కలెక్టర్ వాకాటి కరుణ
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
సీపీ సుధీర్‌బాబు
వరంగల్ సిటీ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలను మంగళవారం లెక్కించేందుకు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్ వా కాటి కరుణ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ రెండో గేట్ సమీపంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ సుధీర్‌బాబు తో కలిసి సోమవారం ఆమె పరిశీలించారు. పోలింగ్ అధికారులు, సిబ్బందికి మాక్ కౌంటింగ్ నిర్వహిం చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కోసం ఏడు కౌంటిం గ్ హాళ్లను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభవుతుందన్నారు.
సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ కౌంటింగ్ హాళ్ల పరిసర ప్రాంతాలలో 144సెక్షన్ విధించామని,విజయోత్సవ ర్యాలీలు నిషేధమని తెలిపారు. ప్రజాప్రతినిదులు, వివిధ పార్టీల నాయకులు తమకు సహకరించాలని కోరారు. అనుమతి పాస్‌లు లేకుండా ఎవరూ కౌం టింగ్‌హాల్ లోపలికి వెళ్లవద్దని సూచించారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
Published Tue, Nov 24 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement
Advertisement