రాజన్న బిడ్డకు నీరాజనం | warngal people support to ys jagan | Sakshi
Sakshi News home page

రాజన్న బిడ్డకు నీరాజనం

Published Tue, Nov 17 2015 1:51 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

రాజన్న బిడ్డకు నీరాజనం - Sakshi

రాజన్న బిడ్డకు నీరాజనం

ఓరుగల్లులో వైఎస్సార్ సీపీ అధినేత
జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, మహానేత అభిమానులు
బోనాలు, బతుకమ్మలతో ఆత్మీయ స్వాగతం

 
పాలకుర్తిటౌన్ / పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా జిల్లాలో చేపట్టిన ప్రచారానికి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల గుండా కొనసాగిన రోడ్‌షోకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మహానేత వైఎస్సార్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఈ మేరకు పాల కుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో తరలివచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోకు తరలివచ్చిన ప్రజానీకానికి అభివాదం చేశారు.

మధ్యమధ్యలో చిన్నారులు, వృద్ధులు, రైతు లు, గిరిజనులను ఆప్యాయంగా పలకరించారు. కాగా, తొలుత పాలకుర్తికి చేరుకున్న అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బొకే లు అందజేసి స్వాగ తం పలికారు. ఇది లా ఉండగా రోడ్ షోలో కార్యకర్తల బైక్ ర్యాలీ, వైఎస్సార్‌సీపీ సాంస్కృతిక బృందం పాడిన పాటలు అలరించాయి.
 
స్వాగతం పలికిన చాకలి ఐలమ్మ మనవరాలు..
 రోడ్‌షోకు హాజరైన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల సంధ్యారాణి ఘన స్వాగతం పలికారు. అలాగే మండల కేంద్రంలోని వాగ్ధేవి జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా స్వాగతం పలికారు. రోడ్‌షోలో వైఎస్సార్‌సీపీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్, ఎమ్మెల్సీ ఎండీ రహమాన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్వ రవీందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, నాయకులు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బండి లక్ష్మణ్, మాదిరెడ్డి భగంవంత్‌రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఎస్. శేఖర్‌పంతులు, తమ్మాళి బాల్‌రాజ్, మాడరాజు యాకయ్య, గుడ్ల వెంకన్న పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement