ముస్లింలను కించపరిస్తే సహించం: మర్రి | marri shashidar reddy fires on thalasani srinivas yadav about muslims | Sakshi
Sakshi News home page

ముస్లింలను కించపరిస్తే సహించం: మర్రి

Published Sat, Oct 8 2016 11:13 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM

ముస్లింలను కించపరిస్తే సహించం: మర్రి - Sakshi

ముస్లింలను కించపరిస్తే సహించం: మర్రి

సనత్‌నగర్‌: ఖబరస్థాన్ స్థల విషయంలో మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ముస్లింలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి మర్రిశశిధర్‌ రెడ్డి అన్నారు. ఓల్ట్‌ కస్టమ్స్‌ బస్తీలో తహరిక్‌ ఖబరస్థాన్  కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఖబరస్థాన్ కు తాను ఒక ఎకరా కేటాయిస్తానని చెబితే...తలసాని రెండెకరాలు కేటాయిస్తామని ముఖ్యమంత్రితో చెప్పించారని, అయితే రెండేళ్లు గడిచినా ఎక్కడా స్థలం కేటాయించకుండా వారిని మోసం చేశారని ఆరోపించారు.

ధనాలగుట్ట వద్ద ముస్లింలకు ఒక ఎకరా స్థలం కేటాయించి,  హిందూ శ్మశానవాటికకు మిగతా స్థలంతో పాటు మరింతగా విస్తరించుకునేందుకు తాను ప్రతిపాదన చేయడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల కారణంగా అది పెండింగ్‌లో పడిందని తెలిపారు. ముస్లింలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  సమావేశంలో సలీంఖాన్ , అనీఫ్, అబ్దుల్‌వాహిద్, శంకర్‌యాదవ్, సాబేర్, జాఫర్‌ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న  మర్రి శశిధర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement