, బ్యాంక్ లోను కొంత కలిపి యాభై లక్షల రూపాయలతో కోయంబత్తూర్ నుంచి ఆటోమేటిక్ అన్కుక్డ్ మెషిన్లు రెండింటిని తెప్పించారు. ఇంటినే కర్మాగారంగా మార్చేశారు. ఒక్కో మిషన్‌పై గంటకు 500 చపాతీలు తయారవుతాయి. రెండు మెషీన్ల నుంచి వెయ్యి చపాతీలను గంటలోనే తయారు చేస్తారు. పిండి కలపడం, ముద్దలుగా చేయడం, ప్రెస్ చేయడం, మిషనరీపై నుంచి తయారైన వాటిని ప్యాక్ చేసేయడం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా తక్కువ ధరలకే ఇస్తుండడంతో డిమాండ్ కూడా బాగా పెరిగింది. రెడీమేడ్‌గా తయారు చేసిన ఈ చపాతీలు, జొన్నరొట్టెలను పొయ్యిపై పెనం పెట్టి కొంచెం వేడి చేసుకుంటే చాలు. కమ్మగా తినచ్చు. ప్యాకింగులో వారం రోజులు నిల్వ ఉంటాయి. తల్లి మనసు ‘‘మేలు రకం గోధుమపిండి, వంటనూనె, మినరల్ వాటర్‌ను వీటి తయారీకి ఉపయోగిస్తాం. నాణ్యత, స్వచ్ఛతే మా వ్యాపారాభివృద్ధికి మార్గమైంది’’ అంటారు శశిరేఖ. ‘‘మా రెడీమేడ్ చపాతీలను, జొన్నరొట్టెలను గృహిణులు ఇంట్లో చేసి, స్కూలుకు వెళ్లే చిన్నారులకు సైతం టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నారు. పిల్లలు ఎంతో ఇష్టంతో తింటున్నారు’’ అని సంతోషంగా చెబుతున్నప్పుడు శశిరేఖలో మనకు వ్యాపారవేత్త కన్నా, తల్లి మనసే కనిపిస్తుంది! ‘‘బీపీ, షుగర్, ౖథైరాయిడ్, ఒబేసిటీ ఉన్నవారు చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెలు తినడం మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. దాంతో ఇటు చిన్నారుల నుంచే కాకుండా పెద్దల నుంచి కూడా మా ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోందని’’అంటారు శశిరేఖ. ఇతర రాష్ట్రాల నుంచీ..! రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుంటాయి. ‘‘హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, దాబాలు, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు పెరిగాయి. అంతేకాకుండా అమెరికాకు వెళ్లే మన తెలుగు వారికి ఇక్కడినుంచి చపాతీలు, పుల్కాలు, జొన్నరొట్టెల పార్సిళ్లు పంపుతున్నాం’’ అని చెప్పారు శశిరేఖ. – మొలుగూరి స్వర్ణలత, సాక్షి, హైదరాబాద్ -
ఈఎస్ఐ కాలేజీకి ‘సూపర్’ సొగసులు
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి సేవలు విస్తృతం కానున్నాయి. ఈఎస్ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆస్పత్రికి అనుబంధంగా కేంద్ర ప్రభు త్వం 2016లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో కారి్మక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతుండగా.. తాజాగా ఈ కాలేజీలో డీఎన్బీ (డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు) కోర్సులు ప్రారంభించేందుకు కేంద్రం ఆమో దం తెలిపింది. ఇప్పటివరకు యూజీ కోర్సులతో కొనసాగుతున్న ఈ కాలేజీలో ఇకపై డీఎన్బీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డీఎన్బీ పరిధిలో అన్నీ సూపర్ స్పెషాలిటీ కోర్సులే కావడంతో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కారి్మకులకు ఆధునిక సేవలు అందనున్నాయి. వీటితోపాటు స్పెషల్ పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రుల్లో డీఎన్బీ, స్పెషల్ పీజీ కోర్సులు ప్రారంభిస్తున్న వాటిలో మొదటిది సనత్‌నగర్ ఈఎస్ఐ కాలేజీనే కావడం విశేషం. కొత్త కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు అధికారు లు చర్యలు వేగవంతం చేశారు. 2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్లో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రికి రూ.180 కోట్లు కేటాయించగా.. కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.200 కోట్లకు పెంచింది. -
ఈఎస్ఐలో ఇక్కట్లు
అమీర్‌పేట్: సనత్‌నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాల బోధన ఆస్పత్రిలో రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదు. కార్డు లబ్ధిదారుల పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఓపీ (ఔట్ పేషెంట్ బ్లాక్) విభాగంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని రోగుల సహాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి రోజూ వేల సంఖ్యలో రోగులు ఓపీ బ్లాక్‌కు వస్తుంటారు. రోగులకు రద్దీకి అనుగుణంగా వైద్యులు ఉండటం లేదు. ముందుగా ఇన్పేషెంట్లను చూసి ఓపీకి ఆలస్యంగా వస్తుండటంతో రోగులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 8 గంటలకే ఓపీకి వచ్చి క్యూలైన్లో ఉన్నప్పటికి 10 గంటల తర్వాతే వైద్యులు వస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. టెస్టుల చేస్తారేమోనని తినకుండా ఆస్పత్రి వచ్చేవారు స్పృహ తప్పి పడిపోతున్నారని చెబుతున్నారు. ప్రతిరోజూ నిర్ణీత సమయం వరకే ఓపీ ఉంటున్నందున ముందుగా ఓపీకి వచ్చే రోగులకు పరీక్షించి అనంతరం వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరీక్షించాలని కోరుతున్నారు. లేని పక్షంలో వైద్య సిబ్బందిని పెంచి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఈఎస్ఐ వైద్యం.. భరోసాకు దూరం
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్య సేవలు అధ్వానంగా మారుతున్నాయి. అనారోగ్యంతో ఈ ఆస్పత్రికి వస్తున్న రోగులు సరైన సేవలు అందక నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా ఇక్కడ డయాలసిస్ సేవల్ని ఉపసంహరించారు. దీంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు సమాచారం లేకుండా సేవలు నిలిపి వేస్తే ఎలా అని రోగులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు అందాలంటే రెండు నెలలపాటు నిరీక్షించాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. ఈ బాధలు భరించలేని కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అమీర్‌పేట్/సాక్షి, సిటీబ్యూరో:ఈఎస్ఐ ఆస్పత్రి అంటే ఓ భరోసా..ఓ ధైర్యం.. నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందుతుందనే నమ్మకం.. ఇప్పుడు సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి ఆపేరును చెరిపేసుకుంటోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ఆస్పత్రి కనీస భరోసా ఇవ్వలేకపోతోంది. ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యపరికరాలు సమకూర్చుకుని రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి వైద్యసేవలను విస్మరిస్తుంది. తాజాగా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందించే ఏజేన్సీ పనితీరు సరిగా లేదని పేర్కొంటూ ఆ సేవలను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా సేవలను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని రోగులు, వారి తరపు బంధువులు ప్రశ్నిస్తున్నారు. గడువున్నా..ఒప్పందం రదు... మూత్ర పిండాల పనితీరు దెబ్బతిన్న రోగులకు డయాలసిస్ చేస్తుంటారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో 1500 మంది బాధితులు వైద్యసేవలు పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి కొందరికి వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయాల్సి ఉంది. ఒక్కో బృందంలో 310 మందికి డయాలసిస్ చేస్తున్నా రు. ఈ సేవలను నెఫ్రోప్లస్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు ఇచ్చిన గడువు ఇంకా కొంత కాలం ఉంది. అయితే ఉన్నట్టుండి ఈ సంస్థతో సేవలను ఈఎస్ఐ రద్దు చేసుకుంది. ప్రత్యామ్నాయంగా డయాలసిస్ కోసం నగరంలో ఐదు ఆసుపత్రులను ఎంపిక చేసింది. అక్కడకు వెళ్లాలని రోగులకు సూచిం చింది. అకస్మా త్తుగా సేవలను ఎత్తివేయడంపై రోగులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే డయాలసిస్ కాంటాక్ట్ దక్కించుకున్న సంస్థ పనితీరు సరిగా లేనందు వల్లే సేవలను ఉపసంహరించుకున్నట్లు ఈఎస్ఐసీ సూపర్‌స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తి ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఐదు ఆస్పత్రులను ఇందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంఆర్ఐకి రెండు నెలలు... ఆస్పత్రిలో ఆరు సూపర్ స్పెషాలిటీ విభాగాలతో పాటు 16 సాధారణ చికిత్సల విభాగాలు ఉన్నాయి. సుమారు 380 పడకలు ఉన్న ఈ ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో నిత్యం 350 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. క్షతగాత్రులతో పాటు తల నొప్పి, వెన్ను పూస నొప్పులు, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు ఉంటారు. వీరిలో చాలా మందికి సీటీ, ఎంఆర్ఐ టెస్టులు అవసరం ఉంటుంది. వైద్యులు రాసిన చీటీ తీసుకుని ఎంఆర్ఐ విభాగానికి వెళ్తే..రెండు నెలల తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. అప్పటికే వ్యాధి తీవ్రత మరింత ముదిరి ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది. చేసేది లేక కొంత మంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రిలో రెండు అధునాతన ఎంఆర్ఐ మిషన్లు ఉన్నా సకాలంలో సేవలు అందకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
లక్షలు వసూలు చేసి బతికించలేదు..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కలకలం రేగింది. వైద్యం కోసం వచ్చిన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. అయితే, ప్రాణాలు నిలుపుతారని ఆస్పత్రికి తీసుకొచ్చిన తమ కుమారున్ని డాక్టర్ల నిర్లక్ష్యమే చంపేసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. అనారోగ్యంతో ఉన్న జయరాం (4)ను సనత్‌నగర్‌లోని నీలిమ హాస్పిటల్‌కి వైద్యం నిమిత్తం ఆదివారం తీసుకొచ్చారు. బాలుడి వైద్యసేవలకై 3 లక్షల యాభై వేల బిల్లు వసూలు చేశారు. బాలుడికి నయమవుతోందని చెప్పి మరింత డబ్బుని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కానీ, పిల్లాడి ప్రాణాలు మాత్రం కాపాడలేపోయారు. కాగా, తమ కుమారుడి చావుకి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందళనకు దిగారు. -
పెళ్లిరోజే తనువు చాలించింది
-
ఈ జీవితం నాకొద్దు
పెళ్లిరోజే తనువు చాలించింది అత్తింటి వారి వేధింపులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణం సనత్‌నగర్: ప్రేమించుకున్నారు..అందరినీ ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.. అయితే పెళ్లయిన ఆరు నెలలకే అత్తింటి వారు వేధింపులకు ఆమె తాళలేకపోయింది...పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేకపోయింది...దీంతో తీవ్ర మనస్థాపంతో సరిగ్గా పెళ్లయిన ఏడాదికి.. అదీ పెళ్లిరోజే(శనివారం) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు.. బేగంపేటకు చెందిన భాగ్యలక్ష్మి (29) ఏఎండీ సంస్థలో ఉద్యోగి. కర్మన్‌ఘాట్‌కు చెందిన శశి గూగుల్ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ప్రేమించుకుని గత ఏడాది మార్చి 25న వివాహం చేసుకుని బేగంపేటలోని ఏఎండీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆరు నెలల పాటు సజావుగా సాగిన కాపురంలో విబేధాలు తలెత్తాయి. అత్తింటివారు మానసికంగా వేధిస్తున్నారంటూ భాగ్యలక్ష్మి కొన్ని నెలల క్రితం బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దంపతులకు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ ఫలితం లేదు. శనివారం దంపతుల పెళ్ళిరోజు కావడం..భర్త తన వద్ద లేకపోవడం.. అత్తింటి వారి వేధింపులు...వెరసి మానసికంగా కుంగిపోయిన ఆమె శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆమె ఉరేసుకున్న గది గోడలపై సూసైడ్ నోట్ రాసింది. నా చావుకు కారణం భర్త శశి, అత్తింటి కుటుంబసభ్యులు మంజుల, భాస్కర్, రమణిలు. మానసికంగా హింసించారు. భర్త నా మాట వినకుండా విడిపోయాడు. నేను చనిపోయాక నా శవాన్నీ, నాకు సంబంధించిన వస్తువులను ఎవరూ ముట్టుకోనీయవద్దు...బేగంపేట పోలీసులనూ వారు కొనేశారు...వాళ్లను నమ్మవద్దు...అంటూ గోడపై రాసి పెట్టింది. పోలీసులు అత్తింటివారిని అదుపులోకి తీసుకున్నారు. -
ముస్లింలను కించపరిస్తే సహించం: మర్రి
సనత్‌నగర్: ఖబరస్థాన్ స్థల విషయంలో మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముస్లింలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి మర్రిశశిధర్ రెడ్డి అన్నారు. ఓల్ట్ కస్టమ్స్ బస్తీలో తహరిక్ ఖబరస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఖబరస్థాన్ కు తాను ఒక ఎకరా కేటాయిస్తానని చెబితే...తలసాని రెండెకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రితో చెప్పించారని, అయితే రెండేళ్లు గడిచినా ఎక్కడా స్థలం కేటాయించకుండా వారిని మోసం చేశారని ఆరోపించారు. ధనాలగుట్ట వద్ద ముస్లింలకు ఒక ఎకరా స్థలం కేటాయించి, హిందూ శ్మశానవాటికకు మిగతా స్థలంతో పాటు మరింతగా విస్తరించుకునేందుకు తాను ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల కారణంగా అది పెండింగ్‌లో పడిందని తెలిపారు. ముస్లింలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో సలీంఖాన్ , అనీఫ్, అబ్దుల్వాహిద్, శంకర్‌యాదవ్, సాబేర్, జాఫర్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న మర్రి శశిధర్‌రెడ్డి -
కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి..
సనత్‌నగర్: కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ కిష్టయ్య కథనం ప్రకారం..బేగంపేట గగన్ విహార్ కాలనీ నివాసి ఏ కౌశల్య (58) తన కుమారులకు వివాహాలు కావడంలేదని కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. బేగంపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యంపై నాగరాజు సైకిల్ యాత్ర
సనత్‌నగర్: తాగి వాహనాలను నడిపి నిండు ప్రాణాలను బలితీసుకోవద్దంటూ వరంగల్ జిల్లాకు చెందిన నాగరాజు సైకిల్ యాత్ర చేపట్టాడు. బేగంపేట్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) నుంచి నిర్విరామంగా 50 గంటలపాటు నిర్వహించే సైకిల్ యాత్రను శుక్రవారం హీరో శివబాలాజీ జెండా ఊపి ప్రారంభించారు. సైకిల్ యాత్రతో కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావానుకుంటున్నట్లు నాగరాజు తెలిపారు. -
ఆ టీఆర్ఎస్ నేత నుంచి ప్రాణాహాని ఉంది
సనత్‌నగర్: అధికార టీఆర్ఎస్ పార్టీ సనత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడితో పాటు ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి అబ్దుల్‌హమీద్ ఆరోపించారు. తన రెండో భార్యతో కలిసి తన ఆస్తిని కాజేయాలని వారు కుట్ర పన్నారన్నారు. ఆదివారం సనత్‌నగర్‌లోని తన నివాసంలో బాధితుడు అబ్దుల్ హమీద్ విలేకరులతో మాట్లాడారు. 1995లో తన మొదటి భార్య నూర్జహాన్‌బేగం చనిపోగా 2001లో వరంగల్‌కు చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నానని తెలిపారు. తన రెండో భార్యకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానంటూ ఆ పార్టీ నాయకుడు ఖలీల్‌బేగ్ ఆమెతో సాన్నిహిత సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత రూ. ఐదు కోట్ల విలువ చేసే తన ఇంటిని తన పేరుపై మార్చుకుని కాజేయాలని ఖలీల్‌బేగ్ ప్రయత్నం చేశాడన్నారు. దీంతో ఆయన తన రెండో భార్యతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలతో సహా, వారి మోసంపై సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని హమీద్ చెప్పారు. ఆ తరువాత ఏప్రిల్ 29, 2015న రెండో భార్యతో విడాకులు తీసుకున్నానని తెలిపారు. అప్పటి నుంచి ఎక్కడ ఆస్తి చేజారిపోతుందోననే ఉద్దేశంతో ఖలీల్‌బేగ్ తనను చంపేస్తానని అల్లావుద్దీన్‌కోఠికి చెందిన ఖాజా, డీఎన్‌ఎంకాలనీకి చెందిన సాబేర్‌లతో కలిసి బెదిరిస్తున్నాడని తెలిపారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని హమీద్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు టీఆర్ఎస్ పార్టీలో పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే తాను మీడియా ద్వారా న్యాయం చేయాలని కోరుతున్నానని బాధితుడు తెలిపారు. కాగా ఖలీల్‌బేగ్, అబ్దుల్ హమీద్ రెండో భార్య (ప్రస్తుతం విడాకులు తీసుకున్నారు) సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆదివారం హల్చల్ చేయడం గమనార్హం. -
సనత్‌నగర్‌కు ఉపఎన్నిక ఎందుకు?
తలసాని ఏమైనా రాజీనామా చేశారా?:నాయిని హైదరాబాద్: ‘‘సనత్‌నగర్ (అసెంబ్లీ నియోజకవర్గం)కు ఉప ఎన్నిక ఎందుకు.. ఆయన (తలసాని) ఏమైనా రాజీనామా చేసిండా?’’ అంటూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిలతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాయిని ఓ ప్రశ్నకు ఇలా బదులిచ్చారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి టీడీపీ తరపున ఎన్నికైన తలసాని టీఆర్ఎస్లో చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించి ఆపై మంత్రి పదవి చేపట్టడం తెలిసిందే. ఆయన రాజీనామా వ్యవహారం ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండటంతో దీనిపై టీడీపీ.. రాష్ట్రపతి, గవర్నర్లకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టులో కేసు వేయడమూ విదితమే. ఈ విషయాలను విస్మరించి హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. నాయిని వ్యాఖ్యలతో జగదీశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకుని విలేకరుల సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. -
'రాష్ట్ర మంత్రి అండతో దౌర్జన్యకాండ'
మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి సనత్‌నగర్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అండదండలతో ఆయన అనుచరులు దౌర్జన్యకాండకు దిగుతున్నారని, అధికార పార్టీ నుంచి ఏ అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. సనత్‌నగర్ ఐటీఐ కళాశాల విద్యార్థులపై అధికార పార్టీ టీఆర్ఎస్కు చెందిన స్థానిక నాయకులు దాడి చేశారన్న సమాచారం మేరకు మంగళవారం ఆయన కళాశాలకు విచ్చేసి విద్యార్థులను పరామర్శించారు. వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మర్రి మాట్లాడుతూ.. నిత్యం మంత్రి తలసాని వెంట ఉండే అనుచరుడు కళాశాలకు చెందిన షట్టర్‌కు అడ్డంగా వాహనం పార్కింగ్ చేయడంతో పాటు తమకు అడ్డుగా ఉందని విద్యార్థులకు కొద్దిగా పక్కకు జరిపినంత మాత్రాన ఏడెనిమిది మంది అధికార పక్ష నాయకులతో కలిసి వచ్చి విద్యార్థులపై దాడికి దిగడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థినులు, అక్కడ పనిచేసే మహిళలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం సంస్కృతి కాదన్నారు. మంత్రి వెంట తిరిగే అనుచరులే విద్యార్థులపై దౌర్జన్యానికి దిగితే మంత్రి నేరుగా వచ్చి పరామర్శించి వారి తరుపున క్షమాపణ చెప్పాల్సిందిపోయి వారి దాడులను ప్రోత్సహించే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ఖబర్థార్ అంటూ హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల నుంచి కీడు జరిగితే నేరుగా తనకు 98480 46677 ఫోన్నెంబర్లో సంప్రదించాలని, తాను వారికి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. -
నమ్మాలి... ఉచితంగా ఉల్లి
వినడానికి కొత్తగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ‘ఉల్లి లొల్లి’ అంతా ఇంతాకాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి తల్లిని ఉచితంగా ఇస్తున్నారంటే ఎవరా ధర్మాత్ములు అంటారు. ఉల్లిపాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వం రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయల కౌంటర్లు తెరిచింది. ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా వరుసలో నిలుచున్నా సరుకు దొరకని పరిస్థితి. ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయద’న్న సామెతను గుర్తెరిగారో యేమో.. అమీర్‌పేట్ లీలానగర్‌లో గల సన్‌షైన్ ప్రి స్కూల్ యాజమాన్యం స్కూల్లో ప్రత్యేక ఉల్లి శిబిరాలను ఏర్పాటు చేసింది. రెండు రోజులపాటు పిల్లలకు తలో కిలో చొప్పున మొత్తం 154 కిలోలు ఉల్లిపాయలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న చిన్నారులు తమ తల్లిదండ్రులతో వచ్చి వీటిని తీసుకున్నారు. ఉచిత వైద్య శిబిరాలు గురించి తెలుసు.. ఉచిత రక్తదాన శిబిరాల గురించి విన్నాం. ఇప్పుడు ఉచిత ఉల్లి శిబిరాల వంతు వచ్చింది. - సనత్‌నగర్ -
సనత్‌నగర్‌లో తల్లీకూతుళ్ల అదృశ్యం
హైదరాబాద్: నగరానికి చెందిన తల్లీకూతుళ్లు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా సనత్‌నగర్‌లో తల్లి చంద్రకళ, కూతురు నేహా నివాసం ఉంటున్నారు. అయితే వారం రోజుల కిందట కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాలని రైలులో బయలుదేరారు. ఇదిలాఉండగా వారం రోజులైనా ఆ తల్లీకూతుళ్లు బంధువుల ఇంటికి చేరలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సనత్‌నగర్‌లో వారం రోజుల కిందట రైలు ఎక్కించామని, ఇప్పటి వరకూ తమ వాళ్ల జాడ కనిపించడం లేదంటూ వారు వాపోతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
సనత్‌నగర్‌లో సీఎం కేసీఆర్