వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’
పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్‌కు ఏ పా ర్టీ నుంచి పోటీ లేకుం డా పోయిందని ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తొర్రూరు బస్టాండ్ ఆవరణలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పార్లమెంట్ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ పార్టీని తమకు పోటీగా భావించామని.. ప్రస్తుతం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాగా అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, అపూర్వ స్వాగతంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయిందని తెలిపారు. తప్పుడు హామీలు, మోసపూరిత విధానాలు అవలంబిస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయూలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్ పాలనతో ప్రస్తుత పాలనను పోల్చుకుని వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కొండా రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, విజయ్‌చందర్, కళ్యాణ్‌రాజు, శ్యాంసుందర్‌రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఇబ్రహీం, బిజ్జాల అశోక్, కోటగిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జగన్ ప్రచారంతో నూతనోత్సాహం
Published Tue, Nov 17 2015 1:47 AM | Last Updated on Fri, May 25 2018 8:03 PM
Advertisement