warangal parliament
-
తెలంగాణలో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. ఆ రెండు స్థానాలపై స్పెషల్ ఫోకస్!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలపై అన్ని ప్రధాన పార్టీలు ప్రచార జోరును పెంచాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడు పెంచాయి. అన్ని పార్టీలు ప్రచారంలో ఆరాటం,ఆర్భాటం, పోరాటం ప్రదర్శిస్తున్నాయి. గతంలో ఇప్పుడు లేని విధంగా వరంగల్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థులు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ప్రచారానికి తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ తరపున ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మహబూబాద్, వరంగల్ బహిరంగ సభలో పాల్గొనగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులను, మంత్రులను, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన లీడర్లను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కాజీపేట వరంగల్ హనుమకొండలో రోడ్ షోలో పాల్గొనున్నారు. దీంతో వరంగల్‌లో టిఆర్ఎస్లో జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులు సైతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. ఇప్పటికే వరంగల్‌లో కేటీఆర్ పర్యటన పూర్తి కాగా, పాలకుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో, అంతకు ముందు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సన్నాహాక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.వరంగల్‌లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం పర్యటన వరంగల్, హనుమకొండ పట్టణాల్లో జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. కేసీఆర్ రోడోషోకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారు కాగా హన్మకొండ జిల్లా బీఆర్ ఎస్ అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, మాజీమంత్రి దయాకర్‌రావు ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షించారు.మే 1న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు రోడ్ షోలో పాల్గొన్న అనంతరం మానుకోట జిల్లా కేంద్రంలోనే బస చేయనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. మానుకోట, హన్మకొండ జిల్లా కేంద్రాల్లో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభల్లో పాల్గొని పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు, శ్రేణులకు సందేశమిస్తూనే కాంగ్రెస్ పార్టీ విధానాలను, ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు ముఖ్యమంత్రి వివరించారు. ఈనెల 30 భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నిర్వహించే కాంగ్రెస్ జన జాతర సభకు హాజరుకానున్నారు. వరంగల్ పార్లమెంటరీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్న రెండో బహిరంగ సభ కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండో బహిరంగ సభ జరగలేదు. వరంగల్ లోక్‌సభ పరిధిలోనే నిర్వహిస్తున్న రెండో సభకు సీఎం హాజరవుతుండటం విశేషం. 30వ తేదీన రేగొండ మండల కేంద్రంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేష్ గెలిపించాలని కోరుతూ.. మే 3న హన్మకొండ జిల్లా ఖాజీపేట మండలం మడికొండ శివారులో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. నరేంద్ర మోదీతో పాటు జాతీయ స్థాయి నేతలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. వరంగల్ లోక్‌సభ సీటుపై కన్నేసిన బీజేపీ ఈస్థానంలో గెలుపునకు అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్వాసంతో ఉంది.ఆరూరి రమేష్ నామినేషన్‌కు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి హాజరుకాగా, నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిశాక బీజేపీ ప్రచారాన్ని ఉధృతం చేస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నామినేషన్లకు ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29న ముగియనుండటంతో బరిలో ఎంతమంది అభ్యర్థులు నిలచేది..? ఎవరెవరు అభ్యర్థులుగా మిగలబోతున్నారు..? అభ్యర్థుల్లో ప్రధాన ప్రత్యర్థులు ఎవరనేది క్లారిటీ రానుంది. మే 1 నుంచి సరిగ్గా పదకొండు రోజుల పాటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగనుంది. -
లోక్‌సభ ఎన్నికల పోటీపై ఆరూరి ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఏం కేసీఆర్ సమావేశం ముగిసింది. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించగా.. ఆయన పోటీకి విముఖత చూపించారు. మరోసారి అవకాశం ఇవ్వాలని సిట్టింగ్ ఎంపీ దయాకర్ కోరగా.. త్వరలోనే నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ బదులిచ్చారు. అటు అనవసర నిర్ణయాలతో భవిష్యత్ పాడు చేసుకోవద్దని పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న ఆరూరి రమేశ్‌కు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. భేటీకి ముందు బీజేపీ చేరినట్లు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించారు. ‘నేను ఏ బీజేపీ నేతలను కలవలేదు. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’అని ఆరూరి తెలిపారు. అయితే గత రెండు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆరూరి రమేష్‌ను బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబల్లి దయాకర్‌రావు హైదరాబాద్ తీసుకురావటంతో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. -
ఎక్కడ.. ఎవరికి
మెజారిటీపై ఎమ్మెల్యేల లెక్కలు గెలుపు ధీమాతో ప్రతిపక్ష నేతలు పెరిగిన పోలింగ్‌తో ఎవరికి లాభమో.. వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక ఫలితం మంగళవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు కొన్ని గంటల్లో మొదలుకానుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నిక కావడంతో ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపోటములు, ఓటింగ్ శాతం తీరు ఎలా ఉంటుందనే విషయంపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలప్పుడు వచ్చిన మెజారిటీ వస్తుందా.. లేదా అనే అంశంపై ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. ఉప ఎన్నికలో వచ్చే తీర్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల పరిపాలన తీరు తెలిసిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ, వరంగల్ ఉప ఎన్నికలో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడం.. ఏ రాజకీయ పార్టీకి బలం చేకూరుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అరుుతే, ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని, సాధారణ ఎన్నికల్లో కంటే మెజారిటీ తగ్గినా స్పష్టమైన ఆధిక్యత ఉంటుందని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమకు ఆధిక్యం వస్తుందని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో కంటే తమకు పరిస్థితులు మెరుగయ్యాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు ఓటింగ్ మారిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగం చేశారని, ప్రజలు తమకే మద్దతు తెలిపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భూపాలపల్లి, పరకాలలో తమకు ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. ఇక, వరంగల్ ఉప ఎన్నికలో మొదటిసారి పోటీ చేసిన వైఎస్సార్సీపీ ఓటింగ్ తీరుపై ఆశాభావంతో ఉంది. ఓటర్లు తమ పార్టీకి మద్దతు తెలిపారని భావిస్తోంది. ఎన్డీయే నేతలు సైతం ఉప ఎన్నిక ఫలితంపై ఆశావాహ ధృక్పథంతో ఉన్నారు. గతంలో కంటే తమకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, ఉప ఎన్నిక ఫలితంతో ఇది స్పష్టమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో తమ పార్టీకి బలం పెరిగిందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వామపక్ష కూటమి సైతం ఓటింగ్ శాతంపై ధీమాతో ఉంది. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత.. ఓటింగ్ శాతంలో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. రాజకీయ పార్టీల అంచనాలు ఇలా ఉండగా.. తుది ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికలో ఓట్లు ఇలా... 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ లో 12,69,008 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 6,95,918 (54.83 శాతం) ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 3,02,981 (23.87 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన రామగల్ల పరమేశ్వర్‌కు 2,06,200 (16.24 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. -
సత్తా చాటనున్న వైఎస్సార్సీపీ
పార్టీ అధినేత జగన్ ప్రచారంతో పెరిగిన బలం మహానేత జ్ఞాపకాల్లో పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలు వరంగల్ : వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ సత్తా చాటనుంది. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రచారానికి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి స్పందన వచ్చింది. జగన్ ఈనెల 16 నుంచి 19 వరకు నాలుగు రోజులు ప్రచారం నిర్వహించారు. ఈ సెగ్మెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్రెడ్డి పర్యటనతో వైఎస్సార్ సీపీ కొత్త ఉత్సాహం వచ్చింది. మహానేత వైఎస్ పథకాలు మరవని ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా జనం కేరింతలు కొట్టారు. ఉప ఎన్నికలో తమకు తిరుగుండదని భావించిన రాజకీయ పార్టీలు.. జగన్ సభలకు వచ్చిన ప్రజా స్పందన చూసి డోలాయమానంలో పడ్డాయి. హామీల అమలులో అధికార పార్టీ తీరుపై జగన్మోహన్రెడ్డి చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. హన్మకొండలో నిర్వహించిన బహిరంగసభకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడం, టీఆర్ఎస్కు ఊపునిచ్చిన జిల్లాలో జగన్‌కు లభించిన ఆదరణ చూస్తే భవిష్యత్‌లో తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
పోలింగ్‌కు సిద్ధం
తొలి ఓటరుకు పూలతో స్వాగతం 90 శాతం ఓటర్లకు స్లిప్పులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలిపోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు కోడ్ ఉల్లంఘనపై 30 ఫిర్యాదులు అందాయి 8 మందికి నోటీసులు ఇచ్చాం ‘సాక్షి’తో జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణ వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యేలా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణ తెలిపారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయూలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానానికి శనివారం పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై శుక్రవారం ఆమె ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ అంశాలు ఆమె మాటల్లోనే... {పజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమైనవి. ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుంది. వరంగల్ ఉప ఎన్నికలో పోలింగ్ శా తం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలను శుక్రవారం వరకు నిర్వహించాం. 97 శాతం మంది ఓటర్లకు ఇప్పటికే ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశాం. అందుబాటులో లేని 20 వేల మంది ఓటర్లకు మాత్రమేు అందించలేకపోయాం. ఓటరు స్లిప్పులు అందని వారు నేరుగా పో లింగ్ కేంద్రాల వద్ద ఉన్న బూత్ స్థాయి అధికారి వద్ద కు వెళ్లి వీటిని పొంది ఓటు హక్కున వినియోగించుకోవచ్చు. వరంగల్ నగరంలో దీని కోసం 30 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ సహాయక కేంద్రాల ద్వారా పోలింగ్స్టేషన్ల వివరాలు తెలుసుకోవచ్చు. లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గ పరిధి లో శనివారం స్థానిక సెలవు ఉంటుంది. ఎన్నిక జరిగే ప్రాంతాల్లోని దుకాణాల్లో పనిచేసే కార్మికులకు సెలవు ప్రకటించాం. పోలింగ్ కేంద్రానికి వచ్చే తొలి ఓటరుకు పూలతో స్వాగతం పలకనున్నాం. రాజకీయ పార్టీల జెండాల రంగులు ఉండే పూలు లేకుండా జిల్లా కేం ద్రం నుంచే అన్ని పోలింగ్ కేంద్రాలకు పూలు లేదా బొ కేలు పంపిస్తున్నాం. ఓటు వేసేందుకు ముందు వచ్చే వారిని అభినందించేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ఏర్పాట్లు పూర్తి ఉప ఎన్నికలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా రు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,57,231 పురుషులు, 7,52,293 స్త్రీలు, 147 మంది ఇతరులు. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, పరకాల, వరంగల్ పశ్చి మ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1778 పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2400 కంట్రోల్ యూనిట్, 4800 బ్యాలెట్ యూనిట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను అందుబాటులో పెట్టాం. పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు 1974 మంది ప్రిసైడింగ్ ఆధికారులను, 2008 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులను, 738 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించాం. వరంగల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ పరంగా ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలూ జరగకుండా చర్యలు తీసుకున్నాం. 20 కం పెనీల భద్రతా దళాలను మోహరించాం. ఎన్నికల నిర్వహణ సామగ్రి ఒకరోజు ముందే పోలింగ్ కేంద్రాలకు చేరవేశాం. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అసౌకర్యం కలుగకుండా కనీస అవసరాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నాం. విద్యుత్, బారికేడింగ్, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. 1778 కేంద్రాల్లో 819 అత్యంత సమస్యాత్మక, 393 సమస్యాత్మక, 566 సాధారణ కేంద్రాలుగా గుర్తించాం. వీటికి అనుగుణం గా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. 5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్‌పై నిషేధం పోలింగ్ ముగిసిన తర్వాత వరంగల్‌లోని అన్ని ఓ టింగ్ యంత్రాలను ఎనుమాముల వ్యవసాయ మా ర్కెట్‌కు తీసువచ్చి భద్రపరుస్తాం. ఈ నెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్ నిర్వహణ, ఎగ్జిట్‌పోల్ ఫలితం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురణ, ప్రసారంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. 30 ఫిర్యాదులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో 30 ఫిర్యాదులు వచ్చాయి. 27 ఫిర్యాదులపై ఎన్నికల సంఘానికి నివేదిక పంపించాం. ప్రచార సభలకు వచ్చిన ప్రజలకు డబ్బులు, మద్యం పంపిణీ విషయంలో ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. నవంబరు 19న సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాత ప్రచారం చేశారనే అంశంపైనా ఫిర్యాదులు వచ్చాయి. అభ్యర్థుల ప్రవర్తనపైనా ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చు విషయంలో రాజకీయ పార్టీలన్నింటిపైనా ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ప్రసంగంపై కొన్ని పార్టీల వారు ఫిర్యాదు చేశారు. నియమావళి ఉల్లంఘన విషయంలో 8 మందికి నోటీసులు ఇచ్చాము. -
నామినేషన్లు 38
ఉప ఎన్నికకు ముగిసిన తొలి ఘట్టం హన్మకొండ అర్బన్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 38 నామినేషన్లు దాఖలయ్యూరుు. బుధవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ప్రధానపార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలతో హోరెత్తించారు. అభ్యర్థులంతా మధ్యాహ్నం తరువాత ఎన్నికల అధికారి కార్యాలయానికి రావడంతో అధికారులు అభ్యర్థులకు నెంబర్లు వేసిన చీటీలు అందజేశారు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సమయం పూర్తయిన తరువాత కార్యాలయంలో సుమారు 15మంది వరకు అభ్యర్థులు వెయిటింగ్లో ఉన్నారు. దీంతో అందరి పత్రాలు ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ రాత్రి 7గంటల వరకు తీసుకున్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అట్టహాసంగా వస్తే.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ సాదాసీదాగా పార్టీ ప్రముఖులతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి నామినేషన్ అందజేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ బహిరంగ సభ అనంతరం తన రెండవ సెట్ నామినేష్ పత్రాలు అందజేశారు. మంగళశారం నాటికి ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. చివరి రోజు బుధవారం 32మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తం నామినేషన్ల సంఖ్య 38కు చేరింది. -
అధికార పార్టీకి ‘ఉప’ సవాల్
ముందున్న వరంగల్ పార్లమెంటు, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు - ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్త్రాలు అంటున్న విపక్షాలు - ఎలా గట్టెక్కాలా అన్న యోచనలో టీఆర్ఎస్ సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ‘ఉప ఎన్నికల’ అస్త్రాన్ని పదేపదే ఉపయోగించిన టీఆర్ఎస్కు ఇప్పుడు ఆ ఉప ఎన్నికలే సవాల్‌గా నిలవనున్నాయి. కడియం శ్రీహరి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్ పార్లమెంటు స్థానం ఖాళీ కాగా, మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన పి.కిష్టారెడ్డి అకాల మరణంతో ఆ స్థానం కూడా ఖాళీ అయ్యింది. ఇపుడు ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశ ముగిసేలోగా ఈ రెండు స్థానాలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. మరోవైపు వామపక్షాలన్నీ కలసి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఇక్కడ గెలవాలన్న కసిమీద ఉంది. అభ్యర్థుల విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ తేలకున్నా, విపక్షాలన్నీ ఎవరి స్థాయిలో వారు ఈ నియోజకవర్గాల్లో ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్లో వరంగల్ ఉప ఎన్నిక గుబులు రేపుతోంది. వ్యతిరేక అంశాలపై ఆందోళన వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి టికె ట్ ఆశిస్తున్న గులాబీ నేతల సంఖ్య తక్కువేం లేదు. కానీ, తమ అధినేత మదిలో ఎవరున్నారో, ఎవరి అభ్యర్ధిత్వం పట్ల మొగ్గు చూపుతారో అంతుపట్టక ఆందోళన చెందుతున్నారు. అన్నిటికన్నా టీఆర్ఎస్కు ప్రతికూలంగా ఉన్న అంశాలపైనే పార్టీలోనూ, బయటా చర్చ జరుగుతోంది. విపక్షాలు ఏ అంశాలను ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకోనున్నాయో గులాబీ నేతలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. - పెన్షన్ లబ్ధిదారుల ఎంపికలో జరిగిన కిరికిరి, రుణమాఫీపై రైతుల్లో ఉన్న అసంతృప్తి, బ్యాంకు రుణాలు అందకపోవడం, గుడుంబా నియంత్రణ పేర చీప్‌లిక్కర్ తేవడానికి జరిగిన ప్రయత్నాలు ప్రభుత్వంపై వ్యతిరేక అభిప్రాయాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు గడిచినా, డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసు లేకపోవడం, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించకపోవడం, ప్రాజెక్టుల ప్రకటనలే కానీ అడుగుముందుకు పడకపోవడం వంటి అంశాలపై విపక్షాలు ప్రచారం షురూ చేశాయి. పార్టీ ఫిరాయింపులూ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీ అభ్యర్థికి ప్రతికూలంగా మారే ముప్పు ఉందని టీఆర్ఎస్ నేతలు మధనపడుతున్నారు. - నారాయణ ఖేడ్ అసెంబ్లీ స్థానం విషయంలోనూ టీఆర్ఎస్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికలో అన్ని పక్షాలు పక్కకు తప్పుకుని, కిష్టారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరి ఏకగ్రీవ ఎన్నికకు నిర్ణయం తీసుకుంటారా? లేక పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గత ఎన్నికల ఫలితాన్ని బట్టి చూస్తే, టీఆర్ఎస్ ఆందోళనకు అర్థం ఉంద ంటున్నారు. గిరిజన ఓట్లు ఎక్కువున్న ఈ స్థానంలో తనకే టికెట్ కావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు ప్రయత్నాలు మొదలు పెట్టారు. దీంతో ఇక్కడ పార్టీలో వర్గ పోరు తప్పేలా లేదు. మొత్తంగా ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అన్న చర్చ పార్టీలో మొదలైంది. -
ఇప్పట్లో వరంగల్ ఉప ఎన్నిక లేనట్లే!
హైదరాబాద్: ఖాళీగా ఉన్న వరంగల్ పార్లమెంట్ స్థానానికి ఇప్పట్లో ఉప ఎన్నిక జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు తొలుత భావించినా.. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ప్రధాన కమిషర్ నసీం జైదీ బుధవారం విడుదల చేశారు. కాగా, వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికకు ఎటువంటి షెడ్యూల్ ను విడుదల చేయకపోవడంతో.. ఆ ఎన్నిక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్ ఉప ఎన్నికపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చలు మొదలైనా.. నోటిఫికేషన్ రాకపోవడంతో రాజకీయ పార్టీలు తమ వ్యూహాన్ని రచించుకోవడానికి మరికాస్త సమయం దక్కిందనే చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవిని స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జూలై 21న ఆయన రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం తెలపడంతో వరంగల్ ఎంపీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల చట్టం ప్రకారం సీటు ఖాళీ అయినప్పటి నుంచీ ఆరు నెలల వ్యవధిలో తిరిగి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. -
'వరంగల్ ఎంపీ టికెట్టు మాకే ఇవ్వాలి'
వరంగల్: వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఉన్నికలో ఏ రాజకీయ పార్టీ అయినా మాదిగలకే టికెట్ ఇవ్వాలని ఎమ్మెస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వకుండా కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ దీక్షా శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ఎంపీ టికెట్‌ను మాదిగలకే ఇస్తామని గతంలో ప్రకటించిన మంత్రి కడియం శ్రీహరి.. ఇప్పుడు తన కూతురును బరిలో నిలపాలని యోచించడం వెనుక ఆంత్యర్యమేంటని ప్రశ్నించారు. మాదిగల సహకారంతోనే కడియం రాజకీయంగా నిలదొక్కుకున్నారనేది గమనించాలన్నారు. మోసం చేయాలని చూస్తే శ్రీహరిని మాదిగలు శత్రువుగా పరిగణిస్తారన్నారు. తెలంగాణ పలెల్లో కడియం శ్రీహరి తిరగకుండా అడ్డుకుంటామన్నారు. తక్కువ శాతం ఉన్న మాలలకు ఎంపీ టికెట్ కట్టబెట్టి మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. సంక్షేమ రంగాల్లో వర్గీకరణ ప్రకటించే విషయంపై కడియం శ్రీహరి తక్షణమే సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతకు పార్లమెంట్లో బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.