Srinivasa Reddy ponguleti
-
రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిద్దామా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును ఒక శాతంమేర తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నివేదిక సమ ర్పించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫీజు తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. ఎలాగూ భూముల «విలువలను సవరిస్తున్నందున సామాన్య ప్రజలపై భారం పడకుండా ఒక శాతం ఫీజు తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించినట్లు సమాచారం.రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌లతో పాటు పలువురు డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు, భూముల విలువల సవరణ, కొత్త సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లా డుతూ సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించాలని, బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా ఈ సవరణ చేపట్టాలని సూచించారు.వచ్చే వారంలోపు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సబ్రిజిస్ట్రార్లు పనిచేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే శాఖ పరిధిలో బదిలీలు జరగనున్నా యని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తా మని, బది లీల కోసం ఎవరూ తన వద్దకు రావ ద్దని, పైరవీలు చేసే వారిపై చర్యలు తీసుకుంటా నని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ఇక, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని హంగులతో శాశ్వతంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించే ప్ర క్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
పోట్ల లేదా రేణుకా చౌదరి!
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మం లోక్‌సభ బరి నుంచి కమ్మ సామాజిక వర్గ నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ నాయకత్వం ప్రతిపాదన కూడా ఇదేనని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గాను 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి పోటీ చేస్తారని ప్రచారం సాగినా.. ఖమ్మం కాంగ్రెస్‌లోని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆమె బుధవారం పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాను కలిసి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతులను వివరించారు. అయితే గతంలో సుదీర్ఘ కాలం టీడీపీలో ఉండి టీఆర్ఎస్లో చేరి ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేరును కూడా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలించింది. ఖమ్మం నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచే అభ్యర్థిని నిలబెట్టడం కలిసొస్తుందని పీసీసీ పెద్దలు నివేదించినట్లు తెలుస్తోంది. అయితే రేణుకా చౌదరికి ఢిల్లీ పలుకుబడి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి కాకుండా ఇతర సామాజికవర్గ నేతలకు టికెట్ ఇవ్వాలంటే ఎన్నికల ఖర్చు భరించే స్తోమత ఉన్న నాయకుడికి కేటాయించే అవకాశం ఉంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరతారా..? వైఎస్సార్సీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కని పరిస్థితుల్లో ఆయన తమ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. కానీ పొంగులేటి మాత్రం టీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీ మారే ప్రసక్తే లేదని తన అనుచరులతో చెప్పినట్లు సమాచారం. ఆర్థికంగా బలవంతుడైన మరో నేత టికెట్ ఆశిస్తున్నప్పటికీ.. ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
జగన్ ప్రచారంతో నూతనోత్సాహం
వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ‘పొంగులేటి’ పాలకుర్తి : వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక సందర్భంగా దివంగత మహానేత వైఎస్సార్ తనయుడు జగన్మోహన్రెడ్డి ప్రవేశంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి సూర్యప్రకాష్‌కు ఏ పా ర్టీ నుంచి పోటీ లేకుం డా పోయిందని ఖమ్మం ఎంపీ, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తొర్రూరు బస్టాండ్ ఆవరణలో సోమవారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డితో పాటు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు పార్లమెంట్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీని తమకు పోటీగా భావించామని.. ప్రస్తుతం వైఎస్.జగన్మోహన్రెడ్డి రాగా అడుగడుగునా ప్రజల నుంచి లభిస్తున్న స్పందన, అపూర్వ స్వాగతంతో వైఎస్సార్ సీపీ అభ్యర్థికి పోటీ లేకుండా పోయిందని తెలిపారు. తప్పుడు హామీలు, మోసపూరిత విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓటు వేయూలో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్ పాలనతో ప్రస్తుత పాలనను పోల్చుకుని వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు కొండా రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, విజయ్‌చందర్, కళ్యాణ్‌రాజు, శ్యాంసుందర్‌రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, ఇబ్రహీం, బిజ్జాల అశోక్, కోటగిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లయినా వైఎస్‌ను ప్రజలు మరవలేదు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి తొర్రూరు/పాలకుర్తి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరేళ్లుగాగా భౌతికంగా మనమధ్య లేకున్నా.. ప్రజలు ఆయన చేసిన సేవలు మరువ లేదని వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో వైఎస్సార్ అభిమానులు పొంగులేటితో పాటు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ఘనస్వాగతం పలికారు. బోనాలు, బతుకమ్మలు డప్పు చప్పుళ్లతో వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు కాందాడి అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పల్లెలో వైఎస్ హయాంలో ప్రతి ఇంటిలో లబ్ధి సొందిన వారు ఉన్నారని అన్నారు. వైఎస్ ఆకస్మిక మరణం తరువాత అధికారంలో ఉన్న వారు ఆ పథకాలను అమలు చేయలేక పోయారని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ బలోపేతం కావడం ఖాయమన్నారు.కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి , జిల్లా నాయకులు విలియమ్స్, ఇర్మియా, ముగిగా కళ్యాణ్‌రాజ్, అప్పం కిశోర్, మహిపాల్ రెడ్డి, కందాడి అచ్చిరెడ్డి, నీలం లక్ష్మయ్య, బిజ్జాల అశోక్, కర్ర అశోక్ రెడ్డి, కృష్ణమూర్తి, మాడరాజు యాకయ్య, గుడ్ల వెంకన్న, లక్ష్మన్ పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: పొంగులేటి
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి సమ్మెను విరమింపజేయాలని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అత్యంత దయనీయ స్థితిలో పనిచేస్తున్న కార్మికులపై బెదిరింపులకు పాల్పడవద్దని, నిండు మనసుతో వారి డిమాండ్లు పరిశీలించాలని ఒక ప్రకటనలో కోరారు. వారి డిమాండ్లు న్యాయమైనవని, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. -
బంగారు తెలంగాణలోనూ దీక్షలా?
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి విస్మయం ఫిజియోథెరపిస్టుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని డిమాండ్ హైదరాబాద్: మన రాష్ట్రం వచ్చింది.. మనది బంగారు తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అంటూ ఉంటే రాష్ట్ర ప్రజలంతా ఆనందపడ్డారని, కానీ బంగారు తెలంగాణలోనూ దీక్షలు తప్పడం లేదని వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్టు(టీఏపీ) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్ష కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండలో ఫిజియోథెరపిస్టులు చేస్తున్న దీక్షను చూస్తే బాధేస్తోందని, ఇంతమంది ఆందోళన చేస్తూంటే సీఎం కేసీఆర్‌కు కనపడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. న్యాయమైన ఫిజియోథెరపిస్టుల కోర్కెలు తెలంగాణ ప్రభుత్వంలో కూడా తీరకపోవటం బాధాకరమని, వారి డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, డెంటిస్టులు ఉన్నారని, ఫిజియోథెరపిస్టులు మాత్రం లేరని, తెలంగాణ వ్యాప్తంగా 25 వేల మంది ఫిజియోథెరపిస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే వారి డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే వారికి మద్దతుగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తమ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని, అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి వారి డిమాండ్లను పరిష్కరించేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఫిజియోథెరపిస్టులకు ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపిస్టుల ప్రైవేట్ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నామన్నారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, ఆదిలాబాద్ రిమ్స్‌లో ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫిజియోథెరపిస్టులకు డాక్టరేట్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. పార్టీ ప్రధానకార్యద ర్శి నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ రాజీవ్ విద్యా మిషన్, ఎస్‌ఎస్‌ఏల్లో తాత్కాలికంగా పనిచేస్తున్న ఫిజియోథెరపిస్టులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రెహమాన్, పార్టీ రాష్ట్ర నేతలు ముజ్తబ అహ్మద్, గూడూరు జయపాల్‌రెడ్డి, ఎం. భగవంత్ రెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, మహ్మద్, రాష్ట్ర యువజ విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, సిటీ యువజన విభాగం అధ్యక్షుడు ఎ.అవినాష్ గౌడ్, సేవాదళ్ నగర అధ్యక్షుడు బండారి సుధాకర్, కర్నె ప్రభాకర్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంక్షోభంలో ప్రజారోగ్యం: పొంగులేటి
న్యూఢిల్లీ: దేశంలో ప్రజారోగ్య సేవలు సంక్షోభంలో కూరుకుపోయాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోక్‌సభలో ఆందోళన వ్యక్తంచేశారు. వైద్యారోగ్య శాఖ పద్దులపై బుధవారం ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రజారోగ్య సేవలు తగినంత లేవని, ఉన్నా నాణ్యత లోపించిందని ఆవేదన వ్య క్తం చేశారు. ప్రైవేటు రంగాన్ని నమ్ముకోవడంతో సామాన్యు డి జేబులకు చిల్లుపడుతోందని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు, హృద్రోగ వ్యాధుల నివారణకు ఓ ఆరోగ్యవిధానం ప్రవేశపెట్టాలన్నారు. యూజీసీ చట్టం ప్రకారమే డీమ్డ్ యూనివర్సిటీలు యూజీసీ చట్టం 1356 కింద డీమ్డ్ యూనివర్సిటీలకు గుర్తింపు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. డీమ్డ్ వర్సిటీల ఏర్పాటు, నిధుల విధివిధానాలపై పొంగులేటి బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు స్మృతి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. యూజీసీ నియమించిన నిపుణుల కమిటీ ఆ వర్సిటీలకు వెళ్లి తనిఖీ చేసి మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది తదితరాలపై కమిషన్‌కు నివేదిక అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ నివేదికను మంత్రిత్వ శాఖ సిఫార్సుకు కమిషన్ పంపిస్తుందని, యూజీసీ సలహా మేరకే డీమ్డ్ వర్సిటీలకు మంత్రిత్వ శాఖ గుర్తింపునిస్తుందని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా డీడీఏ ఫ్లాట్లలోని టెర్రాస్‌లో అక్రమ నిర్మాణాలపై గడిచిన మూడేళ్ల నుంచి తీసుకున్న చర్యలు, నమోదైన కేసులపై పొంగులేటి అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. డీడీఏ హౌజింగ్ పథకంలో అక్రమ నిర్మాణాలపై ఈ ఏడాదితో కలిపి గడిచిన మూడేళ్లలో 78 కేసులు నమోదైనట్టు బాబుల్ తెలిపారు. 95% అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ నగర పాలకసంస్థ చర్యలు తీసుకుందన్నారు. -
గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు
లోక్‌సభలో ఎంపీ పొంగులేటి పశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హెపటైటిస్-బి తో 2014లో 361 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సమాచారం లేదన్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న హెపటైటిస్-బి వ్యాధి అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తెలపాలంటూ శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయనతోపాటు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జేపీ నడ్డా శుక్రవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ వైరల్ హెపటైటిస్‌ను అరికట్టేందుకు ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తున్నామని, పలు జాతీయస్థాయి పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, ప్రైవేటు కంపెనీల నుంచి అంతర్జాతీయంగా టెండర్లు నిర్వహించి సేకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు. -
హామీల అమల్లో టీఆర్ఎస్ విఫలం
వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చింతకాని: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరం గా విఫలమైందని ఖమ్మం ఎంపీ, వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం గాంధీనగర్‌లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వంద కుటుంబాల వారు.. పార్టీ నాయకులు బూరుగడ్డ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఎంపీ పొంగులేటి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారుు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన పొం గులేటి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ దాసరి సామ్రాజ్యం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి ఆకుల మూర్తి, పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎండీ ముస్తఫా, మధిర నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ తూమాటి నర్సిరెడ్డి, మధిర, చింతకాని మండల క న్వీనర్లు యన్నం కోటేశ్వరరావు, ఎర్రుపాలెం జెడ్పీటీసీ అంకసాల శ్రీనివాసరావు, కొప్పుల నాగేశ్వరరావు, తూమాటి అనంతరెడ్డి, చెవుల వెంక య్య, కన్నెబోయిన సీతారామయ్య, వాకా వీరారెడ్డి, నెల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ పరిశీలకులు వీరే
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకులను నియమించారు. ఈ మేరకు పరిశీలకుల పేర్లను పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ప్రకటించారు. జీహెచ్ఎంసీని ఐదు జోన్లుగా విభజించి, వాటికి పరిశీలకులను నియమించినట్లు ఆయన మీడియాకు చెప్పారు. తూర్పు జోన్‌కు కె.శివకుమార్, పశ్చిమజోన్‌కు కొండా రాఘవరెడ్డి, ఉత్తర జోన్‌కు నల్లా సూర్యప్రకాష్, దక్షిణ జోన్‌కు హెచ్ఏ రెహ్మాన్, సెంట్రల్ జోన్‌కు మతిన్‌లను అబ్జర్వర్లుగా నియమించామన్నారు. ఈ పరిశీలకులు ఒక్కో డివిజన్లో అధ్యక్షుడు, అయిదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసుకొని జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారన్నారు. -
వంద రోజుల్లో ఒక్క హామీ నెరవేర్చలేదు
టీఆర్ఎస్పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజం ఖమ్మం: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా మంగళవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కూసుమంచి నుంచి మొదలైన భారీ స్వాగత ర్యాలీ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వరకు సాగింది. అనంతరం, పార్టీ కార్యాలయంలో స్వాగత సభ జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పొంగులేటి మాట్లాడుతూ... ‘టీఆర్ఎస్ను, దాని అధినేత కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టారు. కేసీఆర్ మాత్రం వారి నమ్మకాన్ని వమ్ము చేశారు. వారిని నట్టేట ముంచారు’ అని ధ్వజమెత్తారు. సీఎంగా ప్రమాణ స్వీకారం రోజున రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్.. ఇప్పటివరకు ఏ ఒక్క రైతుకైనా ఒక్క రూపాయైనా మాఫీ చేశారా? అని ప్రశ్నించారు. హుదూద్ బాధితులకు రూ.లక్ష విరాళం హుదూద్ తుపాను బాధితులకు వైఎస్సార్ సీపీ తెలంగాణ నేతలు అండగా ఉంటారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎంపీగా తన వేత నం నుంచి లక్ష రూపాయలను అక్కడి బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మం డల నేతలు కూడా విరాళాలు సేకరించి, బాధితులను ఆదుకుంటారన్నారు. వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తన వేతనం నుంచి రూ. 20 వేలు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన వేతనం నుంచి రూ.50 వేలు విరాళంగా ప్రకటించారు.