
సాక్షి, హైదరాబాద్: సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రి సేవలు విస్తృతం కానున్నాయి. ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆస్పత్రికి అనుబంధంగా కేంద్ర ప్రభు త్వం 2016లో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతో కారి్మక కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందుతుండగా.. తాజాగా ఈ కాలేజీలో డీఎన్‌బీ (డిప్లొమేట్ ఆఫ్ నేషనల్ బోర్డు) కోర్సులు ప్రారంభించేందుకు కేంద్రం ఆమో దం తెలిపింది. ఇప్పటివరకు యూజీ కోర్సులతో కొనసాగుతున్న ఈ కాలేజీలో ఇకపై డీఎన్‌బీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈఎస్‌ఐసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
డీఎన్‌బీ పరిధిలో అన్నీ సూపర్ స్పెషాలిటీ కోర్సులే కావడంతో సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కారి్మకులకు ఆధునిక సేవలు అందనున్నాయి. వీటితోపాటు స్పెషల్ పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో డీఎన్‌బీ, స్పెషల్ పీజీ కోర్సులు ప్రారంభిస్తున్న వాటిలో మొదటిది సనత్‌నగర్ ఈఎస్‌ఐ కాలేజీనే కావడం విశేషం. కొత్త కోర్సును వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు అధికారు లు చర్యలు వేగవంతం చేశారు. 2019–20 వార్షిక సంవత్సరం బడ్జెట్‌లో సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రికి రూ.180 కోట్లు కేటాయించగా.. కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.200 కోట్లకు పెంచింది.
Comments
Please login to add a commentAdd a comment