కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి..
సనత్నగర్: కుమారులకు పెళ్లి కావడంలేదని తల్లి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన బేగంపేట ఠాణా పరిధిలో జరిగింది. ఎస్ఐ కిష్టయ్య కథనం ప్రకారం..బేగంపేట గగన్ విహార్ కాలనీ నివాసి ఏ కౌశల్య (58) తన కుమారులకు వివాహాలు కావడంలేదని కొంతకాలంగా మనోవేదనకు గురవుతోంది.
ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. బేగంపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.