టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి
హన్మకొండ చౌరస్తా : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే విషయం ఫలితాలతో స్పష్టమవుతుందని చెప్పా రు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజ య్య, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌తోకలిసి ఆయన హన్మకొండలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆది వారం విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నిక పోలింగ్ రోజున ప్రతిపక్ష కాం గ్రెస్, బీజేపీలకు పోలింగ్ ఏజెంట్లు సైతం దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీనేతలు డబ్బుల కోసం ఆశపడ్డారని, అవి రాకపోవడం తో ఆయూపార్టీల నేతలు ఎన్నిక రోజు జాడలేకుండా పోయూరని అన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, బస్వరాజు సారయ్య పోలింగ్ బూత్‌లకు రాకుండా ఎందుకు తోకముడిచారో చెప్పాలని ప్రశ్నించారు.
ఓట ర్లను ఓటు అడగడం పక్కనపెట్టి కేసీఆరే లక్ష్యంగా విమర్శలు చేశారన్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ తన పార్టీ నేతలనే సమన్వయం చేయలేకపోయూడని విమర్శించారు. అధికార పార్టీ అరుునా టీఆర్‌ఎస్ ఎన్నికల నియమావళికి లోబడి వ్యవహరించిందని అన్నారు. ప్రచారం ముగి సిన తర్వాత ప్రెస్‌మీట్‌లు పెట్టి కాం గ్రెస్, బీజేపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాయని ఆరోపించారు. ఎ మ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన ప్రతిపక్షాలను ప్రజ లు పట్టించుకోలేదని ఉప ఎన్నికలో తేలిపోయిందన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా నేతలు గుడిమల్ల రవికుమార్, కన్నెబోయిన రాజయ్యయాదవ్ పాల్గొన్నారు.
ఉప ఎన్నికలో గెలుపు మాదే..
Published Mon, Nov 23 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM
Advertisement
Advertisement