కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి.. | mother suicide for her sons marriage | Sakshi
Sakshi News home page

కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి..

Published Thu, Sep 22 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి..

కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి..

సనత్‌నగర్‌: కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్‌ఐ కిష్టయ్య కథనం ప్రకారం..బేగంపేట గగన్ విహార్‌ కాలనీ నివాసి ఏ కౌశల్య (58) తన కుమారులకు వివాహాలు కావడంలేదని కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది.  

ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. బేగంపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement