ప్రచార బరిలోకి సీఎం
నేడు బహిరంగ సభ కు హాజరుకానున్న కేసీఆర్
ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాట్లు
హన్మకొండ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం వరంగల్ రానున్నారు. ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసునూరి దయాకర్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యాన హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో మంగళవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరున్నర గంటలకు జరగనున్న ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారని పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు తెలిపారు. వరంగల్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్.. సాధారణ ఎన్నికల మాదిరిగానే తమ పార్టీ అభ్యర్థిని అదే మె జార్టీతో గెలిపించుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, టీఆర్‌ఎస్ అగ్రనేత లు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రచా రం చేస్తుండగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి తరపున ప్రచారానికి ఊపు తెచ్చేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ వస్తున్నారు. అరుుతే, ఈనెల 21వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలూ ప్రచార జోరు పెంచా రుు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరఫున జాతీయస్థాయి నేతలుగా పేరొందిన దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్, కొప్పుల రాజు, సుశీల్‌కుమార్‌షిండే ప్రచా రం చేస్తున్నారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా ఆర్ట్స్ కళాశాలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభ విజయవంతానకి టీఆర్‌ఎస్ శ్రేణులు భా రీగా ఏర్పాట్లు చేశారుు. లక్ష మందిని ఈ సభకు తరలించాలని నిర్ణయించారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్‌మ్యాప్‌ను వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు పరిశీలించారు.
గుడిమళ్ల ఇంటికి కేసీఆర్...
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరఫున తెలంగాణ ఆటోడ్రైవర్స్ యూనియన్ గౌరవఅధ్యక్షు డు గుడిమళ్ల రవికుమార్ టికెట్ ఆశించగా చివరి ని ముషంలో చేజారిన విషయం విదితే. ఈ మేరకు ఆ యన ఇంటికి వరంగల్ పర్యటనలో భాగంగా ము ఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గుడిమళ్ల రవికుమార్ ఇంటికి ముఖ్యమంత్రి వెళ్తారని షెడ్యూల్‌లో పేర్కొన్నారు.