హైదరాబాద్: నగరానికి చెందిన తల్లీకూతుళ్లు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా సనత్నగర్లో తల్లి చంద్రకళ, కూతురు నేహా నివాసం ఉంటున్నారు. అయితే వారం రోజుల కిందట కర్ణాటకలోని బీదర్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాలని రైలులో బయలుదేరారు. ఇదిలాఉండగా వారం రోజులైనా ఆ తల్లీకూతుళ్లు బంధువుల ఇంటికి చేరలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సనత్నగర్లో వారం రోజుల కిందట రైలు ఎక్కించామని, ఇప్పటి వరకూ తమ వాళ్ల జాడ కనిపించడం లేదంటూ వారు వాపోతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.