తొలి ఓటరుకు పూలతో స్వాగతం
90 శాతం ఓటర్లకు స్లిప్పులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలిపోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు కోడ్ ఉల్లంఘనపై 30 ఫిర్యాదులు అందాయి 8 మందికి నోటీసులు ఇచ్చాం ‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణ
వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణ తెలిపారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయూలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆమె ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ అంశాలు ఆమె మాటల్లోనే...
{పజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవి. ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. వరంగల్ ఉప ఎన్నికలో పోలింగ్ శా తం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలను శుక్రవారం వరకు నిర్వహించాం. 97 శాతం మంది ఓటర్లకు ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశాం. అందుబాటులో లేని 20 వేల మంది ఓటర్లకు మాత్రమేు అందించలేకపోయాం. ఓటరు స్లిప్పులు అందని వారు నేరుగా పో లింగ్ కేంద్రాల వద్ద ఉన్న బూత్ స్థాయి అధికారి వద్ద కు వెళ్లి వీటిని పొంది ఓటు హక్కున వినియోగించుకోవచ్చు. వరంగల్ నగరంలో దీని కోసం 30 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ సహాయక కేంద్రాల ద్వారా పోలింగ్‌స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చు. లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గ పరిధి లో శనివారం స్థానిక సెలవు ఉంటుంది. ఎన్నిక జరిగే ప్రాంతాల్లోని దుకాణాల్లో పనిచేసే కార్మికులకు సెలవు ప్రకటించాం. పోలింగ్ కేంద్రానికి వచ్చే తొలి ఓటరుకు పూలతో స్వాగతం పలకనున్నాం. రాజకీయ పార్టీల జెండాల రంగులు ఉండే పూలు లేకుండా జిల్లా కేం ద్రం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలకు పూలు లేదా బొ కేలు పంపిస్తున్నాం. ఓటు వేసేందుకు ముందు వచ్చే వారిని అభినందించేలా ఈ కార్యక్రమం ఉంటుంది.
ఏర్పాట్లు పూర్తి
ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా రు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,57,231 పురుషులు, 7,52,293 స్త్రీలు, 147 మంది ఇతరులు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చి మ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1778 పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2400 కంట్రోల్ యూనిట్, 4800 బ్యాలెట్ యూనిట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో పెట్టాం. పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు 1974 మంది ప్రిసైడింగ్ ఆధికారులను, 2008 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులను, 738 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించాం. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పరంగా ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకున్నాం. 20 కం పెనీల భద్రతా దళాలను మోహరించాం. ఎన్నికల నిర్వహణ సామగ్రి ఒకరోజు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరవేశాం. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం కలుగకుండా కనీస అవసరాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యుత్, బారికేడింగ్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. 1778 కేంద్రాల్లో 819 అత్యంత సమస్యాత్మక, 393 సమస్యాత్మక, 566 సాధారణ కేంద్రాలుగా గుర్తించాం. వీటికి అనుగుణం గా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం.
5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్‌పై నిషేధం
పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్‌లోని అన్ని ఓ టింగ్ యంత్రాలను ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్‌కు తీసువచ్చి భద్రపరుస్తాం. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్ నిర్వహణ, ఎగ్జిట్‌పోల్ ఫలితం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణ, ప్రసారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
30 ఫిర్యాదులు
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో 30 ఫిర్యాదులు వచ్చాయి. 27 ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాం. ప్రచార సభలకు వచ్చిన ప్రజలకు డబ్బులు, మద్యం పంపిణీ విషయంలో ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. నవంబరు 19న సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ప్రచారం చేశారనే అంశంపైనా ఫిర్యాదులు వచ్చాయి. అభ్యర్థుల ప్రవర్తనపైనా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో రాజకీయ పార్టీలన్నింటిపైనా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రసంగంపై కొన్ని పార్టీల వారు ఫిర్యాదు చేశారు. నియమావళి ఉల్లంఘన విషయంలో 8 మందికి నోటీసులు ఇచ్చాము.
పోలింగ్‌కు సిద్ధం
Published Sat, Nov 21 2015 1:00 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement