HYD: బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య.. కారణమేంటి? | Mother Commits Suicide Along With Kids At Ranga Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

HYD: బిడ్డలతో కలిసి తల్లి ఆత్మహత్య.. కారణమేంటి?

Published Thu, Sep 5 2024 9:25 PM | Last Updated on Fri, Sep 6 2024 1:06 PM

Mother Suicide Along With Kids At Ranga Reddy

సాక్షి, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో తల్లి, కుమారుడి మృతదేహాలు లభించగా.. పాప డెడ్‌బాడీ కోసం గాలిస్తున్నారు.

వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో తల్లి మంగ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పిల్లలతో కలిసి సమీపంలో ఉన్న చెరువులో దూకింది. అది గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. ఈ క్రమంలో వారు ముగ్గురు చనిపోయారు. అనంతరం, వారి మృతదేహాల కోసం గాలించగా తల్లి మంగ, కుమారుడి మృతదేహాలు లభించాయి. పాప డెడ్‌బాడీ ఇంకా లభ్యం కాలేదు. పాప మృతదేహాం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మంగ మరో కుమారుడిని ఆమె ఇంటి వద్దనే వదిలి వెళ్లింది. ఇక, ఆత్మహత్య సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement