సీఎంను అందించిన భాగ్యనగరం! | - | Sakshi
Sakshi News home page

సీఎంను అందించిన భాగ్యనగరం!

Published Fri, Nov 3 2023 7:20 AM | Last Updated on Fri, Nov 3 2023 8:34 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని అందించిన కీర్తిని భాగ్యనగరం మూటగట్టుకుంది. రాజకీయ ఉద్దండుడు మర్రి చెన్నారెడ్డి 1989లో సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. సనత్‌నగర్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన 1989 డిసెంబర్‌ 3 నుంచి 1990 డిసెంబర్‌ 17 వరకు సీఎం బాధ్యతలు చేపట్టారు.

నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి తనదైన మార్క్‌ను సాధించారు. సనత్‌నగర్‌ నుంచి పోటీ చేయకముందే 1978 మార్చి 6 నుంచి 1980 అక్టోబర్‌ 11 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొదటిసారి ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉన్న సనత్‌నగర్‌ నియోజకవర్గం 1978లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా నాలుగో ఎమ్మెల్యేగా మర్రి చెన్నారెడ్డి ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు మర్రి శశిధర్‌రెడ్డిని నిలబెట్టి 1992లో గెలిపించుకుని తన రాజకీయ వారసత్వాన్ని అందించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకుసాగారు. దశాబ్ద కాలం క్రితం వరకు సనత్‌నగర్‌ అంటే మర్రి కుటుంబం, మర్రి అంటే సనత్‌నగర్‌గా ఉంటూ వచ్చింది.
ఇవి చదవండి: TS Election 2023: దోస్త్‌ వర్సెస్‌ దోస్త్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement